Wednesday, 22 Jul, 2026

ఆటలోద్దా?

ఫిన్లాండ్,జపాన్ మొదలైన దేశాల్లో చదువు పిల్లలపైన మోయలేని భారం లాగా ఉండదు. కానీ మన దేశంలో రాత్రి నిద్ర వేళలు తప్ప పిల్లలు చదువుకునే వేళలే అన్ని. స్కూల్ ,హోంవర్క్ ట్యూషన్ అంత ఆటలకు పది నిమిషాలు కూడా లేనట్లే . చదువులతో వాళ్లలో ఒత్తిడి మాటేమిటి? కౌన్సిలింగ్ ఎక్స్ పర్ట్స్ వాళ్లకు ఇతర వ్యాపకాలకు టైం ఇవ్వమంటున్నారు. వాళ్లకు ఇష్టమైన అంశంలో తల్లిదండ్రులే దగ్గరుండి ప్రోత్సహించాలంటున్నారు. హోం వర్క్ ఒకసారి గంటలతరబడి కాకుండా విరామం ఇస్తూ […]

అప్పుడది హ్యాంగ్రీ

వేళకు తినండి ఎందుకు పెద్ద వాళ్ళు చెప్పారో గాని ఇప్పుడైతే అసలు ఆకలెస్తే కలిగే దుష్పరిణామాలలో ఒక పుస్తకం రాసేయవచ్చు అంటున్నారు పరిశోధకులు. బాగా ఆకలేస్తే కోపం వస్తుందట. ఇక రక్తంలో షుగర్ స్థాయిలు పడిపోతాయట. ఒత్తిడి కలిగించే కార్డిసోల్ హార్మోన్ ఆడ్రినలిన్ విడుదల అవుతాయని ఈ హార్మోన్ల వల్ల మెదడుకు వత్తిడి కలిగి చిరాకు,కోపం,విసుగు మొదలైన అన్ని భావోద్వేగాలు కలుగుతాయి. పరిశోధకులు ఈ అవస్థకు హంగ్రీ,యాంగ్రీ కలిపి హ్యాంగ్రీ అని కూడా పేరు పెట్టారు. ఇన్ని […]

ఇంకొంచెం తక్కువ

ఉప్పు కేవలం రుచి కోసం మాత్రమే . అది తగు మాత్రం మాత్రమే వాడుకోవాలి అంటున్నాయి అద్యాయనాలు. రోజువారి ఆహారంలో చిన్నప్పటి నుంచే కాస్త ఉప్పు తక్కువగా తినటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఉప్పు తక్కువ తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. కిడ్నీలకు హాని జరగదు. ఉప్పుతో పాటు నూనె, పంచదారల వాడకం కూడా తక్కువగా ఉండాలి. ఆరోగ్యానికి, అనారోగ్యానికి తేడా మనం తినే పదార్దాల వల్లే నిర్ణయించబడుతుంది. పౌష్టిక ఆహారం, సమతుల ఆహారం ఆరోగ్యవంతమైన […]

సౌకర్యం ముఖ్యం

హై హీల్స్ వేసుకోవడం ఇవాల్టీ అమ్మాయిల మొదటి ఇష్టాల్లో మొదటి ప్లేస్ లో ఉంటుంది. ఎత్తైన చెప్పులు వేసుకోవాలంటే ట్రెండ్ కంటే సౌకర్యం ముఖ్యం అని ముందు వాళ్ళు అర్ధం చేసుకోవాలి. పాదానికి సరిగ్గా సరిపడేవి తీసుకోవాలి. పాదం కంటే చిన్నవయిన పెద్దవయినా అడుగులు తదబడిపోతాయి. కొత్తలో ఒకటి ఒకటిన్నర అంగుళం కంటే ఎత్తువి తీసుకోకూడదు. ముందు కప్పి ఉండే హీల్, వెనక ఆసరా ఉండే బెల్ట్ రకం మోడల్ తీసుకుంటే హై హీల్స్ తో సులువుగా […]

కంటికి ఇంపుగా

స్కూళ్ళు మొదలయ్యాయి. పిల్లలు స్కూల్లోనే భోజనం చేయాలి బాక్స్ చూడగానే ఆకర్షణియంగా ఉంటేనే పిల్లలకు ఆహారం తినాలనే కోరిక కలుగుతుంది. అందుచేత ముందు అందమైన లంచ్ బాక్స్ సెలక్ట్ చేసి ఇవ్వాలి. అలాగే ఆహారం కూడా పిల్లలకు ముందు నుంచే అన్ని రుచులు అలవాటు చేసి సొంతంగా తినటం, మూతి శుభ్రంగా కడుక్కోవటం, తుడుచుకోవడం బాక్స్ భద్రంగా మూతపెట్టడం నేర్పాలి. తినే ఆహారాన్ని సహజమైన చక్కని రంగుల్లో అన్ని కూరగాయలు, ఆకు కూరలు ఉండేలా చూసుకుని కంటికి […]

అబార్షన్లు ఇందుకేనేమో

వాయు కాలుష్యంలో వచ్చే జబ్బులకు తోడు ఇప్పుడు కొత్తగా ఈ కాలుష్యం కారణంగా అబార్షాన్లు అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. వాహనాలు వెదజల్లే కాలుష్ష్యం గర్భస్థ శిశువు పై కూడా తీవ్ర ప్రభావం చూపెడుతుందని అబార్షాన్‌ కావడం లేదా నెలలు నిండకుండా ప్రసవించడం వంటివి ఎక్కువగా సంభవిస్తాయని రిపోర్టు చెబుతుంది. గ్రామీణ ప్రాంతాల వారితో పోలిస్తే నగరాల్లో నివసించే మహిళల్లో గర్భస్రావాలు ఎక్కువ అవుతున్నాయన్న విషయంలో పరిశోధన నిర్వహిస్తే ఈ కాలుష్యం కారణంగా మహిళల్లో సంతానోత్పత్తి సామర్ధ్యం […]

గుండె కు బలం

వారంలో ఐదురోజులు గుడ్డు తింటే పక్షవాతం, గుండె జబ్బుల బారి నుంచి తప్పించుకోవచ్చు అంటున్నాయి అద్యాయనాలు. 30 నుంచి 80 సంవత్సరాల వయసు గల నాలుగు లక్షల మంది ఆహారపు అలవాట్లు సేకరించి తొమ్మిదేళ్ళ పాటు సాగిన ఈ ఆధ్యాయనంలో ప్రతిరోజు గుడ్డు తినేవారు మిగతా వారితో పోలిస్తే గుండెకు సంభందించిన వ్యాదులు,పక్షవాతం మొదలైనవి రాకుండా ఆరోగ్యంగా ఉంటారని తేలింది. ఆరోగ్య సమస్యలు రాకుండా రోజు ఆహారంలో గుడ్డును చేర్చుకోమని వారు సలహా ఇస్తున్నారు.

డ్రై క్లీనింగ్ బెస్ట్

కొంచెం ఖరీదే అయినా విలువైన చీరెలన్ని డ్రై క్లీనింగ్ కే ఇవ్వడం బెస్ట్. పెళ్ళిళ్ళకి, పేరంటాలకు ముఖ్యమైన ఫంక్షన్లకు కట్టుకుని విలువైన చీరెలకు నీటిలో తడిపితే ఆ షైనింగ్‌ పోతుంది. డ్రై క్లీనింగ్ లో దుస్తులను నీటికి బదులుగా ద్రవకాలతో శుభ్రం చేస్తారు. ఇందులో వాడే ద్రావణాలన్ని క్రూడ్ ఆయిల్ నుంచి తయారు చేసినవే. పెట్రోల్, బెంజిన్ ఉపయోగిస్తారు. దుస్తులను పెట్రోల్ లో శుభ్రం చేసి డ్రై క్లీనింగ్‌ మిషన్ లో వేస్తారు. అందులో కార్భన్ టెట్రాక్లోరైడ్, […]

తర్వాత చిక్కులే

ఈ మధ్య కాలంలో మహిళలకు విరివిగా ఆపరేషన్లు చేసేస్తున్నారు. సీజేరియన్ ఆ తర్వాత హిస్ట్రేక్టమి జరిగిపోతున్నాయి. చిన్నపాటి సమస్యలకే గర్భసంచి, అండాశయాలు తొలగిస్తున్నారు. గర్భసంచి ఆపరేషన్‌ తో అనారోగ్యసమస్యలు కొని తెచ్చుకోవడమే. దీని తర్వాత చాలా మందిలో రక్తపోటు పెరగడం హర్మోన్ల మార్పులు గమనించారు. ప్రతి ముగ్గురిలో ఒకరు బరువు పెరుగుతున్నారు. గుండె సంబంధ వ్యాదుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా 35 నుంచి 45 ఏళ్ళ వయసులో చేసే ఈ ఆపరేషన్లు దీర్ఘకాలంలో కొత్త బాధలు తెస్తున్నాయి. మహిళల్లో ఫై […]

ఇవే ఎక్కువ నష్టం

డాక్టర్లు కూడా మధుమేహం ఉన్నవాళ్ళకు కృత్రిమ షుగర్లు సిఫార్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సార్టీమ్ , ఎస్ సల్ఫెమ్ పొటాషియం వంటి క్యాలరీలు లేని కృత్రిమ షుగర్ల వాడకం ఎక్కువైంది. అలా శరీరంలోకి క్యాలరీలను పంపటం తగ్గించుకుంటున్నామని అనుకుంటున్నారు కానీ ఇవి స్థూలకాయానికి దారీ తీస్తున్నాయని వీటితో షుగర్ ఎక్కువవుతుందని చెబుతున్నారు. వీటి వల్ల శరీరంలో వచ్చే జీవరసాయన మార్పులు నరాల వ్యవస్థను దెబ్బతీయటంతో పాటు రక్తనాళల లోపలి పొరను పాడు చేస్తున్నాయని చెబుతున్నారు. వీటి కంటే సహజమైన […]

వెనక్కి వంచాలి

ఉదయం నుంచి సాయత్రం వరకు వంగి లేచి టేబుల్ పైన వాలిపోయి ఫోన్ మాట్లాడే ఇలా అన్ని పనుల్లోనూ ముందుకు వంగే వుంటాం కనుక దీని వల్ల వెన్నుముక పైన వెన్నుపాము పైన నిరంతరం వత్తిడి తగిలి కండరాల సమస్యలు వేధిస్తాయంటున్నారు వైద్యులు. శ్రమ లేని తనం వల్ల ప్రధాన సమస్య జీర్ణక్రియ కుంటుపడటం ఆకలి తగ్గిపోయి తీసుకునే పోషకాలు తగ్గుతాయి. ఈ సమస్యలు పోయేందుకు శరీరం హూనమయ్యే వ్యయామం ఏమి వద్ద్దని కేవలం పది నిమిషాలపాటు శరీరాన్ని […]

నెమ్మదిగా తినాలి

చాలా మందికి ఆహారం గబగబా తినేయటం అలవాటు. ఒక పరిశోధన ఎం చెబుతుందంటే ఒక నియమిత వేగంతో తిన్నప్పుడు మాత్రమే మన జీర్ణ వ్యవస్థలోని ఒక భాగం తనకి చాలు. కడుపునిండింది అన్న సంకేతాన్ని ఇవ్వగలుగుతుంది. వేగంగా తింటే ఈ వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అయిపోతూ సంకేతం ఇవ్వలేకపోతుంది. ఇక అలా ఎంత తిన్నా తృప్తి ఉండదు. అధిక బరువుకు కారణం ఇదే. పైగా అలా తినేవారు ఆహారాన్ని సరిగ్గా నమలరు. దీని వల్ల ఆహారంలో లాలాజలం కలవకపోవటం […]

కంటి ఆరోగ్యం కోసం

కళ్ళు మనసుని ప్రతిబింభిస్తాయంటారు. మన మనసులో ప్రతి ఆలోచనను కళ్ళు కచ్చితంగా అవతలివాళ్ళకు చెప్పేస్తాయి. మొహానికి తేలికైన కళ్ళే అందం. కంటి చూపు కూడా చాలా అవసరం. ఖచ్చితమైన ఆహార నియమాలతో కళ్ళను కాపాడుకోవచ్చు. పసుపు,నారింజ,ఆకుపచ్చ రంగుల్లో ఉండే ఆహారపదార్ధాల్లో కెరోటి నాయిడ్స్ పుష్కలంగా ఉండి కంటి చూపు మెరుగుపరుస్తాయి. ఈ కెరోటినాయిడ్స్ ని కాలేయం విటమిన్ ఎ గా మారుస్తుంది. కంటి పై పడిన వెలుగు శోషించుకోవడానికి విటమిన్ ఎ కావాలి. అందుకే మెరుగైన కంటి చూపుకే […]

మరిచిపోకండి

ఏ జనం మధ్యనో ఎండలో కాసేపు నిలబడితేనో హాటాత్తుగా వంగి లేస్తేనో కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు వెంటనే కాలు పై కాలుని ఎక్స్ ఆకారంలో వేసి కూర్చుని గట్టిగా నొక్కి పట్టాలి. అలాగే చేతులను కూడా ఎక్స్ ఆకారంలో వేసుకుని గట్టిగా భిగిస్తే రక్త సరఫరా వేగవంతమై మెదడుకి ఆక్సిజన్ అందుతుంది. మెదడుకి ఆక్సిజన్ అందకపోతే స్పృహ తప్పుతుంది. ఆస్టర్‌ డామ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ ఎక్స్ చిట్కా తప్పక పని చేస్తుందని మెదడుకు వెంటనే […]

మెదడుకి ఆహారం

ఊబకాయం మీద జరిగే పరిశోధనలు అన్ని ఇన్ని కావు లండన్ ఇంపీరియల్ కాలేజ్ నిపుణులు పరిశోధనలో ఒక కొత్త విషయం తెలిసింది. మెదడు సరిగ్గా పని చేయాలంటే దానికి అవసరమైన శక్తి కోసం గ్లూకోజ్ కావాలన్నది తెలిసిందే. అయితే హైపో థెలామస్ భాగం నుంచి స్రవించే గ్లూకోసెజ్ అనే ఎంజైమ్ కారణంగా మనకు గ్లూకోజ్‌ తీసుకోవాలన్న కోరిక కలుగుతుంది. ఇది ఎంత ఎక్కువ స్రవిస్తే అంత ఎక్కువ గ్లూకోజ్ ను ఆహారం ద్వారా తీసుకుంటున్నట్ల్లు తక్కువ స్రవిస్తే తక్కువ […]

ఖాయంగా అది వ్యసనం

టీనేజర్స్ బొత్తిగా సోషల్ మీడియాకు అతుక్కుపోయి అన్ని అనుంబంధాలకు దూరం అవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. స్నేహాలు, బంధుత్వాలు అన్నింటికి ఆ వర్చువల్ ప్రపంచం వేదికవుతుందని, పిల్లలు అందులో నుంచి బయటకు వచ్చి పది నిమిషాలైన కుటుంబ సభ్యులతో మాట్లాడటం లేదని నివేదిక చెబుతుంది. వెబ్ ప్రపంచలో బతికే టీనేజర్స్ ను బయటకు తెచ్చేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని లేకపోతే వారు భవిష్యత్ లో మానసిక సమస్యలకు గురవుతారని హెచ్చరిస్తున్నారు. ఒక్క ఫాలో లైక్స్ రాకపోతే సాటి వాళ్ళకు […]

గుండు చేయించి వాడాలి

శిరోజాల సంరక్షణ కోసం ఎన్నో అద్భుతమైన నూనెలున్నాయి. కొన్ని రాకాల గాఢమైన తైలాలు వెంట్రుకలు వృద్ది చేస్తాయి. అయితే గుండు చేయించుకుని జోజోబా,లవెండర్, థైమ్ వంటి తైలాలు అప్లయ్ చేస్తే జుట్టు చాలా త్వరగా పెరుగుతుంది. పెప్పర్ మెంట్ ఆయిల్ వల్ల కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. కొత్త జుట్టు రావడానికి తోడ్పడుతుంది. ఇందులోని మెంథాల్ కారణంగా చర్మంలోపలి రక్తనాళలు వ్యాకోచిస్తాయి. దానితో రక్తప్రసరణ మెరుగై శిరోజాలు పెరుగుతాయి. చమేరీ రోజ్ మేరా సేజ్ వంటి ఔషధ […]

పాలలో రకాలు

మార్కెట్లో ఎన్నో రకాల పాల ప్యాకెట్లు దొరుకుతున్నాయి. కొవ్వు తీసినవి, తీయనివి, వేడి చేసినవి,చేయనివి ఇలా రకరకాల ప్యాకెట్ల పైన హాల్ మిల్క్ అని వుంటే అవి కొవ్వు తీయని పాలు ఇందులో కోవ్వు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. స్కిమ్డ్ మిల్క్ అంటే కొవ్వు తీసినవి కొవ్వు క్యాలరీలు చాలా తక్కువ. పాయిశ్వరయిజ్డ్ మిల్క్ అంత ఓ స్థాయి దాకా వేడి చేస్తారు. దీనివల్ల పాలల్లో వుండే హానికరమైన బాక్టీరియా నశిస్తుంది. ఇక టోన్డ్ మిల్క్ అంటే […]

ప్లాస్టిక్ వద్దు

ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనార్ధాలు తెలిసినా అంత తేలిగ్గా ప్లాస్టిక్ వాడకం మాత్రం తగ్గటం లేదు. ప్రపంచంలో ఏటా 50 వేల కోట్ల ప్లాస్టిక్‌ బ్యాగ్ ల వాడకం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఇరవై లక్షల క్యారీ బ్యాగులు షాపుల్లోంచి ఇళ్ళలోకి నడిచొస్తున్నాయి. నిమిషానికో ట్రక్కు ప్లాస్టిక్ చెత్త సముద్రంలోకి డంప్ అవుతుంది. నిజానికి మనం వాడే ప్లాస్టీక్ అంత ఆరోగ్యకరమైనదేం కాదు. 50 శాతం వాడి పారేసేవి రీ సైకిల్ చేసి మళ్ళి మళ్ళీ […]

టెస్ట్ అవసరం

మార్కెట్లోకి ఎన్నో రకాల సౌందర్య ఉత్పత్తులు వస్తూ ఉంటాయి. అవి వాడే ముందర మో చేతి పైనో, చెవి వెనకో కాస్త రాసి టెస్ట్ చేసుకోవాలి. ఎర్రదనం,దద్దుర్లు రాకపోతే ఆ ప్రోడక్ట్ వాడోచ్చు. మాయిశ్చరయిజర్ రాసిన వెంటనే ఫౌండేషన్ ఉపయోగించకూడదు. మాయిశ్చరయిజర్ పూర్తిగా ఆరకనే ఫౌండేషన్ వేసుకోవాలి. సరైన మాయిశ్చరయిజర్ ఉపయోగించకపోతే స్వేద గ్రంధులు ముదిరి పోయి దద్దుర్లు,పొక్కులు వస్తాయి. ఈ ఎండల్లో వేడికి రోజులో ఎక్కువసార్లు ఫేష్ వాష్ ఉపయోగిస్తారు. అయితే నిమ్మగుణాలున్న ఫేష్ వాష్ […]