Chinna Maata
పర్ ఫెక్ట్ మ్యాచింగ్
ఎప్పటికప్పుడూ ఏ డ్రెస్ వేసుకున్న దానికి సరిగ్గా మ్యాచ్ అయ్యేలా రీచేంజ్ బుల్ ఇయర్ రింగ్స్ వస్తున్నాయి. వాటిలో రాళ్ళు మార్చుకునేలా దిద్దుల మధ్యలోని ప్లేట్ ని మార్చుకునే డ్రెస్ రంగుకి తగ్గట్లుగా లోలాకుల్లో వేలాడే పూసనో రాయినో మార్చుకునేవి ఇలా ఎన్నో రకాలు మార్కెట్లో ఉన్నాయి. ఏ డ్రెస్ కి అయినా చీరెకి అయినా వెంటనే దుద్దులు మార్చుకునే ఏర్పాటు ఉంది కనుకనే ఇవి అమ్మాయిలు ఇష్టపడే ఫ్యాషన్. రాళ్ళు,పూసలు,ప్ల్లాస్టిక్ ,వన్ గ్రామ్ గోల్డ్ మొదలు […]
రెండు ప్రమాదమే
శరీర రూపంలో వెంటనే మార్పు కనిపిస్తే వెంటనే ఎవరో ఒకళ్ళు ఎందుకలా ఉన్నావనో లేదా బరువు తగ్గావనో బరువు పెరిగావనో దెప్పేస్తూ ఉంటారు. అలా వెంటనే బరువు పెరగడమో మరి తగ్గడమో మంచిది కాదంటున్నారు డాక్టర్లు. ఒకవేళ అలా త్వరగా బరువు తగ్గిపోతూ ఉంటే అది పక్షవాతానికి దారీ తీస్తుందనో గుండేపోటు ,క్షయ వంటి అనారోగ్యాలను సూచిస్తుందని అనుమానించుకొండి అంటున్నారు. వెంటవెంటనే పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి.
కరెన్సీతో అనారోగ్యాలు
కరెన్సీ వాడకం తగ్గించమంటుంది ప్రభుత్వం.డిజిటల్ లావాదేవీలు పెంచితే ఒకవైపు ప్రింటింగ్ ఖర్చులు తగ్గుతాయి. అంతేకాదు కరెన్సీ ద్వారా వచ్చే రోగాలు కూడా తగ్గుతాయి అంటారు నిపుణులు.నోట్లు ప్రతి నిమిషం ఒకరి చేతి నుంచి ఇంకో చేతికి మారుతూ ఉంటాయి.పాతనోట్లను పరిశీలిస్తే వీటిలో 19 రకాల సూక్ష్మజీవులు గుంపులు గుంపులుగా ఉండటం గమనించారట.ఇందులో స్టాఫైలో కోకస్, ఎన్ టెరో కోకస్ బాక్టీరియాలు కనిపించాయట.ఇవి ప్రాణాంతకమైన బ్యాక్టీరియాలు గాలిలో ఉండే బాక్టీరియా మాటిమాటికి మారే చేతుల నుంచి అంటుకునే బాక్తీరియాలో […]
ఆరోగ్యనిధి
ఘాటుగా,వగరుగా,కారంగా ఉండే వంటలకు వామూతో ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది.చాలా మంది వామూను ఎక్కువగా వాడరు గానీ ఇందులో ఔషధగుణాలు అపారంగా ఉంటాయి. కాస్త వాముని వేయించి,రాత్రంతా నీళ్ళలో నాననిచ్చి ,ఆ నీళ్ళతోనే వాముని మరిగించి ఆ నీళ్ళు తాగితే జీర్ణ సంబంధమైన అనారోగ్యాలు అన్ని పోతాయి. వామూలో ఉండే థైమల్ అనే రసాయనం ఫంగల్ బాక్టీరియా వ్యాధులను నిరోధించగలదు. ఆయుర్వేదంలో వామూకు ప్రాధాన్యత చాలా ఎక్కువ. వీటిలో మినరల్స్ ,విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ చాలా […]
రోజంతా ఫ్రెష్ గా
శరీరంలో దుర్వాసన పొగేట్టే కొలోన్లు ,డియోడ్రెంట్స్ లు సబ్బుల గురించి ప్రతిరోజు యాడ్స్ చూస్తుంటాం. ఇంత ఖరీదైన వస్తువులు మార్కెట్లో ఉన్నాయి అంటే సమస్య తేలికగా ఉన్నట్లే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నాలుగురిలోనూ ఒకరు నోటీ దుర్వాసనలో బాధపడతారట. పుదినా ,తులసి ఆకులు సహజమైన మౌత్ ప్రెషనర్లు ,శరీరం దుర్వాసనకు చమట కారణం .ఈ చమటకు కొన్ని బాక్టీరియాలు కారణం.బాక్టీరియాని దూరం చేసే సబ్బుతో స్నానం చేస్తే మంచిది. అలాగే దుర్వాసన రాకుండా యాంటీ పరిమైరెంట్స్ ఉపయోగించాలి.చర్మాన్ని […]
మంచి నిద్ర కోసం పాలు ,బెల్లం
పాలు బెల్లం కలిపి తాగితే అనేక ప్రయోజనాలు అంటారు వైద్యులు. ఈ శీతాకాలంలో రాత్రి వేళ నిద్రపోయే ముందర ఈ పాలు బెల్లం తాగితే మంచి నిద్ర వస్తుంది అలాగే శీతా కాల సమస్యలు, అస్తమా వంటివి ఉన్న వాళ్ళకి మంచి ఉపశమనం కూడా .పాలలో కాల్షియం ,బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటాయి. బెల్లం జీర్ణ సంబంధిత ఇబ్బందులను సరిచేస్తుంది. కడుపులో గ్యాస్ ఉత్పత్తి కాకుండా అడ్డుకోనే శక్తి బెల్లంలో ఉంటుంది. ఈ చల్లని రోజుల్లో నీటిలో […]
అనారోగ్యాలు వస్తాయి
ఈ సీజన్ లో పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు వెచ్చని భద్రత ఇవ్వకపోతే ఎన్నో అనారోగ్యాలు వచ్చేస్తాయి. వాళ్ళకు పరిశుభ్రంగా ఉండే దుస్తులు వెయ్యాలి. ఎప్పటికప్పుడు గాఢత లేని సబ్బుతో ఉతికి ఎంతో కొంత ఎండ తగిలేలా ఆ ఎండ వేడిలోనే ఆరనివ్వాలి. ఆహారం విషయంలో కూడా మరింత శ్రధ్ద కావాలి. వెజిటెబుల్ సూప్స్ ,చిలకడ దుంపలు పిల్లలకు చాలా మంచిది. వేడిగా ,మిరియాల పొడి వేసిన పాలు తాగిస్తే జలుబు ,దగ్గులు రావు. […]
శరీరానికి శక్తి
చలి వాతావరణం,దోమల కారణంగానే వైరల్,ఫ్లూ జ్వరాలు పట్టుకొంటాయి.రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేసుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆహారం ద్వారానే ఈ వ్యవస్థ బలపడుతుంది.విటమిన్ సి అధికంగా ఉండే కమలాపండులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండి ఈ వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇన్ ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. ఆకుపచ్చని కూరగాయల్లో రోగ నిరోధక శక్తి పెంచే గుణాలు ఎక్కువ. ముఖ్యంగా వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్దం బాక్టీరియా నుంచి శరీరాన్ని కాపాడుతుంది. అలాగే లవంగాలు […]
కేశ రక్షణకు మూలికలు
జుట్టు చక్కగా ఉండాలంటే రసాయనాలతో కూడిన ఆయిల్స్ కంటే ప్రకృతి వర ప్రసాదా లైన ఏడు మూలికలు ఉపయోగించుకోమంటున్నారు ఆయుర్వేద వైద్యులు. సహజసిద్దమైన రోగనాశిని వేప,భారతీయ జిన్ సెంగ్ అని పిలిచే అశ్వగంధ,సి విటమిన్ పుష్కలంగా లభించే ఉసిరి ,యాంటీ సెప్టిక్ లక్షణాలున్న ఆ బంతిపూలు ,యాంటీ ఇన్ ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్న మెంతులు,ఉసిరి,కరక్కాయ మిశ్రమమైన త్రిఫల చూర్ణం అధ్భుతమైన ఔషధ లక్షణాలున్న తులసి ఇవన్ని జుట్టుకు ఆరోగ్యం ఇచ్చేవి. చర్మ సౌందర్యం కేశ సౌందర్యం […]
పువ్వుల మొక్కలే కానుక
ఎన్నో సందర్భాల్లో అనేక కానుకలు ఇస్తూ ఉండటం కాస్త ప్రత్యేకమైనది మనల్ని నిరంతరం గుర్తు తెచ్చేదిగా ఉండేది అయితే పువ్వుల మొక్కల్ని కుండీలు, చక్కని స్టాండ్ తీగల అల్లుకునే మనీ ప్లాంట్ ను ఆధారంగా మాస్ స్టిక్ వంటివి కలిపి ఇస్తే బావుంటుంది. చాలా మందికి పువ్వులు ఇష్టం కూడా బిగోనియా,జరానియం ,అంధూనియం,బ్రిమిలైడ్స్,ఎడీనియం,పిటూనియా వంటి రకాలు కానుకగా ఇస్తే బావుంటాయి. అదృష్టాన్ని పంచుతాయని నమ్మే జెడ్ మండ్ విల్లా మనీప్లాంట్ వంటివి చక్కని బహుమతి. మొక్కల్ని పెంచే తీరిక […]
గర్భిణులకు సూచన
గర్భవతిగా ఉన్న సమయంలో తగినంత బరువు ఉండకపోతే నెలల నిండకముందే ప్రసవించే అవకాశాలు ఉన్నాయి. లేదా సిజేరియన్ చేయవల్సిన అవకాశం ఏర్పడుతుందని ఆస్ట్రేలియాలోని మొనాష్ యూనివర్సిటీ మరిశోధనలు చెభుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా గర్భిణులను పరిశీలిస్తే అందులో సగం కన్నా ఎక్కువ మంది ఉండవలసిన దానికన్నా ఎక్కువ బరువు ఉన్నారు. పావుశాతం మంది ఉండవల్సిన దానికన్నా చాలా తక్కువ బరువు ఉన్నారు. ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక పోషకాహారం తీసుకోవడం తగినంత బరువు పెరగడం పై ప్రత్యేక దృష్టిపెట్టాలని లేకపోతే […]
షిప్టుల మార్పు ప్రభావం
పని వేళల్లో తరుచూ మార్పులు చోటు చేసుకొంటూ ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. ఉద్యోగంలో షిఫ్టులు తప్పవు కానీ వ్యక్తులు అలవాటు పడ్డట్టు అంత వేగంగా శరీరం అలవాటు పడదని వీరు చెబుతున్నారు. దీని వల్ల బాడీ క్లాక్ లో అనేక మార్పులు చోటు చేసుకొంటాయని ఈ కారణంతో షిప్టులలో పని చేసే పురుషులు ఎక్కువ శాతం పక్షవాతం భారీన పడే అవకాశాలు ఉన్నాయంటున్నాయి అధ్యయనాలు. స్త్రీలలో విడుదల అయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ పక్షవాతం భారీ […]
ఇది చక్కని స్క్రబ్
మెంతులు అద్భుతమైన సౌందర్య ప్రయోజనాలు అందిస్తాయి. వీటిలో యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలుంటాయి. నియాసిన్ లేదా విటమిన్ బి3 అత్యాధికంగా ఉండి మెంతులు దెబ్బతిన్న చర్మ కణాల్ని మరమ్మత్తు చేయవచ్చు. కొత్త కణాలను ప్రభావ వంతంగా పునర్ నిర్మింపజేయటంలో సహకరిస్తాయి. ఫలితంగా చర్మం మూడతలు పడటం వయస్సు రీత్యా వచ్చే మచ్చలు ఫైన్ లైన్స్ తగ్గుతాయి.ఈ మెంతుల్ని పిండిగా చేసి చక్కని స్క్రబ్ లేదా మాస్క్ గా వాడవచ్చు.క్రమం తప్పకుండా వాడుతూ […]
పిల్లల్లో ఐక్యూ
పిల్లలకు నాలుగైదు ఏళ్ళు రాగానే వారి తెలివి తేటల గురించి తెలుసుకొనేందుకు ఐక్యూ పరీక్ష పెట్టమని సైకాలజిస్ట్ లు చెపుతుంటారు. ఐక్యూ అంటే ఇంటలిజెంట్ కోషంట్ .ఒక స్థిరీకరించిన పద్దతిలో పిల్లల తెలివి తేటలను సంఖ్యా రూపంలో విలువ కట్టడం .. ఏ సామార్ధ్యాల గురించి పరీక్షిస్తున్నారు, ఎలాంటి పరీక్ష పెడుతున్నారు అన్నా విషయంపైన ఇచ్చే రేటింగ్ ఆధారపడి ఉంటుంది. 90-110 మధ్య రేటింగ్ ఉంటే వారికి మామూలు తెలివి తేటలు ఉన్నట్లు చెప్పవచ్చు. 90కంటే తక్కువ […]
ఆకు కదిపితే సువాసన
ఆకులను కదిలిస్తే చాలా కమ్మని వాసన వస్తాయి. ఆకు నమిలితే నోరు సువాసనతో ఉంటుంది. ఫైబర్ ఐరన్ కాల్షియం ,విటమిన్ ఎ,బి,సి,డిలు కార్బోహైడ్రేట్స్ పుదినాలో ఉంటాయి. అనేక టూత్ పేస్టులు ,మౌత్ ప్రేషనర్స్ ముఖ్యమైన మూలపదార్ధం పుదినానే. పుదినాను నీళ్ళలో వేసి మరిగించి ఆ నీళ్ళలో ఉప్పువేసి పుక్కిలిస్తే గొంతులో ఉండే అసౌకర్యం పోతుంది. పుదినా ఆకులు తింటే గొంతులో కఫం తగ్గిపోతుంది. పుదినా ఆకుల రసం తీసి ఫ్రెష్ గా ఉన్న ఆ రసంలో పంచదార […]
సైక్లింగ్ తో శక్తి
నడకలతో పాటు సైక్లింగ్ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు. అందులోనూ చక్కని ప్రకృతి,మంచి పరిసరాల్లో సైక్లింగ్ చేస్తే స్వచ్చమైన గాలిని పీల్చుకొనే అకాశం కూడా ఉంటుంది.వారానికి మూడు సార్లు సైక్లింగ్ చేస్తే మెదడు ఆలోచన శక్తి బాగా వృద్ది చెందుతోంది . సైక్లింగ్ లో శక్తంతా ఉపయోగిస్తాం కాబట్టి శరీరానికి మంచి వ్యాయామం లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కూడా.నిత్యం సైక్లింగ్ చేస్తే శరీరం లావు కాకుండా కాపాడుకోవటంతో పాటు గుండెజబ్బులు ,మధుమేహాం వంటి వాటిని నివారిస్తుంది […]
యవ్వన వంతమైన చర్మం
చర్మం ముడతల్ని తగ్గించేందుకు ఎన్నో క్రీములు లోషన్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక అధ్యయనం ముఖం సరిగ్గా కడగకపోవటం వల్ల చర్మం మీద వేసే మేకప్ ను తొలగించకపోవటం వల్ల చర్మానికి త్వరగా వార్ధక్యం వస్తోంది అంటున్నారు. యాంటీ ఏజింగ్ రోటీన్ ద్వారా చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవచ్చు అంటున్నారు .రాత్రి వేళ్ళల్లో క్లెన్సింగ్ చేయాలి. రెండు సార్లకు మించి చేస్తే నలభై ఏళ్ళకే చర్మం పొడిభారీ పోతుంది. చర్మం పొడిగా ఉన్న సెన్సిటివ్ అయాని మాయిశ్చరైజంగ్ ఫోమింగ్ […]
తెలుగమ్మాయి ఘనత
మెదడు క్యాన్సర్ గురించి చేసిన ప్రయోగాలతో తెలుగమ్మాయి కావ్య కొప్పరపు అమెరికా లోని డేవిడ్సన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ టాలెంట్ డెవలఫ మెంట్ అనే సంస్థ నుంచి ఫెలోషిప్ అందుకొంది .క్యాన్సర్ పైన మరిన్ని ప్రయోగాలు చేసేందుకు గానూ 50 వేల డాలర్లు ప్రోత్సాహకంగా అందుకొంది కూడా. ఇవేకాదు ఈ పద్దెనిమిది సంవత్సరాల కావ్య మూడేళ్ళ క్రితమే గర్ల్స్ కంప్యూటింగ్ లీగ్ అనే స్వచ్చంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా రోబోటిక్ టెక్నాలజీ, యాప్ డెవలప్ […]
ఆకాశ ఉద్యాన వనాలు
ఇప్పుడు ఆంధ్రాలో వర్టికల్ ఫామ్స్ వెలుసున్నాయి. ఈ విలువెత్తు తోటలో నగర కాలుష్యాన్ని హరించేందుకు మంచి గాలి ఇచ్చేందుకు ఉద్దేశించినవి. సింగపూర్ ,అమెరికా వంటి దేశాలల్లో ఈ నిలువెత్తు తోటల్లో తాజా కూరగాయాలు పండించేస్తున్నారు. హైడ్రోఫానిక్స్ ,ఏరో ఫానిక్స్ ఆక్వా ఫామింగ్ పద్దతులలో ఈ నిలువెత్తు తోటలను పెంచవచ్చు అంటున్నారు నిఫుణులు. జనాభా తగిన నిష్పత్తిలో భూమి లేని భారతదేశానికి నిట్టనిలువు తోటలే మేలు అన్నది వ్యవసాయ నిపుణుల అభిప్రాయం. కేరళలో కూడా ఇప్పుటికే వర్టికల్ ఫామ్స్ […]
సీనరీ రంగోలి
ఒక్క సంక్రాంతే కళకళలాడుతూ కళ్ళకు కనిపించే పండుగా. ప్రతి ఇంటి ముంగిలో రంగవల్లులూ పండగను గుర్తు చేస్తూ ఉంటారు. ముగ్గు అంటే చుక్కలు ,మెలికలు గీతల ముగ్గులే. ఇప్పుడు యూట్యూబ్ అందుబాటులోకి వచ్చాక గొప్ప పెయింటింగ్లే ముగ్గులుగా ఎలా వేయవచ్చో వీడియోలు చేసి చెప్పేస్తున్నారు. ఇప్పుడోస్తున్న ముగ్గుల్ని పోస్టర్ రంగోలి సీనరీ రంగోలీ అంటున్నారు. ప్రకృతిలో మనకు కనిపంచే ప్రతి దృష్యాన్ని చక్కని రంగులతో నేలపైనే వేసేయటం అన్న మాట. చాక్ పీస్ తో సీనరీ గీసుకోని […]
