Chinna Maata
అది అర్థం చేసుకొనే సమయం కూడా
సాధారణంగా రోజుకు 13వేల సార్లు కళ్ళు ఆర్పుతుంటారని చెపుతారు. కళ్ళు పొడిబారిపోకుండా ఉండేందుకు గానూ ఇది శరీరపు ఏర్పాటు అనుకొంటాం. కానీ కళ్ళు మూసుకోవటం తెరవటం వెనక ఇంకో లాభం ఉంది అంటారు నెదర్లాండ్స్ పరిశోధకులు. ఈ సైకో లింగ్విస్టిక్ నిపుణుల పరిశోధనల ప్రకారం ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకొంటూ ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకొంటూ ఉంటారు. ఒకళ్ళు మాట్లాడుతుంటే రెండో వాళ్ళు తల ఆడిస్తూ వింటూ ఉంటే కనురెప్పలు మూత పడుతూ ఉంటాయి. ఇవతలి వాళ్ళు చెప్పేది […]
చూపు బావుండాలంటే చూసి తినాలి
కళ్ళు మూసేదాకా ఆ కళ్ళు చక్కగా పని చేయాలి. నిరంతరం చూస్తూ ఉండాలి. చక్కగా చదువుతూ మెదడుకి చైతన్యం అందించాలి అల చక్కని కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు ఖనిజాలు కావాలి . లుటెన్ ,జయోగ్జాంథన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకు కూరలు, కోడిగుడ్లు ,బ్రకోలి స్వీట్ కార్న్ తీసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే తాజా పండ్లు, కాప్సికం,పాలకూర వంటివి తరుచూ తినాలి. ముడి ధాన్యాలు ,బాధం ,ఆక్రోట్, చేపలు ,గుడ్లు ,అవిసె […]
పాపాయికి అన్నం ,పప్పు
పిల్లలకు ఇచ్చే ఘనాహారం ఇవ్వాళ జీడిపప్పులు, బాధం పప్పులతో ఎంతో సత్తువ నిచ్చే ఆహారంగా తయారు చేసి ఇస్తున్నామంటున్నారు మోడ్రన్ తల్లులు. కానీ న్యూట్రిషనిస్ట్ లు మెత్తగా చేసిన అన్నం, పప్పు చారు, నెయ్యి వేసి పెట్టమంటున్నారు. బియ్యం, కందిపప్పు ,పెసరపప్పు బాధం,జీడి, పిస్తా కూడా కలిపి రవ్వలా చేసి ఉంచుకొని దాన్ని నీళ్ళతో వండి ,చారు, నెయ్యి వేసి పెట్టమంటున్నారు .మిక్సీలో వేస్తే టేస్ట్ మారి పోతుంది, మెత్తని పండ్లు చేతిలో నలిపిపెట్టవచ్చు. ఆకు కూరలు […]
ఇది తేలికైన చికిత్సా మార్గం
కొందరిలో ఎన్నో కారణాలతో కాలేయ కణాల్లో కొవ్వు పేరుకుకొని కాలేయం పాడైపోతుంది. ఆహారపు అలవాట్లు మార్చుకోవటం, వ్యాయామం చేయటం తప్ప ఇంకో చికిత్సా విధానం ఏదీ లేదు. అయితే స్వీడన్ కు చెందిన పరిశోధకులు ఆకుకూరల్లో లభ్యం అయ్యే అకర్బన్ నైట్రిట్ కి కాలేయంలో చేరిన కొవ్వుని తగ్గించే గుణం ఉందని తేల్చారు. ఈ దిశగా సాగిన పరిశోనల్లో ఈ నైట్రిట్ ని సప్లిమెంట్స్ రూపంలో ఇస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది.ఇంకా జీర్ణక్రియ లోపాలు కూడా తగ్గాయి. […]
ఈమె ఆదాయం నెలకో కోటి
గంటల తరబడి సోషల్ మీడియాలో కాలక్షేపం చేసే వాళ్ళు కొందరైతే, అదే సోషల్ మీడియాను తెలివిగా వాడుకొంటూ ,స్వయంగా ఇన్ ఫ్లుయెన్సర్ గా మారిన వాళ్ళు ఉన్నారు, లక్షల్లో సంపాదిస్తున్నారు. ఆష్మా ష్రాఫ్ ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా కోటీశ్వరాలైన తొలి భారతీయ యువతి. ముందుగా మేకప్ ,స్టైల్ చిట్కాలు చెపుతూ ఫోటోలు పెట్టేది. ఫాలోవర్స్ పెరిగారు ఇంకొపక్క ఫ్యాషన్ టూరిజం అంశాలపై సొంత బ్లాగ్ రాస్తోంది. బిజిబిజీగా దేశాలు తిరుగుతూ అనుభవాలు ఫోస్ట్ చేస్తూ నెలకు పాతిక […]
అమ్మాయి మెచ్చేరు
అందంగా ,మంచి ఉద్యోగం చేస్తూ ఆర్ధికంగా స్థిరంగా ఉన్న వాళ్ళనే అమ్మాయిలు భర్తగా ఇష్టపడతారని అనుకొంటారు .కానీ ఒక సర్వేలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. అమ్మాయిలు చక్కని నటులనీ ,మ్యూజిక్ లో ప్రావీణ్యం ఉన్నా వాళ్ళనీ ఇష్టపడతారట. ఒక లిస్ట్ ప్రకారం చూస్తే ఫుట్ బాల్ ఫ్లేయర్లు వరసలో చివరిగా ఉన్నారు. వాళ్ళు మరీ ఎక్కువ కాన్ఫిడెన్స్ తో సరైన రెప్యుటేషన్ లేకుండా ఉంటారన్న కారణంతో ఎవ్వళ్ళు వాళ్ళకి మంచి మార్కులు ఇవ్వలేదు. ఇంకా టీచర్లు ,రచయితలు,డాక్టర్లు,పాత్రికేయులు […]
బరువు తగ్గించే 5 పానీయాలు
కొన్ని పానీయాలు బరువు తగ్గించి సరైన రూపాన్ని ఇస్తాయని అధ్యయనాలు చెపుతున్నాయి. ఈ పానీయాలు యాంటీ ఆక్సిడెంట్స్ తో నిండి ఉంటాయి. బరువు తగ్గించే పానీయాల లిస్ట్ లో గ్రీన్ టీ ముందుంటుంది. గ్రీన్ టీ తో రోజులో 70కేలరీలు తగ్గుతాయి. క్యారెట్ రసంతో విటమిన్లు ఖనిజాలు ఉండటంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలే కాక బరువు తగ్గిస్తుంది. భోజనానికి ముందే ఈ క్యారెట్ రసం తీసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యకరమైన పానీయం బ్లాక్ టీ. ఇది జీవక్రియను […]
తెల్లని అన్నమే ప్రమాదం
భారత దేశంలో కోట్ల మందికి ప్రధాన ఆహారం వరి అన్నమే. కానీ కూల్ డ్రింక్ కల కన్నా అన్నమే ప్రమాదమని పరిశోధకులు చెపుతున్నారు. బియ్యం తెల్లగా మెరిసేందుకు మిల్లులో పాలిష్ చేయటం వల్ల పోషకాలన్నీ తౌడుగా మారిపోతున్నాయి. అలా పాలీష్ చేసిన బియ్యం తినటం వల్ల పోషకాలు శరీరానికి అందక కేవలం గ్లూకోజ్ రూపంలో చక్కెర మాత్రమే రక్తంలో కలుస్తుంది. అది పెరుగుతూ చివరకు మధుమేహానికి దారి తీస్తోందని పరిశోధకులు చెపుతున్నారు. చైనా ,జపాన్ ,అమెరికా ,ఆస్ట్రేలియా […]
నాణ్యత సౌకర్యం ప్రధానం
ఒక బ్యాక్ ప్యాక్ తగిలించుకుని చిన్నిపాటి ప్రయాణం చుట్టేయవచ్చు. ఒక రోజు ప్రయాణానికి కావల్సినవన్ని ఆ బ్యాగ్ లో ఈజీగా పట్టేస్తాయి. అలాగే అమ్మాయిలు కాలేజీకి ఆఫీస్ కి కూడా ఒక బ్యాక్ ప్యాక్ తో బయలుదేరిపోతారు. లంచ్ బాక్స్ దగ్గర నుంచి అవసరమైన వస్తువులన్ని అందులో సిద్ధంగా ఉంచుకుంటారు. ఇంత ప్రయోజనం ఉన్న బ్యాగ్ ఎంచుకునే ముందర నాణ్యత, సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిలో ఎన్నోరంగులుంటాయి. కంటికి ఇంపైన రంగులు చక్కని డిజైన్లు ఫ్లోరల్ డిజిటల్ […]
మచ్చ పడిపోతుంది
బొట్టుబిళ్ళ పెట్టుకోవడమే ఈ రోజుల్లో బొట్టు పెట్టుకోవడం అంటే చాలామందికి ఈ బొట్టు బిళ్ళ అంటించిన చోట ఎలర్జి వస్తుంది. కాస్త దురదగా ఉండటం వల్ల సమస్య అనిపించదు.కొన్నాళ్ళకు అది శాస్వత సమస్య అయిపోయి ఆ ప్రదేశంలో మచ్చ పడిపోతుంది.అసలు ఈ బొట్టు బిళ్ళలు పీవీసి మెటీరియల్ తో తయారు చేస్తారు అది ప్లాస్టిక్ కెమికల్ తో తయారవుతుంది. ఈ రసాయనం బిళ్ళ వెనక ఉండే జిగురు వల్ల ఎలర్జీలు వస్తాయి. వెంటనే వైద్యం చేయకపోతే దురద […]
ఎంత తేలికగా
జపాన్ నుంచి వెలువడుతున్న మేన్స్ మేగజైన్ స్పా డిసెంబర్ 25 సంచికలో ఒక ఆర్టికల్ ప్రచురించింది. ఏ యూనివర్సిటీ అమ్మాయిలు అబ్బాయులు ఎంత త్వరగా పడిపోతారో యూనివర్సిటీ ర్యాంక్ లు ఇచ్చిన కథనం పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారుఽమ్మాయిల డ్రెస్ కోడ్ పైన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఈ బుద్దిలేని పత్రికను వెలివేయమంటూ ఒక మహిళ 37 వేలకి పైగా సంతకాలతో పత్రిక యాజమాన్యం తక్షణం క్షమాపణ చెప్పాలని క్యాంపెయిన్ ప్రారంభిస్తే ఆ డిమాండ్ కి […]
పండగ ప్రత్యేకం
బంగారు తీగతో అల్లిన ముత్యాల నగలు చక్కని దేవతా మూర్తుల పెండెంట్లు పండక్కి ప్రత్యేకంగా ధరించేలా వస్తున్నాయి. పెరల్స్,క్లస్టర్స్ ముత్యాలు మువ్వల్లా ఎంతో అందంగా ఉంటాయి.వీటికి కెంపులు వజ్రాలు వంటి ధగధగమనే ముదురు రంగు రాళ్ళు పొదిగిన పెండెంట్స్ ప్రత్యేకమైన అందం.క్లస్టర్ నగలకు మ్యాచింగ్ గా ఉంగరం,గాజులు,బ్రాస్ లెట్ మ్యాచింగ్ గా నలుగురిలో ప్రత్యేకంగా చూప్సితాయి. పందక్కి ధరించే చీరెలు కూడా కమ్టికి ఇంపైన రంగుల్లో ఉంటాయి కనుక ఆ చీరెకు చక్కగా నప్పేవి ముత్యాలు అల్లిన […]
మేకప్ చెదరకుండా
ఆఫీస్ కు వెళ్లే ముందు చిన్నపాటి మేకప్ వేసుకున్న ఆఫీస్ చేరేసరికి చెదిరిపోతూ ఉంటుంది.మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే మేకోవర్ లో డిడి క్రీమ్ వాడాలి. దీన్ని చర్మానికి బ్లెండ్ చేశాక బుగ్గలు ముక్కు పై బ్లషర్ ద్వారా కాంప్లెక్షన్ కాంతివంతం అవుతుంది. అప్పుడు లోయర్ ల్యాష్ లైన్ పైన కోల్ అప్లయ్ చేయాలి.తేలిగ్గా మస్కరా వేసుకోవాలి. కొద్దిగా గ్లాస్ హింట్ టల్ చేస్తే చాలు సాయత్రం వరకు మేకప్ చెదిరిపోకుండా ఫ్రెష్ గా ఉంటుంది.
ఈ లిప్ బామ్ వాడితే మంచిది
పగిలిన పెదవులు మంటపుడుతూ ఉంటాయి.కొందరు ఆ పెదవులను తడి చేస్తూ ఉంటారు. అలా తడి చేయడం పెదవులు ఇంకోంచెం పొడిబారేందుకు కారణం అవుతుంది. ప్లోరైడ్ ఫ్రీ టూత్ పేస్ట్ వాడితే మంచిది,అలాగే అన్ ఫ్లేవర్డ్ లిప్ బామ్స్ వాడాలి. గాలిని నోటితో పీల్చకూడదు. పెదవులకు బాదం నూనె రాసే రాత్రాంత అలాగే ఉంచాలి.ఇమ్ట్లో తయారు చేసే లిప్ బామ్ వాడుకుంటే పగిలే పెదవుల సమస్య రాదు.తేనె గులాబీ రేకుల క్రీమ్ కొబ్బరి నూనె కలిపి బ్లెండ్ చేసి […]
షాంపూలు మారుస్తూ ఉంటే బెటర్
శిరోజాలు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత దృఢంగా ఉంటాయి. రాలిపోవు ఇతర సమస్యలు రావు.అందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.రెగ్యులర్ గా యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడకూడదు.కుదుళ్ళకు హాని జరుగుతుంది.అదనపు రసాయన హాని జరగకుండా ఉండేందుకు రెసిస్టెన్స్ అడ్డుకునేందుకు బ్రాండ్లు మార్చాలి.జుట్టు తడిగా ఉన్నప్పుడు అదనపు జాగ్రత్తలు అవసరం.తడి జుట్టు దువ్వకూడదు దీంతో మరిన్ని చిక్కులు వస్తాయి. ఒకేసారి కలరింగ్,స్ట్రెయట్ నింగ్ వంటి బహుళ చికిత్సలు తీసుకోకూడదు.రాత్రంతా హెడ్ రోలర్స్ అలాగే ఉంచకూడదు.హెయిఅర్ స్టైలింగ్ జెల్స్ స్ట్రయిటనింగ్ […]
ఇలా తింటేనే పోషకాలు
మనకు నోరూరించే ఆహార పదార్ధాలు మరి అంత దూరంగా ఉండక్కర్లేదు. కాకపోతే కొన్నికాంబినేషన్స్ లో వాటిని పోషకాహారాలుగా మార్చేయవచ్చు. ఇడ్లి,దోశె,ఊతప్పం వంటివి సాంబార్ గ్రీన్ చట్నీతో తినాలి.అలా తింటే ప్రోటీన్లు లభిస్తాయి.కొబ్బరి చెట్ని కొవ్వు పెంచగలదు. పావ్ బాజీని పెసరపప్పు వంటకంతో కలిపి తీసుకుంటే పావ్ బాజీ జంక్ ఫుడ్ కాదు.నూడిల్స్ నూనెలో ఉడికించి కూరగాయల ముక్కలతో పన్నీర్ తో కలిపి తింటే శరీరానికి కావల్సిన ప్రోటీన్లు లభిస్తాయి. పిజాకు బీన్స్ సలాడ్ కలపవచ్చు.మాములుగా ఎప్పుడు తినే […]
మెదడుకి ఆహారం
మెదడు పాదరసం మాదిరిగా పని చేయాలి అంటే ఎప్పటికప్పుడు పదును పెడుతూ పోవాలి. కండరాల వంటిదే మెదడు కూడా. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయకపోతే కండరాలు ఏ విధంగా స్టిఫ్ గా అయిపోతాయో మెదడు అంతే. ఫిజల్స్ బోర్డ్ గేమ్స్,కార్డ్ గేమ్స్, కంప్యూటర్ గేమ్స్ మెదడుకు పదును పెడతాయి. మిగతా శరీరం మాదిరిగా మెదడు ఆశాజనకంగా పని చేయాలి అంటే పోషకాల అవసరం ఎంతగానో ఉంటుంది. సమతుల్యాహారానికి తోడు మల్టీ విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ లభించే పళ్ళు […]
బాంధవ్యాలకు అత్యంత శక్తి
ప్రతి మనిషి జీవితానికి కుటుంబం కేంద్రం. దాన్ని ప్రేమించని వాళ్ళు ఉండరు. అలాంటి బలమైన ,ప్రేమ పూరితమైన బాంధవ్యం ఉంటేనే ఒత్తిడి అనేది తలెత్తకుండా ఉంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. మానసికంగా కుంగిపోయి ఒత్తిడితో ఉంటే రానురాను అది పెను భూతంగా మారుతోంది. దాన్ని ఎదుర్కొగల మార్గాల్లో ఒకటి. మనల్ని సపోర్ట్ చేసి ప్రేమించే వారి పోటోలను చూడటం .ఇది మెదడుకు ఇబ్బంది కలిగించే విషయాలను నెమ్మదింపజేస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. కుటుంబ సభ్యుల ఫోటోలు మెదడుపై అనుకూల ప్రభావం […]
మసాజ్ తో ఉపశమనం
వ్యాయామాలు ,ఫిజికల్ యాక్టివిటీ తర్వాత కండరాల నొప్పులు ఉంటుంది. ఈ నొప్పుల గురించి మందులు వాడటం అవసరం. పరుగు తీసే సమయంలో కాళ్ళ కండరాలు మండుతూ ఉంటే తేలికపాటి జాగింగ్ లేదా వాకింగ్ చేయాలి. నొప్పి తగ్గి హార్ట్ రేట్ సాధారణ స్థాయికి వచ్చే వరకు ఇలాగే చేయాలి. కండరాల నొప్పులు ఉన్నప్పుడు మసాజ్ మంచి ఆప్షన్. రిస్ట్,ఐస్ ప్యాక్,కంప్రషన్ వంటి వాటితో మసాజ్ వల్ల ఫలితం కనిపిస్తుంది. కండరాల నొప్పి నుంచి ఉపశమనం కోసం స్ట్రెచ్ […]
ఈ కొన్ని మార్పులు చాలు
మొనోపాజ్ దశలో ఎదురయ్యే చాల సమస్యలు జీవన శైలీ ఆహారం మార్పులతో అదుపులో ఉంచుకోవచ్చు. ముందుగా శరీరానికి పోషకాలు అందాలి ముఖ్యంగా బీ12 చాలా అవసరం.ఆహరంలో చేపలు,మాంసం తీసుకుంటే ఈ పోషకం అందుతుంది.ఈ సమయంలో ఎముకలు బలహీనపడతాయి.ఆహారం ద్వారా కాల్షియం అందేలా చూసుకోవాలి. ఆకుకూర,బెండకాయ,చిక్కుడు,బీన్స్ ,చిలకడ దుంప వంటి కూరగాయలు నారింజ జామ,బొప్పాయి వంటి పండ్లు తినాలి.చేప,చీజ్ గుడ్ల ద్వారా విటమిన్ డి కూడా అందుతుంది. వీలైనంత వరకు నడవాలి. మెట్లు ఎక్కిదిగాలి.వ్యాయామం దినచర్యలో భాగం కావాలి.ఒత్తిడి […]
