Chinna Maata
అలానే పడుకోండి
గర్భిణిలు వెల్లికిలా పడుకొంటే కడుపులో బిడ్డకు రక్త సరఫరా తగ్గుతోందని పరిశోధకులు అధ్యయనాలు వెల్లడించాయి. ఇప్పుడో తాజా అధ్యయనం అలా వెల్లికిలా పడుకొంటే కడుపులో బిడ్డ చనిపోయి పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటోంది. గర్భం ధరించాక 28 వారాల నుంచి వెల్లికిలా పడుకొనే వారికి మృత శిశువు జననం ముప్పు 2.1 రేట్లు ఎక్కువగా ఉందంటున్నారు . మృత శిశువు జననానికి ఇతరత్రా కోణాలు ఉన్న దీన్ని పరిగణలోకి తీసుకొమంటున్నారు పరిశోధకులు.
ఇవి కొత్త ఫ్యాషన్లు
ఫ్లోరల్ ధోతి టాప్ కాలేజీ అమ్మాయిలకు కంఫర్ట్ గా ఉండే డ్రెస్ అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.ప్రెషర్స్ పార్టీ దగ్గర నుంచి కాలేజీలో జరిగే ప్రతి వేడుకలకు ఈ డ్రెస్ బావుంటుంది. జార్టెట్ ,సిఫాన్,సిల్క్ వంటి వస్త్రశ్రేణి ఈ డ్రెస్ లకు సరిగ్గా సరిపోతుంది. ఈ దుస్తులపైకి చక్కని స్టడ్స్ ,బన్ని హాంగింగ్స్ బాగా నప్సుతాయి. అలాగే పలాజోలు, స్కర్ట్స్ లు కూడా కాలేజీ అమ్మాయిలకు స్టైలిష్ లుక్ తెచ్చి పెడతాయి. ఇక మిక్స్ అండ్ మ్యాచ్ అయితే […]
మగపిల్లలకే ఇబ్బంది
అమ్మాయిల కంటే అబ్బాయిల్లో వాయు కాలుష్యం వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతోంది అంటున్నారు పరిశోధకులు.గర్భంలో ఉన్న పిల్లలు,బాల్యదశ దాటిన పిల్లలు, ఏడేళ్ళ వయస్సు వరకు ఉన్న పిల్లలపై ఈ అధ్యయనం నిర్వహించారు,వారి అధ్యయనంలో కాలుషిత గాలిని పీల్చిన మగ పిల్లల్లో జ్ఞాపక శక్తి ఆలోచన నైపుణ్యాలు తగ్గుతున్నట్లు గుర్తించారు. అమ్మాయిల్లో ఈ సమస్య తక్కువగా కనిపించింది. హార్మోన్ తేడా వల్ల వారిలో ఈ సమస్య ఉత్పన్నం కాలేదని పరిశోధకులు చెపుతున్నారు. వాతావరణంలో ఎక్కువ వాయుకాలుష్యం తీసుకువచ్చే జబ్బుల […]
జానపద గేయాలు- ఆసికాలు
– డి.సుజాతా దేవి మల్లితో నీ ఆసికాలు వల్ల కాదురా సెల్లని మాటాడితేనే నొల్లకోనురా మావ నల్ల కోనురా!! సందమామ మొకమంటె సందమా అందమా నల్ల మచ్చలా మొకమా మల్లికి సాటి మావ మల్లికి పోటి !! సుక్కలు నా కళ్ళంటె సక్కదన మదేటి తిక్కలోడ పగటేళ సుక్కల మెరుపేడర !! సిలక పలుకులంటే గొప్ప కులుకా సంబడమా పలుకు నేర్సెనే గాని పాటలొచ్చునా సిలకకు పాట లొచ్చునా !!
మన ప్రసాదాలు- “దుర్గాదేవి ప్రసాదం”
మంగళవారం హనుమంతుడు తో పాటు దుర్గా దేవిని కూడా పూజించవచ్చు.సకల సౌభాగ్యాలకు మూలం దుర్గా దేవి అనుగ్రహం కలగడం.మంగళవారం ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి పూజ మొదలు పెట్టుకోవాలి. ముందుగా కాళ్ళకి పసుపు రాసుకుని,జుట్టు ముడిచి,పూజించాలి.దుర్గ దేవి ని శ్రద్ధగా,నిష్ఠగా,నిశ్చలమైనమనసుతో ఆరాధించాలి.ముఖ్యంగా ముత్తైదువతనానికి పవిత్రమైన పూజ.ఇంటికి వచ్చిన వారికి పసుపు-కుంకుమ,రవిక,పూలు,పండ్లు,ఎరుపు/ ఆకు పచ్చ గాజులు,ఆకు- వక్క ఇచ్చి నమస్కరించిన అమ్మవారి కటాక్షం తథ్యం!! ఇష్టమైన రంగు:ఎరుపు ఇష్టమైన పూలు: అన్ని రంగుల పూలు సమర్పించిన ఆనందంతో […]
శుభ్రంగా తినోచ్చు
కాస్త బరువు తగ్గాలి అనిపించగానే వెంటనే డైటింగ్ పేరుతో ఆహారాన్ని దూరం పెడతారు అమ్మాయిలు. ఇక పిండి పదార్థాలు చక్కెర,కోవ్వు మొత్తం మానేస్తారు. అయితే ఇవి శరీరానికి తగినంతగా అందకపోతే మరింత బరువు పెరుగుతారంటొందని ఒక తాజా అధ్యయనం. మెదడుకీ శరీరానికి శక్తి అంది సరిగ్గా పని చేయాలంటే పిండి పదార్థాలు చాలా అవసరం. ప్రాంతాన్ని బట్టే ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఎవరో చెప్పరు కదా ఫలానావి తినాలి అనుకొంటే శరీర తత్వాని సరిపోక జీర్ణ వ్యవస్థపైన […]
వ్యాయామంతో సరి
వయసు పెరిగుతుంటే చర్మం వదులుకావటం డబుల్ బిన్ రావటం సాధారణంగా జరుగుతూనే ఈ గడ్డం కింద ఏర్పడే కొవ్వును డైట్ వ్యాయమం వంటి సింపుల్ టెక్నిక్ లతో పొగొట్టుకోవచ్చు శరీరంలోని ఇతర భాగాలకు వల్లే ఫేషియల్ కండరాలకు కూడా నిత్య వ్యాయామం అవసరమే. ముఖ కండరాలకు సంబంధించిన వ్యాయామాలు చేయటం వల్ల ముఖంపై చర్మం బిగుతుగా మారటమే కాకుండా టానింగ్ కూడా బాగా అవుతుంది. మంచి ఆహారం తీసుకొంటూ మృదువుగా మారటంతో పాటు గడ్డం కింద ఏర్పడిన […]
వెల్లుల్లి నూనె బెస్ట్
వేసవిలో విపరీతమైన చమటలతో తలలో దుర్వాసన ,చుండ్రు,జిడ్డు చికాకు పెడుతుంటాయి. ఇంట్లో దొరికే వస్తులతో ఒక ఫ్యాక్ వేస్తే ప్రయోజనకారంగా ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియాల్ ,యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. పోషకాలు అందించగలదు. ఇది దుర్వాసనకు కారణం అయ్యే బాక్టీరియాను తొలగించగలదు. నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ముక్కలుగా చేసి స్టౌపై ప్యాక్ లో రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసి అందులో ఈ వెల్లుల్లి ముక్కలు వేసి కొద్దీ సేపు వేయించి చల్లారనిచ్చి దాన్ని […]
డార్క్ చాక్లెట్స్ ఇష్టమేనా?
తాజాగా ఒక పరిశోధన ఏం చేపుతోందంటే చాక్లెట్స్ రక్తపు పోటును దూరం చేస్తుందనీ ,సులువుగా లభ్యం అయ్యే అన్ని రకాల మిల్క్ చాక్లెట్స్ లో ఈ సుగుణం ఉండదు కానీ కోకో గింజల పొడిని 90శాతం వాడే చాక్లెట్స్ లోనే ఇలా బిపి తగ్గించే గుణం ఉంటుందంటున్నారు.డార్క్ చాక్లెట్ లో రక్త ప్రసరణ జరిగే ధమనుల్లో చైతన్యం కలిగించే లక్షణం ఉందని వివరించారు. రోజుకు ఒకటి రెండు చాకెట్లు తింటే ఈ ఫలితం ఉంటుంది అంటున్నారు.
ఇలానే తినాలి
డైనింగ్ టేబుల్ పైన తినటం సౌకర్యంగానే ఉంటుంది. కానీ మన పాత కాలంలో లాగా కింద కూర్చోని తినటం మంచిదంటున్నారు ఎక్స్ పర్ట్స్. కాళ్ళు ముడుచుకొని నేలపై కూర్చోని తినాలి. దీన్నే యోగా సుఖాసనం అంటోంది. ఈ భంగిమ మల్ల వెన్నుపూస నిలువుగా ఉంటుంది.దానికి సంబంధించిన కండరాలు బలపడతాయి. తొంటి భాగానికి కూడా మంచిదే .కాళ్ళు రెండు మడిచి కూర్చుంటే రక్తం పొట్టకి బాగా సరఫరా అవుతుంది. దీని వల్ల జీర్ణక్రియ వేగం శోషణ వేగం పెరుగుతాయి.కూర్చొని […]
ఆరోగ్యం కాదు అపాయం
వాకింగ్ చేయటం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే. అయితే ఈ వాకింగ్ ఎక్కడ చేస్తున్నారో చెక్ చేసుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పచ్చగా ఉండే పార్కులు వాకింగ్ ట్రాక్ లో ఎంపిక చేసుకొని నడవాలి. ఆ పరిసరాల్లో ఉండే చెట్లతో తాజా గాలి పీల్చుకొనే అవకాశం ఉంటుంది. అంతే కాని రోడ్డు మార్జిన్ లతో ట్రాఫిక్ ఉన్న ప్రదేశాల్లో వాకింగ్ అస్సలు చేయకూడదు.ఇలాంటి చోట్లలో విపరీతమైన కాలుష్యం ఉంటుంది. దుమ్ము ధూళి,శబ్దాలు, […]
జానపద గేయాలు- ఉళ్లొళ్ళో హాయీ
– డి.సుజాతా దేవి చిచ్చొళో హాయీ చిచ్చొళో హాయీ చిట్టి పాపాయీ బూచి వస్తాను బుట్ట తెస్తాను బజ్జో వేమోయి !! వద్దన్న వచ్చింది పొద్దెక్కి ఎండ సద్దుసేయక తొంగిచూసి పాలబుగ్గలమీద వాలింది వచ్చి చుర చుర చుర !! మళ్ళి వచ్చిందమ్మ అల్లరి గాలి ఉయ్యాలలో చేరి ఊగి మోగించి పోయింది మువ్వల్ల గిలక గల గల గల గల గల గల గల గల !!
సౌకర్యంగా ఉంటే చాలు
ఎన్నో సంధర్భరాలలో ఎంతో ఫ్యాషన్ దుస్తుల్ని ఎంచుకొంటారు కానీ రాత్రి దుస్తుల ఎంపిక కాస్త నిర్లక్ష్యంగా ఉంటారు అవి ఆరొగ్యాన్ని ఇబ్బంది పెడుతాయి అంటారు ఫ్యాషన్ డిజైనర్లు.షర్టులు,ఫ్యాంట్లు ,నైటీలు,గౌన్లు ఏవైనా ప్రత్యేకంగా రూపొందించిన నూలు రకాలను ఎంచుకోవాలి. ఏవీ వదులుగా,మరీ బిగుతుగా ఉండకూడదు. మెరుపులు,కుందన్లు రాళ్ళు వంటి హాంగులున్న డిజైన్లు కూడా వద్దు. చక్కని ప్రింట్లు రకాలు ,జేబులు,ఫిల్స్ లేయర్లు వంటివి ఉన్నవి ఎంచుకోవాలి. కాలర్ నెక్ ,డీప్ నెక్ అనవసరం సౌకర్యం కోసం మామూలు రౌండ్ […]
శాఖాహారం బెస్ట్
శాఖాహారామే ఆరోగ్యకరం అంటున్నారు నిఫుణులు.మెయో క్లినిక్ కు చెందిన పరిశోధకులు. 15 మందిని ఎంపిక చేసి ఏడేళ్ళుగా వారి ఆహార అలవాట్లను రికార్డ్ చేస్తు వచ్చారు. మాంసాహారం తినే వాళ్ళలో కొవ్వు ఎక్కువగా ఉందట. ఊబకాయం,హుద్రోగాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. అదే కూరగాయలు తీసుకోనే వాళ్ళలో పొట్ట దగ్గర కొవ్వు తక్కువగా ఉండటం గుండె జబ్బుల ప్రమాదం 90శాతం తక్కువగా ఉందని రికార్డ్ చేశారు. ప్రపంచ వ్వాప్తంగా గుండె జబ్బులు పెరగటం గురించిన నేపథ్యంలో జరిగిన రిసెర్చ్ […]
వయసు పెరిగే కొద్దీ నష్టం
ఇప్పటి వరకు సంతానోత్పత్తికి స్త్రీల వయస్సే కీలకం అన్న ఉద్దేశ్యంలో 35 సంవత్సరాలు దాటితే గర్భధారణ కష్టమని పిల్లల ఆరోగ్యం కూడా సమస్యగానే ఉంటుందని చెపుతుంటారు.అయితే ఈ సూత్రం పురుషులకు కూడా వర్తిస్తుందట. 45 దాటితే పురుషుల్లో సంతాన సాఫల్యత తగ్గటంతో పాటు పుట్టబోయే బిడ్డకు ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించారు. వయస్సు పెరిగేకొద్దీ టెస్టోసైరాన్ శాతం తగ్గటంతో శుక్రకణాలు నాణ్యత తగ్గి ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డ డి.ఎన్ ఏ పైన పడటం వల్లనే పిల్లల్లో రకరాల […]
ఇవి అచ్చంగా అమృతం
ఈ వేసవి ఎండలకు కొబ్బరి నీళ్ళు గొప్ప పరిష్కారం. అందులో ఎలక్ట్రో లైట్లు విటమిన్లు,ఖనిజాలు ఉంటాయి. చెమట రూపంలో పోయే లవణాలన్నీ కొబ్బరి నీళ్ళ ద్వారా శరీరానికి అందుతాయి. వ్యాయామం చేసే వాళ్ళకీ ఆటలు ఆడేవాళ్ళకీ ఇవి శక్తిని ఇస్తాయి.పోత పాలు తాగించే తల్లి పాలలా పని చేస్తాయట. తాజాగా ఉండే కొబ్బరి నీళ్ళలో యాంటీ ఆక్సిడేంట్లు కూడా అధికమే. ఇతర పానీయాలు ,కూల్ డ్రింక్ ల కన్నా ఓ గ్లాస్ కొబ్బరి నీళ్ళు నయం కదా!.
జీవకణాలకు శక్తి
జొన్నల వాడకం ఇప్పుడు లేదు కానీ వాటిలోని ప్రయోజనాలు లెక్కలేనన్ని. జొన్నలో పీచు ఎక్కువ.జొన్నలోని చెక్కెర వేగంగా కాకుండా జీర్ణం అయ్యాక చాలా మెల్లగా రక్తంలోకి వస్తుంది.డయాబెటిస్ ఉన్నవాళ్ళకు ఇది మేలు చేసే అంశం.పోటీన్లు ఎక్కువ కండరాల రిపేర్లు కణాల పుట్టుక పెరుగుదలకు ప్రోటీన్లు ఎంతగానో తోడ్పడతాయి.జీవాల వంట్లోని చెడూ కొవ్వులు నియంత్రిస్తాయి.వీటిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ.రోగ నిరోధకశక్తి పెంచి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
జానపద గేయాలు- అమ్మో !- – డి.సుజాతా దేవి
బయమేత్తందో అమ్మో బతకడానికి అమ్మో ! బయమేత్తందో రన్నో బతకడానికి మనసులేని మనుషుల మద్దిన మసలడానికి కలిసి బతకడానికి !! నవుతానే నామం బెడతరు ఏడుత్తా దణ్ణం బెడతరు కడుపునిండా కళ్లు యిసము మాటల్లో తేనెలు బోత్తరు !! నీతికి నిలబడినోడంటే శాతగాని యదవంటారు కోతలతో కాలం గడిపే పోతులకే కురిసి లేత్తరు !! గుప్పెడు మెతుకులు ఇదిలిస్తే ఎప్పుడూ పడివుంటది కుక్క అన్నమెట్టినోడి నేతినే ఆరగింప జూత్తడు మణిసి !! పాము అంటే పక్కకు బోతము […]
మన ప్రసాదాలు- “బాలాజీ ప్రసాదం”
గోవిందాశ్రిత..గోకులబృంద….పావన జయ జయ పరమానంద!! బాలాజీ అంటేనే గుర్తు వచ్చేది తిరుపతి కదా!! ఆ స్వామిని….ఏడు కొండల వెంకన్న,ఆపదలు కాసేవాడు,పన్నగశయన,నాగభూషణ..ఎలా పిలిచినా పలుకుతాడు.ప్రత్యక్షంగా కనిపించడు కానీ పరోక్షంగా ఆపదలు కాస్తాడు.శ్రీవారికి శనివారం, మంగళవారం ప్రీతి కరం.శనివారం అత్యంత ఇష్టం.శేషతల్పశాయికి తలనీలాలు సమర్పించిన ఎంతో పుణ్యం.ప్రతి శనివారం పదకొండు రుపాయలు,కర్పూరం స్వామి వారి హుండీలో వేస్తే కోరికలు ఇట్టే తీరుస్తాడు. వేంకటేశ్వర స్వామికి పదకొండు ప్రదక్షిణాలు చేస్తే మంచిది. కోరిక తీరిన తరువాత నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం […]
ఎంత తక్కువో
మన దేశంలో వివిద ఉద్యోగాల్లో ఉన్న మహిళల శాతం వాళ్ళ వేతనాల్లో తేడాలు పెద్దగా ఏమి పెరగలేదు అంటున్నాయి అద్యాయనాలు.ఒక నిఘా వ్యవస్థను నడిపే రంగంలో కేవలం ఒకటి నుంచి మూడు శాతం మాత్రమే మహిళలున్నారు. రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు 9 శాతం,పౌర సేవా విభాగంలో 7 శాతం అలాగే గ్రామీణ మహిళల్లో 89.5 శాతం మంది స్త్రీలు వ్యవసాయ కూలీలుగా పరిశ్రమల రంగంలో ఉన్నారు. ఏదైన సంస్థ బోర్డు సభ్యులుగా ఉన్నవాళ్ళు 7.7 […]
