Chinna Maata
ఫార్మా క్వీన్
మహిళలకు అంతగా ప్రవేశం లేని ఫార్మా రంగంలో అడుగు పెట్టి, స్వయంగా మురళీకృష్ణ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థాపించి ఫార్మా క్వీన్ గా పేరు పొందింది సత్య వడ్లమాని. ఇంజనీరింగ్ చదువుకున్న సత్య 1972లో ఆర్మర్ కెమికల్స్ మార్కెటింగ్ విభాగంలో పనిచేశారు. 2004 లో మురళీకృష్ణ ఫార్మా స్థాపించారు. వీరి సంస్థ లో ఔషధ తయారీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ ల అనుమతి ఉంది. 25 మిలియన్ల టర్నోవర్ తో వందల మందికి పైగా క్లైంట్స్ […]
కృషికి తగిన ఫలితం
టైమ్స్ మ్యాగజైన్ 2025 వ సంవత్సరానికి ప్రకటించిన విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ల జాబితాలో 13వ స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయ మహిళ పూర్ణిమా దేవి బర్మాన్. అంతరించిపోతున్న అరుదైన కొంగ జాతిని రక్షించడంలో పూర్ణిమ చేసిన కృషి అనన్యం. 2017 లో భారత ప్రభుత్వం ఆమెకు నారీ శక్తి పురస్కారం అందించింది అలాగే గ్రీన్ ఆస్కార్ గా పేర్కొనే పర్యావరణ అవార్డ్ ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు కూడా ఆమె అందుకున్నారు. […]
అంతరిక్షానికి ప్రయాణం
ప్రముఖ గాయని గేయ రచయిత్రి కాటి పెర్రీ బ్లూ ఆరిజన్ కు చెందిన ఎన్ఎస్-31 అంతరిక్ష విమానంలో ప్రయాణం చేయనున్నారు ఈ సారి ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్రయాణంలో పురుషులు లేరు పూర్తిగా మహిళా వ్యోమగాములతో వెళుతున్న స్పేస్ క్రాఫ్ట్ ఇదే.కాటి పెర్రీ ఇప్పటికే గుడ్ విల్ అంబాసిడర్ గా తన సొంత స్వచ్ఛంద సంస్థ ద్వారా సమాజ సేవ చేస్తోంది. 1963 లో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళగా అప్పటి సోవియట్ యూనియన్ వ్యోమగామి వాలెంటీనా […]
తీగలతో కళాకృతులు
స్టీల్ వైర్లతో అందమైన బొమ్మలు చేయటం షీనా మెక్ కార్కోడెల్ (sheena mccorquodale) ప్రత్యేకత ఆ తీగ బొమ్మల కళాకృతులు చేసేందుకు చాలా ఓర్పు కావాలి కెనడాలోని వాంకోవర్ ద్వీపానికి చెందిన షీనా వైర్ చిత్రకళ లో ఆరితేరారు.ముందుగా గ్రాఫిక్ డిజైనర్ గా థియేటర్ సెట్ డిజైనర్ గా పనిచేసే ఈ తరహా చిత్రకళ లోకి వచ్చారు. స్టీల్ తో తయారైన సన్నని స్టీల్ తీగలతో అల్లిన జాలి తో ఆమె అందమైన కళాకృతులు తయారుచేస్తారు. ఈ […]
మైకీ కి ఆస్కార్
2024 వ సంవత్సరానికి ఆస్కార్ ఉత్తమ నటి అవార్డ్ తీసుకున్నది మైకీ మాడిసన్ .సినిమా పేరు ‘అనోరా’.ఆమె ఇందులో వేశ్య పాత్రలో నటించారు ఈ అనోరా సినిమాకు ఉత్తమ చిత్రం,ఉత్తమ దర్శకుడు,ఉత్తమ నటి,ఉత్తమ స్క్రీన్ ప్లే,ఎడిటింగ్ అన్ని విభాగాల్లోనూ ఐదు పురస్కారాలు గెల్చుకొన్నది.సినిమా మొత్తన్ని తన భుజాలపై మోసి అనోరా పాత్ర పోషించిన మైకీ మాడిసన్ అవార్డ్ గెల్చుకోంది.
నిద్ర ఇవ్వటం ఈ వ్యాపారం
స్లీప్ కంపెనీ వ్యవస్థాపకురాలు ప్రియాంక సలోట్ పరుపులు దిండ్ల వ్యాపారం లో వంద కోట్ల రూపాయల వ్యాపారాన్ని సృష్టించారామే. సూపర్ సైచి స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ పరుపులు రూపొందించారు కృత్రిమ మేధతో పనిచేసే తొలి స్మార్ట్ గ్రిడ్ పిల్లో కూడా ఆమె సృష్టే. నిద్రకు ఆటంకం లేకుండా వినియోగదారుల నిద్ర సమయాన్ని నాణ్యతని గుండె వేగాన్ని, శ్వాస రేటు లెక్కించి యాప్ కు పంపిస్తుంది ఈ పిల్లో. ఈ వ్యాపారం ప్రారంభించిన నాలుగేళ్లలోపే 500 కోట్లకు చేరింది […]
ఆమె సేవలకు అత్యుత్తమ అవార్డ్
రోడ్డు టాస్క్ ఫోర్స్ కమాండర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కర్నల్ పోనుంగ్ డోమింగ్ దేశ రక్షణ లో సేవా మెడల్ అందుకున్నారు. సముద్ర మట్టానికి 19400 అడుగుల ఎత్తులో సరిహద్దు రేఖ పొడవునా రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. అత్యంత ఎత్తైన ప్రాంతంలో సరిహద్దు రహదారుల లో ఔట్ పోస్ట్ కమాండ్ చేసిన తొలి భారతీయ మహిళ అధికారిని పోనుంగ్ డోమింగ్. ఈ సంవత్సరం రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె సేవా మెడల్ అందుకున్నారు.
పట్టు దారాల గారా ఎంబ్రాయిడరీ
వందేళ్ల పైగా ప్రాచీన చరిత్ర గల గారా ఎంబ్రాయిడరీ ఇవ్వల సెలబ్రిటీలకు ఇష్టమైన ఎంపిక మహిళలు ప్రత్యేక సందర్భాల్లో ధరించే ఈ గార ఎంబ్రాయిడరీ చాలా ఖరీదైనది. క్రేప్,జార్జెట్,షిఫాన్ వంటి ఫ్యాబ్రిక్ పైన పట్టు దారాలతో ఈ ఎంబ్రాయిడరీ చేస్తారు. గార డిజైన్లలో పోల్క చుక్కలు సాలిడ్ లా అనిపించే మెటీఫ్స్ కనిపిస్తాయి పక్షులు వృక్షాలు జంతువులు వంటివి ఈ ఎంబ్రాయిడరీ లో కనిపిస్తాయి ఈ డిజైన్ చీర వేసేందుకు కళాకారులకు కొన్ని నెలల సమయం పడుతుంది.
అమృతం పంచే దేవత
తమిళనాడు లోని తిరుప్పూర్ కు చెందిన విచిత్ర సెంథిల్ కుమార్ స్థాపించిన బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ఎంతోమంది పిల్లలకు ప్రాణదానం చేసింది. గత నాలుగు సంవత్సరాల లో నాలుగు వేల లీటర్ల చనుబాలు ఆమె సేకరించి,తల్లిదండ్రులు వదిలేసిన పిల్లల కోసం ఇచ్చారు. అనారోగ్యాలు ఇతర కారణాలవల్ల పాలు ఇవ్వలేని తల్లుల పిల్లలకు కూడా ఈ పాలు అందుతున్నాయి.తిరుప్పూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి తో కలిసి ఈ మిల్క్ బ్యాంక్ నడుస్తోంది. విచిత్ర కోయంబత్తూర్ జిల్లా మహిళా ఫుట్బాల్ […]
ఫోర్బ్స్ జాబితాలో అపర్ణ
ఆకాశమే హద్దు సినిమా ద్వారా జాతీయ ఉత్తమ నటి అవార్డు తీసుకున్న అపర్ణ బాలమురళి, పాలక్కడ్ లోని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో ఉన్నత విద్య అభ్యసించింది. శాస్త్రీయ సంగీతం నేర్చుకుని తమిళ, మలయాళ చిత్రాల్లో గాయనిగా పేరు తెచ్చుకుంది. కుందాం 18 ఏళ్ల వయసులో యాత్ర తుడారున్ను అనే మలయాళ చిత్రం ద్వారా సినిమాల్లో అడుగుపెట్టిన అపర్ణ 30 సినిమాల్లో నటించింది తాజాగా ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో ఎక్కింది స్నేహితులతో ఎలియాసిస్ […]
నిద్రతోనే ఎంతో లాభం
నిద్ర వేళల్లో మార్పులు ఉంటే వెంటనే నడుము చుట్టూ కొలత పెరుగుతుంది అంటున్నారు అధ్యయనకారులు నిద్ర బరువు వ్యాయామం మధ్య సంబంధాలు తెలుసుకోవడం కోసం ఒక అధ్యయనం నిర్వహిస్తే ఎన్ని గంటలు నిద్రపోవాలన్నా పైగా అది ఒకే సమయంలో నిద్రపోతేనే బరువు పెరగకుండా ఉంటారని అధ్యయనం లెక్కలు చెపుతోంది. బరువు తగ్గాలంటే ముందు సరైన నిద్ర వేళలు పాటించి నిద్రపోండి అని చెబుతున్నారు పరిశోధకులు.
మహిళలకు స్ఫూర్తి
ఇండియన్ విమెన్ సైంటిస్ట్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకుంది. ఈ అసోసియేషన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్స్ సుధా పాధ్యే. 90 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఆడపిల్లలకు సైన్స్ కష్టం కాదని నిరూపించేందుకు ఈ సంస్థ స్థాపించాం అంటారు సుధా. కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చిన మహిళలకు ఆర్గనైజేషన్ కు సంబంధించి డే కేర్,హెల్త్ కేర్ సెంటర్ లు చిల్డ్రన్స్ విమెన్స్ హాస్టల్ ఉంటాయి. ఈ అసోసియేషన్ ఎన్నో తరాల మహిళా శాస్త్రవేత్తల అనుభవ జ్ఞాన సముద్రం ఈ […]
నైటింగేల్ ఆఫ్ ఇండియా
భారత జాతీయ కాంగ్రెస్ కు ఈ సంవత్సరం తో 140 ఏళ్లు నిండాయి. ఇన్నేళ్ల చరిత్ర కలిగిన ఆ పార్టీకి 100 సంవత్సరాల క్రితం 1925లో అధ్యక్షురాలైన సరోజినీ నాయుడు తొలి మహిళా అధ్యక్షురాలు అని బీసెంట్ అయిదా తొలి భారతీయ అధ్యక్షురాలు సరోజినీ నాయుడు ఆమె చక్కటి స్త్రీ విద్యను ప్రోత్సాహించారు ఆమె కవిత్వం, ప్రసంగ నైపుణ్యం రెండు మహిళా ఉద్యమానికి పదునుపెట్టాయి. దేశంలోనే తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు గవర్నర్ గా ఉండగానే […]
ఆమె దర్శకురాలు కూడా
వెండితెరకు నిండుతనం తెచ్చి అగ్రశ్రేణి కథానాయికగా పేరుపొందిన మహానటి సావిత్రి దర్శకురాలిగా పేరు సంపాదించుకున్నారు హీరోయిన్ ఆమె కెరీర్ ఉజ్వలంగా ఉన్నప్పుడే దర్శకత్వం లో ప్రయోగాలు చేశారు. సావిత్రి దర్శకత్వం వహించిన చిన్నారి పాపలు చిత్రానికి ఆమె కథ రచయిత్రి కూడా. వాణిజ్యపరంగా ఇది విఫలం అయినప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. మాతృదేవత,వింత సంసారం వంటి సినిమాలకు కూడా ఆమె దర్శకత్వం వహించారు.
చిత్తజల్లు కృష్ణవేణి
చిత్తజల్లు కృష్ణవేణి బాలనటిగా చిత్రసీమలో ప్రవేశించారు మీర్జాపురం రాజా వారి తో వివాహం అయిన తర్వాత జయ పిక్చర్స్ సంస్థ బాధ్యత తీసుకున్నారు కృష్ణవేణి ఎన్టీఆర్ వంటి మహానటుడిని చిత్రసీమకు పరిచయం చేశారామె. జయ పిక్చర్స్ ను శోభనాచల స్టూడియోస్ గా పేరు మార్చి ఎన్నో సినిమాలు నిర్మించారు. కృష్ణవేణి తన 98 సంవత్సరాల వయసులో 2022లో సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల్లో భాగంగా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఆవిడ కుమార్తె అనురాధ కూడా తెలుగు, తమిళం, […]
అనుకోని అవకాశం
రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన 50 సంవత్సరాల రేఖా గుప్తా విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనూహ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు షీలా దీక్షిత్ సుష్మా స్వరాజ్ అతిశీ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాలుగో మనిషి రేఖా గుప్తా. ఆమె హర్యానాలోని జులనా జన్మించారు ఆమె న్యాయవాదిగా పనిచేశారు.
కాఫీ వేళ మార్చడం అవసరం
ఉదయాన్నే కాఫీ తాగకపోతే చాలామందికి నిమిషం గడవదు. కానీ న్యూరో సైన్స్ అధ్యయనం ఈ అలవాటు తప్పంటోంది. ఉదయం పూట మన శరీరంలో కార్టిసోల్ విడుదల అవుతుంది. ఈ ఒత్తిడి కలిగించే హార్మోన్ శరీరాన్ని తర్వాతి పనులకు చురుగ్గా ఉండేలా సిద్ధం చేస్తుంది. అలాంటప్పుడు కాఫీ తాగితే కార్టిసాల్ ఉత్పత్తి రెట్టింపు అవుతుంది. ఒత్తిడి అనవసర కంగారు పుట్టుకొస్తాయి. సృజనాత్మకత పైన ప్రచారం ఎడల కాక ఆందోళన పెరుగుతుంది కనుక నిద్ర లేవగానే కాఫీ అన్న నియమాన్ని […]
చరిత్ర సృష్టించిన సినిమా
‘గర్ల్స్ విల్ బి గర్ల్స్’ చిత్రం 40వ ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్స్ లో జాన్ కసావెట్ అవార్డు గెలుచుకుంది శుచి తలాటి రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిమాలయన్ బోర్డింగ్ స్కూల్లో చదివే మీరా అనే టీనేజర్ ఆలోచనలు పరిచయం చేస్తుంది. జాన్ కసావెట్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ చిత్రంగా గర్ల్స్ విల్ బి గర్ల్స్ చరిత్ర సృష్టించింది ప్రముఖ నటులు రిచా చద్దా ఆలీ ఫజల్ లు ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఫోర్బ్స్ మెచ్చిన ప్రీతి పాల్
ఉత్తరప్రదేశ్ లోని ముజాఫర్ నగర్ కు చెందిన ప్రతిపాల్ పుట్టుకతోనే సెలబ్రిల్ పాలీస్. కాళ్లు బలహీనంగా వంకరగా ఉన్నాయి. కుటుంబం ఆమెకు చికిత్స చేయించారు ఐదో ఏటనే కాలిపర్స్ పెట్టారు పెరిగి పెద్దయ్యాక పారా స్పోర్ట్స్ లోకి అడుగు పెట్టింది ప్రీతి. పరుగులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది పారా ఒలింపిక్స్ లక్ష్యంగా గత సంవత్సరం పరుగులో రెండు కాంస్య పతకాలు సాధించింది. ఈ క్రీడలో రెండు పతకాలు గెలిచిన భారత మహిళా అథ్లెట్ గా […]
ఆమె జీవితం ఓ అద్భుతం
కొందరి జీవితాలు కథల కంటే చిత్రంగా అనిపిస్తాయి ఇందుకు ఒక బలమైన ఉదాహరణ లిసా స్థలేకర్. పూణే లోని ఒక చెత్తకుండీలో దొరికిన పాప ను ఒక అనాధాశ్రమ నిర్వాహకుడు చేరదీశాడు. న్యూ హరేన్ అనే దంపతులు అమెరికా నుంచి ఒక బిడ్డను దత్తత తీసుకునేందుకు ఇండియా వచ్చి ఆశ్రమంలో ఉన్న పాపను దత్తత తీసుకున్నారు లీసా అనే పేరు పెట్టుకున్నారు సిడ్నీ లో స్థిరపడిన ఆ దంపతులు తమ కుమార్తెకు క్రికెట్ నేర్పించారు. ఆమె ఇప్పుడు […]
