Sunday, 02 Aug, 2026

మన తెలుగు సామెతలు 

కొండను తవ్వి ఎలకను పట్టినట్లు అంటారు పెద్దవాళ్ళు. ఒక పెద్ద కొండను తవ్వాలనే పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొంటే అంత కష్ట పడ్డాక దాని ఫలితం అంత స్థాయిలో ఉండకపోతే నవ్వులపాలు అవుతారు. ఎంతో గొప్పగా మాట్లాడి దానికి తగ్గ చేతలు లేకపోతే మాటలే వెక్కరింపు అన్నమాట ఈ సామెత. గొప్ప కొండను తవ్వేసి,ఒక చిన్న ఎలుకను పట్టినట్లుగా ఎన్నో డాంబికాలు పలికి ఫలితం ఏమీ చూపెట్టలేదు అని ఈ సామెతకు అర్ధం. పెద్దవాళ్ళు ఎం చెపుతున్నారు అంటే […]

“కన్యకాపరమేశ్వరి ప్రసాదం”

తమిళనాడు రాష్ట్రంలోని నాగర్కోయల్ సమీపంలో కన్యగా కన్యకాపరమేశ్వరి వెలసింది.   పురాణాల ప్రకారం పార్వతీ దేవి వివాహం కొరకు ఎదురుచూస్తూ ఇక్కడ విగ్రహ రూపంలో ఉండిపోయిందిట.పరశురాముడు ప్రతిష్ఠ చేశారు అని అంటారు.పార్వతీ దేవి అతి బలవంతుడైన బాణాసురుని హతమార్చడానికి ఇక్కడ ఉందిట.అట్టి సమయానికి పెళ్లి ముహూర్తం దాటిపోయినందుకు శివుడు యోగ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు.అందుకే పార్వతీ దేవి  వివాహం చేసుకోకుండా కన్యగా ఉండిపోయింది కావున కన్యకాపరమేశ్వరి గా పేరు వచ్చింది. నిత్య ప్రసాదం:కొబ్బరి,పొంగలి,పులిహోర                    -తోలేటి వెంకట శిరీష

క్రమ శిక్షణ అవసరం 

లాక్ డౌన్ సమయంలో పిల్లలందరికీ ఆన్ లైన్ అయినా ఆఫ్ లైన్ అయిన ముందుకు పిల్లలకు క్రమశిక్షణ అవసరం. స్నానం టిఫెన్ అన్ని వేళకు ముగించి పాఠాలకు హాజరు కావాలి పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేయాలి. ఇంటెర్నెట్ వేగంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. గదిలో లైటింగ్ సరిపడా ఉంటేనే టీచరు విద్యార్థి ఒకళ్ళకొకళ్ళు కనిపిస్తారు. వెలుతురు పడేచోటనే లాప్ టాప్పికి స్మార్ట్ ఫోన్ అమర్చుకొనేలా చూడాలి. క్లాస్ మధ్యల్లో పిల్లల్ని టీ,కాఫీ,స్నాక్స్ అంటూ […]

మన తెలుగు సామెతలు 

కలిగిన వాడికి అందరు బంధువులే అన్నట్లు అన్న సామెత నిజంగానే అనుభవ సారంలోంచి పుట్టిందే డబ్బున్న వాళ్ళ చుట్టు ఎందరో ఆశ్రతులు ఉంటారు.. డబ్బు అవసరం ప్రతి వాళ్ళను ధనికులకు బంధువులను చేస్తుంది. వాళ్ళలో బంధుత్వం కలుపుకొనేందుకు అందరు ఇష్టపడతారు. డబ్బుతో అవసరం లేనిది ఎవరికీ ? ఏదో ఒక రోజు డబ్బు అవసరం వస్తే ఆదుకోకపోతారా అని కలిగిన వాళ్ళను ఎవ్వరు నొప్పించకుండా జాగ్రత్తగా స్నేహంగా ఉంటారు. ధనికులకు అందరు చుట్టాలే. అనే సామెత ఇలాగే […]

ఊరికే నొప్పించకండి 

ప్రతి ఒక్కరు దృఢమైన మనస్సుతో పుట్టారు. అందరికీ విమర్శలను తట్టు కొనే శక్తి ఉండదు. ఊరికే ఎవరినీ నొప్పించేలా మాట్లడకండి. అంటూ పోస్ట్ చేసింది జైరా వశీమ్.దంగల్ సీక్రెట్ సూపర్ స్టార్ ది స్కై ఈజ్ పింక్ చిత్రాల్లో నటించిన జైరా వశీమ్ చాలా సున్నితమైన మనసున్న అమ్మాయి అంటారు. ఆమెను తలిచిన వాళ్ళు ఎదుటి వాళ్ళు తెలిసో తెలియక మాట్లాడే మాటలు ఎంతో నొప్పిస్తాయి. పదిమందిలో వేసే జోక్స్ ఒక్కసారి భరించలేక పోతాము అంటోంది జైరా […]

వేసవి ఎండల్లో రక్ష   

తక్షణ శక్తి నిచ్చే పదార్ధాల్లో కిస్మిస్ ను మొదటిగా చెప్పుకోవచ్చు తీపినిచ్చే ఎండు ద్రాక్ష లో కాల్షియం,ఐరన్ మాంగనీస్,మెగ్నీషియం,జింక్,ఫ్లోరైడ్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ల తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది నల్ల ఎండు ద్రాక్షలో అయితే మరీ ఎక్కువ. ఆహారం సరిగా తీసుకొని పిల్లల కు,పిస్తా బాదం,జీడిపప్పు ద్రాక్ష తో కలిపి లడ్డులు చుట్టి ఇస్తే మంచిది. రక్తపోటు సమస్యకు ఎండు ద్రాక్ష చాలా మేలు చేస్తుంది. వాటిని రాత్రి వేళ నీళ్ళలో నానపెట్టి ఉదయం […]

“చెంగాళమ్మ ప్రసాదం”

చిత్తూరు జిల్లాలో శుభగిరికి సమీపంలో కాళింది మరియు నెర్రి అనే నదులకు దగ్గరగా ఈ చెంగాళమ్మ పరమేశ్వరి దర్శన భాగ్యం కలుగుతుంది. పూర్వం ఈ ప్రాంతంలో గొడ్లు తోలుకుంటూ పిల్లలు కాళింది నదిలో దిగేసరికి నదిలో సుడులు వచ్చేటప్పటికి ఏదో ఒక శక్తి తమని పట్టుకుని రక్షించినట్టు అనిపించింది.మరుసటి రోజు మరల వెళ్ళి నదిలో దిగి చూస్తే ఒక రాయి పైన కాళికాదేవి రాక్షసుడిని సంహరిస్తున్నట్టుగా కనిపించిన పిల్లలు ఆ రాయిని ఒడ్డుకు చేర్చి పెద్దల సమక్షంలో […]

ప్రకృతి ధర్మాన్ని పాటించాలి 

లాక్ డౌన్ సమయం దొరికింది కదా అని రాత్రి చాలా సమయం వరకు సినిమాలు సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తూ నిద్రను పాడుచేసుకోకండి అంటున్నారు డాక్టర్లు. పగలు పని రాత్రి నిద్ర ఇది ప్రకృతి నియమం. ఈ ధర్మాన్ని ధిక్కరిస్తే ప్రాణాలకే ముప్పు అంటారు. రాత్రి వేళ మేలుకువగా ఉంటే డయాబెటిస్ అవకాశం 30 శాతం,నాడి సంబంధిత వ్యాధులు 25 శాతం ఎక్కువ. శ్వాసకోస జీర్ణకోశ వ్యాధులు కూడా అధికమే. సమయానికి నిద్రపోలేకపోతే అందుకు కారణం మానసిక […]

మంత్ర తంత్రాల మార్కెట్  

ఈ రోజుల్లోనూ దెయ్యాలు , చేతబడులను  నమ్మేవాళ్ళు  ఉన్నారంటే ఆశ్చర్యం ఏమీ లేదు .ప్రపంచం లో చాలామంది నమ్ముతున్నారు ఈ దెయ్యాలను .మెక్సికో నగరంలో ఏకంగా మంత్రం విద్యలకు ఉపయోగించే వస్తువుల అమ్మే మార్కెట్ ఉంది దీని పేరు ‘సోనోరా మార్కెట్ ‘ఈ మార్కెట్ కు సెలవే ఉండదు  .స్థానికులే కాదు ఇతర దేశాల నుంచి ఈ మార్కెట్ కు వస్తూ ఉంటారు .ఈ మార్కెట్ లో మంత్రం తంత్రాలకు  ఉపయోగించే  వస్తువులు, మంత్రించిన పౌడర్లు, బలి […]

మనసారా నవ్వాలి 

నవ్వుకి నొప్పిని తగ్గించే లక్షణమే కాకుండా అలెర్జీల తీవ్రతను కూడా తగ్గించే లక్షణం ఉన్నట్లు ఎన్నో అంతర్జాతీయ క్లినికల్ పరీక్షలో రుజువైంది. మానసిక వైద్య నిపుణులు దీన్ని సీరియస్ గా అధ్యయనం చేసి నవ్వుల శాస్త్రానికే రూప కల్పన చేశారు దీన్నే గెటరాలజీ అంటారు. మానసిక వైద్య విధానంలో ఇదో ప్రత్యేక విభాగం దీని లోంచి లాఫ్టర్ యోగ పుట్టుకొచ్చాయి నవ్వితే మనసు తేలిక పడి దిగులు కుంగు బాటు వంటి మానసిక సమస్యలే కాదు ఎన్నో […]

అద్భుతమైన ఔషధ గుణాలు 

అచ్చం చింత పండు రుచితో వుండే బ్లాక్ వెల్వెట్ చింత లో విటమిన్ -సి,ఎలు,ఫోలిక్ ఆమ్లా ,నియాసిన్,రిబో ఫ్లేవిన్ వంటి పోషకాలు సంవృద్ధిగా ఉన్నాయి ఆగ్నేయసియా,ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా పెరిగే ఈ చెట్టుకు కాసే పండు లో  పండిన తర్వాత పై పెంకు రాలి పోతుంది. గుజ్జు తియ్యని చింత పండు రుచి తో ఉంటుంది ఈ పండు తో పాటు చెట్టు ఆకులు,బెరడు కూడా అనేక వ్యాధుల నివారణ లో పనికివస్తాయి. ముఖ్యంగ శ్వాసకోశ వ్యాధులకు […]

ఆహారానికే ఆ శక్తి 

తినే ఆహారం నోటికే కాదు మెదడుకీ రుచిస్తే అది చక్కగా పని చేసి జ్ఞాపక శక్తిని కాపాడుతోంది అంటున్నారు పరిశోధకులు. కూరగాయలు. ఆకు కూరలు,బెర్రీలు,నట్స్,తృణ ధాన్యాలు చేపల తో కూడిన ఆహారం తీసుకొనే వాళ్ళలో మతి మరపు చాలా తక్కువగా ఉండటం తో పాటు వారి ఆలోచన శక్తి కూడా బాగా ఉంటుందని సర్వేలు నిరూపించాయి.పిండి పదార్ధాల్లో,బంగాళాదుంపలు,కుకీలు,స్నాక్స్ తినే వాళ్ళలో అల్జీమర్స్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాంసా హారంతో పండ్లు,కూరలు,సీఫుడ్స్ జోడించి తినే వాళ్ళలో మతిమరుపు తక్కువగా ఉంది. […]

మన తెలుగు సామెతలు 

పాత రోజుల్లో ముక్కు సూటిగా,మొహమాటం లేకుండా చక్కగా మాట్లాడే వాళ్ళు అని చెప్పేందుకు ఈ సామెత ఉదాహరణ.                               ఎక్కడైనా బావ గానీ వంగతోట దగ్గర మాత్రం కాదట ‘ ఎంతటి చమత్కారం బావ అని పిలవటం అంటే చనువుగా బంధుత్వం కలుపుకోవటం కదా. కానీ ఆల పిలిపించు కొన్నవాడు వంగ తోట దెగ్గర మాత్రం కాదని […]

ఆలోచనలు రేపే killa సినిమా 

2014 లో దర్శకుడు,ఛాయాగ్రాహ దర్శకుడు అవినాష్ అరుణ్ మరాఠీలో నిర్మించిన అందమైన సినిమా కిల్లా (కోట). చదువుల్లో చురుగ్గ వుండే చినూ తండ్రి మరణిస్తాడు. తల్లి చేస్తున్న ఉద్యోగంలో ఎక్కువ స్థిరత్వం లేకుండ ఎంతో బాధపడుతూ ఉంటారు. ఈ బదిలీలో పదకొండు సంవత్సరాలు చినూ ని వాళ్ళమ్మ కి ఎంతో ఇబ్బంది కలిగిస్తాయి. ఆలా వాళ్ళు పూణే నుంచి కొంకణీ తీరం లోని ఒక చిన్న ఉరికి బదిలీ అవుతారు చినూ నెమ్మదిగా అక్కడ కొందరు స్నేహితులు […]

నల్ల మిల్లోరి పాలెం కథలు 

పాఠకుల నోరూరించే తెలుగు విందు వంశీ ‘ నల్ల మిల్లోరి పాలెం కథలు ‘ అన్నారు డాక్టర్ జంపాల చౌదరి. ఈ కథల గురించి చెప్పాలంటే ఇవి వంశీ శైలిలో వివిధ పార్ష్వాలకు ఉదాహరణలుగా నిలుస్తాయి. కొన్ని కథలు గాఢంగా మనసుని హత్తుకుంటాయి. తూర్పు గోదావరి జిల్లా మాండలీకం,అక్కడ వ్యాప్తిలో ఉన్న అచ్చ తెలుగు మాటలు నిత్య జీవిత సంభాషణలను తన కథల్లో కి సునాయాసంగా తీసుకొస్తాడు వంశీ. గోదావరి అందలద్దుకొన్న ఈ కథలేంత కమ్మగా ఉంటాయంటే […]

“లక్ష్మీదేవి  ప్రసాదం”

కరాగ్రే వసతే లక్ష్మీ…అంటూ మనం నిద్ర లేవటంతోనే లక్ష్మీదేవిని స్మరిస్తూ లేస్తాం.పౌర్ణమి రోజు లక్ష్మీదేవి పూజ ఎంతో మంచి సత్ఫలితాలిస్తుంది. క్షీరసాగర మధనంలో నుండి లక్ష్మీదేవి జన్మించినది అని,భృగు మహర్షి కుమార్తె అని విష్ణు పురాణంలో చెప్పారు.ప్రతి నిత్యం మనం దేవతామూర్తుల ఆరాధన చేస్తూనే వుండాలి.లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి శుచి,శుభ్రంగా వుండాలి.ఇల్లు శుభ్రంగా వుంచుకోవాలి.వాకిలి కడిగి రంగవల్లులు తీర్చిదిద్దాలి.దాన ధర్మాలు చేయాలి.ఇంటికి వచ్చిన అతిథులను మర్యాదగా వ్యవహరించడం చాలా అవసరం. నిత్య ప్రసాదం:కొబ్బరి,పొంగలి,పాయసం            -తోలేటి వెంకట […]

ఒక మంచి పుస్తకం 

అను బందో పాధ్యాయ రాసిన బహు రూపి గాంధీ ఒక చక్కని పుస్తకం నండూరి వెంకట సుబ్బారావు గారు అనువాదం చేశారు. ఆర్కే లక్ష్మణ్ బొమ్మలతో ఉన్న ఈ చిన్న పుస్తకం పిల్లల కోసం రాసిందే అయన,పెద్దలు కూడా తప్పని సరిగా చదవాలి. మహా నాయకుడు గాంధీ ఒక సామాన్యమైన జీవితం ఎలా గాడిపారు. మలమూత్రాలు ఎత్తి పోయటం నుంచి ప్రతి పని  తప్పని,అవమానకరమని భావించకుండా స్వయంగా చేసి చూపిస్తూ ఇతరులకు స్ఫూర్తి ఇచ్చారు,శారీరక శ్రమ చేయించటం,ఒక […]

శరీరం శక్తి మంతం 

ప్రాచీన ఆయుర్వేదం వనమూలికల లోనే ఎన్నో అనారోగ్యాలను విజయ వంతంగా తగ్గించగలిగింది. సైంధవ లవణం,అల్లం మరి అందులో నెయ్యి వేసుకొని మొదటి ముద్దగా తింటే ఆరోగ్యానికి మంచిది అంటుంది ఆయుర్వేదం జీర్ణ వ్యవస్థ చక్కగా ఉంటుంది ఉసిరి తొక్క పచ్చడి,అల్లం ముద్ద కలిపి తింటే వైరస్ లు అడ్డుకో గలిగే శక్తి వస్తుంది. అల్లం వాడకం పెంచుకొంటే ఎన్నో ఔషదాలు తీసుకొన్నట్లే అల్లం,వెల్లులి,వాము కలిపి టీ కాచి తాగితే పేగులు శుభ్ర పడుతాయి. ఊపిరి తిత్తులు దృఢం […]

ఇది సహజమైన ఔషధం 

కర్పూరపు సువాసన అందరికీ తెలిసిందే. పెళ్ళిళ్ళలో కూడా కర్పూరం పుల్లలు ఇస్తారు. చక్కని పరిమళం తో ఉండే ఈ కర్పూరం శ్వాస మార్గం లో కఫం చేరుకోకుండా చేస్తుంది. వైరస్ లు వ్యాపించనపుడు తుమ్ములు,దగ్గులు జలుబు వంటివి వస్తాయి. ఆలా శుభ సంధర్భాల్లో తుమ్మకుండ కర్పూరం పుల్ల చేతి లో ఉంచుతారు. పావు చెంచా కర్పూరం ఒక గుడ్డలో కట్టి వాసన చూస్తూ ఉంటే వైరస్ ను ఊపిరి తిత్తుల్లోకి పోనివ్వకుండా శ్వస నాళాలను శుభ్రం చేస్తుంది. […]

చక్కని మరాఠి సినిమా’AB AaNI CD’

లాక్ డౌన్ మూలంగా ఇంట్లోనే ఉండే అవసరం వచ్చింది. చక్కని భాషా చిత్రాలు చూసే అవకాశం కూడా ఇదే. మరాఠి సినిమా ఎబి,ఆని సిడి ,ఒక సీనియర్ సిటిజన్ ఇంటా బయట ఎదురుక్కొనే ఛీత్కారాలు వృద్దుల విషయంలో చూపించే నిర్లక్ష్యలకు సంబంధించింది. చంద్రకాంత్ దేశ్ ముఖ్ (సిడి )ఒక రిటైర్ ఆర్ట్ టీచర్. ఇద్దరు కొడుకులు కోడళ్ళు ఉన్న ఇంట్లో అతనొక పనికిరాని పాత వస్తువు లాంటివాడు.ఈయన స్థితి గమనించి మనవరాలు,మనవడు ఒక ప్లాన్ వేస్తారు. ఒక […]