Chinna Maata
ప్రతి రోజు హెర్బల్ చాయ్
సుగంధ ద్రవ్యాలతో చేసిన హెర్బల్ టీ ప్రతి రోజు తాగితే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దగ్గు జలుబు కఫం,అలర్జీ,సైనసైటిస్ నుంచి రక్షణ ఇస్తుంది. యాలకులు దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు సమపాళ్లలో తీసుకొని బరకగా పొడిగా చేసి భద్ర పరుచుకోవాలి కప్పు మరుగుతున్న నీళ్లలో పావు చెంచా పొడి చేసి మరగనివ్వాలి బాగా మరిగాక,వడకట్టి స్పూన్ తేనె కలిపి వేడివేడిగా తాగితే ఒత్తిడి తగ్గుతోంది. అనారోగ్యాలు దగ్గరకు రావు అలాగే టీ […]
ఆలివ్ తో గోళ్ళ అందం
చేతి గోళ్లు బలహీనంగా ఉన్న,విరిగిపోతున్న,రంగు మారినట్లు అనిపించిన ఇంట్లో దొరికే పదార్ధాలతో వాటిని బలంగా మారేలా చేయచ్చు. లిక్విడ్ బాత్ సోప్ తో గోళ్లను శుభ్రం చేయాలి. తరువాత ఆలివ్ నూనెతో మర్దన చేయాలి. ఆలివ్ నూనె లో లినోలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది గోళ్లకు తేమను ఇస్తుంది. అలాగే ఒక గిన్నెలో గోరు వెచ్చని పాలు పోసి అందులో గోళ్లను ముంచి కొన్ని నిముషాలు నాననివ్వాలి. తరువాత నీళ్లతో కడిగి మొయిశ్చ రైజర్ రాస్తే సరిపోతుంది. […]
గాలి వచ్చేలా చూడండి
కోవిడ్-19 వ్యాప్తి భయంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుఉన్నట్లే ఇంటి పరిసరాలు వాతావరణం పైన కూడా దృష్టి పెట్టాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్. రోజంతా చక్కగా గాలి లోపలికి వచ్చేలా కిటికీలు తలుపులు తీసి పెట్టాలి.తెల్లవారుజామున చీకటి వీడిన తరువాత వచ్చే గాలి చల్లగా ఆరోగ్యంగా ఉంటుంది.ఇంట్లో పేరుకునే ఏరోజు చెత్తను ఆరోజే తొలగించాలి ఆహార పదార్ధాలు ఎప్పటికప్పుడు పడ వేయాలి.మొక్కలు విడుదల చేసే ఆక్సిజన్ ఆరోగ్యానికి శ్రీరామరక్ష అందుకే కాస్త చోటు ఉన్న అపార్ట్మెంట్ సిటీ అవుట్ లో […]
ఇంటి వైద్యం చాలు
ఏళ్ళతరబడి కళ్ళకు కాటుక పెట్టుకుంటూ ఉన్నా,లేదా వయసుతోపాటు వచ్చే మడతలు కళ్ళకింద వచ్చినా కళ్ళ కింద నల్లని వలయాలు కనిపిస్తాయి.ఇవి నిద్రలేమి వల్లనో అలర్జీలు,రక్తహీనత వల్ల కూడా రావచ్చు.కళ్ళ కింద ఉండే సున్నితమైన చర్మం చేత్తో రుద్దటం వల్ల కూడా నల్లని వలయాలు వస్తాయి.కళ్ళ చుట్టూ చల్లని కీర ముక్కలను ఉంచి ఐదు నిమిషాలు విశ్రాంతి గా కళ్ళు మూసుకోని ఉండాలి. ఆ మొక్కలతో కళ్ల చుట్టూ మృదువుగా రాయాలి.అలాగే బంగాళాదుంప రసం కళ్ళకింద రాసి ఐదు […]
ఎంత మోతాదు ?
ఇప్పుడు విటమిన్-సి అవసరం అందరికీ తెలిసిందే ఎందుకోసం నిమ్మజాతి పండ్లు బొప్పాయి, క్యాప్సికం, స్ట్రా బెర్రీ, జామ, పైనాపిల్ తింటున్నారు.అయితే ఏ పండు లో ఎంత విటమిన్ సి శరీరానికి లభిస్తుంది.ఒక్క కమలా పండు లో 75 గ్రాములు విటమిన్ సి లభిస్తుంది.అంటే మహిళలకు సరిపోయే దైనందిన డోస్ ఇది…ఓ పది ముక్కల క్యాప్సికం తింటే వంద గ్రాముల సి విటమిన్,ఓ జామకాయ,ఒక కప్పు చొప్పున బొప్పాయి స్ట్రా బెర్రీ, టమోటో ముక్కలు తిన్న అదే మోతాదులో […]
సమయానికి తగు బ్యాగ్స్
బ్యాగ్ లేకపోతే అమ్మాయిలు బయట కాలు పెట్టారు.అన్నిసందర్భాలకు,అవసరాలకు, ఒకే బ్యాగ్ బావుండదు. టోటే బ్యాగ్ చూసేందుకు కాస్త పొడవుగా పెద్దగా ఉన్నా రెగ్యులర్ వేర్ గా బాగుంటుంది అన్నిరకాల డ్రెస్ లపైకి ఇది ట్రెండీ లుక్ తెస్తుంది. డబల్ హ్యాండిల్ తో విశాలంగా ఉండే సాబెల్స్ అధికబరువును ఆపగలగుతాయి. మేకప్ లంచ్ బాక్స్ లు అమరికగా సర్దుకోవచ్చు. చేతిలో ఇమిడిపోయే హ్యాండిల్స్ భుజాలకు సౌకర్యంగా తగిలించుకునే పొడవాటి స్ట్రాప్స్ ఉండే స్లింగ్ బ్యాగ్స్ ప్రయాణాలకు పార్టీలకు బావుంటాయి.ఇక […]
ఇంట్లోని వ్యర్థాలతో ఎరువు
ఇంట్లో పెంచుకొనే పెరటి తోట కోసం ఇంట్లోని వ్యర్థాలతో నే ఎరువు తయారుచేసుకోవచ్చు అంటున్నారు ఉద్యానవన నిపుణులు. ఈ ఎరువు తయారీ కోసం ఇనుము, ప్లాస్టిక్ డబ్బాలను కంపోస్ట్ బిన్ లుగా వాడుకోవచ్చు.కూరగాయలు పండ్ల వ్యర్థాలు,మొక్కలు కత్తిరించిన గడ్డి కోడిగుడ్డు పెంకులు తేయాకు, పూలు వంటి వాటిని కంపోస్టు తయారీకి వాడవచ్చు. జంతువుల వ్యర్ధాలు రంగుల కాయితాలు, పాడైపోయిన ఆహార పదార్థాలు, పాల ఉత్పత్తులు ఈ ఎరువు కోసం ఉపయోగించరాదు. మూడు వంతుల ఎండు వ్యర్ధాలు, ఒక […]
చుండ్రుకి గులాబీ నూనె
జుట్టు కి పోషణ ఇచ్చేందుకు చక్కని నూనె ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.ఈ నూనెతో చుండ్రు కూడా తగ్గిపోతుంది జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది గుప్పెడు చొప్పున మందార పూలు ఆకులు, కలబంద గుజ్జు కప్పు, కొబ్బరినూనెలో మరిగించి చల్లారాక వడకట్టి గాలి చొరబడని సీసాలో భద్రపరుచుకోవచ్చు.రెండు రోజులకో ఒకసారి ఈ నూనెతో జుట్టుకు మసాజ్ చేస్తే చుండ్రు అదుపులోకి వస్తుంది.జుట్టు రాలటం తగ్గిపోతుంది.అలాగే గుప్పెడు గులాబీలు, కప్పు చొప్పున మునగాకు కరివేపాకు, ఆముదం, కొబ్బరి నూనె తీసుకుని […]
కాస్త దూరం మంచిదే
నిరంతరం కరోనా వార్తలను వినటం వల్ల భయం ఆందోళన కలగటం సహజం.ముందుగా పుకార్లను వ్యాప్తి చేసే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం ఉత్తమం.చిన్న చిన్న వ్యాయామ లక్ష్యాలు చాలా అవసరం.రోజుకు అరగంట పాటు 14 రోజులు వేగంగా నడవాలని నిర్దేశించుకోవచ్చు.ఆ అరగంట శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుతుంది.ఆన్ లైన్ వ్యాయామ తరగతుల్లో చేరవచ్చు.మంచి పోషకాహారం తోనే తగినంత శక్తి లభిస్తుంది.రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కొవ్వు, ఉప్పు, తీపి పదార్థాలు సాధ్యమైనంత మితంగా తీసుకోవాలి. పీచు అధికంగా ఉండే […]
ఇవి సాయం చేస్తాయ్ !
జిమ్ లు ప్రారంభం అయ్యాయి గానీ కరోనాతో బయటకు వెళ్లాలంటే తెలియని భయం.ఇంట్లోనే యాప్ ల సహాయంతో వ్యాయామం చెయ్యండి అంటారు ఎక్స్పర్ట్స్. ఫిట్ ఆన్ యాప్ ని ఎంచుకుంటే శరీరంలో ఏ భాగంలో కొవ్వుని ఎలా తగ్గించుకోవాలనుకుంటున్నారు. ఆ భాగానికి సంబంధించిన వ్యాయామాలు ఉంటాయి. స్వార్ కిట్ యాప్ తోడుగా ఉంటే వ్యక్తిగత వ్యాయామ సలహాదారు ఉన్నట్లే.వ్యాయామం ఎలా మొదలు పెట్టాలి ఎంత సేపు చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశాలకు సంబంధించిన వీడియోలు […]
మేని మెరుపు కోసం
వారానికి ఒక సారి తీరికగా శరీరానికి నలుగు పెట్టుకోని స్నానం చేస్తే ఒంటికి రక్తప్రసరణ జరిగి మేని మెరిసిపోతుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. పాలు, పెసర పిండి, శెనగపిండి,వట్టి వేళ్ళ పొడి,పచ్చ కర్పూరం, కస్తూరి పసుపు, చందనం, గులాబీ రేకుల పొడి ఇవన్నీ స్టోర్స్ లో దొరుకుతాయి.ఒక్క అర స్పూను చొప్పున ఇవన్నీ తీసుకొని నువ్వుల నూనె కలిపి ఆ పేస్ట్ తో నలుగు పెట్టుకోవాలి.అలాగే జుట్టుకు మెంతికూర మెత్తని గుజ్జు గా చేసి పెరుగు కొబ్బరి పాలు […]
దుర్వాసనా ?
ఈ చల్లని వాతావరణంలో ఇంట్లో దుర్వాసనలు వస్తూ ఉంటాయి.సాధారణంగా చెత్త బుట్ట నుంచే ఇలాంటి వాసనలు రావచ్చు.తడి చెత్త, పొడి చెత్త వేరు వేరు గా ఉంచితే వాసనలు రావు.చాలామందికి ఇళ్లలో పెంపుడు జంతువులు ఉంటాయి.సోఫాలు, మంచాల పైన అంటుకున్న జంతువు వెంట్రుకలను వ్యాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేయాలి.అలాగే తడిసిన దుస్తులు కూడా వాసన వేస్తాయి.మాసిన దుస్తులు తడవకుండా బాస్కెట్ లో వేసి దూరంగా పెట్టాలి.ఉతికిన బట్టలు ఎండలో ఆరవేయాలి లేదా గాలి వచ్చే చోట […]
ఇది చక్కని స్క్రబ్ కూడా !
జుట్టుకు పోషణ ఇచ్చే హెయిర్ కండీషనర్ తో ఇతర ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్ .పగిలిన పాదాలకు కండిషనర్ పోషణను అందించి మృదువుగా మార్చేస్తాయి.రాత్రి వేళ పాదాలకు ఈ కండిషనర్ పూసి సాక్స్ లు వేసుకోవాలి.ఇలా ప్రతిరోజూ చేస్తే పాదాలు మృదువుగా మారిపోతాయి అలాగే కాలి వేళ్ళకు గోళ్ళకు కండిషనర్ రాసి మర్దనా చేస్తే గోళ్లు బలంగా చక్కగా కనిపిస్తాయి.ఈ కండిషనర్ బాడీ స్క్రబ్ లాగా కూడా వాడుకోవచ్చు.కండిషనర్ లో కొద్దిగా బ్రౌన్ షుగర్ నిమ్మరసం […]
యువతకు స్ఫూర్తి సవితా గార్జె
తాజాగా విడుదలైన మహా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ఫలితాల్లో మంచి మార్కులు సాధించింది త్వరలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు తీసుకోని ఉన్నది సవితా గార్జె.ముంబై లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సవిత తండ్రి మారుతి గార్జె సాధారణ క్లర్క్.చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ చదువుకుంది సవితా.నెలవారీ ఖర్చుల కోసం కోచింగ్ సెంటర్లలో పాఠాలు చెప్పేది. నా లక్ష్యం డి.ఎస్.పి కావాలని అందుకే చిన్న చిన్న సమస్యలు పట్టించుకోలేదు. అని చెప్పే […]
సిద్ధంగా ఉంటే మేలు
వర్షాలు మొదలయ్యాయి లాక్ డౌన్ తో షికారుకు వెళ్లకపోయినా ఏ ఫ్రూట్స్ కోసమో, సరుకుల కోసమో బయటకు వెళ్ళక తప్పదు.అప్పుడు వర్షం వస్తే హ్యాండ్ బ్యాగ్ తో సహా మొత్తం వస్తువులు తడిసిపోతాయి. అందుకే హ్యాండ్ బ్యాగ్ లో నాలుగైదు జిప్ లాక్ కవర్లు ఉంచుకోవాలి.డబ్బులు, ఫోన్ లు వంటివి వాటిలో పెట్టుకోవచ్చు. పెద్ద పాలిథిన్ కవర్లు,లేదా ఓ లెదర్ సంచి వంటిది బ్యాగ్లో ఉంచుకుంటే మొత్తం వస్తువులకు రక్షణ ఉంటుంది .అలాగే వర్షం రాగానే ఇల్లంతా […]
కూరకు అదనపు రుచి
కూరలు వండే విషయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే వాటి రుచి రూపం కూడా బావుంటాయి కూరలో గ్రేవీ పల్చగా అయిపోతే రెండు స్పూన్ల పుట్నాల పప్పు పొడి వేసి బాగా కలపాలి కూర దగ్గరపడుతోంది రుచి కూడా పెరుగుతోంది లేకపోతే సెనగపిండి కూడా వాడవచ్చు.అలాగే బంగాళదుంపలు కూడా ఉపయోగపడతాయి ఉడికించిన బంగాళదుంపలను మెత్తగా మెదిపి కూరలో కలిపితే కూర దగ్గరపడుతోంది స్టార్ట్ వాడినా కూర చిక్కబడుతుంది. వీటిలో ఏది చేర్చిన కూరకు అదనపు రుచి వాసన వస్తాయి.
ఎలిజిబెత్ రాణి బహుమతి
బ్రిటన్ మహారాణి రెండవ ఎలిజబెత్,నాలుగు నెలలుగా విండ్సర్ క్యాస్ట్లీలో లాక్ డౌన్ లో ఉన్నారు. ఆమె ఒంటరిగా దిగులు గా ఉందేమోనన్ని ఆలోచనలో తిమోతీ మ్యాడర్స్ అనే ఏడేళ్ల పిల్లవాడు ఆమెను ఉల్లాస పరిచే హ్యాపీ వర్డ్ పజిల్ ను స్వయంగా కనిపెట్టి ఆమెకు పెద్ద వాళ్ల ద్వారా కానుకగా పంపాడు. ఈ పజిల్ పూర్తి చేస్తున్నంతసేపు మనసుని సంతోష పెట్టే పదాలు వెతుక్కుంటూ ఉండాలి. 94 ఏళ్ళ వయసు లోనే రాణిగారి సంతోషం గురించి లోకం పోకడ […]
దగ్గు జలుబు కు ఔషధం
ఈ రోజుల్లో నేరేడు పండు ఎక్కువగా దొరుకుతాయి నేరేడు లో క్యాల్షియం, ఇనుము, పొటాషియం విటమిన్ ఎ, సి లు పుష్కలంగా ఉంటాయి.దగ్గు, జలుబు, జ్వరం వంటి వాటి బారిన పడకుండా తగ్గించే ఔషధగుణాలు నేరేడు పండు లో ఉన్నాయి, విటమిన్ ఎ సి లు కంటి చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయాన్ని శుభ్రపరిచి పనితీరును మెరుగుపరుస్తాయి.దంత సమస్యలు నివారిస్తాయి.మెదడు చురుగ్గా పని చేసేలా చేస్తాయి ఆస్తమా బ్రాంకైటిస్ వంటి వ్యాధులతో […]
పోషకాల సూప్ ఇది
వర్షాల జోరులో రైస్ బ్రాత్ సూప్ తాగితే ఆరోగ్యం అంటున్నారు ఎక్సపర్ట్స్. బియ్యం వేయించి రవ్వగా మార్చాలి. ఒకటికి రెండు గ్లాసులు నీళ్లు పోసి ఉడికించాలి. ఈ సూప్ లో ఉడికిన కూరగాయల ముక్కలు, అల్లం ముక్కలు, మిరియాలు, బిర్యాని ఆకులు వేసి ఇంకాస్త ఉడికిస్తే రుచి,పోషకాలు అందించే సూప్ తయారవుతోంది. అలాగే పాలల్లో బాదం పప్పుల పొడి,కుంకుమపువ్వు, జీడిపప్పు పొడి వేసి కేసరి పాలు తయారు చేసుకొని తాగితే శక్తి ఆరోగ్యం సొంతం అవుతాయి.
చర్మ కాంతికి నువ్వులు
చర్మ,కేశ రక్షణకు నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. చర్మాన్ని హాని కారక ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. నువ్వులను పొడిగా చేసి దానికి పెసరపిండి పాలు కలిపి వంటికి రుద్దుకొంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వులు యాంటీ మైక్రోబియల్ గా పనిచేస్తాయి. ఫలితంగా మొటిమలు,వాటి తాలూకు మచ్చలు పోతాయి. ఇందుకోసం నువ్వుల పొడిలో చెంచా తేనె చెంచా పంచదార కలిపి ముఖానికి పూతగా వేసుకొని ఓ అరగంట ఆగి […]
