Tuesday, 04 Aug, 2026

ఒక ప్రత్యేకత కావాలి

ఎవరికి వాళ్లకు తాము ప్రత్యేకంగా కనిపించాలని ఒక కోరిక ఉంటుంది అలాంటప్పుడు కనిపించిన ప్రతి ఫ్యాషన్ ను అనుసరించటం వల్ల లాభం ఏమి ఉండదు. అలా ప్రత్యేకంగా కనిపించాలి అంటే మీ కోసం ఓ ట్రెండ్ క్రియేట్ చేసుకోండి అంటున్నారు ఎక్స్పర్ట్స్.కేశాలంకరణ లోనూ బొట్టు లోనూ వస్త్రధారణలోనూ ఒక ప్రత్యేకత ఉండాలి దాన్ని మార్చకుండా ఒక స్టైల్ స్టేట్ మెంట్ గా చేసుకోవాలి.ఉదాహరణకు విద్యాబాలన్ ఎప్పుడూ అంచున చీరలతో,వాణిశ్రీ పెద్ద కొప్పు తో ఒక రాజకీయ నాయకురాలు […]

 ఉద్యోగాల్లోనే జ్ఞాపకశక్తి

ఉద్యోగం చేసే మహిళలకు వృత్తిపరమైన సంతృప్తి తో పాటు ఆర్థిక స్వేచ్ఛ మాత్రమేగాక వాళ్లలో మెరుగైన జ్ఞాపకశక్తి జీవిత చరమాంకంలో మెరుగ్గా ఉంటుందని పరిశోధనలు చెపుతున్నాయి. 1995-2016 మధ్య ఆరువేల మంది మహిళల జ్ఞాపకశక్తిని ప్రతి రెండేళ్లకూ పరీక్షించారు. దీనికోసం 16-50 మధ్య వయసువారిని ఎంపిక చేసుకున్నారు. పనిచేసే మహిళలతో పోలిస్తే పనిచేయని వారి జ్ఞాపకశక్తి సగటున 50 శాతం తక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేల్చారు. మహిళల జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండేందుకు వ్యాయామాలూ, ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లతోపాటు […]

పిల్లల కోసం కొత్త కథలు

‘గ్రాండ్ పేరెంట్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్’ పేరుతో కొత్త పుస్తకం తీసుకొచ్చారు సుధామూర్తి చిన్న పిల్లల కోసం ఊహాతీతమైన జానపద గాధలు  నీతి బోధలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ లాక్ డౌన్ స్నేహ చిన్న పాప గా అమ్మమ్మ, తాతయ్య దగ్గర చిక్కు పోతే ఎలా ఉంటుందో ఊహించుకున్న ఆ సమయంలో అమ్మమ్మ తాతయ్యలు ఆ పిల్ల విషయంలో ఎలా స్పందించి ఉంటారో ఆలోచించాను. అదే ఈ కథలు రాయటానికి స్ఫూర్తి  అంటున్నారు సుధా మూర్తి. […]

ఇది పిల్లో షూస్ ట్రెండ్ 

డ్రెస్సింగ్ నుంచి షూ వరకు అన్ని  కొత్తకొత్తగా కనిపించాలి అనుకుంటారు ఫ్యాషన్ ప్రియులు. ఈ చలి రోజుల్లో పాదాలను వెచ్చగా ఉంచేందుకు పిల్లో  షూస్ మార్కెట్ లోకి వచ్చేశాయి.స్టైల్ గా కనిపించే ఈ షూస్ ఇప్పుడు ట్రెండ్. వీటిని ఫ్రాన్స్ కు  చెందిన లూయిస్ ఫుట్టిస్  కంపెనీ తయారు చేసింది. ఈ షూస్ తయారీలో నైలాన్ వాడటం వల్ల పాదాలు వెచ్చగా ఉంటాయి. నలుపు ,తెలుపు ఆకుపచ్చ రంగుల్లో వస్తున్న ఈ షూస్ పైజామాలు స్వెట్ ప్యాంట్లు […]

పెట్స్ తో ఒత్తిడి మాయం 

పెంపుడు జంతువులు పక్కనే ఉంటే ఎలాటి స్ట్రెస్ కూడా మాయం అయిపోతుంది అంటారు ఎక్సపర్ట్స్  ముఖ్యంగా పెట్ డాగ్స్ ఎంత ప్రేమ ఇస్తే అంత తిరిగి ఇస్తాయి అంటారు. ఇంట్లో మనుషుల్లాగా పెంపుడు కుక్కలను ప్రేమిస్తారు చాలా మంది సెలబ్రెటీలు.అలాగే వాటి కోసం ఆస్తులు కూడా రాసి ఇచ్చిన సంఘటనలూ ఉన్నాయి బాలీవుడ్ హీరోయిన్లు ఎంతమందికి పెంపుడు కుక్కలున్నాయి తమన్నా భాటియా, సమంత అక్కినేని, కీర్తి సురేష్, కళ్యాణి ప్రియదర్శన్, పూజా హెగ్డే,  మహేష్ బాబు, నమ్రతా […]

పైజామా సూట్ 

వర్క్ ఫ్రొం హోమ్ ఇప్పుడు చాలామంది అలవాటుపడిపోయారు సూట్లు ఆఫీస్  డ్రెస్ ల  అవసరం అయిపోయాయి. ఇంట్లో నేను కొనేవి, ఆఫీస్ వేర్ అనే తేడాలు పోయాయి అయితే ఆన్ లైన్ వీడియో కాన్ఫరెన్స్ లకీ జూమ్ మీటింగ్స్ కి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అన్నది యూత్ ముందున్న ప్రశ్న. జపాన్ కి చెందిన ఏమో కి హోల్డింగ్ కంపెనీ ఒక అద్భుతమైన ఆలోచన చేసి పైజామా సూట్ డిజైన్ చేసింది సాధారణ ప్యాంటు షర్ట్ ల […]

బాల్కనీ లో నిమ్మచెట్టు 

విటమిన్- సి సమృద్ధిగా ఉండే నిమ్మ పండు మంచి రోగనిరోధక బూస్టర్ కూడా.నిమ్మ చెట్టు ఇప్పుడు ఇంట్లో కుండీల్లో కూడా పెంచుకోవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్.వెడల్పుగా ఉండే కుండీని వర్మీ కంపోస్ట్,ఆవు పేడ సేంద్రీయ ఫీడ్ ,మట్టి ఇసుక తో నింపి నిమ్మ మొక్క నాటుకోవచ్చు.ఈ మొక్కకు సూర్యరశ్మి ఎక్కువగా కావాలి. ప్రతి రోజు నీరు అవసరం లేదు రెండు మూడు రోజులకు ఒకసారి  నీరు పోస్తే చాల విత్తనాలు లేని నిమ్మకాయలు కూడా ఈ కుండీలో పండించవచ్చు.రెండేళ్ళలో […]

అందరికీ కృతజ్ఞతలు

 కృతజ్ఞత తో ఉన్న వారికి  అన్నీ వాటంతట అవే అందుతాయి అంటారు పెద్దలు మనం అందుకొన్న ప్రతి దానికీ థాంక్స్ చెప్పి తీరాలి తన విజయం వెనక తన ముందు తరం పరిశోధకుల పాత్ర ఉందని ఐస్ స్టీన్  అంతటివాడు స్మరించుకున్నాడు.   క్రీడాకారిణి గెలుపులో కోచ్ పాత్ర, సినిమా సక్సెస్ లో దర్శకుని పాత్ర..ఇలా సాయపడిన అందరికీ స్మరించుకోవడం అంటే కృతజ్ఞతలు చెప్పుకోవడమే.మన  జీవితంలో తల్లిదండ్రులు, తోడ బుట్టిన వారు స్నేహితులు, బంధువులు ఇలా సంతోషం కలిగించిన […]

అస్తిత్వ మరాఠీ హిందీ 2000 

అదితి ఆమె భర్త శ్రీకాంత్ దంపతులు అనుకోకుండా ఒకరోజు అతిధికి మ్యూజిక్ టీచర్ తన ఆస్తి నంతా రాసిన వీలునామా వస్తుంది అతని పేరు కామత్.ఇంత ఆస్తి ఎందుకు అతిధికి ఇచ్చాడని శ్రీకాంత్ పాత డైరీలను చదువుకొని అతిధికి పుట్టిన కొడుకు కామత్ సంతానమని తేల్చుకుంటారు. ఎదిగిన కొడుకు భర్త ఇద్దరూ ఆమెను తిరస్కరిస్తారు భర్త ఎంత కాలం పాటు వ్యాపారంలో మునిగి తేలుతూ తనకు కోసం నిముషం కూడా కేటాయించని రోజుల్లో అనుకోకుండా మ్యూజిక్ టీచర్ […]

‘స్ట్రీట్  టు స్టూడియో

‘స్ట్రీట్  టు స్టూడియో ‘ పేరుతో కొచ్చి ఫోటోగ్రాఫర్ మహదేవన్ దంపి తీసిన ఫోటోలు నెటిజన్లను ముగ్దులను చేశాయి. కొచ్చిలోని ఎడపల్లి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సీజనల్ వస్తువులు అమ్ముతోంది ఆస్మాన్. వాన వస్తే గొడుగులు, లేకపోతే విండో ఫీల్డ్ లు అమ్ముతున్న ఆస్మాన్ రూపం చర్మం కూడా ఫ్యాషన్ ఫొటోగ్రఫీకి పనికివస్తాయని దంపి కనిపెట్టాడు. షెరీన్ అన్న కాస్ట్యూమర్ అమ్మాయి కి డ్రెస్ లు డిజైన్ చేసింది. ఆస్మాన్ చక్కగా ఫోజులిచ్చిన ఫోటో షూట్ స్ట్రీట్  […]

అపురూపమైన గిఫ్ట్

భార్య కోసం ఏకంగా చంద్రుడిపైన ఫ్లాట్ కొని బహుమతిగా ఇచ్చాడు.రాజస్థాన్ లోని అజ్మార్ లో ఉండే ధర్మేంద్ర అనీజీ డిసెంబర్ 14న ఆయన భార్య స్వప్న పుట్టినరోజు న్యూయార్క్ సిటీలోని లూనా సొసైటీ ఇంటర్నేషనల్ నుంచి కొన్ని వందల డాలర్లు చెల్లించి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు .ప్లాట్ ఖరీదు ఎంత అని నేను అడగలేదు కానీ ఆయన చూపించిన ప్రేమతో తడిసిపోయినంటోంది  ఆయన భార్య స్వప్న.

వేడి నీరు ఆరోగ్యం

కొన్ని గ్లాసుల వేడి నీరు తాగడం వల్ల ఈ నీరు, చర్మం కండరాలు కీళ్ళ ఆరోగ్యానికి తోడ్పడతాయి. వేడి నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. ఇవి సాధారణంగా పేగుల కదలిక కు సాయపడతాయి మలబద్దకం ఉండదు. ముక్కు కారడం, దగ్గు, గొంతు నొప్పి అలసట నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.మరీ వేడి నీరు వల్ల గొంతులో కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది కనుక గోరువెచ్చని నీళ్ళు తాగడం మేలు.

మంచి కొవ్వులు అవసరం

ఈ కరోనా సమయంలో కండరాలు రోగనిరోధక వ్యవస్థ పనితీరు కు కొవ్వులు చాలా అవసరం. ఆహారం నుంచి లభించే రసాయనిక భేదాలను బట్టి మంచి చెడు కొవ్వులు గా పిలుస్తారు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం తో ఫాస్ట్ ఫుడ్స్ లో డాల్డా, వనస్పతి వంటి వాటిని వాడి తయారుచేసే బేకరీ ఫుడ్స్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటి వల్ల రక్తంలో L.D.L కొలెస్టరాల్ పెరుగుతుంది.మంచి కొవ్వులు అంటే పోలీ అన్ శాచురేటెడ్, మెనో అన్ […]

ఆమె పేరే బ్రాండ్  

సౌందర్యసాధనాల ప్రపంచంలో తిరుగు లేని మహారాణి షహనాజ్ హుస్సేన్.ఆమె పేరే ఒక బ్రాండ్ 1979లో షహనాజ్ హుస్సేన్ కోల్కతాలో ప్రారంభమైంది.కాస్మెటిక్ తెరఫీ కాస్మెటాలజీ లో శిక్షణ పొందిన షహనాజ్ పేరుపైన ప్రస్తుతం 7000 ఫ్రాంచైజ్ క్లినిక్ లు 800 డిస్ట్రిబ్యూషన్ పార్టనర్లు, 70 బ్యూటీ  శిక్షణ అకాడమీ లు ఉన్నాయి.140 దేశాలకు ఆమె ఉత్పత్తులు విస్తరించాయి. ఒక వ్యాపార ప్రకటన కూడా లేకుండా తన పేరు పైన అన్ని ఉత్పత్తులు అమ్మే షహనాజ్ కు ఇటు హాలీవుడ్ […]

ఇదే నా బ్యూటీ సీక్రెట్

సినిమాల్లో కనిపించాలంటే అందం, నాజూకుదనం ఎంతో ముఖ్యం. నిజానికి నేను పక్కా మాంసాహారాన్ని పూర్తిగా శాకాహారిగా మారిపోయాను.కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు గుడ్లు మటుకు తింటాను. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్లే నాజుగ్గా కనిపిస్తామని చెప్పవచ్చు అంటోంది రష్మిక మందన్న. లక్షల మంది అభిమానులు ఉన్న రష్మిక అందం వెనుక రహస్యం వ్యాయామం ఆహారమే ,డైటీషియన్ ఏం చెపితే అదే భోజనం. బొప్పాయి, యాపిల్, నల్లద్రాక్ష,డ్రాగన్ ఫ్రూట్ దానిమ్మ గింజలు ఫ్రెష్ పండు నా బ్రేక్ ఫాస్ట్ […]

గ్రీన్  అంబాసిడర్ గా ఖుషి

మేము న్యూ సిటీ లైట్ ప్రాంతంలో ఉండే వాళ్ళం ఖాళీ ఉన్న ప్రతి చోట అపార్ట్మెంట్స్ వెలిశాయి.పక్షులకు ఆవాసం లేకపోవటం చూశాను.నా చెల్లి పెద్దయ్యాక అసలు ప్రకృతి అంటే ఏమిటో కూడా తెలుసుకోలేకపోతుంది అనిపించింది.అప్పటి నుంచే పర్యావరణం కోసం పనిచేయడం ప్రారంభించాను అంటుంది సూరత్ కు చెందిన 17 ఏళ్ల ఖుషి పర్యావరణం పైన తన ప్రేమను అభిప్రాయాలను తెలియ జేసేందుకు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంది ఖుషి ఆమె రాసిన […]

మిస్ పింక్

ప్రపంచంలో ఒకే రంగును ఎంచుకున్నందుకు కాను  కొంతమంది మహిళలు ప్రసిద్ధికెక్కారు స్విట్జర్లాండ్ కు చెందిన యాస్మిన్ కూడా అలాగే పింక్ కలర్ ఎంచుకుంది. ఆమె వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు ఆమెను మిస్ పింక్ అని పిలుస్తారు. 12 సంవత్సరాల వయస్సు నుంచే పింక్ రంగు పట్ల వ్యామోహం పెంచుకున్నారు యాస్మిన్ చార్లెట్. పింక్ కలెక్షన్ మొదలుపెట్టింది పెళ్ళయ్యాక భర్త కూడా అందుకు అడ్డు చెప్పలేదు. 2019 లో సొంత ఫ్లాట్  కొనుక్కుని ఇల్లంతా పింక్ షేడ్ లోకి మార్చేసింది.20 […]

పర్ ఫెక్ట్ లుక్ మొదటి సూత్రం

మైలకోకతోడ మాసిన తలతోడ నొడలు మురికి తోడ నుండెనేని నగ్రకులజుడైన నట్టిట్టు పిలువరు విశ్వదాభిరామ వినురవేమ. మురికి బట్టలు మాసిన తల దేహం మీద మురికితో ఉంటే ఎలాంటివాడినైనా ఎవరూ మెచ్చరు. అన్నాడు ఏనాడో యోగివేమన మొదటి పరిచయం తో ఎదురుగా ఉన్న వ్యక్తిని అంచనా వేసేందుకు, మొహంలో చిరునవ్వు వేసుకున్న దుస్తులు బాడీ లాంగ్వేజ్ పరిగణనలోకి వస్తాయి. మన వృత్తి వ్యాపారాల్లో ఎవరో తెలిసిన వాళ్లతోనే లావాదేవీలు ఉండవు తెలియని వ్యక్తులతో డీల్ చేయాలి.అవతలి వాళ్ళు […]

Muramba మరాఠీ (2017)  

అలోక్ ఇందు మూడేళ్లుగా డేటింగ్ లో ఉంటారు ఒక యాడ్ ఏజెన్సీలో ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తూ ఉంటుంది.అలోక్ కెరియర్ పట్ల ఎలాంటి శ్రద్ధ చూపించాడు ఎంబిఎ, పూర్తి చేసి అక్కడే టీచర్ పని చేయటం ఇష్టం అంటాడు. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయటం లేదని ఇందూ తగువు  పడుతుంది.అలోక్ బ్రేకప్ చేస్తాడు కోపంతోనే ఇంటికి వచ్చి ఇందు వైపు నుంచి తనకు నచ్చని విషయాలు చెప్పి అందుకే ఆమెతో విడిపోయానని చెబుతాడు. అలోక్ తల్లిదండ్రులు […]

స్కిన్ ఫాస్టింగ్

చర్మానికి ఎటువంటి సౌందర్య సాధనాలు వాడకుండా ఉండటమే స్కిన్ ఫాస్టింగ్. గాజు వంటి అందమైన మెరిసే చర్మం గ్లాస్ స్కిన్ కోసం సరికొత్త స్కిన్ ఫాస్టింగ్ ట్రెండ్  ఉపందుకొంది. జపాన్ కు చెందిన మిరాయి క్లినిక్ అనే ఒ స్క్రీన్ కేర్ కంపెనీ నూతన సృష్టి ఇది. సాంప్రదాయ ఉపవాసాలతో శరీరానికి ఎలా లాభం చేకూరుతుందో,అలాగే ఎలాంటి సౌందర్య సాధనాలు వాడకుండా చర్మానికి సహజమైన గాలి తగులుతూ ఉంటే మెరిసిపోతుంది అని చెబుతోందీ ఈ ప్రక్రియ.ఇలాంటి క్రీములు, […]