Chinna Maata
నిజాయతీకి ఇది నిదర్శనం
మనుషుల్లో వుండే నిజాయతీకి నిదర్శనం ఈ ఊరి షాపులు. మిజోరాం లోని సెలింగ్ పట్టణం లో ఉన్న ఈ హైవే మార్గంలో కొండలు అడవులు వరి పంటలే కనిపిస్తాయి. ఆ దార్లో అక్కడక్కడా కూరగాయలు పండ్లు. పండ్ల రసాల బాటిల్ తో పాటు ఇతర అటవీ ఉత్పత్తులను అమ్మే చిన్న దుకాణాలు ఉంటాయి.కానీ ఆ షాపుల్లోఅమ్మే వాళ్ళు ఎవ్వరూ కనిపించరు అన్ని వస్తువుల పైన వాటి ధర ఒక అట్టముక్క పైన రాసి ఉంటుంది. వాహనాల్లో అటు […]
ఈ పూల లోయ ఒక అద్భుతం
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని సువిశాల ప్రాంతం లడక్ జనాభా తక్కువ విస్తీర్ణం ఎక్కువ బౌద్ధం ప్రధాన మతం.లడక్ లోని పువ్వుల లోయలు చూస్తుంటే ప్రపంచంలోని అందమంతా ఇక్కడే ఉందని అనిపిస్తుంది. లడక్ లోని షీలా కాంగ్ ప్రాంతంలోని లోయ ఒక ప్రత్యేకం సముద్రమట్టానికి 5,000 అడుగుల ఎత్తైన చుట్టూ మంచు పర్వతాలు కరిగిన నీళ్ళతో ఏర్పడిన సెలయేళ్ళు. ఆ సెలయేళ్లు అంచున ఎన్నో రంగురంగుల పువ్వులు ఒక పువ్వు కి ఒక ప్రత్యేకమైన అందం నీలి, గులాబీ, […]
ఒకే చెట్టుకు 22 రకాల పండ్లు
ఒకే మామిడి చెట్టుకు 22 రకాల మామిడి పండ్లు పండించే ఉత్తమ రైతు గా గుర్తింపు పొందారు కాకా సాహెబ్ సావంత్ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా లోని ఓ చిన్న గ్రామం అంట్రాల్ గ్రామానికి చెందిన సావంత్ ఓ ఆటోమొబైల్ కంపెనీ లో మెకానిక్ గా పని చేసేవారు. పూణే లో ఉద్యోగం చేసే సావంత్ కు వేరే ఊరు బదిలీ అయింది. ఏదో తెలియని ప్రాంతానికి వెళ్లే బదులు సొంత ఊరు వచ్చేసి ఉన్న 20 […]
వర్క్ వుట్స్ కు శారీ బెస్ట్
ఏ పనికి చీరె అడ్డంకి కాదు ముఖ్యంగా యోగా చేసేందుకు అంటుంది పుణేకు చెందిన ఆయుర్వేద వైద్యురాలు శార్వరి ఈ 37 సంవత్సరాల ఫిట్నెస్ ఫ్రీక్ రోజు జిమ్ లో వెయిట్ ట్రైనింగ్, పుషప్స్ వంటి వర్క్ వుట్స్ చేస్తుంది. నా దగ్గరకు ఆరోగ్య సలహా కోసం వచ్చే ఎంతోమందికి నేను వ్యాయామం గురించి చెబుతాను ఎంత చెప్పినా సాంప్రదాయ చీరకట్టుతో వ్యాయామం కష్టం అంటారు. పోనీ జిమ్ డ్రెస్ వేసుకోండి అంటే అలవాటు లేదంటారు .సాంప్రదాయ […]
ఆహార వ్యర్ధాలతో ఫ్యాబ్రిక్
ఫ్యాషన్ ప్రపంచం మొత్తం ఇప్పుడూ ప్రకృతి ఆరాధనలో మునిగిపోయినట్లు ఉంది. ఫ్యాషన్ డిజైనర్ మధురిమా సింగ్ డ్రెస్ డిజైన్ చేసిన ఫ్యాబ్రిక్ ను చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. అరటి, మొక్కజొన్న, సోయా పాలు తామర, ఆరెంజ్ బాంబు యూకలిప్ట్ స్ వంటి సహజ ఫైబర్ లతో పర్యావరణ అనుకూలమైన ఫ్యాబ్రిక్ను తయారు చేసింది మాధురిమా సింగ్. ముంబైకి చెందిన ఈ ఫ్యాషన్ డిజైనర్ ఢిల్లీలో ‘ధురీ’ పేరుతో ఫ్యాషన్ లేబుల్ ద్వారా సహజ ఫైబర్ తో […]
ఇసుక ఎడారిలో చల్లని బడి
దేశం లో అతి తక్కువ మహిళ అక్షరాస్యత నమోదైన రాష్ట్రం రాజస్థాన్. అక్కడి స్త్రీల అక్షరాస్యత 32 శాతానికి మించి లేదు దీనికి కారణం పేదరికం, నీటికొరత,బాల్యవివాహాలు,బ్రాహ్మణ హత్యలు ఇలా ఎన్నో కారణాలు. గర్భంలో ఆడపిల్ల ఉందని తెలిస్తేనే చంపేస్తారు. ఈ కారణాలు అధ్యయనం చేసిన సిటా అన్న ఎన్జీవో ఈ సమస్యలకు పరిష్కారం ఆడపిల్ల చదివే అని తేల్చుకొని 2018 లో ఇక్కడో స్కూలు నిర్మించింది. రాజస్థాన్ రాష్ట్రం, జైసల్మేర్ జిల్లా కానోయ్ గ్రామంలో, ది […]
కొచ్చి చాక్లెట్ కు అంతర్జాతీయ అవార్డ్
మంచి చాక్లెట్ అనగానే విదేశీ బ్రాండ్ గుర్తుకువస్తాయి డైరీ మిల్క్, ఫ్యూస్, మార్స్, ఫైవ్ స్టార్, బోర్న్ విల్లే వంటి చాక్లెట్లు కొనేందుకు ఇష్టపడతారు. కానీ ఈ విదేశీ రకాలను పక్కన పెడుతూ సగర్వంగా అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమమైన చాక్లెట్ లలో ఒక్కటిగా సిల్వర్ అవార్డ్ సాధించింది ఒక ఇండియన్ చాక్లెట్. కేరళ కు చెందిన పౌల్ అండ్ మైక్ చాక్లెట్ పూర్తిగా స్వదేశీ చాక్లెట్. 2012 నుంచి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ చాకొలెట్ అవార్డ్ లు […]
ఇవి తయారు చేసిన వజ్రాలు
అచ్చం వజ్రాల లాగే కనిపించే అమెరికన్ డైమండ్ భూమి నుంచి తవ్వి తీసిన అసలు వజ్రాలు వంటివి కాదు ఈ కృత్రిమ వజ్రాలు ప్రయోగశాలలో తయారవుతాయి వజ్రపు పొడిని కరిగించిన గ్రాఫైట్ కార్బన్ తో కలిపి 1500 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర తీవ్ర వత్తిడికి గురి చేసి స్పటికాల్లాగా చేస్తారు. తర్వాత దాన్ని మాములు వజ్రం లగే కట్ చేసి పాలిష్ చేస్తారు. జెమాలజిస్ట్ లు కూడా ప్రత్యేక పరికరాలు సాయం లేకపోతే ఏది నిజమైన […]
గాలిలో తేలి పోదాం
దేవతల్లా అలా గాలిలో ఎలా ఎగురుతున్నారు ఈ అమ్మాయిలు అని ఆశ్చర్యం వేస్తుంది ఏ ఆధారం లేకుండా గాలిలో ఎగరడం సాధ్యమా అంటే సాధ్యమే అంటున్నారు జియాటియన్ పార్క్ నిర్వాహకులు చైనాలోని ఫుజియాన్ లో జియాటియన్,జియా పర్యాటక ప్రాంతానికి వెళితే ఎవరైనా ఇలా గాలిలో ఎగిరే అనుభవం పొందచ్చు. పూర్వం ప్రాచీన చైనాలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రవీణ్యం ఉన్నవాళ్లు తేలికగా గాల్లో ఎగిరే వాళ్లనే కథలున్నాయి .ఉగ్జియా పేరుతో ఇలాంటి స్టంట్స్ చేసే ఫిక్షన్ సినిమాలు […]
అంతులేని సాహసం
జర్నలిజం, సాహిత్య రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు పులిట్జర్ ఈ ఏడాది మేఘ రాజగోపాలన్ ను వరించింది. ఇన్నోవేటివ్ ఇన్వెస్టిగేషన్ కేటగిరీలో మేఘన కు ఈ అవార్డు దక్కింది. మేఘా భారతీయ మూలాలున్న జర్నలిస్ట్ బజ్ ఫీడ్ సంస్థ లో పని చేస్తోంది. చైనాలోని షిన్ జియాంగ్ అనే ప్రాంతంలో వేలకొద్ది ముస్లింలను అక్కడి ప్రభుత్వం నిర్బంధించింది. ఇందుకోసం పెద్ద సంఖ్యలో జైళ్ళనూ నిర్భందంగా క్యాంప్ లను నిర్మించింది. దీనిపై మేఘ […]
ఆక్సిజన్ అందించే మొక్కలు
స్వచ్ఛమైన గాలి అందించే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యం అని రికమెండ్ చేస్తోంది నాసా పరిశోధన కేంద్రం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవటం చాలా అవసరం అరేకా ఫామ్ ను కిటికీల దగ్గరగా ఉంచి పెంచితే రాత్రివేళ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఇంట్లో ఉన్న కాలుష్యాన్ని గ్రహిస్తుంది .రాపిడ్ ఫామ్ మొక్క పిల్లలు చదువుకునే ప్రదేశాల్లో పడక గదుల్లో పెడితే ఎక్కువ ఆక్సిజన్ అందిస్తుంది .ఇక స్పైడర్ ప్లాంట్ గదిలో ఉన్న దుమ్మును […]
అచ్చంగా దాన కర్ణుడే
సినిమాల్లో విలన్ గా ప్రసిద్ధి చెందిన సోనుసూద్ ఇప్పుడు ఈ కరోనా సమయంలో సాయంతో కర్ణుడంత వాడు అనిపించుకొన్నాడు మోడలింగ్ తో మొదలుపెట్టి సినిమా నటుడైన సోనుసూద్ సోనాలీ ని పెళ్లి చేసుకున్నాడు .ఇషాన్, అయాన్ అన్న ఇద్దరు పిల్లల తండ్రి. కరోనా సమయంలో హైవే లో నడుస్తున్న కార్మికుల కష్టాలు చూసి చలించి పోయిన సోనుసూద్, వాళ్ళ కోసం ఆహారం, రవాణా సౌకర్యం కల్పించడం కోసం సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు .కొన్ని వేల మందికి […]
మామిడి కిలో రెండు లక్షల 70 వేలు
మామిడి పండ్ల చెట్టుకు కాపలా కోసం నలుగురు గార్డులు ఆరు కుక్కల్ని ఏర్పాటు చేశాం అంటే వినేందుకు ఎలావుంటుంది. పైగా రెండు చెట్లకు ఏడే పండ్లు. అంత ప్రత్యేకం ఏమిటంటే కిలో మామిడి పండ్ల ధర 2.7 లక్షలట. జపాన్ లోని మియాజాకి ప్రాంతానికి చెందిన ఈ అరుదైన మామిడి పండ్లు మధ్యప్రదేశ్ జబల్‌పుర్‌లోని రాణి, సంకల్ప్ అనే భార్య భర్తలకు చెందిన కాశాయి. అవి మామూలు మొక్కలే అనుకొన్నారు కానీ వాటికి కాసిన రూబీ రంగు […]
ఆహారమే ఔషధం
కోవిడ్ను ఎదుర్కొనేందుకు మాస్క్ లు సామాజిక దూరాలతో పాటు రోగ నిరోధక శక్తి పెంచుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు ఎక్స్పర్ట్స్. వయసును బట్టి తగినన్ని కేలరీలు అందేలా డైట్ ప్లాన్ చేసుకోవాలి. తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తినాలి. చిక్కీలు, ప్రోటీన్ బార్ ల తో పాటు మామిడి, అరటి వంటి పండ్లను స్నాక్స్ గా తీసుకోవాలి. తాజాగా వేడిగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా పప్పు దినుసులు, పన్నీర్, పెరుగు వంటి డైరీ ఉత్పత్తులకే ప్రాధాన్యత […]
కరోనా పై పోరులో యువరాజ్ సింగ్
యువరాజ్ సింగ్ ప్రముఖ క్రికెటర్ భారత ప్రభుత్వం నుంచి అర్జున్, పద్మశ్రీ పురస్కారాలు పొందాడు క్రికెట్ మైదానం లో అడుగుపెడితే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే యువరాజ్ గుండె ఎదుటి మనిషి కష్టాలకు కరిగిపోతుంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో అతని సాయం క్రికెట్ రికార్డుల కంటే గొప్పది ఆసుపత్రిలో బెడ్లు, దొరక్క, ఆక్సిజన్ అందక ప్రజలు కరోనాతో పిట్టల్లా రాలి పోతుంటే తన స్వచ్ఛంద సంస్థ యు వియ్ కెన్ ( youwecan ) ద్వారా బాధితులకు […]
గుడ్డు బొమ్మలు సూపర్
గట్టిగా వేళ్ళతో పట్టుకుంటేనే చితికి పోతుంది అనిపించే గుడ్డు తో అద్భుతమైన బొమ్మలు, గుడ్డు శిల్పాలు, ఎంబ్రాయిడరీలు, గోడ చిత్రాలు చేస్తారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఉక్రెయిన్ లో కళాకారులు గుడ్డు పైన అద్భుతమైన జానపద చిత్రాలు, దేవతా రూపాలను, ప్రకృతి దృశ్యాలను వ్యక్తుల రూపాలనీ అద్భుతంగా గీస్తారట. తేనెపట్టు నుంచి తీసిన మైనం తో రంగులు కలిపి సన్నని సూదితో గుడ్డు పైన జానపద డిజైన్ లు గీయటం అక్కడి కళాకారులకు మాత్రమే సాధ్యం. ఈ ఆర్ట్ […]
వాట్ ప్రా దమకాయా
గౌతమ బుద్దుడి ని ప్రపంచం మొత్తం ఆరాధిస్తారు. ప్రపంచంలోనే ఎత్తయిన ఏకశిలా విగ్రహం టాంక్ బండ్ లో కనిపిస్తుంది. బుద్ధుడికి సంబంధించి ఎన్నో చిహ్నాలు దేవాలయాలు ఉన్నాయి . థాయ్ లాండ్ లో వెయ్యి ఎకరాల స్థలంలో బుద్దుడి దేవాలయం ఉంది. వాట్ ప్రా దమకాయా అని పిలిచే ఈ భారీ బుధ్ధ దేవాలయం థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న క్లాంగ్ లువాన్ మండలం లో ఉంది. […]
ఇవి ఆర్నమెంటల్ క్యాబేజిలు
క్యాబేజీ కూర వండుకుంటాం కానీ అందాల పూల తోటలుగా పెంచటం ఎక్కడైనా ఉంటుందా ? ఆర్నమెంటల్ క్యాబేజిలు చూస్తే తోట అలంకరణకు ఇంత కంటే మంచి పూవులు ఇంకెక్కడా లేవనిపిస్తుంది. ఈ అందమైన క్యాబేజిపూవులు గులాబీ,పీచు,వంగపూవు ఇలా విభిన్నమైన రంగుల్లో మిశ్రమ వర్ణాల్లో కనువిందు చేస్తాయి. మాములు క్యాబేజీలో చుట్టు కొన్ని ఆకులు విచుకొన్నట్లు మధ్యలో బంతిలాంటి క్యాబేజీ ఉంటుంది కదా. ఆ బంతి బదులుగా గులాబీలా రెక్కలు విచ్చుకొంటాయి.చల్లని ఈ క్యాబేజీ పూవులు రంగులు ముదురు […]
ఎప్పటికీ వాడిపోని పూవులు
సృష్టి లోని సౌందర్యం మొత్తం ఒకే చోట పోగుపడి వికసించినట్లు ఇంత అందం ఇంత సౌందర్యం ఎక్కడ లేనట్లు ఎప్పటికీ వాడిపోని అపురూపమేమో అన్నట్లు ఉన్నాయి కానీ చేయి జారిందంటే మాత్రం పగిలిపోతాయి ఇవి పింగాణీ పువ్వులండి ! కోల్డ్ ఫోర్సిలిన్ తో చేసిన ఈ లిల్లీలు, గులాబీలు, చామంతులు చూస్తే వెంటనే తలలో పెట్టుకోవాలని పిస్తుంది. కానీ చేతిలోకి తీసుకుంటే అదే ఏమిటి పూలు రాళ్ళు లాగా ఉన్నాయి అనిపిస్తుంది. ఉక్రెయిన్ కు చెందిన బలెస్వా […]
కలర్ ఫుల్ ఎగ్
ఎంతో ఆరోగ్యం కదా అని గుడ్డు తినిపించాలని చూస్తే పిల్లల మొహం తిప్పేస్తారు తెల్లగా రుచిగా లేని గుడ్డు తినటం అంటే కష్టమే మరి. గుడ్డులోని శక్తిమంతమైన ప్రొటీన్లు, రిబోఫ్లేవిన్ ఎడి ఇకె విటమిన్లు ఖనిజాలు ఇంకా ఎన్నో పోషకాలు ఉంటాయి.వీటిని పిల్లలు చేత తినిపించాలంటే ఎడిబుల్ కలర్స్ తో రంగులు మార్చేయండి అంటున్నారు షెఫ్ లు. ఐరోపా అమెరికాల్లో ఈ ఈస్టర్ పండుగకు సంతాన సాఫల్యతకు పుట్టుక కి సంకేతమైన గుడ్డుని రంగు రంగులతో అలంకరించి […]
