Chinna Maata
వర్షాకాలంలో ఆహారం
వర్షంల్లో జలుబు,దగ్గు,గొంతు పొడిబారిపోవడం వంటి సమస్యలు వస్తాయి. వాతావరణంలోని మార్పుల వల్లనే ఇలా జరుగుతుంది. వీటికి దూరంగా ఉండాలంటే తగిన పోషకాహారం తీసుకోవాలి వెరైటీ టి తాగాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని హానికర బాక్టీరియాను తొలగిస్తాయి. డ్రై ఫుట్స్ శరీరానికి శక్తిని ఇచ్చి. వ్యాధులకు కారణం అయ్యే వైరస్ లను నియంత్రిస్తాయి జీడిపప్పు, ఖర్జురం, బాదం,వాల్ నట్స్ మొదలైనవి ఎంతో ప్రయోజనకరం. పసుపు,మిరియాలు,దాల్చిన చెక్క వంటివి ఆహారంలో భాగంగా ప్రతి రోజు తీసుకొంటే మంచిది.
వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోతుందా ?
జుట్టు రాలడమనేది ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య. అయితే వర్షాకాలంలో జుట్టు రాలడం సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఈ సీజన్లో ఎక్కువగా జుటు రాలిపోతుంటుంది. దీంతో ఎన్నో రకాల సప్లిమెంట్స్, కెమికల్ షాంపులు, రకరకాల ఆయిల్స్ ఉపయోగిస్తుంటారు. కానీ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. కొన్ని లక్షణాలను బట్టి శరీరంలోని ఏ లోపం వలన జుట్టు రాలుతుంది అనేది తెలుసుకోవాలి. వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోవడానికి కొన్ని కారణాలున్నాయి. వాతావరణంలో ఉంటే అధిక తేమ […]
హారం వెనక్కి..ఇప్పుడిదే ఫ్యాషన్
హారాలు, గొలుసులు, నెక్‌లెస్‌లు ఇలా నగలన్నీ మెడలో వేసుకుని మురిసిపోతాం. అయితే అవన్నీ గుండెలమీదుగా వేలాడేవే. కానీ ఇప్పుడు ట్రెండ్…బ్యాక్‌స్టైల్ జ్యూయలరీదే. ప్రత్యేకంగా తయారు చేసిన ఈ జ్యూయలరీ డీప్‌నెక్ బ్లవుజులు, గౌనులు, క్రాప్‌టాప్‌లు…ఇలా అన్నింటిమీదకూ నప్పేస్తుంది.
ఇలా వండుకుంటే పోషకాలు ఫుల్
మనం తీసుకునే ఆహారానికి, ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందన్న విషయం తెలిసిందే. చక్కటి పోషకాహారం తీసుకున్నప్పుడే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఎలాంటి వైరస్, బ్యాక్టీరియాకు మన శరీరం లొంగకుండా జాగ్రత్తపడచ్చు. కొన్ని ఆహార పదార్థాలు పచ్చిగా తీసుకోవడం కంటే వండుకొని తింటేనే వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి.. అలాగే సులభంగా జీర్ణమవుతాయి కూడా! అదే కాయగూరలు ఉడికించడం, డీప్ ఫ్రై చేయడం వల్ల వాటిలోని కొన్ని పోషకాలు తొలగిపోయే అవకాశం ఉంది..దుంప […]
చీరె తో మ్యాచింగ్ నగలు
చీరె కట్టాలంటే మ్యాచింగ్ జ్యువెలరీ ఉండాలి అంటారు అమ్మాయిలు చీరె కు సరిగ్గా సరిపోయే ఆభరణాలు వెతకటం పెద్ద సమస్య. కానీ ఇప్పుడు ఏకంగా చీరెతోపాటు మ్యాచింగ్ ఫంకీ నగలు వచ్చేశాయి. కాటన్, రాసిల్క్ ,లెనిన్ తరహా ఫ్యాన్సీ చీరెలకు మ్యాచింగ్ గా వస్తున్నా నగల సెట్ అచ్చంగా చీరె రంగులో ఉండే సిల్క్ దారాలతో నో, చెక్క లేదా టెర్రికోట పూసలు కలిపి చీరెకొంగు కో, బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యేలా రూపొందిస్తున్నారు . లెనిన్ […]
ఇవి అందాల సరస్సులు
నెలవంకల్లా ఒంపులు తిరిగిన ఇసుక తిన్నెల మధ్యలో ఆకుపచ్చగా ప్రతిబింబించే నీటి కొలనులు. ఇంత అందమైన ప్రకృతి ప్రసాదం బ్రెజిల్ లోని నేషనల్ పార్క్ లెంకోయిస్ మారనేన్సిస్ లో ఉంది. ఇది నిజానికి ఎడారి. అయితే వర్షం నీరు ని ఇసుక మధ్యని చోటు చేసుకొంటుంది. పోలాల్లో చిన్న వంపుల్లా కనిపించే ఇవన్నీ పెద్ద పెద్ద చెరువులు. వర్షాకాలంలో వేల మంది పర్యాటకులు ఈ అందాల సరస్సుల్లో జలకాలాడేందుకు వస్తారు.
కనువిందుగా ఫ్లోరల్ ప్రింట్స్
పూల పూల డిజైన్లు దుస్తులు, చెప్పులు బ్యాగులు ఫ్యాషన్ ట్రెండ్ లో ఉంటాయి. కెన్ స్కాట్ అనే అమెరికన్ డిజైనర్ నిండు రంగులు ప్రింట్ లు ఐకానిక్ మోటిఫ్స్ తో ఫ్లోరల్ ప్రింట్స్ కి శ్రీకారం చుట్టాడు. పూల షర్టులు పూల గౌన్లు ప్యాంట్లు టాప్స్ హాఫ్ హ్యాండ్ షర్ట్ లు ఫుల్ హ్యాండ్ షర్ట్ లు, చెప్పులు, బ్యాగ్ లు ఎటుచూసినా రంగులే. సాయం వేళల్లో పార్టీ డ్రెస్ లు ట్రాక్ సూట్లు సిల్క్ షర్ట్ […]
బెస్ట్ మెడిసిన్
కరోనా వచ్చి తగ్గిన తరువాత చాలా మందిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గి శ్వాస ఇబ్బందులు వస్తున్నాయి.శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ సమస్యలకు సోలో గార్లిక్ చక్కని మెడిసిన్ అంటున్నారు డాక్టర్లు. ఈ ఒంటి రెబ్బ వెల్లుల్లి,సాధారణ వెల్లుల్లి కంటే ఎంతో వేగంగా ఫ్లూ వైరస్ లను బాక్టీరియా వ్యాధులను తగ్గించగలదు మధ్యప్రదేశ్,రాజస్థాన్ లలో సాగయ్యే ఈ సోలో గార్లిక్ కొలెస్ట్రాల్ ని అదుపు చేస్తుంది. ఈ వెల్లుల్లి లోని అలసిన అనే శక్తి మంతమైన […]
షేకింగ్ థెరపీ బెస్ట్
పదిమందిలో కూర్చున్నపుడు ఎవరేనా ఊరికే చేతులు ఆడిస్తుంటే చూసేందుకు ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడా దృష్టి మార్చుకోండి శరీరాన్ని అలా షేక్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. ఎన్నో కారణాలతో,ప్రస్తుతం కరోనా భయం వర్క్ ఫ్రమ్ హోమ్ వత్తిడి ఇవన్నీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. కూర్చున్నచోట,నిలబడిన చోటనో ఈ వత్తిడి తగ్గించుకోవాలి అనుకొంటే కాళ్ళు కదపటం చేతులు ఉపటం వంటి షేకింగ్ థెరపీ వల్ల కండరాలు స్వాధీనం లో ఉంటాయి. దీని వల్ల వత్తిడి తగ్గిపోతుందని పరిశోధకులు […]
ఉత్సాహం ఇచ్చే పింక్ డ్రింక్
పింక్ కలర్ తో చేసిన డ్రింక్ లను ఈ రోజుల్లో సూపర్ డ్రింక్స్ అంటున్నారు. పుచ్చ, బొప్పాయి, డ్రాగన్, నిమ్మ, ద్రాక్ష, గ్రేప్ ఫ్రూట్ బెర్రీలు, జామ తో చేసే గులాబీ రంగు జ్యూస్ లు ఉత్సాహాన్ని ఇస్తున్నాయని అమెరికా లోని వెస్ట్ మినిస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు కనిపెట్టారు ముఖ్యంగా ఆటలు ఆడే వాళ్ళు ఈ గులాబీ రంగులో ఇచ్చిన కాఫీ, పాలు జ్యూస్ ఏదైనా సరే తాగితే అలసట పోయి ఉత్సాహంగా ఉన్నారని పరిశోధకుల మాట. […]
పెద్దంచు చీరెలదే కళ
వేడుకలు, వ్రతాలు పండగల్లో పట్టుచీరెలే అందం అందులోనూ కంచిపట్టు మరీ ప్రత్యేకం. పెద్దంచు జరీ చీరెలు కట్టుకో గానే సాంప్రదాయ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. అందుకే ఆ పట్టు చీరె ఎంపికలు పది పన్నెండు అంచుగల చిరాయితే అందంగా ఉంటాయి. ఎరుపు, రాయల్ బ్లూ, పచ్చ, మెజెంటా కలర్స్ కాంతివంతంగా పండగ కళను తీసుకొస్తాయి. మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ లేదా పూర్తి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఎంపిక చేసుకుంటే పట్టు చీరెలు పర్ఫెక్ట్ అనిపిస్తాయి. ఘనంగా […]
కదలకపోతే సమస్యే
నిద్ర లేస్తున్నే శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. వెల్లికిలా పడుకొని నిరంతరం కదులుతూ ఉండాలి లేకపోతే అనర్థమే అంటాయి అధ్యయనాలు. సైక్లింగ్, స్క్యాట్స్ వంటివి చేస్తే కండరాలు శక్తిని పుంజుకుంటాయి.ఫోనొస్తే నడుస్తూ మాట్లాడాలి కాళ్ళు మడమలు తిప్పుతూ ఉండాలి. ప్రతి ఇరవై నిమిషాలకీ రెండు నిమిషాలు లేచి నిలబడాలి రెండు గంటలకోసారి వెన్ను భుజాలు చేతి కండరాలు కదిలేలా నవ్య అపసవ్య దిశలో కదలించాలి. నీళ్ల సీసా, చున్నీ, తాడు, కర్ర ఏది చేతికి దొరికితే వాటితో వ్యాయామాలు […]
భారీ ముష్రూమ్స్
కరోనా కాలంలో పోషక పదార్థాల కు విలువ పెరిగిపోయింది. అట్లా ముష్రూమ్స్ అత్యంత శక్తినిచ్చేవిగా గుర్తించారు. ఈశాన్య భారతం లోని త్రిపుర లో పెంచే మష్రూమ్స్ భారీ సైజులో వున్నాయి. కుళ్ళిపోతున్న జీవ పదార్థాల పైన పెరిగే ఫంగస్ ఇది. ఇవి ఎంత పెద్ద సైజులో ఉంటే అంత ఆరోగ్యం అన్న డిమాండ్ పుంజుకొంది. చూసేందుకు ఆశ్చర్యపడేలా ఉన్నాయి కుక్క గొడుగులు.
వ్యర్థాలతో అపూర్వ సృష్టి
కళాకారుడు థామస్ దోంబో తీర్చిదిద్దె పెద్ద శిల్పాలు చాలా ప్రత్యేకం అవన్నీ వ్యర్థాలతో రూపొందించిన బ్రహ్మాండమైన బొమ్మలు. రీసైకిల్ ఆర్ట్ యాక్టివిటీస్ చెత్త, చక్క, ఇనుము సామాన్లు వంటింటి వ్యర్థాలతో నిర్మించిన రీసైకిల్ శిల్పాలు కోపెన్‌హాగన్ లో కనిపిస్తాయి 2006 నుంచి థామస్ వివిధ ఆకారాలు రంగులతో 3500 కంటే ఎక్కువ బర్డ్ హౌస్ లు నిర్మించారు అరణ్యాల నుంచి సేకరించిన కుళ్లిపోయిన చెట్లు రీసైకిల్ తో నిర్మించిన పురాణాల జీవులు చిత్రకారుని ప్రతిభకు నిదర్శనం.
డాన్స్ బెస్ట్ థెరపీ
మోనోపాజ్ తర్వాత మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రధానంగా, బరువుతో పాటు బీపి కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, ఈ సమస్యకు నివారణకు డాన్స్ చేయడం పరిష్కారం అంటున్నారు. అమెరికన్ మెనోపాజ్ సొసైటీ కి చెందిన నిపుణులు ఆ వయసులో జీవక్రియ లోపాలవల్ల ఎక్కడికక్కడ శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. నడకతో పాటు డాన్స్ ప్రాక్టీస్ చేస్తే అది థెరపీ లా పనిచేస్తున్నట్లు అధ్యయనకారులు గుర్తించారు. ఈ డాన్స్ థెరపీ లో ఆత్మ విశ్వాసం […]
వర్ణ విన్యాసం అపూర్వం
చక్కగా పువ్వులు పూయటం సరే అవి కాస్తా సాయంత్రానికి రంగులు మారిపోవటం, పైగా ఒకే కొమ్మకి రెండు మూడు రకాల్లో కి వర్ణ విన్యాసం చేయడం ఆశ్చర్యం కదా. పత్తి మందార హైడ్రాంజియాకమలియాన్ రోజ్, ల్యాంటానా మార్నింగ్ గ్లోరీలు ఇలా రంగులు మార్చే పువ్వులతో ఉంటాయి. ఇందులోని వర్ణద్రవ్యాలు సూర్యకాంతితో చర్య పొందడంతో పాటు వేళ్లు గ్రహించే పోషకాల్ని బట్టి కూడా రంగులు మార్చే చేయగలుగుతాయి అంటున్నారు పరిశోధకులు ఒకే చెట్టుకి లేత పసుపు, ఉదా, నీలం, […]
గజ రక్షణ కోసం పోరాటం
ఏనుగుల సంరక్షణ కోసం వాయిస్ ఆఫ్ ఏసియన్ ఎలిఫెంట్స్ సొసైటీ నడుపుతున్నారు సంగీత అయ్యర్ కేరళ పాలక్కాడ్ జిల్లాలోని అళత్తూరులో పుట్టి పెరిగిన సంగీత చిన్నతనంలో దేవస్థానంలో బరువైన సంకెళ్లు వేసి బంధించిన ఏనుగులను చూసి బాధపడింది. పెరిగి పెద్దయి జర్నలిస్ట్,విడియోగ్రాఫర్ అయి కెనడాలో స్థిరపడ్డారు సంగీత.కేరళలో ఉత్సవాల్లో సంకెళ్లు వేసి,చూపు మందగించిన ఏనుగులు నిలబడి ఉండటం 2013లో భారతదేశానికి వచ్చినప్పుడు చూశారు. మానవ హింస వల్ల ఏనుగులు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో ఏనుగులు ఎంత […]
అంతుపట్టని గ్రామం
మన దేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న మలానా గ్రామం పురాతన ప్రజాస్వామ్య గ్రామం. ఇక్కడి ప్రజల రూపం భాష అలవాట్లు అన్నీ ప్రత్యేకమే. ఈ గ్రామవాసులు మేము జమదగ్ని మహర్షి వారసులం అని చెబుతారు. గంజాయి పంట పండిస్తారు. ఇది వాళ్ళ తరతరాల పంట గనుక ప్రభుత్వం కూడా పట్టించుకోదు. బయట ప్రపంచానికి దూరంగా ఉంటుందీ గ్రామం. హిమాచల్ ప్రదేశ్ లోని కుటా లోయకు ఈశాన్యంగా ఉండే పార్వతి లోయ గుండా ప్రవహిస్తుంది మలానా […]
ఎత్తు పెరగటం ఈజీనే
బాగా పొడుగ్గా అందంగా కోరుకొంటారు ఎత్తు సాధారణంగా వంశ పారంపర్య లక్ష్యం. కానీ 15 ఏళ్ల వయసు నుంచి 20 ఏళ్లలోగా ఆహారం నిద్ర విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకొంటే పెరిగే ఎత్తు పూర్తిగా ఉంటుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. 19 ఎల్లా వయసు వచ్చే వరకు ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం బావుండేలా ఆహారంలో ప్రోటీన్లు కాల్షియం విటమిన్-డి సరైన మోతాదుల్లో తీసుకోవాలి ప్రొటీన్ల కోసం గుడ్డు,మాంసం,చేపలు,పాలు,పెరుగు, పప్పు ధాన్యాలు,బాదం, ఆక్రోట్,పిస్తా, వంటి గింజలు తప్పని సరిగా తీసుకోవాలి […]
అమృత మాధురి మీ తీయని తేనె
పువ్వులోని మకరందం, పుప్పొడి పరిమళం కలగలిసిన అమృతాన్ని మరిపించే దివ్య ఔషధం తేనె. ఒకప్పటి తేన ఒక్కటే రంగు ఒకటే రుచి కానీ ఇప్పుడు భిన్నమైన రంగుల తేనెలున్నాయి. పసుపు, ముదురు కాఫీ, నలుపు, బూడిద వర్ణపు తేనె ఉన్నాయి. యూకలిప్టస్, నిమ్మజాతి వృక్షాల చుట్టూ తిరిగి తేనెటీగ సేకరించే తేన ఘాటైన రుచి వాసనతో ఉంటుంది. శుద్ధి చేయని ముడి తేనెలో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఎంజైములు ఎక్కువే. ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉన్న ఆహార […]
