Sunday, 02 Aug, 2026

 మరింత ఉపయోగం

క్యారెట్ తింటే గుండెకు కూడా మంచిదంటున్నారు ఇల్లినాయిస్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. క్యారెట్ లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. డైట్ లో తీసుకున్న బీటా-కెరోటిన్ శరీరంలోకి చేరుకున్నాక విటమిన్ ఏ గా మారుతుంది ఈ కన్వర్షన్ రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని పరిశోధకులు గుర్తించారు. అంతే కాకుండా గుండె జబ్బులకు కారణమయ్యే అథిరోస్కెలెరోసిన్ డెవలప్ కాకుండా చూడటం లోనూ ఉపయోగపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ జబ్బుతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చూడటంలో క్యారెట్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. […]

అందమైన చర్మం

వెన్న తో చేసిన ఫేస్ ప్యాక్ ముఖానికి చక్కని మృదుత్వాన్ని ఇస్తుంది. టీ స్పూన్ వెన్నెలో టీ స్పూన్ రోజ్ వాటర్ వేసి పేస్ట్ లా కలుపుకోవాలి. ఈ మిశ్రమం తో ఫేస్ ప్యాక్ వేసుకుని అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే చర్మం మృదువుగా నిగారింపు తో ఉంటుంది. అలాగే టీ స్పూన్ వెన్నెలో అరటిపండు గుజ్జు కలిపి ముఖానికి మెడకు మర్దన చేసి అరగంట తర్వాత కడిగేయాలి. కీరా దోస పేస్ట్ లో ఇందులో […]

ఉపాధ్యాయినుల సంఖ్య ఎక్కువే

దేశ భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి లో మహిళలే ఎక్కువ అంటోంది ఒక అధ్యయనం. పాఠశాల విద్యా రంగంలో 15 లక్షల పాఠశాలలు 26.5 కోట్ల మంది విద్యార్థు లతో మన దేశం ప్రపంచంలోనే అతి పెద్ద వ్యవస్థ. 2019-20 విద్యా సంవత్సరంలో 13.01 కోట్ల మంది బాలురు,12.08 మంది బాలికలు ఉన్నత పాఠశాలల కు వెళ్లారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు విద్యా బోధన చెప్పే వారిలో లక్ష మంది ఉపాధ్యాయినులు ఉంటే 27 వేల మంది […]

సీజనల్ ఫుడ్ చాలా అవసరం

వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే సీజనల్ ఫుడ్ తీసుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఈ కాలంలో దొరికే మొక్కజొన్న లో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కార్క్ లో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణశక్తిని ఇస్తుంది. విటమిన్లు, మినరల్స్ పాటు  ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేందుకు అరటి పండు తినాలి. కండరాలు శక్తి కోసం కోడిగుడ్లు తీసుకోవాలి. బొప్పాయి దానిమ్మ పియర్స్ లిచి వంటి సీజనల్ ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా […]

దక్షిణాఫ్రికా లో మహాత్ముడు

టింకా క్రిస్టఫర్ అనే శిల్పి యువకుడిగా కనిపించే గాంధీ విగ్రహాన్ని చెక్కింది. 21 ఏళ్ల పాటు ఆయన జీవించిన దక్షిణాఫ్రికా లోని జోహెనెస్ బర్గ్ లో ఈ యువ గాంధీ విగ్రహం కనిపిస్తుంది. కోటు వేసుకుని, దానిపైన లాయర్ గౌను వేసుకున్న గాంధీజీ  నిలువెత్తు శిలా విగ్రహం ఉన్న ప్రాంతాన్ని గాంధీ స్క్వేర్ గా పిలుస్తారు. శిలా విగ్రహం కింద ఫలకం మీద ఎంకె గాంధీ, అటార్నీ ఎట్ లా అన్న అక్షరాలు ఉంటాయి రోజుకి పది […]

మెరుపు లీనే చర్మం

వర్షం పడుతూ ఉంటే మేకప్ తో బయటికి పోవటం కష్టం ఎలాంటి మేకప్ లేకుండా మొహం తేటగా మెరిసేలా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. ఉదయం పూట ఫేషియల్ స్క్రబ్బింగ్ క్లెన్సింగ్ తో మొటిమల మచ్చలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం బాదంపప్పులు నీటిలో నాననిచ్చి మెత్తగా గుజ్జుగా చేయాలి. అందులో స్పూన్ పెరుగు ఎండబెట్టిన నిమ్మ నారింజ తొక్కల పొడి పుదీనా ఆకుల పొడి కలిపి ముఖానికి పట్టించాలి. పది నిమిషాల తరువాత చేతివేళ్ళను తడి చేసుకుని స్క్రబ్ […]

వర్షాల్లో అనారోగ్యం

వర్షాకాలం మొదలైతే దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్ లు ఎక్కువ అవుతాయి. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకుంటూ హెర్బల్ టీ, వేడి నీరు తాగుతూ జింక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ కి కాస్త దూరంగా ఉండమన్నారు డాక్టర్లు. దోమల మూలంగా మలేరియా, డెంగ్యూ జ్వరాలు వస్తాయి. గోరువెచ్చని నీళ్లు మాత్రమే తాగాలి. ముసురు పట్టిన రోజుల్లో ఆకుకూరలు, కూరగాయలు బాగా శుభ్రం చేసుకోవాలి. అప్పుడప్పుడే చేసిన భోజనం వేడిగా ఉండగానే తినేయాలి. వర్షంలో తడిస్తే వెంటనే […]

కిచెన్ గార్డెన్ చాలా అవసరం

కిచెన్ గార్డెన్ తప్పనిసరిగా పెంచండి, ప్లాస్టిక్ బాటిల్స్ గ్లాస్ కంటెయినర్లలో కొత్తిమీర, పాలకూర, ఉల్లి,పుదీనా వంటివి పెంచుకోవచ్చు అంటున్నారు ఉద్యానవన నిపుణులు. అవసరమైన విత్తనాలు నర్సరీల్లో కొనాలి. లెమన్ గ్రాస్, టమోటో, మిర్చి, అల్లం వంటివి పెంచుకోవచ్చు. సారవంతమైన మట్టితో కుండీలు నింపి రసాయన పదార్థాలు ఉపయోగించకుండా పెంచిన కూరగాయలు, ఆకు కూరలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సూర్యరశ్మి పడే ప్రాంతంలో మొక్కలని ఉంచితే చాలు. చాలా కొద్దిపాటి స్థలం లో కూడా ఇంటికి కావలసిన ఆకుకూరలు […]

ఇది మంచి ప్రొఫెషన్

లిల్లిపుట్ ల్యాండ్ పేరుతో చిన్న పాపాయిల ఫోటోలు తీసే స్టూడియో స్థాపించింది మానస అల్లాడి. ఫోటోగ్రఫీ పైన ఇష్టంతో ఫోటోగ్రఫీ పైన డిప్లమో కోర్స్ చేసింది. మానస ముప్పై నేపథ్యాలతో త్రీ డైమన్షన్‌ సెటప్‌ లతో ఇండియా లోనే అతి పెద్ద బేబీ ఫోటో స్టూడియో లిల్లిపుట్ ల్యాండ్. ఈ ప్రొఫెషన్ లో మహిళల కు మంచి అవకాశాలు ఉంటాయి. పిల్లలను మాలిమి చేసుకోవడం వాళ్లతో ఫోటో షూట్ చేయటం కాస్త కష్టమే అయినా మహిళలు తొందరగా […]

వేడి చేస్తేనే బెటర్

ప్యాకెట్లలో లభించే పాశ్చరైజ్డ్ పాలు వేడి చేయకుండా తాగవచ్చా అని హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు సందేహ పడుతూ ఉంటారు. కొన్ని రకాల హానికారక సూక్ష్మజీవులు నశించే పాలను అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కాసేపు వేడి చేసి చల్లార్చి ప్యాక్ చెయ్యటాన్ని పాశ్చరైజ్డ్ పాలు అంటారు. ఇలాంటి పాలను సరైన ఉష్ణోగ్రత లో ఫ్రిజ్ లో ఉంచితే రెండు రోజుల పాటు సురక్షితంగానే ఉంటాయి. అయితే ప్యాకింగ్ తర్వాత ఇంటికి చేరేందుకు కొన్ని గంటల వ్యవధి ఉంటుంది […]

పుష్కలంగా కాల్షియం

రోజు గ్లాసు పాలతో శరీరానికి అవసరమైన క్యాల్షియం దొరుకుతుంది. అయితే కొన్ని ఇతర పదార్థాల ద్వారా కూడా కాల్షియం ను పొందవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. 20 గ్రాముల గసగసాల పాలు కూడా గ్లాసు పాలతో సమానం. గసగసాలతో చేసిన డ్రింక్, హల్వా, డెజర్ట్ ఏదైనా తీసుకోవచ్చు. రెండు స్పూన్లు నువ్వులు కూడా గ్లాసు పాలు తో సమానం. 10 గ్రాముల కిడ్నీ బీన్స్ 100 గ్రాములు బాదం పలుకులు 100 గ్రాములు లోపు ఎనిమిది అంజీర్లు బ్రోకోలి, […]

చక్కని మెరుపు

ఫేషియల్ కోసం కొన్ని రకాల పండ్లు,కొన్ని దినుసులుంటే చాలు. ఫేషియల్ చేసుకొనేందుకు ముందుగా క్లెన్సింగ్ చేయాలి. పాలలో ముంచిన దూది ఉండల తో ముఖాన్ని శుభ్రంగా తుడవాలి. ఆపై నీళ్లతో కడగాలి. అలాగే మృతకణాలు పోగొట్టుకొనేందుకు ఓట్స్ పొడి పాలను కలిపి ముఖానికి పట్టించాలి. మునివేళ్లతో మర్దన చేసి తరువాత ఆవిరి పడితే మృతకణాలు పోతాయి అప్పుడు తేనె అరటి పండు,బొప్పాయి వంటి రకరకాల పండ్లతో ముఖానికి మసాజ్ చేయచ్చు. చివరిగా కీర దోస తో ఫేస్ […]

పాట ఆమె చిరునామా

కౌసర్ మునీర్ చాలా ప్రత్యేకం.. ఎందుకంటే ఆమె ఒక లిరిసిస్ట్ (Lyricist) బాలీవుడ్ లో ఎంతోమంది పాటల రచయితలున్నారు. వారి సరసన చోటుచేసుకుంది కౌసర్. ఆమె నాయనమ్మ సల్మా సిద్ధికీ ఉర్దూ రచయిత్రి . తండ్రి ఫిల్మ్ స్టూడియో లో పాఠాలు చెప్పే ప్రొఫెసర్ యష్ రాజ్ ఫిల్మ్స్ ఇష్క్ జాదే లో రాసిన పాట తో ఆమెకు అవకాశాలు వచ్చాయి. డియర్ జిందగీ బజరంగీ భాయిజాన్,  సీక్రెట్ సూపర్ స్టార్ గుంజనా సక్సేనా ది కార్గిల్ […]

ధాన్య మార్గం ఉత్తమం

4000 క్రితమే ధాన్యం భారతీయుల విధానంగా ఉంది. ఇది ఇప్పుడు విశ్వవ్యాప్తం. ఇవ్వాల్టి  ఆధునిక ప్రపంచంలో ఎదురవుతున్న మానసిక ఒత్తిడి తద్వారా ఎదురయ్యే గుండె జబ్బులు వంటి అనర్థాలను తగ్గించుకో గల అత్యంత శక్తివంతమైన మార్గం ధ్యానం, యోగ నే అంటున్నారు పరిశోధకులు. ఒత్తిడి వల్లనే రక్తనాళాల్లో బ్లాక్స్ కు కారణం అయ్యే ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు ఎమొరీ విశ్వవిద్యాలయ పరిశోధకులు. తప్పకుండా ప్రతిరోజు కొద్ది నిమిషాలు ధ్యానం చేయమంటున్నారు.

మొత్తంగా మహిళలే

ఇండోర్ లో ఇప్పుడు రెండు పింక్ బస్ లు తిరుగుతున్నాయి. బస్ డ్రైవర్ నుంచి ప్రయాణికుల దాకా అందరూ మహిళలే బోపాల్ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం కారిడార్‌ లోని 11.56 కిలో మీటర్ల పరిధిలో ఈ బస్సులు తిరుగుతాయి. పాటనీ పూరా కు చెందిన 35 ఏళ్ల రితూ నర్వాల్ మొదటి డ్రైవర్ కాగా  25 ఏళ్ల అర్చన కాటారే  రెండో డ్రైవర్ ఇండోర్ లో ఇప్పటికే ఆటో, క్యాబ్ డ్రైవర్ లుగా మహిళలే రాణిస్తున్నారు. 2019 […]

మ్యాజిక్ టాబ్లెట్ నాప్కిన్

ప్రయాణాల కోసం వేడుకలు పెళ్లిళ్ల కోసం సులువుగా వెంట తీసుకువెళ్లేందుకు మ్యాజిక్ టాబ్లెట్ నాప్కిన్ లు వచ్చాయి. మామూలుగా చిన్న మాత్ర లాగా ఉండే కాగితం బిళ్ళని కొళాయి కింద పెట్టగానే నీటిని పీల్చుకుంటుంది అదే అందమైన తెల్లని టవల్ లాగా మారిపోతుంది. దీన్ని తడిగా పొడిగా ఎలాగైనా మొహం చేతులు తుడుచు కొనేందుకు వాడుకోవచ్చు ఈ టాబ్లెట్ జేబులో వేసుకుని వెళ్ళిపోవచ్చు.

బరువు తగ్గే దారి ఇది

మనదేశంలో 12.6 శాతం మహిళలు 9.3 శాతం పురుషుల అధిక బరువుతో బాధపడుతున్నారాని పరిశోధనలు చెబుతున్నాయి. తక్కువ క్యాలరీలు ఎక్కువ న్యూట్రీషన్లు ఉండే ఆహారం తింటే ఆరోగ్యకరంగా బరువు తగ్గొచ్చు. విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు వుండే గుడ్డు తింటే ఫ్యాట్ కరుగుతుంది. ఫైనాపిల్ లో నీటి శాతం పీచు ఎక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు ఆపిల్, చీని, నారింజ, పుచ్చకాయ తో పాటు తృణధాన్యాలతో చేసిన ఆహారం కూరగాయలు ఇడ్లీ, రోటీ ,మజ్జిగ […]

ఈ పాదయాత్ర ఓ పలకరింపు

శ్రిష్టి బక్షి బృందం నిర్వహించిన పాదయాత్రపై అజితేష్ శర్మ రూపొందించిన ఉమెన్ ఆఫ్ మై బిలియన్ డాక్యుమెంటరీ ఫీచర్ మెల్ బోర్న్  ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైంది. 2016 లో జరిగిన హైవే 91 రేప్ కేస్ లో నిరాశ చెందిన మహిళల పై జరుగుతున్న నేరాలకు నిరసనగా 11 మందితో తమిళనాడు నుంచి పాదయాత్ర మొదలు పెట్టింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మొత్తం 240 రోజుల పాటు చేసిన ఈ పాదయాత్రలో ఎంతోమందిని కలుసుకొంది […]

ఇదే ట్రెండ్

సాంప్రదాయ చేనేతకు ఆధునిక హంగులతో చక్కని లుక్ తీసుకు రావచ్చు అంటారు ఎక్సపర్ట్స్ . ప్లెయిన్ లెనిన్ చీరకు 3/4  బెల్ స్లీవ్స్ వీ నెక్ బ్లౌజ్ జోడించచ్చు. కలర్ ఫుల్ పటోరా చీరెకు బెల్ట్ చాలా బాగుంటుంది. పోచంపల్లి డబుల్ ఇక్కత్ డిజైన్ లో పెప్లమ్ టాప్ ఎంచుకొని  జతగా ప్లెయిన్ టాప్ చక్కగా ఉంటుంది. నారాయణ్ పేట్ నేత చీరె లో లాంగ్ గౌన్ లు కుట్టించుకొని వాటికి బెల్-బాటమ్ స్లీవ్స్ యాడ్ చేయచ్చు. […]

సువాసన భరితమైన వెలుగు

రాజస్థాన్ అమ్మాయి తనుశ్రీ జైన్ 2018 లో నుషారా పేరుతో ఇకో ఫ్రెండ్లీ క్యాండీల్స్  స్టార్ట్ ప్ ను ప్రారంభించింది. తేనె తుట్టి నుంచి తీసిన మైనం సువాసన భరితమైన నూనెలు చక్కని రంగుల లో ఉండే ఈ క్యాండిల్స్ కు మంచి ఆదరణ లభించింది. క్యాండిల్స్ తయారీ లో రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహిళలు పాల్గొంటున్నారు. ఈ క్యాండిల్స్ ని ఇంటి దగ్గర తయారు చేసి ఇవ్వటం ద్వారా 250 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. అలాగే […]