Chinna Maata
నా కూతురే నా ఫ్రెండ్
ఇంట్లో మేం ఇద్దరం మాత్రమే కనుక స్నేహితుల్లాగే ఉంటాం. మా మధ్య దాపరికాలు ఉండవు. చిన్నప్పుడే నువ్వు మా ప్రేమకు ప్రతి రూపానివి అని ఆమెకు అర్థం అయ్యేలా చెప్పాను. తండ్రి తో ఆమెను దూరం పెట్టనే లేదు అంటుంది నీనా గుప్తా. మాసాబ్ గుప్తా ఆమె ఏకైక కుమార్తె ఇద్దరు కలిసి నటించిన మసాబా మసాబా వెబ్ సిరీస్ సక్సెస్ ఫుల్ గా ఓటీటీ లో ఎందరో అభిమానం పొందింది. అందులో నిజజీవిత పాత్రలనే పోషించారు […]
మై ట్రీ హౌస్
పిల్లలకు మంచి అలవాట్లు బాల్యం లోనే ఏర్పడతాయి పుస్తకాలు చదివే అలవాటు కూడా అలా చిన్నతనంలోనే అలవాటు కావాలి అందుకే పిల్లలను పుస్తకాలు చదివే దిశగా ప్రోత్సహించటం కోసం సింగపూర్ నేషనల్ లైబ్రరీ బోర్డు స్థానిక సెంట్రల్ లైబ్రరీ లో పిల్లల కోసం విడిగా ‘మై ట్రీ హౌస్’ పేరుతో గ్రంథాలయం ఏర్పాటు చేసింది. ప్రవేశద్వారం దగ్గర నుంచి అన్నీ బొమ్మలే కుత్రిమంగా ఏర్పాటు చేసిన చెట్లు చెట్లుంటాయి. ఈ చెట్ల పై పిల్లలు ఎక్కి ఆడుకోవచ్చు. […]
అద్భుత వర్ణాల గౌన్
న్యూయార్క్ లో జరిగిన ఫ్యాషన్ వేడుక మెట్ గాలా 2021 లో ఈ ఏడాది థీమ్ అమెరికన్ ఇండిపెండెన్స్ కు తగ్గట్టుగా తీర్చిదిద్దిన గౌను ధరించి వార్తల్లో నిలిచింది సుధా రెడ్డి. 15 సంవత్సరాలుగా డిజైనర్ రంగంలో ఉన్న భార్య భర్తలు ఫాల్గుని, షేన్ లు ఈ గౌన్ ని రూపొందించారు. ఫాల్గుని, షేన్ పీకాక్ డిజైన్లు ముఖ్యంగా నూతన వధూవరులు కలెక్షన్. అమెరికా జెండాలోని రంగుల తో డిజైన్ చేసిన సుధా రెడ్డి ధరించిన గౌను […]
సుందర వనాలు
పశ్చిమ కనుమల్లోని ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూలు కట్టేస్తున్నారు. 12 ఏళ్లకోసారి పుష్పించే నీలకురింజి పూలతో ఈ ప్రాంతం పర్పుల్ తివాసీ పరిచినట్లు అద్భుతంగా ఉంది. కర్ణాటకలోని కొడగు జిల్లాలో మందల్‌పట్టి, కోటె బెట్టా కొండల్ని ఈ నీలకురింజి పూలతో కళకళలాడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఋతువులను బట్టి కొన్ని పూలు పూస్తాయి కానీ ఈ కురింజి పూలు మాత్రం నాటి ఏరాగ సంపర్కానికి ఎక్కువ సమయం తీసుకోవటంతో 12 ఏళ్లకోసారి పూస్తాయి.
పొట్ట తగ్గించే అవకాడో
స్త్రీలకైనా పురుషులకైనా వయసు పెరిగే కొద్దీ పొట్ట పెరిగి పోతుంటుంది. అయితే స్త్రీలు రోజుకో అవకాడో తింటే పొట్టలోని కొవ్వు తగ్గుతోందని చెబుతున్నారు ఇలినాయిస్ యూనివర్సిటీ నిపుణులు. సాధారణంగా చర్మ కణాల అడుగు భాగంలో కానీ, పొట్ట లోపలి అవయవాల చుట్టూ కొవ్వు కణాలు పేరుకొంటాయి. ఈ కొవ్వు వల్లనే మధుమేహం పెరుగుతుంది కూడా. అవకాడో తిన్న వాళ్ళు కొవ్వు పట్టిన లోపల అవయవాల చుట్టూ పేరుకోకుండా చర్మం అడుగుభాగాన్నే పేరుకుంటుంది. దానితో అవి తిన్న వాళ్లలో […]
గిరిజనులకు బాన్ సూలి అండ
ఈ ఏడాది ఫోర్బ్స్ ప్రకటించిన ‘అండర్–30’ జాబితాలో సలోని నభేతి పేరు చోటు చేసుకుంది. రాజస్థాన్ లోని అల్వాల్ లో మార్వారి జైన్ కుటుంబంలో జన్మించిన సలోని తను ఇంటర్న్ షిప్ చేస్తున్నప్పుడు పర్యటించిన గ్రామాల్లో గిరిజన ల ఆర్ధిక పరిస్థితి చూసి వారి కోసం ‘బాన్ సూలి’ అనే స్టార్టప్ ప్రారంభించింది. బాన్ అంటే వెదురు సూలీ అంటే నగలు. డ్యాంగ్ జిల్లా గిరిజన మహిళలకు అక్కడ దొరికే వెదురుతో జ్యువెలర్స్ తయారు చేయటం నేర్పించింది. […]
గోడల్లేని హోటల్
స్విట్జర్లాండ్ లోని ఈ హోటల్ తాత్కాలికంగా సామాజిక దూరం పాటించాలనుకునే వారి కోసం. ఒక్క రాత్రికి 250 స్వీస్ ఫ్రాంక్ లు ఖరీదు చేసే ఈ హోటల్ ను ‘నల్ స్టెర్న్’ సంస్థ నడుపుతోంది. ఈ హోటల్లో గోడలు పైకప్పు, బాత్ రూమ్ ఏవీ ఉండవు. ఓపెన్ ఎయిర్ హోటల్ ప్రకృతి అందాలకు నిలయమైన ఆల్ప్స్ పర్వత సానువుల్లో సముద్రమట్టానికి 6463 అడుగుల అత్యంత ఎత్తులో ఉంది. రెండు పడకల బెడ్ నైట్ ల్యంప్ లు దుప్పట్లు […]
ఈ స్కూలు చాలా ప్రత్యేకం
1999 లో మొదలయింది వీణా వాదిని స్కూల్ మధ్యప్రదేశ్లోని సింగ్రౌలి జిల్లా బుధేలా లో ఉన్న ఈ స్కూల్ ల్లో రెండు చేతులతో రాయగలిగే ‘యాంబీ డెక్ట్రాస్’ అనే విధానాన్ని నేర్పుతారు పాఠశాల వ్యవస్థాపకుడు పీ.వీ శర్మ సంవత్సరాల తరబడి సాధన చేసి రెండు చేతులతో రాయటం, పైగా ఒక చేత్తో ఒక భాష మరో చేత్తో మరో భాష రాయటం సాధించారు. తను నడిపే వీణా వాదిని స్కూల్లో ఈ రాయడం సాధన చేయిస్తారు ఇలా […]
ఈ రాత్రికి అతీంద్రియశక్తులు
ఎందరో హాలీవుడ్ సెలబ్రెటీలు ఐర్లాండ్ లోని బ్లార్నీ బురుజు లో ఉన్న అదృష్ట రాయి కి ముద్దు పెట్టి సంతోష పడడం ఐర్లాండ్ వాసులు ఈ కోటలోని బురుజు నిర్మాణంలో శాశ్వతంగా ఒక గోడలు నిలిచిపోయిన బ్లార్నీ రాయిలో అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్ముతారు శతాబ్దాల క్రితం స్కాట్లాండ్ ఇంగ్లాండ్ రాజులు ఈ రాయిని తమ పట్టాభిషేక ఉత్సవాల్లో తప్పనిసరిగా ఉండేలా చూసుకునేవారట.ఆ చేతులు మారుతూ ఆ ప్రాంతాన్ని పరిపాలించే మెక్ కార్టి చేతికి వచ్చింది.. దాన్ని […]
ఎంతో దయగల టీచర్
కొచ్చి లో అవర్ లేడీస్ గర్ల్స్ స్కూల్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న 53 సంవత్సరాల నన్ సిస్టర్ లీజీ చక్కాల కల్ నిస్సందేహంగా సాటి లేని మనిషి. ఆమె ఇల్లు లేని పేద విద్యార్థులకు ఇల్లు కట్టించి ఇస్తుంది. 2014 నుంచి గత ఏడేళ్లలో ఆమె నూట 150 ఇళ్ళు తన స్టూడెంట్ ల కోసం నిర్మించింది ఆమె పనిచేస్తున్న స్కూల్లో ఎంతో మందికి ఇళ్లు లేవు. పాలితిన్ షీట్స్ ల కప్పుతో గుడిసెలలో ఉండే […]
రెండు అక్షరాలతో ముడతలు మాయం
రెండే రెండు అక్షరాలు పలకడం ద్వారా మొహం పైన మడతలు పోయి మొహం యవ్వనంతో కనిపిస్తుంది అంటారు ఎక్స్ పర్ట్స్. యాంటీ ఏజింగ్ టిప్ కంటే ఈ చిన్నది బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. చక్కగా స్థిరంగా కూర్చుని ఇంగ్లీష్ అక్షరాలు ‘K’ ‘D’ లను పలకడం ద్వారా ముడతలు పోతాయి. ఐదు నిమిషాలు కోసారి ఓ అన్న అక్షరాన్ని తర్వాత ఈ నీ పలకటం తద్వారా ముఖం పైన ముడతలు పోయి చర్మం గట్టి పడి పోతుంది […]
నిరుపమాన సేవకు పురస్కారం
హనుమకొండ జిల్లా మల్లారం ఎ.ఎన్.ఎం మహమ్మద్ శుక్రా తాండాల్లో చేసిన నిరుపమాన సేవలకు గాను ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు తీసుకుంది భీమదేవరపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మల్లారం సబ్ సెంటర్ లో హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహమ్మద్ శుక్రా ఎంతో కాలం తండాల్లోనే కాలినడకన తిరుగుతూ వారికి వైద్యం చేసేవారు. ఏ రోగం వచ్చినా మంత్రాలను నమ్ముకొని మూఢాచారాల తో బతికే తాండాల్లో పిలిస్తే పలికే డాక్టరమ్మగా దగ్గరయ్యారు 2011, 2017,2009 సంవత్సరాల్లో […]
మొక్కలకు ప్రాణం
ఇండోర్ ప్లాంట్స్ నిజానికి ఎంతో ఖరీదైన ఇంటీరియర్స్ కంటే ఇంటికి అందం ఇస్తాయి. ఒక్కసారి అవి వడలిపోయి ఆకు చివర్ల ఎండినట్లుగా కనిపించి మనసు పాడైపోతుంది అలాంటప్పుడు ఈ చిట్కా ఉపయోగపడుతుంది. పావు కప్పు పచ్చి పాలకు రెండింతలు నీళ్లు కలిపి మొక్క మొదట్లో పోయాలి. వారం పాటు ఇలా చేస్తే మళ్లీ మొక్క జీవం పుంజుకుంటుంది. ఆకులపై మచ్చలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తే బై కార్బోనేట్ ను ఓ స్పూన్ మొక్క మొదట్లో వేస్తే ఫలితం […]
చాలా ఉపయోగం
ఏవా ఫెర్టిలిటీ ట్రాకర్ రాత్రి సమయంలో చేతికి పెట్టుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కెరీర్, ఒత్తిడి, కాలుష్యం తరచూ, మారిపోయే పనివేళలు స్త్రీల విషయంలో నెలసరి పైన ప్రభావం చూపెడతాయి. దీనితో సంతానోత్పత్తి విషయం లోనూ సమస్యలు వస్తాయి. ఇందుకు పరిష్కారంగా ఏవా ఫెర్టిలిటీ ట్రాకర్ వచ్చింది. ఈ ట్రాకర్ నెలసరి అండం విడుదల అయ్యే సమయం నుంచి ప్రెగ్నెన్సీ లో మార్పుల వరకు తెలియజేస్తుంది. శరీర ఉష్ణోగ్రత రేట్లు గుండె […]
శక్తినిచ్చే విత్తనాలు
ఆరోగ్యానికి అద్భుతమైనవి గా చెబుతారు అలసందల గురించి పచ్చి విత్తనాల నుంచి ఉడికించినవీ మొలకెత్తినవీ తినచ్చు. ఏ రూపంలో తీసుకున్నా శరీరానికి శక్తి ఇస్తాయి. అలసందల్లో కాపర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఉడకబెట్టిన కప్పు అలసందల్లో 160 క్యాలరీలు ఉంటాయి 33.5 గ్రాముల కార్బోహైడ్రేట్లు 5.2 గ్రాముల ప్రొటీన్లు 8.3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. వీటిలో క్యాల్షియం, మాంగనీస్ వంటివి లభిస్తాయి. కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువగా ఉండే వీటిని రెగ్యులర్ గా […]
లీజా దినూప్
Varanadanam నృత్యానికి చిత్రకళని కలిపే నృత్యం ఇది. కేరళలోని కాసర్‌గోడ్ దగ్గర లోని పయ్యూర్ కు చెందిన 30 ఏళ్ల లీజా దినూప్ భరత నాట్యం చేస్తూనే వేదికపైన కాన్వాస్ పైన దేవతల బొమ్మలు గీయగలదు ఈ ఆర్ట్ నే వారనాదానమ్ అంటారు నృత్యం చేస్తూ మధ్యలో కాన్వాస్ దగ్గర ఉన్న కుంచె తో నృత్యం లో ఉన్న ఆధ్యాత్మిక భక్తి భావాలకు తగిన బొమ్మ వేయగలదు. ముఖ్యంగా రామాయణం లోని నవరస చిత్రాలను గణేశ్ భక్తిని […]
107 ఏళ్ళ వయసులో కొత్త ఆల్బమ్
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వాయిద్యకారులు పేరుపొందిన కోలెట్టే మేజ్ 107 ఏళ్ళ వయసులో తాజాగా 70 ఏళ్ళ కొడుకు తో కలిసి కొత్త ఆల్బం విడుదల చేసింది. గత 15 సంవత్సరాలుగా రోజుకు ఎనిమిది గంటలు పియానో వాయించి రికార్డ్ చేసి సౌండ్ ఇంజనీర్ సాయంతో ఆల్బమ్ గా మారుస్తోంది. సంగీతం అనేది చాలా ప్రభావ వంతమైన భావోద్వేగాలతో కూడుకొన్న మధ్యమం. ప్రకృతి భావోద్వేగాలు ప్రేమ కలలు ఆశలు వంటి వాటన్నింటికీ సంగీతమే ఆత్మీయ ఆహారం లాగా […]
రన్ విత్ సా
విలక్షణమైన వర్క్ వుట్స్ కి అనుగుణంగా రన్ విత్ సా ఆల్బమ్ విడుదల చేశారు జయంతి కుమరేష్. సంగీతం లో స్వరాల ఆరోహణ అవరోహణలు ఉన్నట్లే వ్యాయామం లో వివిధ దశలున్నాయి. వార్మప్, వేగాన్ని అందుకోవటం చివరకు నెమ్మదించటం వంటి వ్యాయామాల దశలకు తగ్గట్లు ఈ ఆల్బమ్ లో ట్రాక్ లు ఉంటాయి. మొదటి ట్రాక్ లో 160 బీట్స్ తో గెట్ ఇన్ ట్యూన్ చేసిన కూల్ విత్ కామాస్ ఆఖరి ఐటమ్ శరీరాన్ని చల్లబరిచేందుకు […]
జుట్టు పెరుగుతుంది
జుట్టు మరీ ఎక్కువగా ఊడిపోతూ మాడు కనబడుతూ ఉంటే కొన్ని హోమ్ రెమడీ ల ద్వారా పోయిన జుట్టు వచ్చేలా చేసుకోవచ్చు. ప్రతి రోజూ గోరు వెచ్చని కొబ్బరినూనెతో జుట్టు కుదుళ్ళు వరకు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఫాలికల్స్ యాక్టివ్ గా మారి జుట్టు పెరుగుతుంది. అలోవెరా జెల్ తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఫిష్ ఆయిల్ లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు పెరిగేందుకు తోడ్పడతాయి. ఉల్లిపాయ […]
గొప్ప మనసున్న మోడల్
మిస్ జార్ఖండ్ 2020 పోటీల్లో టైటిల్ గెలుచుకున్న సురభి పర్యావరణ హితం కోరి చేసిన ఫోటో షూట్ సామాజిక మాధ్యమాల్లో అభినందనలు అందుకుంటోంది. ఫ్యాషన్ ఫోటో గ్రాఫర్ ప్రాంజల్, జార్ఖండ్ రాజధాని రాంచీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెత్తను తరలించే డంపింగ్ యార్డ్ ఉండే ప్రాంతంలో వస్తున్న అనారోగ్యాలు, దుర్వాసన ఆ చుట్టుపక్కల వాళ్లు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడో ఫ్యాషన్ షూట్ తలపెట్టాడు ఇందుకోసం సురభి మోడల్ గా పని చేసింది. మురిగిపోయిన చెత్తకుప్పలు విపరీతమైన […]
