Monday, 12 Oct, 2026

కనుల పండుగగా దేవీ రూపం

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి జానపద జన జీవితాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని,ప్రాంతీయ అస్తిత్వాన్ని చాటుతూ అమ్మవారిని వేడుకగా కొలుచుకునే భాగ్యం తెలంగాణలో ఇంటింటికి చేరింది. ఎంగిలిపూల బతుకమ్మ అటుకుల బతుకమ్మ ,ముద్ద పప్పు బతుకమ్మ ,నాన బియ్యం బతుకమ్మ,అట్ల బతుకమ్మ,అలిగిన బతుకమ్మ,వేపకాయల బతుకమ్మ వెన్నముద్దల బతుకమ్మ సద్దుల బతుకమ్మ పేరుతో కొలిచే ఆదిపరాశక్తి.ఈ బతుకమ్మ. రంగురంగుల పూలన్నీ కలిసి అవతరించిన శక్తి స్వరూపిణి.జన జీవితంలో ఒక సామూహిక స్ఫూర్తి. కుటుంబ ప్రాంతీయ సంప్రదాయాలను బట్టి పూజలో చిన్న చిన్న మార్పులు ఉంటాయి బతుకమ్మ పాటలు చప్పట్లు కోలాటాల నడుమ మహిళలు సామూహికంగా వేడుకల్లో పాల్గొంటారు. పూల రూపమై వెలిగే బతుకమ్మ సౌభాగ్యాలను ఇచ్చే అపర దేవీ మూర్తి. ఈ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.

Leave a Reply