Monday, 12 Oct, 2026

నవీ పిళ్ళైకు నోబెల్

అంతర్జాతీయ చట్టాల అమలుకు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల పరిరక్షణకు,మహిళల హక్కుల కోసం పోరాడి, అణచివేతకు గురైన కోట్లాదిమందికి న్యాయం అందించినది  దక్షిణాఫ్రికా న్యాయకోవిదురాలు నవనీతమ్, నవీ పిళ్ళై ను 2026 నోబెల్ శాంతి పురస్కారం వరించింది. తమిళనాడు నుంచి దక్షిణాఫ్రికాకు వలస వెళ్లిన పేద కుటుంబంలో జన్మించిన నవీ 1967లో దక్షిణాఫ్రికాలోని నాతాల్ ప్రావిన్స్ లో లాయర్ గా ప్రాక్టీస్ ప్రారంభించిన తొలి నల్లజాతి మహిళగా చరిత్ర సృష్టించారు. నెల్సన్ మండేలా వంటి మహోన్నత నాయకులు జైల్లో నిర్బంధానికి  గురైనప్పుడు కోర్టు లో వారి తరఫున ధైర్యంగా నిలబడి వాదించిన ఏకైక న్యాయవాది నవీ. 1995లో జాతి వివక్ష అంతమయ్యాక దక్షిణాఫ్రికా హైకోర్టులో మొదటి నల్లజాతి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు నవీ. ప్రపంచ శాంతి కి అంతర్జాతీయ చట్టమే దిక్సూచి అని నోబెల్ కమిటీ ఈ పురస్కారం ద్వారా స్పష్టం చేసింది. అణిచివేతకు గురవుతున్న కోట్లాదిమందికి న్యాయవ్యవస్థపై నమ్మకం ఉన్న ప్రతి పౌరుడికి 86 ఏళ్ల నవీ జీవితం ఆదర్శం.

Leave a Reply