Monday, 05 Oct, 2026

సరికొత్త వ్యాపారాల్లో పోలో ప్లేయర్

భారతదేశపు తొలి మహిళా ప్రొఫెషనల్ పోలో ప్లేయర్ గా గుర్తింపు పొందారు 47 సంవత్సరాల రీనా షా.జీవితంలో ఒక రంగంలో పేరు తెచ్చుకున్న తర్వాత ఇంకొక కొత్త బాటలో అడుగు పెట్టాలంటే చాలామంది వెనకడుగు వేస్తారు. సరికొత్త సవాళ్లు కొత్త వ్యాపారం గురించి నేర్చుకోవడం కష్టమైన పని గా భావిస్తారు కానీ పట్టుదల ఉంటే ఇంకొక కొత్త ప్రయాణం కూడా సాధ్యమేనని నిరూపించింది రీనా. ఫుట్ వేర్ ఫ్యాషన్ యాక్సెసరీస్ డిజైనర్ గా ఆమె వ్యాపారం లోకి ప్రవేశించారు. ఆమెకు మొదటి నుంచి డిజైనింగ్ మీద ఆసక్తి ఉంది.న్యూయార్క్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది రీనా. రెనాల్ట్ బ్రాండ్ పేరుతో వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రత్యేకమైన ఫుట్ వేర్, ఫ్యాషన్  యాక్ససరీస్ రూపకల్పనలో గుర్తింపు సంపాదించింది. ప్రముఖులు సెలబ్రిటీల కోసం ప్రత్యేక డిజైన్లు రూపొందిస్తుంది ఈ పోలో ప్లేయర్ రీనా. సినీ నటులు రేఖ,శిల్పా శెట్టి, కరీనా కపూర్ వంటి ప్రముఖులు ఆమె కష్టమర్స్ గా ఉన్నారు.అలాగే డీజే స్కూల్ ఆఫ్ ఆమ్‌స్టర్‌డ్యామ్ కూడా ఆమె స్థాపించిన ఇంకొక వ్యాపారం. ఇది టాప్ టెన్ డీజే స్కూళ్లలో  ఒకటి. ఏ కొత్త ప్రయాణమైనా మనం పట్టుదలతో ప్రారంభిస్తే, దాన్ని విజయం వైపుగా నడిపించటం సాధ్యమేనని అంటారు ఈ పోలో ప్లేయర్.

Leave a Reply