Monday, 05 Oct, 2026

జీవితం మన గుప్పిట్లోనే

యవ్వనం ప్రారంభంలో, జీవితం మొదటి అడుగుల్లో ప్రారంభించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. పెళ్లి ,పిల్లల విషయంలో మన చాయిస్ మాత్రమే ఉండాలి. మన జీవితం మన ఇష్టపూర్తిగా ఉండాలి.ఇంట్లో అందరి అవసరాలతో పాటు మన నిద్ర ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి మనకంటూ సమయం కేటాయించుకోవాలి. వ్యక్తిగతంగాను వృత్తిపరంగానూ  విజయం సాధించేందుకు ఒక  లక్ష్యం నిర్ణయించుకోవాలి.మన చుట్టూ బలమైన నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవాలి.పిల్లలు పుట్టాక దొరికిన ఖాళీ సమయం అంతా వాళ్లతో గడపాలి. మనం ప్రతిసారి అందరికీ నచ్చాలని నియమం లేదు.అవసరం లేని వాటికి మొహమాటం లేకుండా నో అని చెప్పాలి. కుటుంబ బాధ్యతల కోసం తప్పకుండా ఉద్యోగం చేయాలి.ఆర్థిక స్వేచ్ఛ ఎవరికైనా చాలా ముఖ్యం. ఇదంతా చేయకుండా సమయం దాటిపోయాక అయ్యో అది చేసి ఉంటే బాగుండేది అని బాధపడటం పరమ దండగ.మన లక్ష్యం సంతృప్తికరమైన జీవితం.

Leave a Reply