Saturday, 05 Sep, 2026

గిరిజన బాలికలకు విద్య ఉపాధి

బస్తర్ జిల్లా లోని 570 కి పైగా గిరిజన గ్రామాల్లో గిరిజన బాలికల విద్య, మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న డాక్టర్ బుద్రి తాటి ని భారత ప్రభుత్వం 2026 లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1966 లో దంతే వాడలోని హిరనార్ గ్రామం లో ఒక గిరిజన కుటుంబంలో జన్మించిన డాక్టర్ బుద్రి 15 ఏళ్ల వయసులోని సామాజిక సేవ వైపు అడుగులు వేశారు. 1984లో అఖిలభారత వన వాసి కళ్యాణ ఆశ్రమం లో చేరి తన జీవితాన్ని పూర్తిగా గిరిజన సమాజ శ్రేయస్సుకు అంకితం చేసింది. దూర ప్రాంతాల్లో పాఠశాలలు ఉండడం పేదరికం వల్ల ఆడపిల్లలను ఇంటి పనులకే పరిమితం చేసే సామాజిక జీవనంలోంచి పిల్లలను ఆశ్రమ వసతి గృహాల్లో చదువుకునే అవకాశాన్ని కల్పించింది డాక్టర్ బుద్రి. 1990లో బార్సూరులో 11 మంది గిరిజన బాలికలతో మొదటి ఆశ్రమ వసతిగృహం ప్రారంభించింది బుద్రి. తర్వాత కాలంలో హౌర నార్ లో ఉచిత వసతి గృహాన్ని నిర్మించారు. అక్కడ గిరిజన బాలికలు విద్య నేర్చుకుంటున్నారు. అలాగే గిరిజన మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కోరిక తో స్వయం సహాయక సంఘాలకు శ్రీకారం చుట్టిందామే .స్వయం ఉపాధి శిక్షణ ద్వారా చేతివృత్తులు నేర్పించింది.నాలుగు దశాబ్దాలకు పైగా ఎలాంటి ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా పని చేసినందుకు గానూ భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది.

Leave a Reply