మహిళల పరిస్థితి అధ్వాన్నం
మహిళా సాధికారత విషయంలో చెప్పుకుంటున్న విధంగా భారతదేశంలో గణనీయమైన ప్రగతి సాధించలేదని కొన్ని సర్వే ఫలితాలు నిరూపిస్తున్నాయి. 23 శాతం మంది 18 నుంచి 49 సంవత్సరాల మధ్య వయస్సున్న వివాహితలు భర్త నుంచి భౌతిక లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఒక సర్వే చెప్తుంది. ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు వైవాహిక హింసను ఎదుర్కొంటున్నారని నివేదిక చెప్తోంది. కేరళలో 87% మంది బాలికలు పదో తరగతి కంటే ఎక్కువ చదువుకున్న భర్త చేతిలో వేధింపులు తగ్గడం లేదు విద్యా వికాసాలు ఉన్నచోట కూడా గృహహింస తీవ్ర రూపంలోనే ఉంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి వారి జీవితాలను దెబ్బతీస్తున్న ప్రధాన సమస్య బాల్య వివాహాలు. ఆంధ్రప్రదేశ్ లో 25 శాతం జార్ఖండ్ లో 28% బీహార్ లో 34% పశ్చిమ బెంగాల్ లో 36 శాతం గా బాల్యవివాహాలు ఇప్పటికీ పెద్ద సమస్య గానే ఉన్నాయి. చిన్న వయసులోనే వివాహాలు కావడం వల్ల మహిళలు మానసిక ఆర్థిక సామాజిక సాధికారతను సాధించలేకపోతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెబుతోంది. మహిళా సాధికారతను విద్యా ఉద్యోగం బ్యాంకు ఖాతాలు మొబైల్ ఫోన్లు ఇంటర్నెట్ సదుపాయాల ఆధారంగానే కొలుస్తూ వస్తున్నారు కానీ ఈ ఎన్ ఎఫ్ హెచ్ సర్వే మహిళల స్థితిగతులు అధ్వాన్నంగానే ఉన్నాయని చెప్తోంది.
