ప్రజా సేవకు దక్కిన పరిహారం
13 సంవత్సరాల పాటు ఐఏఎస్ గా ప్రజల కోసం ఎంతో సేవ చేసిన దివ్యా మిట్టల్ ఈ మధ్యకాలంలో పదవికి రాజీనామా చేశారు. యుపిఎస్సి సాధించి 2013లో ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన దివ్య శిక్షణ లో అత్యుత్తమ పనితీరుకు గాను అశోక్ బాంబావాలే అవార్డు అందుకున్నారు. నీతి ఆయోగ్ అసిస్టెంట్ సెక్రటరీ గా పనిచేశారు. మిర్జాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ గా ఉన్న కాలంలో అక్కడ లహూరియ అనే కొండ ప్రాంతం ఉండేది.1200 మంది జనాభా ఉన్న ఆ గ్రామానికి ఎన్నో దశాబ్దాలుగా తాగునీటి సదుపాయం లేదు. దివ్య మిట్టల్ దేవరియా జిల్లా లో దశాబ్దాలుగా ఆక్రమణలో ఉన్న వందల కోట్ల రూపాయలకు పైగా విలువైన 900 కు పైగా ప్రభుత్వ స్థలాలను శాంతియుతంగా విడిపించి ప్రజల ఉపయోగానికి కేటాయించారు. పైప్ లైన్లు ద్వారా తాగునీరు తీసుకెళ్లే ఏర్పాటు చేశారు. అధికారుల సహకారం, సాంకేతిక పరిజ్ఞానంతో 2023 ఆగస్టులో కొండ ప్రాంతంలోని ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు చెరువు చేశారు.దివ్య ఊరంతా పండగ చేసుకుంది ఈ ప్రయాణంలో ప్రజల నుంచి ఎంతో ప్రేమ సంపాదించింది కానీ పాలకుల మెప్పు పొందలేకపోయింది.లండన్ లో ఎక్సోటిక్ డెరివేటివ్స్ ట్రేడర్ గా సెటిలై భారీ వేతనంతో జీవిస్తున్న రోజుల్లో కూడా ఆమె మనస్సు దేశం గురించి ఆలోచిస్తూ ఉండేది. ప్రజలకు ఎంతో సేవ చేయాలని కలలు కన్నది.ఆమె చేసిన ప్రజాసేవకు ఫలితం సుదీర్ఘమైన ఆటంకాలు బదిలీలు సవాళ్లు ఎదురయ్యాయి. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖలో సేవలు అందించిన అనంతరం 2022 లో ఉద్యోగం నుంచి ఆమె రాజీనామా చేసింది.
