ఈ వ్యాయామం చాలా ఉపయోగం
చైనాలో వృద్ధులు గుంపులుగా చేరి గట్టిగా చప్పట్లు కొట్టడం, శరీరం మొత్తాన్ని చేతులతో నెమ్మదిగా తట్టుకోవడం చేస్తుంటారు. ఈ చైనీస్ వ్యాయామాన్ని పై షవ్ గ్యాంగ్ అని పిలుస్తారు.ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇది ఒక ఫిట్ నెస్ ట్రెండ్.అరచేతుల్లో శరీర భాగాలకు సంబంధించిన అనేక ఆక్యుప్రెషర్ పాయింట్స్ రిఫ్లెక్స్ జోన్లు ఉంటాయి .వాటిని తట్టి లేపటం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది ఒత్తిడి తగ్గుతుంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది గుండె ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది.కండరాల నొప్పులు అలసట తగ్గుతాయి ఇందుకోసం అరచేతులు పూర్తిగా ఒకదానికొకటి తగిలేలా గట్టిగా చప్పట్లు కొట్టాలి.ఒక చేతి పిడికిలితో మరొక అరచేతిని తట్టడం వంటివి ఈ ఫిట్నెస్ కార్యక్రమంలో ఉంటాయి. మన దేశంలో మహిళలు కూడా ఇప్పుడు ఎక్సర్సైజ్ ఫాలో అవుతున్నారు.ఇదే కొత్త సరికొత్త వ్యాయామం.కొత్త ఆరోగ్య సూత్రం.వాకింగ్ లో భాగంగా ఈ వ్యాయామం కూడా చేస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది కండరాళ్ల నొప్పులు అలసట తగ్గుతాయి.
