47 ఏళ్ల సేవకు ఫలితం
పశ్చిమ బంగాలోని బెలాకోబా గ్రామీణ ప్రాంతానికి ఏఎన్ఎం గా వెళ్లారు గీత కర్మాకర్.అక్కడి నుంచి డాంగ్ వాజూర్ టీ తోటకు ఆమె ఉద్యోగం బదిలీ అయింది కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా లేని చిన్న గిరిజన గ్రామం.సుమారు 55000 మంది గిరిజనులు నివసిస్తున్న ఆ గ్రామాల్లో ఆధునిక వైద్యం మీద ఒక్కరికి అవగాహన లేకపోవడం గమనించింది గీత. అందుకే వారికి ఆధునిక వైద్యం మీద అవగాహన కల్పించేందుకు సైకిల్ మీద ఇంటింటికి వెళ్లి ఆసుపత్రి ఎంత సురక్షితమో,అత్యవసర సమయంలో డాక్టర్లు ఎంత సాయంగా ఉంటారో చెప్పేవారట గీత .నెమ్మదిగా గిరిజనుల్లో నమ్మకం పెరిగింది.ఆస్పత్రిలో డెలివరీలు పెరిగాయి మాతా, శిశు మరణాల రేటు తగ్గింది.ఇవన్నీ గీత చేసిన కృషి వల్లనే జరిగింది.ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె కాలికి గాయమై 40 శాతం వైకల్యం వచ్చింది. అయినా రిక్షా లో తిరుగుతూ ప్రతి గ్రామంలో వైద్యం అందించేది గీతా కర్మాకర్. అలా 40 ఏళ్ల పాటు సేవలందించిన ఈమె రాష్ట్రపతి చేతుల మీదుగా నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకున్నారు.సమాజ శ్రేయస్సు ముఖ్యమని తపించిన ఈమె జీవితం ప్రతి ఒక్కళ్ళకి స్ఫూర్తి.
