వన్యప్రాణుల రక్షణ మన బాధ్యత
భారతదేశంలో ఫస్ట్ ఫిమేల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నది రాధికా రామస్వామి. హై స్కూల్ రోజుల నుంచే ఆమె ఫోటోలు తీయడం మొదలు పెట్టింది. ఆడవాళ్లు ఒంటరిగా అడవిలోకి వెళ్లడం ఫోటోలు తీయడం చాలా కష్టం అనుకుంటున్న రోజుల్లో వన్యప్రాణుల ఫోటోలు తీయడం మొదలు పెట్టింది రాధిక. రణతంబోర్, బంధవ్ గడ్ వంటి అడవుల్లో పులులను చాలా దగ్గరగా ఫోటోలు తీసింది. నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్లలో ఆమె ఫోటోలు అచ్చయ్యాయి. ఫోటోగ్రఫీ కి సంబంధించి సాంకేతికత చాలా మారింది అడవిలో ఫిలిం కెమెరాలు ఉపయోగించే స్థాయి నుంచి మిర్రర్ లెస్ కెమెరాలు ఉపయోగించే స్థాయికి సాంకేతికత పెరిగింది.రాధిక ఇలా చెబుతోంది.నేను ఫోటోగ్రఫీ పైన మమకారం పెంచుకున్న తొలి రోజులకి ఇప్పటికీ తేడా ఏమిటంటే జీవజాతుల సంఖ్య తగ్గింది వన్యప్రాణులకు ముప్పు పెరిగింది అందమైన ఫోటోలు తీస్తే సరిపోదు ప్రకృతిని వన్యప్రాణులను కాపాడటానికి మన నడుం బిగించాలి అంటుంది రాధికా రామస్వామి.వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కి సంబంధించి ఆమె రెండు పుస్తకాలు ప్రచురించారు ఒకటి బర్డ్ ఫోటోగ్రఫీ. ఎన్నో పక్షుల ఫోటోలు ఇందులో పొందుపరిచారు .అలాగే ద బెస్ట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ మూవ్మెంట్స్. వివిధ అడవుల్లో ఆమె తీసిన అపురూపమైన వన్యప్రాణుల ఫోటోలు ఇందులో ఉన్నాయి.
