తొలితరం ఫోటోగ్రాఫర్
1920 నాటి రోజుల్లో స్టూడియో ఫోటోగ్రఫీ అనేది పురుషులకు మాత్రమే వృత్తి గా కొనసాగుతున్న రోజుల్లో కెమెరా చేతిలో పట్టుకుని స్త్రీలకు మార్గదర్శకురాలిగా నిలిచారు అన్నపూర్ణ దత్త .అవిభక్త బెంగాల్లో జన్మించిన దత్తా ఆ కాలంలోని తొలి తరం ఫోటోగ్రాఫర్లు లో ఒకరుగా నిలిచి కొత్త చరిత్ర సృష్టించారు ఎంతోమంది ప్రముఖుల ఫోటోలు తీశారు. రాజకీయ నాయకుల నుంచి గాయకుల వరకు ఆమె ఫోటోలలో కనిపిస్తారు. దత్త ఫోటోల్లో ఆమె సెల్ఫ్ పోర్ట్రైట్ బాగా పాపులర్ .ఈ ఫోటోలో ఆమె తన ప్లేట్ కెమెరా పక్కన కనిపిస్తారు. అదే మనం పైన చూసిన ఫోటో ఇదే. లెన్స్ కెమెరా పట్టుకుని అన్నపూర్ణ దత్త తన వృత్తిపై అమితమైన అభిరుచిని ఆత్మవిశ్వాసం కనబరుస్తూ సంప్రదాయ గృహ జీవన కట్టుబాట్లకు కట్టుబడి ఉంటూనే తనకు ఇష్టమైన వృత్తి లో విజయవంతం అయ్యారు.ఫోటోలను స్వయంగా డెవలప్ చేసి ప్రింట్లు వేసేవారు. బెంగాల్ లో ఆమెను ఫోటోగ్రాఫర్ మాషిమా అని పిలిచేవాళ్ళు.మాషిమా అంటే తల్లి అని అర్థం. 82 సంవత్సరాల వయసులో అన్నపూర్ణ దత్తా కన్నుమూశారు. తొలితరం మహిళా ఫోటోగ్రాఫర్లలో ఆమె ఒకరు. అన్నపూర్ణ దేవి చేసిన కృషి ఎన్నో తరాల మహిళలకు స్ఫూర్తి.
