కోట్ల కొద్ది అభిమానులు
నేనో బటర్ఫ్లై మారా రాకెట్ నై…అంటూ విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో సుబ్లాషిని గణేశన్ పాడిన పాట కోట్ల కొద్ది వ్యూస్ సంపాదించి లక్షల మందికి దగ్గర చేసింది. చెన్నై కి చెందిన సుబ్లాషిని సంగీతం ప్రత్యేకంగా నేర్చుకోలేదు కానీ క్లాసికల్ ,పాప్, జాజ్ వంటివి అలవోకగా పాడి. రేడియోలో కూడా పాడింది మొదట్లో ఇంగ్లీష్ కవర్స్ పాడి ఇన్స్టా లో పోస్ట్ చేస్తే ఎంతోమంది అభిమానులు మెచ్చుకున్నారు. హెచ్ఆర్ విభాగంలో పనిచేసే సుబ్లాషిని గణేశన్ ఉద్యోగం వదులుకొని పూర్తి సింగర్ గా మారారు. 2024 నుంచి సినిమాల్లో పాడుతున్నారు.ధనుష్ జీవి ప్రకాష్ వంటి వాళ్లతో కలిసి పాడారు పుష్ప 2 లో కిస్సిక్ పాటతో దేశవ్యాప్తంగా ఆమెకు కోట్ల కొద్ది వీక్షణలు, పాపులారిటీ వచ్చింది.తెలుగు ,తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఆమె పాడుతున్నారు. ఇప్పుడు హిందుస్తానీ నేర్చుకోవడం మొదలు పెట్టింది సుబ్లాషిని గణేశన్. ఎన్నో సొంత ఆల్బమ్స్ ని రిలీజ్ చేసింది.
