Monday, 17 Aug, 2026

జ్యోతిష్యం నా వ్యాపారం

జాన్విగర్ వేద జ్యోతిష్యం తారో రీడింగ్, వాస్తు నిపుణురాలు.సైకిక్ గైడెన్స్ ఇవ్వగలరు.30 ఏళ్లకు పైగా వేలాది మందికి మార్గ నిర్దేశం చేస్తూ ఆధ్యాత్మిక గురువు గా పేరుపొందారు భారత దేశంలో జన్మించి దుబాయ్ లో నివసిస్తున్న ఈమె దేశ విదేశాల్లోని వ్యాపారస్తులు,రాజకీయ నాయకులు మార్కెట్ వర్గాలకు ఆత్మీయ గురువు. జ్యోతిష్యం గురించి ఆమె మాటల్లో చెప్పాలంటే మనిషి పుట్టిన క్షణంలోనే ఆ తేదీ సమయం ఆధారంగా జాతకం రూపొందుతుంది.ఆ జాతకం గత జన్మ కర్మల ప్రభావాన్ని చూపిస్తుంది.ఈ గత జన్మలో చేసిన కర్మల కారణంగా ఈ జన్మలో ఎటువంటి పరిస్థితి ఎదురవుతాయో జ్యోతిష్యం సూచిస్తుంది అంటుంది జాన్విగర్.మా అమ్మ అమ్మమ్మల నుంచి నాకు ఈ అద్భుతమైన అంతర్దృష్టి కలిగింది దీనినే వృత్తి గా మార్చుకున్నాను 20 ఏళ్ల వయసులోనే ఇది అసాధారణమైన శక్తి అని నాకు అర్థమైంది ఇది ఒక ప్రొఫెషన్ .ఇది ఒక బిజినెస్ నా వరకు అంటుంది జాన్వీ గర్. దేశ విదేశాల్లో ఎంతోమంది ఆమె శిష్యులు ఉన్నారు.

Leave a Reply