ప్రాచీన కళ తో వ్యాపారం
అక్క చెల్లెలు అన్నే అవని ,అమిత ఇద్దరూ కలిసి ప్రాచీన చిత్రకళా స్ట్రింగ్ ఆర్ట్ తో చెక్క మేకులు దారాలు ఉపయోగించి రకరకాల కళారూపాలు తయారు చేస్తున్నారు.అవని ఎంబీఏ చేసి టెక్ మహీంద్రా లో పని చేస్తుంది.అమిత బీటెక్ పూర్తి చేసి డెలైట్ లో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరు కలిసి చేసే ఈ కళారూపాలు మంచి వ్యాపారమైంది.ట్విని టేల్స్ పేరుతో ఆన్లైన్ లో విక్రయాలు ప్రారంభించారు .ఈ కళ కోసం ఇత్తడి మేకులు బంగారు రంగుతో చేయించి పక్షులు,జంతువులు ప్రపంచ పటాలు వెంకటేశ్వర నామాలు, కుటుంబ చిత్రాలు ఇలా వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు తయారు చేస్తున్నారు. కార్పొరేట్ ఈవెంట్లు కి రిటర్న్ గిఫ్ట్ లుగా ఈ బొమ్మలు ఎంతో బాగుంటాయి. ఇవి చేతితో తయారు చేస్తారు కాబట్టి చాలా సమయం ఓపిక కావాలి.పుట్టినరోజు పండుగలు, బేబీ షవర్, రీ యూనియన్ వంటి వేడుకల్లో ఇవి చాలా ట్రెండ్ సృష్టించాయి. బాగా చదువుకున్న ఈ అక్క చెల్లెలు ఈ వ్యాపారంలో కూడా చక్కగా రాణిస్తున్నారు.
