హాంగ్ వాంగ్ కు ఫీల్డ్ మెడల్
గణిత శాస్త్రంలో నోబుల్ ప్రైజ్ గా చెప్పుకునే ఫీల్డ్ మెడల్ ని అందుకున్నారు హాంగ్ వాంగ్. చైనాలోని గ్వైలిన్ లో 1991లో పుట్టింది వాంగ్ .ఆమె తండ్రి లెక్కల టీచర్.వాంగ్ కి చిన్నప్పటినుంచి చదువు అన్నా, ముఖ్యంగా గణితం అంటే చాలా ఇష్టం.పదహారేళ్ల వయసుకే పెకింగ్ విశ్వవిద్యాలయం లో ప్రవేశం పొందగలిగింది. మసాచు సెట్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో పిహెచ్డి చేసింది. హార్మోనిక్ అనాలసిస్, జ్యామితీయ కొలతల సిద్ధాంతం పై పరిశోధనలు చేసింది.ప్రస్తుతం ఇన్స్టిట్యూట్ డెస్ హాటెస్ ఎట్యూడెస్ సైంటిఫిక్స్ లో ప్రొఫెసర్ గా పని చేస్తోంది హాంగ్ వాంగ్ .గత సంవత్సరం గణిత శాస్త్రజ్ఞుడు జాషువా జాల్ తో కలిసి 3డి కకేయా సిద్ధాంతాన్ని నిరూపించారు .గణిత శాస్త్రంలో 100 ఏళ్లకు పైగా పరిష్కారం కనిపెట్టలేని సమస్యలో ఇది ఒకటి. ఈ కృషికిగాను హాంగ్ వాంగ్ ఫీల్డ్ మెడల్ ని అందుకున్నారు. చైనాలో ఈ గౌరవాన్ని పొందిన మొదటి మహిళ హాంగ్ వాంగ్.
