మహిళల భద్రత లక్ష్యం
తెలంగాణ సిఐడి ఏసీబీ డీజీపీ ఉమెన్ సేఫ్టీ వింగ్ కు ఇన్చార్జి డిజిపిగా ఉన్న చారు సిన్హా హైదరాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ విమెన్ లో గ్రాడ్యుయేషన్ హెచ్ సి యు నుంచి పొలిటికల్ సైన్స్ లో పీజీ చేశారు యూపీఎస్సీ ద్వారా 1996లో ఐపీఎస్ బ్యాచ్ తెలంగాణ క్యాడర్ కి ఎంపిక అయ్యారు. ఆమె తొలి పోస్టింగ్ పులివెందుల, తర్వాత ప్రకాశం జిల్లాలో పనిచేశారు. డిప్యూటేషన్ మీద ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ మిషన్లో భాగంగా కొసావో లో ఏడాది పాటు పని చేశారు. అక్కడ ప్రొఫెషనల్ సర్వీసెస్ యూనిట్ ని నిర్వహించే కీలకమైన పరిపాలన బాధ్యతలు నిర్వహించారు. శాంతి పరిరక్షణ దళాల్లో అంతర్గత సమస్యలు లేకుండా,ఐక్యరాజ్యసమితి ప్రవర్తన నియమావళి కి కట్టుబడి ఉండేలా చూడటం ఆనాటి ఆమె విధుల్లో భాగం ప్రస్తుతం తెలంగాణలో సిఐడి ఏసీబీ డీజీపీ గా పనిచేస్తున్నారు. మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా పురుషుల నేతృత్వంలో స్టాండ్ విత్ హర్ కార్యక్రమం ప్రారంభించారు అలాగే ఆపరేషన్ ముస్కాన్ 12 ద్వారా 6307 మందికి పైగా చిన్నారులను కాపాడగలిగారు.
