బంధాలను పెంచే కథలు
ఇంటీరియర్ డిజైనర్ కథకురాలు ‘ఒరిదతోరిదత్ బై కళ్యాణి’ అన్న ప్రాజెక్ట్ పేరుతో పిల్లలకు కథలు చెప్పడం మొదలుపెట్టారు. కళ్యాణి స్వయంగా క్రియేటివ్ ఆర్టిస్ట్. ఆమె ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థ ది పోర్ట్రైట్ ద్వారా పిల్లల కోసం అందమైన బొమ్మలు చేసి ఇస్తుంది. అలాగే పిల్లల్లో సృజనాత్మకత పెరిగేందుకు మాతృభాషలోనే కథ చెప్పడం ఆమె ప్రత్యేకత. సైన్సు, లెక్కలను కూడా కలిపి ఆమె అందమైన కథల సృష్టిస్తారు. ఈ కథలు స్పాటిఫై పాడ్ కాస్ట్ లో ప్రసారమయ్యాయి .వీటికి మంచి స్పందన వచ్చింది. పిల్లలకు ఆసక్తి కలిగేందుకు కథల వర్క్ షాప్ లో కళ్యాణి పాత్రలకు తగ్గట్టు గొంతు మారుస్తూ కథలు చెప్పారు కథలు చెప్పడం వినడం అనే ప్రక్రియ పిల్లలు తల్లిదండ్రుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది అంటుంది కళ్యాణి.
