స్వర్ణం సాధించిన అరుంధతి
గ్లాస్గో లోని ఎన్ ఇ సి సెంటర్ లో మహిళల విభాగంలో 70 కేజీల విభాగంలో బాక్సింగ్ లో స్వర్ణం గెలుచుకుంది అరుంధతి చౌదరి. రాజస్థాన్ లో పుట్టి పెరిగిన అరుంధతికి చదువు అంటే ఎంతో ఇష్టం గణితంలో ఎక్కువ మార్కులు వచ్చేవి .ఐఐటీ లేదా ఐఏఎస్ పరీక్ష రాయాలనుకున్న అరుంధతి బాక్సింగ్ ఒక ఒలింపిక్ క్రీడా అని తెలిశాక తైక్వాండో కోచ్ అశోక్ గౌతమ్ దగ్గర శిక్షణ తీసుకుంది.యూత్ ఆసియా క్రీడల్లో 2019లో కాంస్యం, సెర్బియాలో జరిగిన నేషనల్ కప్ లో స్వర్ణం, యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం, వరల్డ్ బాక్సింగ్ లో స్వర్ణం గెలుచుకుంది. తాజాగా కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించింది.
