పులుల రక్షణలో హృషిత
హృషిత నేగిని టైగర్ విమెన్ గా పిలుస్తారు. గ్రౌండ్ బ్రేకింగ్ ఏఐ కెమెరా సిస్టమ్స్ ట్రైల్ గార్డ్ ఏఐ తో పులుల రక్షణ కోసం పనిచేస్తుంది హృషిత.ఆమె తండ్రి హిమ్మత్ నేగి కన్హా రిజర్వుకు డైరెక్టర్ గా పనిచేసేవారు. నాలుగేళ్ల వయసులోనే ఆమె పులిని ఎదురుగా చూసింది .న్యూఢిల్లీ యూనివర్సిటీ లో జీవశాస్త్రంలో డిగ్రీ, మాస్టర్స్ పూర్తి చేసింది. పులుల సంరక్షణ పై పని చేసే గ్లోబల్ టైగర్ ఫోరమ్ కి హాజరైన హర్షిత అమెరికన్ టైగర్స్ యునైటెడ్ యూనివర్సిటీ కన్సార్టియం గురించి తెలుసుకుంది.పులుల సంరక్షణ కోసం పనిచేసే వాళ్ళకి స్కాలర్షిప్ లు అందిస్తుంది ఈ సంస్థ. తన కో రీసెర్చర్ జెరిమీ డెర్టియన్ తో కలిసి పులుల జాడలను గుర్తించే కెమెరా ట్రాప్ సిస్టమ్ ను రూపొందించింది హర్షిత. ఇది పులుల రక్షణకు సంబంధించిన మొట్టమొదటి ఏఐ టైగర్ కెమెరా ట్రాప్. ఈ కెమెరా పులుల గురించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇస్తుంది. ఐదు ఫోటోలు తీసి సమీపంలోని సెల్ టవర్ కు అందజేస్తుంది.ఈ కెమెరాలు అత్యంత శక్తివంతమైనవి వేటగాళ్లకు కనిపించవు. పులులకు రక్షణ గా ఉంటాయి ఇంత సేవ చేసినందుకు హృషిత ను టైగర్ ఉమెన్ అంటారు.
