Monday, 06 Jul, 2026

కొత్త చరిత్రకు శ్రీకారం

అనాదిగా వస్తున్న పాదుకా దస్తూర్ ఆచారాన్ని ఒక సాంప్రదాయ చట్టాన్ని తిరగరాస్తూ    ఖేర్వాగఢ్ సింహాసనాన్ని 13 ఏళ్ల బాలిక తేజస్వి కుమారి జోధా అధిష్టించింది. ఇటీవల ఆ వంశ పెద్ద హరీష్ చంద్ర జోధా అకాల మరణం చెందారు ఆయనకు పుత్ర సంతానం లేదు కుమార్తె తేజస్వి జోధా మాత్రమే ఉంది.కోట వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ఇంతవరకు రాజస్థాన్ లో కొనసాగుతున్న ఒక సంప్రదాయ పద్ధతిని పక్కన పెట్టి తేజస్వి కుమారి కి వంశ వారసత్వ పగ్గాలు అందించారు. ఇంతవరకు పురుషులకే పరిమితమైన ‘పాగ్ కా దస్తూర్’ గౌరవాన్ని ఆమెకు అందించారు. సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల సాక్షిగా కొత్త వారసుడి తల పైన అంటే తలపాగా చుట్టడం సంప్రదాయం.అనాదిగా వస్తున్న ఆచారాన్ని పక్కనపెట్టి తేజస్విని తలపై పాగా చుట్టి సింహాసనంపై కూర్చోబెట్టారు. ఇకపై ఆస్తుల నిర్వహణ వంశ పారంపర్య ట్రస్ట్ పర్యవేక్షణ ఆమె ఆధీనంలో కొనసాగుతాయి.

Leave a Reply