మొఘల్ పర్షియన్ హస్త కళల డిజైన్లతో కాశ్మీర్ లో తయారయ్యే ఈ జుంకాలు ఫ్యాషన్ ప్రపంచంలో చాలా ప్రత్యేకం .అందంగా స్టడ్స్ వాటికి ఊగిసలాడే హ్యాంగింగ్స్, వీటిని జత చేసే సన్నని చైన్లు ఇప్పుడు ట్రెండింగ్. సంప్రదాయ డిజైన్లు దాటి ఇప్పుడు కుందన్ వర్క్, ముత్యాల వర్క్, ఎనామిల్ పెయింటింగ్ లు వేలాడే మువ్వలతో కలర్ ఫుల్ గా గ్రాండ్ గా కనిపించే ఆభరణాలు తయారు చేస్తున్నారు ఫాన్సీ డిజైనర్లు .ఈ స్టేట్ మెంట్ జువెలరీ లో ఎన్నో స్టెప్స్, లేయర్లు ఉండే లాగా ఈ జుంకీలు డిజైన్ చేస్తారు. పొడవుగా వేలాడే ఈ జుంకీలు అన్ని రకాల చీరలు, సల్వార్ సూట్లు క్యాజువల్ వేరు మీద స్టైల్ గా కనిపిస్తాయి. ఫంక్షన్ లో పార్టీల్లో వీటిని ధరిస్తే లైట్లు వెలుగులో జిగేల్ మని మెరుస్తాయి. అలాగే కొత్త థీమ్ డిజైన్లు కూడా వచ్చాయి .ఏనుగులు, హంసలు ,నెమళ్ళు , దేవత మూర్తులు, పురాణ ఘట్టాలు కూడా ఈ కాశ్మీర్ జుంకాల్లో చక్కగా ఆవిష్కరించారు.














