సఫీనా హుస్సేన్ బాలీవుడ్ ప్రముఖ నటుడు దివంగత యూసుఫ్ హుస్సేన్ కుమార్తె ముంబైలోని ఇష్టమైన వాతావరణంలో పెరిగి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్న సఫీనా పేదరికంలో మగ్గుతున్న బాలికల కోసం సేవా పదాన్ని ఎంచుకున్నారు. 2000 లో ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ స్థాపించారు. 15 లక్షల మంది బాలికలకు విద్య దానం చేశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి వెనుకబడిన గ్రామాల్లో పిల్లల కోసం ఆమె చేసిన కృషికి గాను ఆమె అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. 2026 లో టైమ్స్ విమెన్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచారు సఫీనా హుస్సేన్.














