రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ చందనా సిన్హా ‘అతి విశిష్ట రైల్వే సేవా పురస్కారం’ అందుకున్నారు లక్నో లోని చార్ బాగ్ రైల్వే స్టేషన్ లో ఆమె విధులు ప్రారంభించారు.అక్రమ రవాణా బాల కార్మిక వ్యవస్థను అంతం చేసే లక్ష్యంతో బలమైన బృందాన్ని తయారు చేసుకున్నారు. మూడేళ్లలో రైల్వే ప్లాట్ ఫామ్ లపైన 1500 మంది పిల్లల్ని అక్రమ రవాణా నుంచి కాపాడారు. రైల్వే ప్లాట్ ఫామ్ ల పైన, తప్పిపోయి, అపహరణకు గురైన, లేదా అక్రమ రవాణా బాధితులైన పిల్లలను రక్షించటం తన కర్తవ్యం గా నిర్ణయించుకున్నారు చందనా సిన్హా.













