Tuesday, 22 Sep, 2026
అల్లం టీ ఎంతో బాగుంటుంది. తలుచుకుంటే ఇప్పుడే తాగాలనిపిస్తుంది. ప్రతి వంటకానికి తనదైన ప్రత్యేక రుచిని అందించే ఆహార పదార్దమే గాక, ఒక అద్భుతమైన ఔషదం కూడా. ఎన్నో రుగ్మతులు నయం చేసేందుకు వైద్యులు అల్లాన్ని వాడుతున్నారు. అల్లం వేళ్ళలో బాగా పెద్ద స్థాయి లో యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి కాన్సర్ కరకమైన ప్రీరాడికల్స్ తో పోరాడతాయి. కొన్ని రకాల పోషకాల ఉత్పత్తి జరగకుండా గట్టిగా ఆపుతాయి. స్త్రీలు గర్భం ధరించిన సమయంలో వంతులు వికారం రెండింటి తోనూ బాధపడుతుంటారు. కడుపులో వాయుప్రకోపాన్ని ఆపడంలో అల్లం ఉపయోగ పడుతుంది. కనుక వేవిళ్ళు దీని వల్ల ఆగుతాయి. ప్రతి రోజు తాజా అల్లం రసం నాలుగైదు చుక్కలు తాగితే మంచిది. జీర్ణ రసాలని ఊరేట్టు చేస్తుంది. నెల సారి కడుపు నొప్పి తగ్గిస్తుంది. మైగ్రేన్, తలనొప్పికి మంచి ఉపసమనం. కీళ్ళ నొప్పుల నుండి ఉపసమనం . ఈ ఘాటైన మసాలా దినుసు ఎన్నో వ్యర్ధాలను తగ్గించే మంచి మందు. అల్లం రసం, తేనె, నిమ్మరసం మంచి కాంబినేషన్.

ఏ అల్లమైన ఔషధమే

అల్లాన్ని యూనివర్సల్ మెడిసిన్ అంటారు వైద్యులు. అల్లం స్వస్థలం మలేషియా ఇండోనేషియా ఫిలిప్పీన్స్ దీవుల్లో అల్లం మొక్కలు పువ్వులు చాలా అందంగా ఉంటాయి కనుక పెంచుకుంటూ ఉంటారు చాలా ప్రదేశాల్లో.అల్లం పెరిగే వాతావరణాన్ని బట్టి భిన్న వర్ణాలు సైజుల్లో పెరుగుతుంది.ఎరుపు రంగులో ఉండే జింజిబర్ రుబ్రమ్, నీలం, గులాబీ, తెలుపు రంగులో ఉండే క్యాంపెరియా పర్విఫ్లోరా ,పసుపు రంగులో ఉండే జింజిబర్ కాసామునార్,ఊదా నలుపు రంగుల్లో క్యాంపేరియా పర్వి ఫ్లోరా మొదలైనవి చాలానే ఉన్నాయి. మామిడి అల్లం గా పిలిచే కుర్ క్యూమా అమండా పసుపు కొమ్ములాగా ఉంటుంది అల్లం రుచి మామిడి వాసనతో ఉంటుంది దీన్ని నిల్వ పచ్చడి కి వాడతారు ఏ రంగులో ఉన్న ఈ అల్లం రకాలన్నీ అత్యుత్తమ ఔషధాలే.

Leave a Reply