Thursday, 24 Sep, 2026
అన్నదమ్ములూ అక్కాచెల్లెళ్లు ఎంత ఎక్కువమంది ఉంటె అంత లాభం అని అమెరికన్ సోషియాలజికల్ అసోసియేషన్ చేసిన ఒక సర్వే లో తేలింది. ముఖ్యంగా విడాకుల తీసుకుని సంఖ్య చాలా తక్కువగా ఉంటుందీ అంటున్నారు. అలాగని తోబుట్టువులు భార్యాభర్తల మధ్య వచ్చే తగువులు తీరుస్తారని కాదు. ఒక్కరుగా పెరిగిన వారికంటే ఎక్కువ మందితో పెరిగిన వారిలో ప్రేమానందాలతో పాటు పంతాలు పట్టింపులూ ఆ వెనకనే పట్టువిడుపులు సర్దుబాటు జీవితంలో ఒక భాగమై పోతాయి. ఈ రకమైన నైపుణ్యాలు అలవర్చుకునేవాళ్లు వైవాహిక జీవితంలో చాలా సులభంగా సర్దుకుపోగలుగుతారు. అందుకే కుటుంబం అన్నది ఎంత ఉంటే అంత లాభం అంటున్నారు సామజిక నిపుణులు. ఆలా కాకుండా ఒక్కరు లేదా ఇద్దరు చొప్పున పెరిగిన వాళ్లలో అన్నది ఈ రకమైన నైపుణ్యాలు తక్కువనీ వాళ్ళకి సర్దుకుపోవటం అన్నది జీర్ణం కాదనీ అందుకే విడాకుల సంఖ్యా ఎక్కవవుతున్నాయంటున్నారు విశ్లేషకులు.

అనుబంధాలు పదిలం 

ఈ లాక్ డౌన్ సమయంలో దంపతుల మధ్య అనుబంధం ఎంతో బలపడినట్లు ఒక అధ్యయనం చెపుతోంది. ఇళ్లల్లోనే ఉండిపోయిన వారిలో 47 శాతం పెళ్లి చేసుకొన్నవాళ్ళు లేదా బంధం లో ఉన్నవాళ్లలో 38 శాతం మంది తమ భాగస్వామి పైన ఇష్టం,ప్రేమ పెరిగాయని చెప్పారు.  90 శాతం మంది కొత్తగా పెళ్ళైనవాళ్లు సహజీవనం తో ఉన్నవాళ్లలో తాము ఎక్కువ సమయం గడపగలిగినందువల్లనే ఎక్కువ అర్ధం  చేసుకోగలిగామని,ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు పెంచుకొన్నామని భాగస్వామితో దాపరికం లేకుండా మాట్లాడ గలిగినందుకు తమ సంతోషం 40 శాతం పెరిగిందని చెప్పారు. ఈ లాక్ డౌన్ లో తమ అనుబంధాలు మరింత పటిష్టంగా  తయారయిందని చెప్పారు.

Leave a Reply