Tuesday, 06 Oct, 2026
అందమైన చీరల్లోకి కనిపిస్తూ ఉంటుంది విద్యా బాలన్. కేన్స్ రెడ్ కార్పెట్ పైన విద్య తన సకల వస్త్ర కళలను ప్రదర్శించింది. సవ్య సాచి రూపొందించిన అందమైన చీరలకు అందం విద్యా బాలన్ వస్త్ర ధారణ లో యాక్సిసరీస్ లో తనదైన ప్రత్యేకత నిలుపుకునే విద్యా బాలన్. ఇష్టమైన డ్రెస్ చక్కని చీరలే. ఆమెకు గౌన్లు కుర్తీలు షార్ట్ కట్స్ అనార్కలీలు అస్సలు నప్ప వనే మనకే తెలిసిపోతుంది. కానీ చీరల్లోకి ఎందుకామే బావుంటుందీ అంటే అసలు చీరల క్వాలిటీ అంచులు పమిట కొంగులు కుచ్చిళ్ళు కట్టే తీరు ఇవన్నీ కలిసి అసలు ప్రపంచంలోనే అత్యంత క్లవర్ గార్మెంట్ చీర ఒక్కటే కనుక. అందుకే దీన్ని ఎంచుకొంటానంటోంది విద్యా. చీరల అంచులు రివర్స్ ఆఫ్ లైట్ లాగా పనిచేస్తాయి. ఇవి నాజూకు తనాన్ని ఎత్తునూ అందాన్ని తెలివిగా నిర్దేశిస్తాయి. ఒక్కసారి వీటికి జోడీగా వుండే యాక్సెసరీస్ కూడా చీరకి న్యూలుక్ ఇచ్చి మరింత అందాన్నిస్తాయి. విద్యాకయితే చిన్న రంగులు మరీ పెద్దవికాని నెక్లెస్ లు చుంకీ బ్యాంగిల్స్ బ్రేస్ లెట్స్ వదిలేసిన జుట్టు లేదా పాతకాలంలో లాగా చక్కని జడ అన్నీ కలిపి ఆమెను సంప్రదాయ సుందరిని చేసేస్తాయి. చీర చేసే మ్యాజిక్ ఇదే.

వెయ్యి కిట్లు డొనేట్ చేశా 

లాక్ డౌన్ లో నేను వంటరిగా  లేను. నాకు నేను తోడుగా ఉన్నాను. ఎంతో మంది తో ఇంటరాక్ట్ యి ఉన్నాయి. నాకు నేను చేయగలిగిన సాయం నా తోటి వాళ్ళకు చేయాలను కొన్నాను అంటోంది విద్య బాలన్. జీవితం గతం లో ఎప్పుడు లేనంత రొటీన్ గా మారింది. ఒత్తిడి అలసట లేకుండా ఉరుకులు పరుగులు పెట్టకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్న. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అహర్నిశలు,వైద్యులు పారిశుధ్య సిబ్బంది పని చేస్తున్నారు. వైద్యులకు నేను వెయ్యి పి.పి ఈ కిట్లు డొనేట్ చేశాను. ఇంకో వెయ్యి కిట్లు ఇవ్వాలను కొంటున్నా. కొందరిని కలుపుకొని ఇంకా ఎంతో చేయాలని ఉంది అంటోంది విద్య బాలన్.

Leave a Reply