Wednesday, 12 Aug, 2026
సోయా ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు ఖాయం చేశాక ఇందులో ఎన్నో వెరైటీలు మార్కెట్ లో వెలిశాయి. ఈ సోయాలో వుండే ఓ పోషక పదార్ధం గుండెకు ఎంతో మేలు చేస్తుందని నిపుణుల తాజా పరిశోధనల్లో తేలింది. ఇందులోని ఐసో ఫ్లెవోనిన్లు అనే పోషకాలు గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీన్ని ఆహారంలో భాగంగా తీసుకొంటే ఇందులో ఈక్వల్ అనే పదార్ధం ఉత్పత్తి అవుతుంది. దీని కారణం గానే హృద్రోగ సమస్యలు రావు. ఈ పదార్ధం కారణంగానే రక్తనాళాల్లో కాల్షియo పేరుకోదని గుర్తించారు. జపాన్, చైనాల్లో వాడే సోయా ఉత్పత్తులలో ఈ ఐసో ఫ్లెవోనిన్ల శాతం మిగిలిన దేశాల్లో కంటే ఎక్కువనీ అందుకే వాళ్ళకు గుండె జబ్బులు తక్కువనీ పరిశోధనల్లో తేలింది. అంతేగాక ఈ పోషక పదార్ధం వల్ల మతిమరుపు, ఆస్టియోపోరోసిస్, రొమ్ము ప్రోస్టేట్ కాన్సర్ రాకుండా ఉంటాయట. కాబట్టి ప్రతిరోజు తినే ఆహారంలో సోయా, సోయా ఉత్పత్తులు, కొంచెం మోతాదులో అయినా భాగంగా చేసుకోండి అని చెప్తున్నారు డాక్టర్లు.

ప్రోటీన్లు నిండిన సొయా 

సోయాను మాంసానికి ప్రత్యామ్నాయం అంటారు. దీనిద్వారా నాణ్యమైన ప్రోటీన్లు అందుతాయి ఎమైనో ఆమ్లాలు లభిస్తాయి. శాఖాహారాలకు అవసరం అయేలా  ప్రోటిన్లు లభించేది సోయా ద్వారానే-పోషక పదార్ధాలు లోపం వున్నవారికి సోయ మేలు చేస్తోంది.సోయ ఐసొలేట్స్,ఎడమేరు,సోయనట్స్ సోయాబీన్స్ టోపు,సోయామిల్క్, సొయా యోగర్ట్  మార్కెట్ లో దొరుకుతున్నాయి. ఎడమేరు ఉడికించి ఉప్పు కలిపి తినవచ్చు. సోయను సుప్ లలో సలాడ్స్ లో వాడుకోవచ్చు. ఆవుపాల బదులు సోయపాలు తాగవచ్చు. పాలు నేరుగా తాగలేకపోతే అల్పాహార వంటకాల్లో ఉపయోగించవచ్చు. శాండ్ విచె,కాన్ రోల్స్ స్టార్ ఫ్రైస్ ల ద్వారా సోయా తీసుకోవచ్చు పాలిష్ పట్టిన బియ్యం,గోధుమల కు  ప్రత్యామ్నాయం గా సొయా తీసుకొంటే ఆరోగ్యం.

Leave a Reply