Tuesday, 13 Oct, 2026
కాఫీ ఇష్టం లేనిదెవరికి? ఫిల్టర్ కాఫీ తాగినా లేదా ఇన్స్టెంట్ రుచి అయినా అన్నీ బానేవున్నాయనిపిస్తోంది. వేడిగా కాఫీ వాసనొస్తే చాలనిపిస్తుంది. కానీ కాఫీ మేకింగ్ గొప్ప ఆర్ట్ అనీ దీన్ని ఒక పద్దతి లో కలిపి తేనె అసలైన రుచి అంటారు నిపుణులు. ముందు నాణ్యమైన గింజల్ని రోస్ట్ చేసిన డేట్ చూసి మరీ కొనాలి. గాలి చొరబడని డబ్బాలు నిల్వచేయాలి. ఫ్రీజర్ లో ఉంచకూడదు. వాడే ముందర గింజల్ని గ్రైండ్ చేయాలి. మాములు మంచి నీళ్లు మరగనిచ్చి పొడిని ఫిల్టర్ లో వేసి అందులో నీళ్లు పోసేయాలి. ఫ్రెష్ డికాషన్ దిగుతుంది. వేడి వేడి పాలలో చక్కగా దిగిన డికాషన్ కలిపి పంచదార తగినంత వేసి తాగితే అదే స్వర్గం అనుకోవచ్చంటారు నిపుణులు. సరైన కొలత అంటే ఒక న్యూస్ కాఫీ పొడి అయితే ఆరు జెన్సుల నీళ్లు. అలాగే ఎన్ని కప్పులు కావాలో లెక్కేసుకుని అన్ని స్పూన్లు అన్ని జెన్సుల నీళ్లు పోయాలి. కాఫీ అద్భుతంగా వుండాలంటే ఇదీ పద్దతి. ముందు మంచి గింజలు ఎక్కడ దొరుకుతాయో వెతకాలి.

నాలుగు కప్పులు ఓకే

కొత్త అధ్యాయనం ఒక మోతాదు వరకు కాఫీ తాగితే పెద్ద నష్టం లేదంటుంది.రోజుకు 400మిల్లీగ్రాముల కెఫ్హిన్ పుచ్చుకోవచ్చు. అంతే నాలుగు కప్పుల కాఫీ తాగవచ్చన్నమాట.గర్భిణులు ఐతే మూడు కప్పుల హాయిగా తాగవచ్చు. పిల్లలని మాత్రం కాఫీకి దూరంగా ఉండమంటున్నారు. కాఫీ ఆరోగ్యానికి మంచిదే మోతాదుకు మించితే మాత్రం చాలా నష్టం అంటున్నారు.

Leave a Reply