March 2024
సంగీతమే ఆమె అడ్రస్
అతి చిన్న వయసు లోనే సంగీతం, వినోదం విభాగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించింది అదితి సైగల్ స్టేజ్ నేమ్ తో ఆమె పాడే పాటలు వినే వాళ్ల సంఖ్య రెండు లక్షలకు పైగా ఉంటుంది. గాయనిగా గీత రచయిత్రిగా గుర్తింపు పొందిన గీత సి క్రియేచర్ ఆన్ ది సోఫా పేరుతో కొత్త ఆల్బమ్ విడుదల చేయబోతున్నారు ఎవ్రీ బాడీ డాన్సస్ టు టెక్నో మ్యూజిక్ వీడియో ద్వారా గుర్తింపు పొందిన అదితి ఫోర్బ్స్ 30 జాబితాలో […]
కోట్ల మందికి రక్ష
సంపద దృష్ట్యా తెలుగు మహిళల్లో ప్రథమ స్థానం మహిమా దాట్ల కు దక్కుతోంది. భారతదేశంలో ఫార్మా స్యూటికల్ రంగంలో నిలిచి ఉన్న అతి తక్కువ మంది మహిళల్లో ఒకరు. బయలాజికల్ ఇ కంపెనీ ఎం.డి. కోవిడ్ సమయంలో కార్బెవాక్స్ ను విజయవంతంగా తయారు చేసి 30 కోట్ల వ్యాక్సిన్ లను అందజేసింది ఈ కంపెనీ. దాదాపు 100 దేశాలకు పలు రకాల వ్యాక్సిన్ లను సరఫరా చేస్తున్న ఈ సంస్థను మహిమా దాట్ల నిర్వహిస్తున్నారు. ఆమె సంస్థ […]
ఆమెకు ఆమే సాటి
బిజినెస్ ఫిలాంత్రఫీ రంగాల్లో సేవలు అందించిన ఉమెన్ వయోనార్ గా 2023 లో గుర్తింపు పొందారు సుధా రెడ్డి. కృష్ణా జిల్లా ఉయ్యూరు లో పుట్టి పెరిగి మైక్రోబయాలజీ చదువుకొని ఫ్యాషన్ రంగం వైపు వెళ్ళింది సుధా. మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ గ్రూప్ డైరెక్టర్ భారత్ లోని విశేషమైన నగల డిజైన్లు గుర్తించి స్థానిక నగలను ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చే ప్రయత్నం లో పలు అంతర్జాతీయ ఫ్యాషన్ ఈవెంట్లలో పాల్గొన్నారు. వ్యాపారం,సేవ ఫ్యాషన్ […]
‘సారీ’ అలవాటైతే కష్టం
ప్రియా కుమార్ మోటివేషనల్ స్పీకర్ దేశంలో టాప్ 10 మహిళ వ్యక్తిత్వ వికాస్ నిపుణులలో ఒకరు ఈమెది చండీగఢ్. 47 ప్రపంచ దేశాలలో ప్రియ కుమార్ కార్పొరేట్ సంస్థలకు మోటివేషనల్ స్పీకర్ గా ఉన్నారు. ఆమె రాసిన 12 పుస్తకాలు అంతర్జాతీయ అవార్డు లు పొందాయి. తాజాగా పుల్లెల గోపీచంద్ బయోగ్రఫీ షట్టర్స్ ఫ్లిక్ పుస్తకం తీసుకువచ్చారు ప్రియా. తప్పులు పొరపాట్లు చేసి సారీ చెప్పటం అందరూ చేస్తారు అయితే జీవితం మొత్తం ఆ సారీ లు […]
భక్తి సంగీతం లక్ష్యం
మిథిలా నగరంలో పుట్టిన మైథిలి ఠాకూర్ భజన గాయకురాలు. క్లాసికల్ సంగీతాన్ని నేర్చుకొని హార్మోనియం వాయిస్తూ సోదరులతో కచేరీలు చేయటం ప్రారంభించింది మైథిలీ.ప్రస్తుతం ఢిల్లీలో స్థిరపడిన మైథిలి యూట్యూబ్ లో ప్రతి రోజు ఒక భజన కీర్తన అప్ లోడ్ చేస్తుంది. వేడుకల్లో ఆమె భక్తి గీతాలు పాడితే భక్తులు ఆధ్యాత్మిక లోకంలో ఓలలాడుతారు. భజనలు,కీర్తనలు పాడుతూ సమాజంలో భక్తి ప్రవృత్తులతో పాటు నైతికతను పెంచడం లక్ష్యం అంటుంది మైథిలీ.
బాల్కనీకే అందం
లేత ఆకుపచ్చ రంగు ఆకులతో హృదయాకారపు పూలతో ఆసియా బ్లీడింగ్ హార్ట్ మొక్కలు బాల్కనీలో పెంచుకోవచ్చు అధిక వేడికి తట్టుకుంటాయి.అలాగే నీడ లోను పెరుగుతాయి.కుండీల్లో ఈ మొక్కలు పెంచుకోవాలంటే అందులో నింపే మట్టిలో వర్మి కంపోస్ట్, పశువుల పేడ కలిపి నింపుకుంటే బలంగా ఎదుగుతాయి .ఒక్క కొమ్మకు డజన్ పైగా పువ్వులు పూస్తాయి. ఇవి ఎరుపు గులాబీ పసుపు తెలుపు వైలెట్ కాంబినేషన్ లో ఎక్కువగా కనిపిస్తాయి.ఈ మొక్కలకు కాల్షియం అవసరం ఎక్కువ నేలపైన నాటినా తగిన […]
అది ప్రాణాంతక వ్యాధులు
శరీరాన్ని కదిలించటం తక్కువై ప్రపంచ జనాభా అనారోగ్యాలకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.మొత్తం 168 దేశాల్లోని సమాచారం ప్రకారం 55 దేశాల్లో 3 వంతుల జనాభా లో కదలిక వ్యాయామం చాలా తక్కువగా ఉంది. కనీసం రోజులో 75 నుంచి 150 నిమిషాలు శారీరక చురుకుదనం అవసరం కాగా ఆ మేరకు వ్యాయామం చేసేవారు 22-25 శాతం మాత్రమే రాబోయే రోజుల్లో దేశ ఆరోగ్యం పైన దాని ప్రభావం తీవ్రంగా ఉందని కదలిక లేక వచ్చే […]
పోటీలేని వ్యాపారం
ఇంటికి అవసరమైన ఉత్పత్తులను అందిస్తోంది జ్యోతి ల్యాబ్స్. 50 ఏళ్ల క్రితం నీలిమందు ఉజాలా ను కనిపెట్టి దానికోసం ప్రారంభించిన ఫ్యాక్టరీ కి జ్యోతి ల్యాబ్స్ అని కూతురి పేరు పెట్టారు రామచంద్రన్.2020 ఏప్రిల్ లో ఆ సంస్థ ఎం. డి అయింది జ్యోతి. బట్టలు ఉతికే డిటర్జెంట్ లు డిష్ వాషింగ్ కు ఉపయోగపడే సబ్బులు లిక్విడ్స్ ను తయారు చేస్తుంది సంస్థ. జ్యోతి బాధ్యత తీసుకున్న సమయంలో ఆ కంపెనీ రెవెన్యూ 1700 కోట్లు […]
మ్యాప్ మై ఇండియా
గూగుల్ మ్యాప్ తెరిస్తే హాయిగా ఆ సూచనల ప్రకారం వెతుక్కోకుండా వెళ్ళిపోతాం .ఈ మ్యాపింగ్ చేసింది సి ఇ ఇన్ఫో సిస్టమ్స్ అది నేత్రి రస్మి వర్మ. 1970లో ఐటిఐ లో ఏకైక మహిళా విద్యార్థిని రస్మి. 12 సంవత్సరాలు అమెరికా లో పనిచేసి ఇండియా వచ్చి మ్యాప్ మై ఇండియా అనే పేరుతో భారత దేశపు డిజిటల్ మ్యాప్ రూపొందించింది.మ్యాప్ లో ఇంటి నుంచి ఇంటికి ట్రాఫిక్ అంశాలు స్పీడ్ లిమిట్స్ రోడ్డు పైన గతుకులు […]
వ్యవసాయానికి ఆసరా
మహబూబాబాద్ జిల్లాలోని తానంపల్లి లో పుట్టి పెరిగిన భీమ్ రెడ్డి మాధవి తెలుగు రాష్ట్రాల్లో తొలి మహిళ డ్రోన్ పైలెట్ గా నిలిచారు. వ్యవసాయంపై ప్రేమ తండ్రి చంద్రయ్య చేసే వ్యవసాయం లోని కష్టాలు తగ్గించాలనే ఉద్దేశంతో మాధవి హైదరాబాద్ లోని ఫ్లైటెక ఏవియేషన్ నుంచి శిక్షణ తీసుకొని డ్రోన్ పైలెట్ అయింది.అన్ని రకాల డ్రోన్ లా నిర్వహణ ఫ్లయింగ్ క్రిమి సంహారక మందుల పిచికారి మరమ్మత్తులు చేయగలరు మాధవి.
ఒత్తిడి తగ్గించే థెరపీ
ఢిల్లీ కి చెందిన గౌరీ మినోచా ఆర్ట్ సైకో థెరపీ తో, కాలేజీ పిల్లల్లో కనిపించే మానసిక ఒత్తిడి దూరం చేయగలరు. ఢిల్లీ లోని శ్రీరామ్ కాలేజీలో చదువుతున్న గౌరీ తల్లి వ్యాపారవేత్త ఆర్ట్ గ్యాలరీ నడుపుతారు.కాళ మనస్తత్వ శాస్త్రం రెండింటిని కలిపి ఆర్ట్ సైకో థెరపీ లో ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తుల పెయింటింగ్స్ వేస్తారు గౌరీ.ఇది ఒక రిలాక్సేషన్ టెక్నిక్స్ స్కూళ్ళు, కాలేజీల్లో ఉచిత వర్క్ షాప్స్ నిర్వహిస్తారు గౌరీ.
మూగ జీవుల సేవ
కుక్క పిల్లల సంరక్షణ కోసం మద్రాస్ యానిమల్ రెస్క్యూ సొసైటీ స్థాపించారు సారా అయ్యార్.ఇది తమిళనాడు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ తో కలిసి పని చేసింది.చెన్నై నగర శివారు ప్రాంతంలో మహాబలిపురం రూట్ లో ఏర్పాటు చేసిన కుక్కల సంరక్షణ కేంద్రం లో దాదాపు 400 కుక్కలున్నాయి. చెన్నై కు చెందిన సారా అయ్యార్ స్పెషల్ ఎడ్యుకేటర్ స్పెషల్ చిల్డ్రన్స్ ను తీర్చి దిద్దడం లో పాతికేళ్లు పనిచేశారు.
చక్కని ప్రయత్నం
ధూలియా కల్చర్ అఫ్ వోల్డ్ కామ్ రూప్,డాక్యుమెంటరీ తీశారు అపర్ణ భుజర్ బారువా.78 ఏళ్లు దాటిన అపర్ణ బాటని లెక్చరర్ రేడియోలో 100 పాటలకు పైగా స్వరాలు అందించిన అపర్ణ ఏ ఐ ఆర్ గువహటి ఫస్ట్ ఉమెన్ మ్యూజిక్ డైరెక్టర్ గా అరుదైన ఘనత సాధించారు. ఆమె షార్ట్ ఫిలిమ్స్ తీయటం నేర్చుకున్నారు. 26 నిమిషాల నిడివి ఉన్న డాక్యుమెంటరీ తో ఆమె దూలియా ప్రత్యేక సంస్కృతిని పరిచయం చేశారు.ధూలియా అనేది పురాతన కళారూపం గాయకుల […]
లిల్లీ పూలతో వ్యాపారం
కేరళ కు చెందిన విజి అభి వాటర్ లిల్లీ లను పెంచుతుంది.ఈ పూల వ్యాపారం తో నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తుంది. 100 రకాల వాటర్ లిల్లీలు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తోంది.ఫేస్బుక్, ఇన్ స్టా ద్వారా దేశ విదేశాలకు విక్రయిస్తుంది. ఆమెను అందరూ వాటర్ ఆఫ్ లిల్లీ అని పిలుస్తారు. నీళ్లలో పెరిగే లిల్లీ పువ్వుల మొక్కలు చాలా జాగ్రత్తగా పెంచాలి. ఈ పువ్వుల పెంపకంతో విజి అబి కి కేరళ లో ఎన్నో అవార్డులు వచ్చాయి.
ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ రాధిక
కార్గో లోని బరువైన కంటైనర్ లను మోసే ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ గా రాణిస్తోంది శ్రీ రామోజు రాధిక. తెలంగాణ లోని జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిర్ కార్గో తొలి మహిళ ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ రాధిక జిఎమ్మర్ వరలక్ష్మి ఫౌండేషన్ లో ఎక్స్ లేటర్ నడపటం లో ముందు శిక్షణ తీసుకుంది తర్వాత ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ ట్రైనింగ్ తీసుకుంది రాధిక. వరంగల్ లోని వెంకటాపూర్ ఊరు లో పదవ తరగతి వరకే చదువుకున్న రాధిక ఈ […]
సమ్మర్ ఫ్యాషన్
ఎండలు అదరగొడుతున్నాక సింపుల్ గా సౌకర్యంగా ఉండే దుస్తులు ఫాలో అవ్వాలి.వేసవి వేడికి విరుగుడు తెలుగు రంగు దుస్తులు తెలుపు టాప్ తో ఏ రంగైనా మ్యాచ్ అవుతుంది. వైట్ టాప్ కు ముదురు రంగు ప్యాంట్ లేదా పలాజో, మ్యాచింగ్ హిల్స్ వేసుకోవాలి. అలాగే పూల డిజైన్లు కూడా ఈ సీజన్ కు తగ్గవే. ఫ్లవర్ ప్రింట్ డ్రెస్ లతో సింపుల్ గా ఉండే ఇయర్ రింగ్స్ పాదాలకు హీల్స్ ధరించాలి జీన్స్ వేసుకుంటే పెద్ద […]
చురుకుదనం కోసం కాఫీ
కాఫీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాఫీలోని కెఫిన్ చర్మాన్ని హైడ్రేడ్ చేస్తుంది.ఫ్లెక్సిబిలిటీ తీసుకువస్తుంది. ఇది డయాబెటిస్ పానీయం విష పదార్థాల పోయి పొట్ట శుభ్రంగా ఉంటుంది. బ్లాక్ కాఫీ తో శరీరంలోని కొవ్వులు పోతాయి. విశ్రాంతి లేదనిపిస్తే, ఒక కప్పు కాఫీ తో చురుకుదనం వస్తుంది.ఈ కాఫీ గింజల్లో ఉండే ఫ్రీ రాడికల్స్ తో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.కాఫీ తాగితే రక్త ప్రసరణ సాఫీగా అవుతుంది మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
మొటిమలతో ఇబ్బందా ?
ఎండ, చెమటతో మొటిమలు కూడా ఎక్కువే.ఈ వేసవిలో మొటిమలు తగ్గేందుకు బొప్పాయి గుజ్జుతో మొహం మసాజ్ చేయాలి. ఇందులోనే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి. అలాగే పండిన దోస పండు గుజ్జుతో ప్యాక్ వేసుకోవాలి.తేనెతో ప్యాక్ వేసిన మొటిమలు తగ్గిపోతాయి. మూడు వంతులు యాపిల్ సిడర్ వెనిగర్ తో నాలుగు వంతులు నీళ్లు కలిపి ముఖం కడుక్కోవాలి.ఆరిపోయాక కడిగేయాలి. ఈ మిశ్రమం చర్మాన్ని టోన్ చేస్తుంది ఫలితంగా మొటిమలు తగ్గుతాయి.
జననేత మరియమ్
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురిగా జననేతగా పురుషాది కత్వ గల దేశ రాజకీయాల్లో మడమ తిప్పని నాయకురాలు మరియమ్ నవాజ్.ఆమె ఇటీవలే పంజాబ్ రాష్ట్ర సి.ఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నో పోరాటాల ఫలితం ఆమె సాధించిన ఈ విజయం తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన తనదైన ఒక ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్నారు మరియమ్. ఈ నెలలో జరిగిన ఎన్నికల్లో జాతీయ అసెంబ్లీకి, అలాగే పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీకి పోటీపడి […]
రెండు లక్షల మందికి శిక్షణ
ఆమెపై అత్యాచార యత్నం జరిగింది బయటపడ్డాక,రెడ్ బ్రిగేడ్ పేరుతో రెండు లక్షల మంది అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇచ్చారు ఉషా విశ్వకర్మ దాదాపు 1000 సెమినార్లు,వీధి నాటకాల ద్వారా లైంగిక దాడులను ఎదుర్కొనే పద్ధతులు. ఏదైనా దుర్ఘటన ఎదురైతే న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలో సూచనలు ఇస్తున్నారు ఉషా. మహిళలకు ఆత్మరక్షణ నైపుణ్యం తప్పనిసరిగా కావాలి అంటారు ఉషా విశ్వకర్మ.
