December 2020
చర్మం కాంతిమంతం
ప్రతి రోజు ఫేస్ సీరమ్ రాసుకొంటే మొహం పై గీతాలు ముడతలు కనపడకుండా పోతాయి. చర్మం కాంతివంతంగా ఉండాలంటే మాయిశ్చ రైజర్ కంటే తేలికగా ఉండే జెల్ లేదా లిక్విడ్ రూపంలో ఉండే ఫేస్ సీరమ్ రాసుకోవాలి. ఇది చర్మం లోపాలి కాణాల్లోకి వెళ్లి చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది. ఇందులోని రెటినాల్,కాపర్ పె ప్లైడ్ ముఖం పైవి మడతలు తొలగించి చర్మాన్ని యవ్వనవంతంగా మార్చేస్తుంది.
ఏకగ్రీవంగా సర్పంచ్
దివ్యాంగురాలు అయిన కవితా భోండ్వే మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని దహేగాన్ వాగ్లుడ్ గ్రామాలకు సర్పంచ్ గా పనిచేస్తున్నారు. ఆమె తండ్రి పుండాలిక్ సర్పంచ్ గా ఉండేవారు. ఆయన ప్రోత్సాహంతో కవిత 2011 లో కవిత గ్రామపంచాయతీ సభ్యురాలిగా ఉండేది. గ్రామ పాలన కు సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకుని సర్పంచిగా బాధ్యత తీసుకుని ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆమె రెండు గ్రామాలకు రోడ్లు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయించగలిగింది. ఆమెను రెండు గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా రెండోసారి […]
సంతోషాన్ని ఇచ్చే మాటలు
ప్రతి రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మాట్లాడుతూ ఉంటాం.లక్షలాది పాదలు నోటివెంట దొర్లుతుంటాయి.ఈ మాట్లాడే మాటల్లో ఏది ఎక్కువ సంతోషాన్ని ఇవ్వగలదు అంటే చెప్పలేం కదా.ఈ విషయంలో పరిశోధకులు 17 లక్షల పదాల పై పరిశోధనలు చేశారు. వాడే పదాల్లో అమ్మమ్మ,నాయనమ్మ వంటి వరసలు మనం మనకు నేను మనది వంటి వ్యక్తిగత పదాలు సంతోషాన్ని ఇస్తాయని గుర్తించారు. నిరంతరం వాడే ఐ ఫోన్ గూగుల్ వంటి వస్తు సంబంధిత పదాలు ఉచ్చారణలో […]
Class of 83 (హిందీ) ( థ్రిల్లర్ మూవీ)
పోలీస్ అధికారి విజయ్ సింగ్ ఒక అండర్ వరల్డ్ ముఠా ను పట్టుకునే క్రమంలో కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తాడు.అతని భార్య చనిపోతుంది గ్యాంగ్ స్టర్ లను అంతం చేసే అవకాశం కూడా పోయి నాసిక్ లోని పోలీసు శిక్షణా కేంద్రంలో కొత్త ఉద్యోగానికి వెళ్ళవలసి వస్తుంది.ముంబై పోలీస్ ఫోర్స్ లో చేరిన ఐదుగురు యువకులను ఎంచుకుని శిక్షణ ఇచ్చి, పోలీస్ వ్యవస్థ లో కి పంపుతాడు.ముంబై లోని నాలుగు ప్రాంతాల్లో ఉద్యోగాల్లో చేరిన యువకులు నగరాన్ని […]
అత్యంత గౌరవం ఇది
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బ్రిటిష్ కౌన్సిల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికయింది.ఈ విషయం గురించి చెబుతూ ఈ బాధ్యత నేను అత్యంత గౌరవంగా భావిస్తున్నాను.ఇందుకోసం వచ్చే సంవత్సరం అంతా లండన్ లోనే ఉండవలసి ఉంటుంది.ఈ ఫ్యాషన్ కౌన్సిల్ కు అంబాసిడర్ గా ఉండటం అంటే ఇది నేను సాధించిన విజయాలకు ఒక గిఫ్ట్ గా అనిపించింది అంటోంది. ఫ్యాషన్ ట్రెండ్స్ కు సెలబ్రెటీలు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటే బ్రాండ్స్ కు క్రేజ్ పెరుగుతుంది. […]
శిరోజాలకు మెరుపులు
చలిరోజుల్లో తలకు చుట్టుకునే స్కార్ఫ్ లు ఉలెన్ క్యాప్స్ జుట్టు పై తేమను పీల్చేసి పొడిబారేలా చేస్తాయి.ఈ సమస్యకు హాట్ ఆయిల్ థెరపీ నే అసలైన చికిత్స.అలాగే బియ్యం కడిగిన నీటిలో కొంచెం పాలు, తేనె కలుపుకుని జుట్టు మొత్తం పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి కడిగేస్తే మాడు లో, వెంట్రుకల్లో తేమ వస్తుంది.తులసి మెంతులు హెర్బల్ టీ లేదా పెప్పర్ మెంట్ నీళ్ళలో నాననిచ్చి ఆ నీటిని వడకట్టి చివరి రన్స్ గా ఉపయోగించుకోవాలి. రోజ్ […]
మా ఇద్దరి లక్ష్యం దేశ రక్షణే
చెన్నై లోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి నలభై తొమ్మిది వారాల శిక్షణ పూర్తి చేసుకున్నారు.29 ఏళ్ల కనికా కౌస్తుభ్ రాణే .ఆర్మీ శిక్షణ పూర్తి చేసుకున్నాక నా భర్త మరణంతో ఆయన కలలే నా కలలయ్యాయి అన్నారు లెఫ్టెనెంట్ ఆఫీసర్ కానికా మా ధేయ్యం దేశ భద్రత, దేశ రక్షణ అంటున్న ఆమె వీడియోను రక్షణశాఖ పీఆర్ ఓ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.రెండేళ్ల క్రితం కాశ్మీర లో ఉగ్రవాదులు ముఖాముఖి పోరులో మేజర్ ప్రాణాలు […]
శానిటైజ్ తప్పనిసరి
మేకప్ సామాగ్రిని ఈ కరోనా సమయంలో వీలు దొరికినప్పుడల్లా శానిటైజ్ చేసి ఉపయోగించండి అంటున్నారు ఎక్స్పర్ట్స్.మేకప్ బ్రష్ లను స్పాంజి లను షాంపూతో శుభ్రం చేసి ఆరిన తరువాత శానిటైజర్ చల్లి భద్రం చేయాలి.లిప్ స్టిక్ వేసుకోవటం పూర్తయిన ప్రతిసారీ పరిశుభ్రమైన వైప్స్ తో లిప్ స్టిక్ హోల్డర్ ను తుడవాలి.అలాగే లిప్ పెన్సిల్ ను కూడా వాడిని ప్రతిసారి శానిటైజర్ చేయాలి.అలాగే మస్కారా వాండ్ ను శానిటైజ్ చేసేప్పుడు మరింత శ్రద్ధ తీసుకోవాలి పౌడర్లు చాలావరకూ […]
అందరి ఇల్లు
హైదరాబాద్ లో ఒక ప్రత్యేకమైన ఇల్లు ఉంది దాని పేరే అందరి ఇల్లు ఆకలి వేస్తే ఇక్కడకు వచ్చి వండుకొని తినచ్చు మనసు బాగా లేకపోతే కుదుట పడే వరకు ఉండి వెళ్ళవచ్చు.వింజమూరి సూర్య ప్రకాష్ సామవేదం కామేశ్వరి గార్లు నిర్వహిస్తున్న ఈ ఇల్లు 2006 జూన్ 15 నుంచి నడుస్తోంది.ఇక్కడకు ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు వంట వండుకునేందుకు అవసరమైన వస్తువులు నీటి సౌకర్యాలు ఉంటాయి. ఈ ఇల్లు హైదరాబాద్ లో కొత్తపేట రైతు బజార్ వెనకే […]
ఇవి అత్యంత అందం
పగడాల నగలు ధరిస్తే రుణ విముక్తి ధన వృద్ధి అవుతాయని చెబుతారు ఎక్స్ప్రెస్ సముద్రపు అడుగున ఉన్న శిలలపై చేరిన పగడపు జీవాల లార్వా అతుక్కుని వాటి చుట్టూ ఏర్పరచుకునే రక్షణ కవచల నుంచి పగడాలు ఏర్పడతాయి. ప్రాచీన వైద్య పద్ధతుల్లో పగడాల విరివిగా వాడుతారు.పగడాలు కాల్చగా వచ్చే భస్మాన్ని ఇప్పటికి ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు.సాన బట్టిన పగడాలు ఎంతో మెరుపుతో ఉంటాయి. ఎరుపు నారింజ కాషాయ రంగుల్లో దొరికే ఈ పగడాలా జాతక రత్నలుగా […]
ఇవి క్యాబేజీ పువ్వులు
బాల్కనీల్లో పెద్ద సైజు గులాబీల్లా కనపడే క్యాబేజీలు పూయిచండి అంటున్నారు ఎక్సపర్ట్స్. క్యాబేజీ,కాలి ఫ్లవర్ కేల్,బ్రోకలీ ఇవన్నీ కూడా బ్రస్సికా ఒలెరాసియా జాతికి చెందినవే పూల రంగులను బట్టి కలర్ అఫ్ పిజియన్, పీకాక్,ఒకాసా టోక్వా వెరైటీలు ఉంటాయి. అన్ని రకలోనూ చుట్టు ఉన్న ఆకులు ఆకుపచ్చ రంగు లోను మధ్యలో పువ్వులా రకరకాల రంగుల్లో విచుకోనట్లు ఉంటాయి. కుండీల్లో చామంతులతో పాటు వీటినీ పెంచవచ్చు. ఈ పువ్వుల క్యాబేజీ ని సలాడ్స్ సూపుల్లో వాడుకోవచ్చు. ఎన్నో […]
వీటిని పరిచయం చేయండి
ఎలాగో ఆన్ లైన్ ఎడ్యుకేషన్ అలవాటైపోయింది కనుక పిల్లలను తీరిక చిక్కినప్పుడల్లా కామిక్ కథలు పుస్తకాలు చదివేలా ప్రోత్సహించండి అంటున్నారు ఎక్స్పర్ట్స్. అమర్ చిత్ర కథ, ట్వింకిల్ వంటివి ఆన్ లైన్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి వీటిని కొంత కాలం ఉచితంగా చదువుకోవచ్చు.లిట్ ప్రా వెబ్ సైట్ లో పిల్లలు పుస్తకం చదవడం అదీ వేగంగా తప్పులు దొర్లకుండా ప్రాక్టీస్ చేయవచ్చు ఎలా చదువుతున్నారో తెలుసుకునేలా ఆడియో రికార్డ్ సౌకర్యం ఉంది పెద్దవాళ్ళు schilitpro.com లోకి లాగిన్ అయి పిల్లలచేత […]
వెయిట్ లిఫ్ట్ ఉపయోగం
శరీరం తీరుగానే ఉన్న కండరాలు చేతులు, ముంజేతులు కాస్త బొద్దుగా ఉంటాయి. ఇలా ఉంటే కార్టియో ఎక్సర్ సైజులు చేస్తే పూర్తిస్థాయి బరువు తగ్గుతారు అంటారు ఎక్సపర్ట్స్. తేలికపాటి వెయిట్ లిఫ్ట్ చేయాలి బైసెప్ కర్ల్, హ్యూమర్ కర్ల్ ట్రైసెస్ డిప్,కిక్ బ్యాక్ కొవ్వును కరిగించటం లో సహాయపడతాయి. పంచింగ్ వల్ల ముంజేతులు బాగా టోన్ ప్ అవుతాయి. యోగ అప్పర్ బాడీ ని బలోపేతం చేస్తుంది. స్క్సాష్,టెన్షన్,బాడ్మింటన్ వంటి ఆటలు ఆడితే చేతులకు మంచి వ్యాయామం అవుతుంది.
ఆవిష్కరణకు ప్రోత్సాహం
డాక్టర్ మేఘన ఎకనామిక్ టైమ్స్ ఇన్నోవేషన్ అవార్డ్ 2020 గెలుచుకున్నారు.ఒకటిన్నర కిలోల బరువు మాత్రమే ఉన్నా బ్రెయిలీ టైప్ రైటర్, రూపకల్పనకు, బరువు తక్కువగా ధర తక్కువగా ఉన్న క్రాఫ్ట్ పేపర్ ను రూపొందించినందుకు గాను ఆమెకు ఈ అవార్డ్ అందుకున్నారు.ఆమె పుట్టిపెరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం. హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చదువుకున్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రకృతి సంరక్షణ సంబంధించిన అంశాలను డాక్టర్ మేఘన ఆదర్శంగా తీసుకున్నారు. వెన్నుపూసకు సంబంధించిన ఒక సర్జరీకి […]
ఇది కాలుష్య ప్రభావమే
చర్మ సోయగాన్ని దెబ్బతీస్తోంది కాలుష్యం. చర్మం రంగు మారటం మచ్చలు రావటం వయసు పైబడ్డట్టు కనిపించటం ఇవన్నీ కారణాలే బయటికి అడుగు పెడితే ముందు సన్ స్క్రీన్ రాసుకోవాలి తలచుట్టూ స్కార్ఫ్, లేదా దుపట్టా కప్పుకోవాలి గొడుగు వెంట తీసుకుపోవాలి. రాత్రి నిద్రపోయే ముందర వంటికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.కనీసం రాత్రి వేళ అయినా కుంకుడు కాయల పొడి శెనగపిండి పసుపు కలిపిన మిశ్రమంతో బళ్ళు రుద్దుకోవాలి. ప్రతిసారి బయట నుంచి ఇంటికి వచ్చాక వేడి […]
అన్నింటికీ అతని అభద్రతే కారణం
మగవాళ్ళలో మైనస్ ల గురించి చెప్పమని చేసిన సర్వేలో ఆడవాళ్లు చెప్పిన కంప్లయింట్స్ ఆలోచనలో పడేసే విధంగా ఉన్నాయి. భార్య పాపులారిటీ ,ఆమె రూపం కాన్ఫిడెన్స్ మగవాళ్ళకు నచ్చవు అని 50 శాతం మంది చెప్పారు.మిగతా సగం మంది అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే పని గురించి స్నేహితుల సహోద్యోగుల గురించి లేదా, ఇల్లాలి అభివృద్ధి గురించి ఏం చెప్పినా ఆసక్తి చూపించరు.అనుమానపు ప్రశ్నలతో విసిగిస్తారు భార్య మిత్రులు, ఇష్టమైన వాళ్ళు తన స్థాయిని సూట్ కాదన్న భావనతో […]
జల్లికట్టు (మలయాళం)
మలయాళం సినిమా జల్లికట్టు విడుదలకు ముందే అనేక ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై విమర్శకుల మెప్పు పొందింది. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ లిజో జోస్ పెల్లిస్సేరీ ఉత్తమ దర్శకుడి అవార్డు అందుకున్నారు.కథ విషయానికి వస్తే కేరళలో అటవీప్రాంతం దగ్గర లో ఒక ఊరు. విస్సెంట్ అడవి దున్న మాంసం ఊరందరికీ అమ్ముతుంటాడు ఎప్పటిలాగే ఒక అడవి దున్నను నరికేందుకు సిద్ధపడితే అది కాస్త ఆ ఊరిని తన పశుబలంతో వణికించి నానా […]
హలీమా యాకోబ్
సింగపూర్ తొలి మహిళా అధ్యక్షురాలు హలీమా యాకోబ్ ఆమె తండ్రి భారత్ నుంచి ఉపాధి కోసం సింగపూర్ లో స్థిరపడ్డారు.తల్లి మలేషియా మూలాలున్న మలయ్ మహిళ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి మాస్టర్స్ డాక్టరేట్ పూర్తి చేసిన హలీమా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ కార్మిక నాయకురాలగా ఎదిగారు. 2001 ఎన్నికల్లో రాజకీయాల్లోకి అడుగు పెట్టి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2011 ఎన్నికల్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ […]
సనా మిరెలా మారిన్
సనా మిరెలా మారిన్ 34 సంవత్సరాల వయసులోనే ఫిన్లాండ్ ప్రధాన పీఠాన్ని అధిరోహించారు.కాలేజీ రోజుల్లోనే రాజకీయాల్లో కి ప్రవేశించారు సనా.సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఫిన్లాండ్ యువ విభాగమైన సోషల్ డెమోక్రటిక్ యూత్ తో పని చేశారు.2015లో ఎంపీగా పోటీ చేసి నెగ్గారు.2019 లో ట్రాన్స్ పోర్ట్ కమ్యూనికేషన్స్ మంత్రి అయ్యారు.ఆ ఏడాదే ప్రధానిగా పీఠం దక్కించుకున్నారు.ఫుట్ బాల్ ప్లేయర్ మార్కస్ రైక్కొనెన్ ఆమె భర్త సమాజంలో అందరూ సమానమే అంటారు సనా మిరెలా మారిన్ మహిళా […]
శ్వేత సౌధం లో మాలా ఆడిగా
భారత సంతతికి చెందిన మాలా అడిగా శ్వేతా సౌధం,నూతన పాలక వర్గం లో కాబోయే ప్రధమ మహిళ జిల్ బైడెన్ కు పాలసీ డైరెక్టర్గా బాధ్యత తీసుకోనున్నది ఆమె అమెరికాలోని ఇల్లినాయిస్ లో పుట్టి పెరిగారు యూనివర్సిటీ ఆఫ్ షికాగో లా స్కూల్లో డిగ్రీ పూర్తి చేశారు తాజా ఎన్నికల్లో పౌండేషన్ లో ఉన్నత విద్య సైనికుల కుటుంబాల విభాగం డైరెక్టర్ గా పని చేశారు,
