July 2020
Silent Book Club
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో సైలెంట్ బుక్ క్లబ్ మొదటిసారిగా ఏర్పాటయింది.పుస్తకాలు నచ్చే వాళ్లంతా కలిసి ఓ క్లబ్ ఏర్పాటు చేసుకునేవారు అమెరికా తర్వాత ఈ ట్రెండ్ ప్రపంచం అంతా విస్తరించింది.16 దేశాల్లో 100 శాఖలుగా వర్ధిల్లుతోంది ఈ క్లబ్.మనదేశంలో ఉజ్జయిని, బెంగళూర్,చండీగర్ ,ఢిల్లీలో ఈ సైలెంట్ బుక్ క్లబ్ శాఖలున్నాయి.క్లబ్ వ్యక్తులు వారానికో నెలకో ఒక్కసారి కలుసుకుని అక్కడ ఇష్టమైన పదార్థాలు ఆర్డర్ చేసుకొని పుస్తకాల గురించి మాట్లాడుకొంటారు.చదివిన పుస్తకం గురించి చెబుతారు ఇలాంటి బుక్ క్లబ్ […]
ఆ నీళ్లలో ప్రోటీన్లు
పాలు చాలా సార్లు విరిగి పోతూ ఉంటాయి. అలా విరిగిపోయిన పాలతో పన్నీర్ చేస్తుంటారు.ఆ మిగిలిన నీళ్లలో ఎన్నో పోషకాలు ప్రొటీన్లు ఉంటాయి.ఈ విరిగిన పాల నీళ్ళు పోసి అన్నం వండేందుకు ఉపయోగిస్తే అన్నానికి రుచి వస్తుంది పోషకాలు దక్కుతాయి.ఈ నీళ్ల తో నూడుల్స్ వండితే చాలా టేస్టీగా ఉంటాయి.అలాగే చపాతి పిండి లో ఈ నీళ్ళు కలుపుకోవచ్చు.సుప్ కోసం ఈ నీళ్లను ఉపయోగించుకోవచ్చు.ఈ నీళ్లలో ఉండే సుగుణాలు గుర్తుపెట్టుకొని వీటిని ఉడికే కూరల్లోనూ పప్పు దినుసులు […]
ఆందోళన తగ్గిస్తాయి
కరోనా సమయంలో నిరంతరం వైరస్ గురించి వార్తలు వింటూ ఉండటంతో ఆందోళన కలగటం సహజం… ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఈ ఆందోళన తగ్గుతుంది అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు.బ్రౌన్ రైస్, గోధుమ, రొట్టెలు,చిరుధాన్యాలు తీసుకోవాలి.అధిక భాగం కూరలు, పండ్లు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి.పాలు, పెరుగు, గుడ్లు మంచివే.కాఫీ ,టీలు ఎక్కువగా తాగడం నిద్రలేమి వల్ల కూడా ఆందోళన కలగవచ్చు.ఆవశ్యక ఫ్యాటీ ఆమ్లాలైన్ ఇ పి ఎ ,డి హెచ్ ఎ లు ఆందోళన తగ్గటానికి అవసరమైనా సెరటోనిన్,డోపమైన్ అనే […]
ఈమె మొదటి మహిళ
క్రికెట్ అంటే అమ్మాయిల ఆట కూడా అని నిరూపించింది శరణ్య సదరంగని.డ్రీమ్ లెవెన్ యూరోపియన్ క్రికెట్ సిరీస్ లో ఆడిన తొలి మహిళా క్రికెటర్ గా గుర్తింపు సాధించింది.ఐసిసి గుర్తింపు ఉన్న ఈ లీగ్ లో పురుషులతో పాటు మహిళా క్రికెటర్లు ఆడేందుకు అనుమతి ఉంది.ఐరోపా దేశానికి చెందిన జట్టు పాల్గొనే ఈ టి 10 టోర్నీ తాజా ఎడిషన్ గతనెల చివర్లో మొదలైంది.దీనితో జర్మనీకి చెందిన కె.ఎస్.వీ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తోంది శరణ్య.24 సంవత్సరాల శరణ్య […]
ప్రైమ్ లో నేను నేనొస్తున్నా
లావుగా అయ్యావు అనే వాళ్ళు ఎందుకు అలా అయ్యావు అని అడగరు ఏదైనా హెల్త్ కారణాలేమో అని అస్సలు ఆలోచించరు.బాడీ షేమింగ్ చేసేస్తారు. మనకున్న ఎక్కువ పెర్ఫార్మ్ చేసే వాళ్ళు మనల్ని విమర్శించారు.మనకున్న తక్కువ స్థాయిలో నిలబడ్డ వాళ్లే ఈజీగా ఒక మాట అనేస్తారు.అంటోంది నిత్యమీనన్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను కాస్త బొద్దుగా అయ్యానా నాకేం పెద్ద రిగ్రెట్స్ లేవు.బ్రీత్ ఇంటూ ద షాడోస్ అమెజాన్ లో రాబోతోంది. దాని గురించి చాలా […]
యూట్యూబ్ సెలబ్రిటీ
వృత్తి రీత్యా పైలెట్ అయిన రితు రతీ తానే ఓ ప్రముఖ బ్లాగర్,ఫిట్ మజిల్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతారు.ఆమె భర్త రీతు కౌరవుల్లో తో కలిసి ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్ కు ముప్పయ్ లక్షల మందికి పైగానే వీక్షకులున్నారు.యూట్యూబ్ ఫ్యాన్ మీట్ కి హాజరయ్యే అవకాశం దక్కించుకున్నారు ఈ జంట. రీతు హర్యానాలోని ఓ కుగ్రామం.పైలట్ శిక్షణ పొంది ఎయిర్ లైన్స్ లో కో పైలెట్ గా ఉద్యోగాన్ని అందుకుంది. నాలుగేళ్లలో […]
క్వీన్ హిందీ మూవీ
రాణి అన్న యువతి పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి సంగీత్ లో అందరూ ఉత్సాహంగా నృత్యం చేస్తుంటారు. వరుడు ఈ పెళ్లి చేసుకోనని నిరాకరిస్తాడు.మనసు మార్చుకొన్ననంటాడు.ఆ సమయంలో రాణి నిర్ణయం తీసుకుంటుంది తను ఒక్కతే హనీమూన్ కోసం బుక్ చేసిన టికెట్ తో ప్యారిస్ వెళ్తా నంటుంది.తండ్రి వప్పు కుంటాడు.అలా ప్యారిస్ చేరిన రాణి ప్రతిచోట కొత్త స్నేహితులను కలుసుకుంటుంది.జీవితం తన చేజారి పోలేదని తెలుసుకుంటుంది.ఆడపిల్ల జీవితంలో ఒక్క కుదుపు వస్తే ఆమె జీవితం అంతటితో ముగిసిపోయిందనే […]
సకల రోగ నివారిణి
ఈ వర్ష రుతువులో ప్రతిరోజు పొడి చేసిన వామును మొట్టమొదటి అన్నంలో ఓ స్పూన్ నెయ్యి లో కలిపి తినమంటున్నారు వైద్యులు ఈ కాలంలో వచ్చే దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్,జ్వరం మొదలైనవి రాకుండా వామ మేలుచేస్తుంది.పొట్టలో ఏదన్నా జీవులుగా చేరి క్రిములను వాము నిర్మూలిస్తుంది.వాములో థైమోల్ కార్వాక్రోల్ థైమ్ క్వినోవా వంటి ఘాటైన నూనెలు హానికర క్రిములను బాక్టీరియాని నాశనం చేస్తాయి.జీర్ణ శక్తిని పెంచుతాయి ఆయుర్వేద నిపుణులు అరస్పూన్ వాము పొడిని గోరువెచ్చని నీటితో ప్రతిరోజూ తీసుకుంటే […]
ఇక సురక్షిత ప్రయాణం
కోవిడ్ -19 భయంతో బస్సులలో ప్రయాణించాలి అన్నా భయమే అందుకే స్ప్రే చేయటం తో పాటు ప్రయాణికులు ఎక్కేప్పుడు స్ప్రే క్లార్స్ ద్వారా శానిటైజ్ చేసే పద్ధతులు కూడా వచ్చాయి. చైనాలో ఇన్ఫెక్షన్ సోకకుండా బస్సుల్లో యువి లైట్లను అమర్చారు.బ్రెజిల్ కు చెందిన మార్కోపోలో నెక్ట్స్ ఆరోటెక్ సంస్థలు సంయుక్తంగా ఫాగ్ ఇన్ ప్లేస్ అనే బోర్డ్ అనే సరికొత్త టెక్నాలజీతో కూడిన శానిటైజర్ విధానాన్ని రూపొందించారు.హాని రహితమైన స్ప్రే ను పొగ రూపంలో బస్సుల్లో 20 […]
నెలసరి నొప్పి కి యోగ
నెలసరి సమయంలో కడుపు నొప్పి, వెన్నునొప్పి విసిగిస్తూ ఉంటాయి. కొన్ని వ్యాయామాలు చేస్తే ఈ నొప్పుల నుంచి ఉపశమనం అంటున్నారు ఎక్స్పర్ట్స్ సహజంగా పిరియడ్స్ లో కండరాలు పట్టేయటం కడుపునొప్పి వంటి సమస్యలకు తేలికపాటి స్ట్రెబ్బింగ్స్ చేయటం వల్ల కండరాలు సాగి నొప్పి తగ్గుతోంది.జంబీ క్రమం తప్పకుండా చేస్తే నెలసరి నొప్పి తీవ్రత తగ్గుతుందని చెప్తున్నారు. యోగాసనాలు ప్రాణాయామ ముద్రలు ఉపయోగ పడతాయని ఎన్నో పరిశోధనలు చెప్పాయి.సూర్యనమస్కారాల వల్ల హార్మోన్ల పనితీరు మెరుగవుతోంది.
నలుపు మాయం
మోచేతులు నల్లగా బరకగా అనిపిస్తాయి.ఆ నలుపు దనం పోయి మృదువుగా అయిపోవాలంటే వేడి చేసిన కొబ్బరి నూనె కి బ్రౌన్ షుగర్ రెండు చుక్కల తేనె కలిపి ఆ ప్రాంతంలో రుద్దాలి.వీటిలో ని యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మానికి తేమ అందేలా చేస్తాయి.బంగాళదుంప పలుచగా కోసి ఆ ముక్కల్ని చేతులపై రుద్దాలి.లేదా బంగాళాదుంప రసంలో తేనె కలిపి రుద్దితే త్వరగా పరిష్కారం లభిస్తుంది.కలబంద గుజ్జు కొద్దిగా పసుపు కలిపి మోచేతుల దగ్గర మర్దనా చేస్తే […]
మైదా తగ్గిస్తే మేలు
పాలిష్ పట్టిన పదార్థాలన్నీ శరీరాన్ని పోషకాలకు బదులుగా కేలరీలతో నింపుతాయి.అలాంటి వాటిలో మైదా మొదటి స్థానంలో ఉంటుంది.జంక్ ఫుడ్ మొత్తం మైదా తోనే చేస్తారు.మైదా అత్యధిక గ్లైకో మిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది.దీనితో తయారైన బ్రెడ్, నూడుల్స్ ,పాస్తా తిన్నప్పుడు రక్తంలోకి చక్కెర లు త్వరితంగా విడుదల అవుతాయి అధిక చక్కెర ను నియంత్రించడం కోసం ఇన్సులిన్ స్రావాలు పెరుగుతాయి.ఈ పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగితే టైప్ 2 డయాబెటిస్ బారిన పడక తప్పదు.సమోసా, నూడుల్స్, కొబ్బరి, చీజ్, […]
కప్పు ముక్కలు తినండి చాలు
కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు బొప్పాయి తినమని వైద్యులు సూచిస్తున్నారు.బొప్పాయిలో ఇనుము, ఫోలేట్ ,విటమిన్ బి6, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్-ఏ సి,ఇ కె,బి 1,బి 3,లు పుష్కలంగా ఉన్నాయి ఇన్ని రకాల పోషకాలు ఉన్నాయి కనుకనే దీన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జలుబు, గొంతు నొప్పి రాకుండా చూస్తాయి.బొప్పాయిలో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్,బీటా కెరోటిన్,విటమిన్ సి ,విటమిన్ ఇ సహజంగానే కొవ్వులుకరిగిస్తాయి.రక్తపోటు […]
శాకాహారంలో ప్రోటీన్లు
రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ప్రోటీన్స్ బాగా ఉపయోగపడతాయి.ఇవి శాకాహారం లోనూ ఎక్కువగానే లభిస్తాయి 25 శాతం వరకు ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి శాకాహారులు ఆహారంలో పప్పు దినుసులు ఉండేలా చూసుకోవాలి.ఒక పూట ఆకు కూర తింటే మరో పూట పొట్టుతీయని పప్పు దినుసులతో కాయగూరలు కలిపి వండుకోవాలి.పప్పు రాత్రి నాననిచ్చి పగలు ఉపయోగించుకుంటే గ్యాస్ సమస్య రాదు. సోయా ఉత్పత్తులు పాలు, పన్నీర్ వంటివి తీసుకోవాలి సోయాలో 40 శాతం ప్రోటీన్లు ఉంటాయి పండ్లు ఆకుకూరలు […]
చక్కని పరిమళం ఇది
శిరోజాలు సువాసన తో తాజాగా ఉండాలంటే ఇంట్లో చేసిన స్ప్రే బాగా ఉపయోగపడుతోంది సగం కప్పు రోజ్ వాటర్ కొన్ని చుక్కల వెనీలా ఎక్పాల్ట్ జాస్మిన్ నూనె పది చుక్కలు, కొన్ని చుక్కల స్వీట్ ఆరెంజ్ నూనె తీసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపి స్ప్రే బాటిల్ లో పోస్తే ఇక హెయిర్ పర్ఫ్యూమ్ రెడీ అయినట్లే.ఈ పర్ ఫ్యూమ్ తలస్నానం చేశాక వెంట్రుకల పై స్ప్రే చేసుకోవాలి.జుట్టు మెరుపును పోయినట్లు అనిపిస్తే ఈ హెయిర్ పర్ఫ్యూమ్ ఉపయోగించి […]
ఇక మాస్క్ తప్పనిసరి
ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు జీవితంలోనూ మాస్క్ ఇప్పుడు విడదీయలేని భాగం.ఒక వ్యాధితో ఇన్ఫెక్షన్ వచ్చిన వ్యక్తి ఇతరులకు దాన్ని వ్యాపింపజేయకుండా ఉండేందుకు మాస్క్ అవసరం.కరోనా నుంచి కాపాడుకోవటంలో మాస్క్ ధారణ ముఖ్య పాత్ర పోషిస్తుందని వైద్యనిపుణులు ధ్రువీకరించారు.ప్రతి ఒక్కరూ వస్త్రంతో చేసిన వైద్య పరమైన మాస్క్ లు బహిరంగా ప్రదేశాల్లో ఉపయోగించాలని వాటికి కనీసం మూడు పొరలు ఉండాలని ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది మనదేశంలో చాలా రాష్ట్రాల్లో మాస్క్ ధరించినవారికి 100 నుంచి ఐదు వేల […]
చర్మానికి మెరుపు నిచ్చే తేనె
ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్లో తేనె చాలా కీలకం తేనె చర్మానికి తగినంత తేమ ఇస్తుంది.ముఖం శుభ్రంగా తుడుచుకొని కొద్దిగా తేనె అర చేతుల్లో తీసుకుని మసాజ్ చేస్తున్నట్లు ముఖానికి పట్టించి కాసేపాగి తుడిస్తే మొహం పై మురికి తొలగిపోయి మెరుస్తుంది. తేనె లోని యాంటీ ఆక్సిడెంట్లు దెబ్బతిన్న చర్మాన్ని మరమ్మతు చేస్తాయి.ముఖం పై యాక్నే ఉన్నచోట తేనె అద్ది పదిహేను నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి. తేనె లోని హైడ్రేటింగ్ గుణాలు వల్ల చర్మం సిల్క్ […]
పండ్లలో పోషకాలు
ప్రోటీన్ లు ఉండే పదార్థాలతోనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జామ పండు లో విటమిన్- సి అధిక మొత్తంలో ఉంటుంది. ఈ పండ్లు తింటే చాలా మంచిది యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఇవి రోగ క్రిములను అంతం చేస్తా యి. అలాగే ఎండు ద్రాక్షలో ఉండే పోషకాలు ఐరన్ తో రక్తహీనత సమస్య రాదు. ఐరన్ పొటాషియం పీచు విటమిన్లు మాంసకృతులు ఉంటాయి. అలాగే ఎంతో రుచిగా ఉండే పనస పండు లో ఎన్నో మాంసకృతులు […]
కరోనా స్పెషల్ మీల్స్
కర్ణాటక ప్రభుత్వం పౌష్టికాహార నిపుణులను సంప్రదించి ప్రత్యేక ఆహార పట్టికను తయారు చేయించింది ఉదయం ఏడు గంటలకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్,రాత్రి మళ్ళీ ఏడు గంటలకు డిన్నర్.బ్రేక్ఫాస్ట్ లోకి సోమవారం రవ్వ ఇడ్లీ,, మంగళవారం పొంగలి బుధవారం సెట్ దోస, గురువారం రైస్ ఇడ్లీ, శుక్రవారం బిసి బిల్లా బాత్, శనివారం వెజ్ బాత్ తప్పనిసరి లంచ్ లోకి ప్రతిరోజు రోటీ చపాతీ కూరగాయల వేపుడు మరి అన్నం పప్పు పెరుగు గుడ్లు.డిన్నర్ […]
Mere Pyare Prime Minister
పిల్లలతో పెద్ద వాళ్ల కోసం తీసిన సినిమా మేరే ప్యారే ప్రైమ్ మినిస్టర్.ఒక చిన్న పిల్లాడు వాళ్ల కాలనీలో టాయిలెట్ లేకపోవటం గురించి చుట్టూ ఉన్న అపార్ట్మెంట్స్ లో ఒక్క ఇంటికి రెండేసి ఉండటం గురించి చాలా ఆశ్చర్య పోతాడు. ఒక చీకటి వేళ ఈ అబ్బాయి తల్లి ఒక్కటే టాయిలెట్ కోసం వెళ్తే ఎవరో రేప్ చేస్తారు.ఏడుస్తున్న తల్లిని చూసి ఈ పదేళ్ల కుర్రాడు ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రధాన మంత్రిని కలిసి వాళ్ల కాలనీలో […]
