Sunday, 28 Jun, 2026

వంటింటికి అందం గోల్డ్ కలర్ స్టీల్ 

వంటింట్లో వాడే స్పూన్ ల దగ్గర నుంచి ప్లేట్స్, గ్లాసులు, గిన్నెలు ఇతర అన్ని రకాల వంట సామాన్లు పైన బంగారు రంగులో అద్దేస్తున్నారు. ఈ గోల్డ్ కలర్ స్టీల్ సామాను చూస్తేనే కళ్ళు చెదిరేలా ఉంటున్నాయి.స్టీల్  ఫిజికల్ వేపర్ డిపాజిషన్ కోటింగ్ పద్ధతిలో బంగారు రంగు అద్దుతారు. ధర కాస్త ఎక్కువైనా అచ్చం బంగారు పాత్ర లాగే ఉన్నాయి.క్యారెట్ తురిమే గ్రేలర్ పిండి జల్లెడతో సహా అన్ని పుత్తడి రంగుతో కళ్ళు మెరుస్తున్నాయి. స్టీలు  పాత్రల […]

ఆరోగ్యాన్నిచ్చే స్వీట్ కార్న్ 

చల్లగా ఉన్న వాతావరణంలో స్వీట్ కార్న్ లేదా మామూలు మొక్కజొన్న కండెలు వేడి వేడిగా తింటే బాగుంటుంది.వేడి స్వీట్ కార్న్ పైన ఉప్పు,కారం,మిరియాల పొడి చల్లి తింటే  మరింత రుచి వీటిలో క్యాలరీలు తక్కువ.వంద గ్రాముల స్వీట్ కార్న్ లో కేవలం 86 కేలరీలు ఉంటాయి.ఈ గింజల్లో డైటరీ ఫైబర్ విటమిన్లు ,యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.వీటిలో ఉండే ఫెరులిక్ ఆమ్లం వార్ధక్యపు ఛాయలు రానివ్వదు.అలాగే జియాక్సాంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటిచూపును మెరుగుపరుస్తుంది. స్వీట్ కార్న్ […]

మాస్క్ లు ఇస్తున్న దేవత 

తమిళనాడులో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాస్కులు వేసుకోవటం తప్పనిసరి అన్న అవగాహన ప్రజల్లో కల్పించటం కోసం తమిళుల ఆరాధ్య దైవం మరియమ్మన్  అమ్మ అవతారం ధరించింది.ఈ సామాజిక కార్యకర్త తలపై కిరీటం కాళ్ళకు గజ్జెలు ధరించి వీధుల్లో నడుస్తూ ప్రజల దగ్గరకు వెళ్లి మాస్కులు వేసుకోమని చెప్పి వాటిని ఇస్తోందామే.వెనకే ఇద్దరు మహిళలు మాస్క్ లు పట్టుకోని ఆమెను అనుసరిస్తున్నారు.రహదారుల్లో ప్రజలను ఆపి కరోనా ప్రమాదాన్ని వివరిస్తోంది.గ్రామీణ ప్రాంతాల ప్రజల దేవత పేరు […]

ముఖం పై నలుపా ? 

ఒత్తిడి వల్లనో హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ వల్లనో మొహం పైన నలుపు పేరుకు పోతుంది. ఈ టాన్ పోగొట్టుకోవాలంటే ఇంట్లోనే చేసుకోగలిగే ఫేస్ ప్యాక్ వాడుకోవచ్చు.రెండు స్పూన్ల బార్లీ పొడిని ఉడకబెట్టి అందులో కాస్త నిమ్మరసం కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఈ పేస్ట్ తో ఫేస్ ప్యాక్ వేసుకుని పావుగంట తర్వాత కడిగేస్తే నలుపుదనం క్రమంగా క్రమంగా తగ్గుతోంది పెసరపిండి, ఉలవ పిండి లో కీరదోస రసం కలిపి ప్యాక్ వేసుకోవచ్చు. ఎండు ద్రాక్ష ఎండు […]

చక్కని ఆకృతి కోసం 

తీరైన ఆకృతి కోసం లో దుస్తులు ఎంచుకోవడంలో శ్రద్ధ పెట్టాలి అంటారు ఎక్స్పర్ట్స్.ఎదిగే వయసుని బట్టి శారీరకంగా వచ్చే మార్పులకు అనుగుణంగా వీటిని ఎంచుకోవాలి. వేసుకునే దుస్తులు ఆకృతి ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకోవాలి.ఛాతి పెద్దగా ఉండే వారు పూర్తిగా కప్పి ఉండే రకం బ్రాలను ఎంచుకోవాలి.అదే తక్కువగా ఉంటే కప్ రకాలు ఎంచుకుంటే చక్కని ఆకృతిలో కనిపించటమే కానీ ఇవి ఛాతి అడుగు నుంచి సపోర్ట్ గా ఉంటాయి.అలాగే చీర కు సంబంధించి అదే రంగులో […]

గోళ్ళకు పోషణ  

గోళ్ళ పైన వేసుకునే నెయిల్ ఆర్ట్ బావుంటుంది. అలా ఆర్ట్ వేసుకోవాలంటే గోళ్లు బలంగా ఉండాలి.బయోటిన్ ఆహారంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.ఉడికించిన గుడ్లు, చిరుధాన్యాలు, సోయాబీన్స్, అరటి పండు తినాలి.శానిటైజర్ వాడకం వల్ల గోళ్లు పొడిబారిపోతూ ఉంటాయి గోళ్లకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి.నెయిల్ పాలిష్ వాడకుండా గోళ్ళకు పోషణ ఇస్తే అప్పుడు బలం గా ఎదిగిన గోళ్ళ పైన నెయిల్ ఆర్ట్ చక్కగా వస్తోంది.అలాగే గోళ్ళ పైన రంగును పోగొట్టుకోవాలి అంటే ఎసిటోన్ లేని నెయిల్ రిమూవర్లు వాడాలి.

వర్షంలో జాగ్రత్త 

వర్షంలో తడవటం లేదా ఎక్కువ సమయం నీళ్లలో ఉండవలసి వస్తే పాదాల పైన తేమ అధికమై ఇన్ఫెక్షన్ లు వస్తాయి.ఈ సీజన్ లో మరీ ఎక్కువ వర్షంలో బయటికి వెళ్ళవలసి వస్తే ఓపెన్ ప్లాస్టిక్ చెప్పులు లేదా రబ్బరు చెప్పులు వేసుకోవాలి. స్నానం చేసినప్పుడు కాళ్లు కడుకున్నప్పుడు పాదాలు తడి లేకుండా తుడుచుకోవాలి.పాదాలపైన యాంటీ ఫంగల్ డస్టింగ్  పౌడర్  టాల్కమ్ పౌడర్ చల్లుకోవాలి మాయిశ్చరైజర్ వాడకం తగ్గించాలి. ఉతికిన దుస్తులు వేడి నీళ్లలో ముంచి తీసి ఆరబెట్టుకోవాలి […]

కిండిల్ లో ‘ నో నెట్ ‘ 

సోనాలీ దాబడే  రాసిన ‘ నో నెట్ ‘ అనే 9 కథల సంపుటి.అమెజాన్ కిండిల్ లో పబ్లిష్ అయ్యింది. ఆ అనే సినిమాకు స్క్రిప్ట్ రాసిన సోనాలి సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి రచన రంగం లోకి వచ్చింది నైట్స్ అండ్ లిల్లీస్ ఆమె మొదటి నవల. తరువాత ఫైవ్ ఆఫ్ హార్ట్స్ రాసింది.ఈ మూడవ కథల పుస్తకం నో నెట్ లో ఒక్క కథలో ఒక్క భావోద్వేగం ఉంటుంది. ఈ పుస్తకం చదవాలనుకుంటే అమెజాన్ […]

మంచి నీళ్లకు రుచి 

మంచి నీళ్ళతో కూడా ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్.నారింజ, నిమ్మకాయ పైనాపిల్ ముక్కలు, కీర ముక్కలు, అల్లం ముక్కలు, పుదీనా ఆకులు మొత్తం సన్నగా కట్ చేసుకోవాలి. పాత్రలో నీళ్లలో ఈ ముక్కలన్నీ వేసి ఒక గంట పాటు అవతల పెట్టి ఆ తరువాత ఆ పదార్థాలు తీసేసి ఆ నీళ్లను ఫ్రిజ్ లో పెట్టుకోని తాగవచ్చు. ఈ ముక్కలన్నీ కలిపిన నీళ్లు మంచి రుచి తో సువాసన తో ఉంటాయి.మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకుంటే మంచిదనే […]

 వజ్రాల మాస్క్ 

ఈ వజ్రాల ఫేస్ మాస్క్ ధర అక్షరాలా లక్షా నలభై వేల రూపాయలు సూరత్ లో ఉండే వజ్రాల వ్యాపారి కుశాల్ భాయ్ తయారు చేశాడు.  తను చేయించుకున్న మాస్క్ కు ది కుశాల్ బాయ్ అన్న ఇంగ్లీష్ అక్షరాలను వజ్రాలతో  అమర్చుకొని  ఫోటోలు షేర్ చేశాడు. కరోనా సమయంలో ఎలానో మాస్క్ లు తప్పవు పెళ్లి వేడుకల్లో మంచి దుస్తులు ఆభరణాలు ధరించి మామూలు మాస్క్ లు సర్జికల్ మాస్క్ లు ఏం బావుంటాయి.  అప్పుడీ […]

గౌరీ మహాదిక్ కు శుభాకాంక్షలు

ఇంతటి ధైర్యం తెగువ అంకితభావం భారతీయ మహిళల లోనే ఉంటాయి. అసలైన భారతీయ మహిళకు ప్రతీక  గౌరీ మహాదిక్ అన్నారు  స్మృతి ఇరానీ. తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో అమర సైనిక వీరులను తలచుకునే నేపథ్యంలో ఆమె గౌరీ మహాదిక్ లక్ష్యాన్ని ప్రశంశించారు. 2017 భారత చైనా సరిహద్దుల్లో మేజర్ ప్రసాద్ మహాదిక్ గాయపడి ప్రాణాలు వదిలారు. మేజర్ అమరుడైన 10 రోజులకు ఆయన భార్య గౌరీ ఒక నిర్ణయం తీసుకుంది. వృత్తి రీత్యా ఆమె లాయర్ […]

దైవం దీవించింది 

సమ దీప్తా ముఖర్జీ పాడిన రాగాన్ని ట్విట్టర్ లో ఇప్పటివరకు 6 లక్షల మంది విన్నారు ఆ అద్భుతమైన స్వరాన్ని పరిచయం చేసింది సాక్షాత్తు లతా మంగేష్కర్. ఈమె ఏదో ఒక నాటికి గొప్ప సింగర్ అయిపోతుంది అన్ని ఆశీర్వాదనం కూడా ఇచ్చారు. ఇప్పుడు సమ దీప్తా సంతోషం అవధులు దాటి పోయింది సాక్షాత్తు దైవమే నాకు ఆశీస్సులు అందించారు ఇంక నాకేం కావాలి అంటోంది సమ దీప్తా వీడియో లో సమ దీప్తా పాడిన పాట […]

ప్రసవం తర్వాత 

ప్రసవం తర్వాత శరీరం బరువు పెరిగే మాట వాస్తవం చిన్న చిన్న వ్యాయామాలు చేసి  తీసుకునే ఆహార పదార్థాల పైన దృష్టి పెడితే నెమ్మదిగా ఆ బరువు తగ్గుతుంది. ఆహారంలో మాంసకృత్తులు, కొవ్వులు, పోషకాలు, పీచు ఉండాలి.అలాగే కార్టియో ఫ్లాంక్ వంటి వ్యాయామాలు ఎంచుకోవాలి. ఈ వ్యాయామం దినచర్యలో భాగంగా కొనసాగించాలి. ఈ కరోనా సమయంలో జిమ్కు వెళ్లడం కష్టం కాబట్టి ఇంట్లోనే చిన్న చిన్న గా మొదలుపెట్టి సమయం పెంచుకుంటూ పోవాలి .ప్రసవం తర్వాత ఇంట్లో […]

స్కిన్ ఫుడ్

కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ప్రతిరోజు బొప్పాయి తింటూ ఉంటారు.బొప్పాయి పండు తోలు చర్మానికి ఎంతో మంచి చేస్తుంది. ఈ తోలు లో ఉండే ఎంజైమ్లు చర్మానికి రక్షణ ఇస్తాయి వయసు రీత్యా వచ్చే మచ్చలను తొలగిస్తాయి.ముఖం శుభ్రంగా కడిగేసి ఈ బొప్పాయి తోలుతో చర్మాన్ని రుద్దుకోవాలి. కళ్ళ చుట్టూ,కణతల పైన,మూతి చుట్టూ గల పైన లైన్స్ పై కూడా బొప్పాయి తోలుతో మెల్లగా రుద్దాలి అలాగే మెడ మోచేతులు కూడా పట్టించి పావుగంట […]

 ఇల్లే శ్రీదేవికి కానుక

రోడ్డు పక్క టార్పాలిన్ తో వేసిన చిన్న గుడారం లో ఉండే భరతి  ఖండేకర్ ఈ ఏడాది టెన్త్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించింది.వీధి దీపపు వెలుగులో చదువుకున్న ఈ అమ్ములు  గురించి ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే ఈ బాలికకు సింగిల్ బెడ్ రూమ్ ఇంటి తాళాలు ఇచ్చారు. ఆడపిల్లగా ఫుట్ పాత్ పై ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చదువుకుంటున్న భారతి కి కంప్యూటర్ ఫర్నిచర్ కానుకగా ఇచ్చారు.భవిష్యత్తులో ఆమె చదువుకు అయ్యే ఖర్చు […]

వయసు ఛాయలు రానివ్వదు 

అన్నం వార్చిన గంజి లో ఉండే ఖనిజాలు పోషకాలు చర్మ సౌందర్యాన్ని వయసు ఛాయలు దగ్గరికి రానివ్వదు అంటున్నారు ఎక్స్పర్ట్స్.బియ్యం గంజి లో తాజా కలబంద గుజ్జు  రెండు ఇ-విటమిన్ క్యాప్సూల్స్ వేసి కలిపి ఆ మిశ్రమాన్ని మొహానికి లేపనం లాగా రాసి మృదువుగా మర్దనా చేస్తే చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. సూర్యకిరణాల ప్రభావం పడకుండా కాపాడుతుంది దద్దుర్లు  మొటిమల నివారణకు పనికి వస్తుంది. కలబందలో వ్యాధి నిరోధక కారకాల కారణంగా ముఖ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. […]

సహ జీవనం తప్పదు 

కోవిడ్ తో సహజీవనం చేయవలసిన పరిస్థితులు వచ్చాయి. బయట పనులు చేసుకోవటం ఆఫీసులకు వెళ్ళటం తప్పనిసరి అలాటప్పుడు స్వీయ నియంత్రణ పాటించడం చాలా ముఖ్యం. కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలి.పని ప్రదేశాల్లో గుంపులుగా ఉండవద్దు 40, 60 సెకన్ల పాటు చేతులు సబ్బుతో శుభ్ర పరచుకోవాలి.శానిటైజర్ రాసుకోవాలి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దు.జలుబు ,దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి ఉద్యోగులందరూ ఒకే చోట  భోజనం చేయటం మానేయాలి.కార్యాలయాల్లో క్రమం తప్పకుండా వైరస్ […]

ఇంట్లోనే జిమ్ 

ఆరోగ్యం కోసం పోషకాలతో పాటు కొంత శారీరక వ్యాయామం కూడా ఇవ్వాలి. ఇంటి పని కూడా ఓ రకంగా చక్కని వ్యాయామం అలసటకు గురవుతున్నట్లు తెలియకుండా ఒంట్లో కేలరీలు తగ్గించే సాధన డాన్స్ స్టెప్స్ వేయటం… ఏదైనా నచ్చిన పాటకు పది నిమిషాలు డాన్స్ చేస్తే చాలు ఫిట్నెస్ పొందవచ్చు. లేదా ఇంట్లో పుస్తకం చదువుతూ పచార్లు చేయవచ్చు.ఇల్లు చిమ్మడం తుడవటం తో చాలా సేపు వంగటం నిలబడటం చేయాలి.ఈ పనులు గుండె పనితీరు మెరుగు పరుస్తాయి. […]

 ఏ బంధము వద్దు 

స్త్రీలు వంటరిగా ఉండగలరు.అసలు ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడుతున్నారు అని తాజా గణాంకాలు చెబుతున్నాయి.శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టం 2018 గణాంక నివేదిక ప్రకారం దేశంలో 5.5 శాతం మంది స్త్రీలు  వివాహం అయ్యాక అనేక కారణాల రీత్యా ఒంటరిగా ఉంటున్నారు. విడాకులతో విడిపోయి, భర్త చనిపోయిన కారణాలు ఏవైనా ఒంటరిగానే ఉన్నారు.తమిళనాడులో ఆ సంఖ్య రెట్టింపు గా ఉంది కేరళలో ఒంటరిగా ఉన్న స్త్రీలు 9.3 శాతం గా ఉంటే తమిళనాడులో 9.1 శాతం ఉంది.ఆంధ్రప్రదేశ్ లో 7.8 […]

 కొత్తిమీర పెంచుకోవచ్చు 

కిచెన్ గార్డెన్ లో కూడా కొత్తి మీర పెంచుకోవచ్చు. లేదా కాస్త వెలుతురు ఎండ పడే చోట ఒక ప్లాస్టిక్ ట్రే లో కూడా ధనియాలు చల్లాలి. మసాలా కు వాడే ధనియాల్లో  పక్వానికి వచ్చే గింజలు చాలా తక్కువ.విత్తనాల ధనియాలు చల్లి తేనే మొలకలు వస్తాయి.ధనియాలను రెండు చేతులతో నలిస్తే  రెండు పలుకుల విడిపోతాయి. వాటిని 24 గంటల పాటు నీళ్లలో నానబెట్టి అప్పుడు వాటిని మట్టిలో నాటుకోవాలి.కొద్దిగా నీళ్లు చల్లుతూ ఉంటే రెండు వారాల్లో […]