May 2020
“శృంఖలాదేవి ప్రసాదం”
కలకత్తాలోని హుగ్లీ లో వున్న శక్తిపీఠమే ప్రద్యుమ్న శృంఖలాదేవి.త్రేతాయుగంలో రోమపాదుడనే చక్రవర్తి ఈ అమ్మవారిని ప్రతిష్ఠ చేశాడని,అమ్మవారి ఉదర భాగం ఇక్కడ పడింది అని అంటారు. ఒకసారి రోమపాదుడి రాజ్యంలో కరువు తాండవం చేస్తోంది.జనం తిండి లేక విలవిల్లాడారు.రుష్యశృంగుడనే మహర్షి ఈ ప్రదేశానికి వస్తే అంతా సస్యశ్యామలంగా వుంటుంది అని చెప్పారు.వెంటనే చక్రవర్తి తన సైన్యాన్ని,కొంత మంది యువతులను రుష్యశృంగుని ఆశ్రమం వద్దకు పంపించాడు.అతను ఆ యువతుల అందచందాలను చూసి ముగ్ధుడై వారి వెంటే నడుచుకుంటూ రోమపాదుడి […]
ఇంటర్ ఛేంజ బుల్ లాకెట్స్
మ్యాచింగ్ లేకుండా ఒక పట్టాన అమ్మాయిలకు ఏ వస్తువు నచ్చదు.దుద్దులు,గాజులు,ఉంగరాలు అన్ని మ్యాచింగ్ కావాల్సిందే.ఇప్పుడు నల్లపూసల గొలుసు లతో పాటు ఇంటర్ ఛేంజ బుల్ లాకెట్స్ వచ్చాయి.రంగు రంగుల రాళ్లు పూసలు గల లాకెట్ వాటికి తగ్గ జూకాలు వచ్చాయి ఎలాంటి డ్రెస్ వేసుకుంటే దానికి మ్యాచింగ్ గా ఈ గొలుసు కొక్కెం తీసి ఆ రంగు లాకెట్ తొలగించుకోవచ్చు .రంగు రంగుల రాళ్లతో ఉన్న ఈ లాకెట్ లతో నల్లపూసలు గొలుసు చక్కని అందం వచ్చింది.
మాస్క్ గివింగ్ ట్రీ
మాస్క్ ల చెట్టును సృష్టించింది అమెరికాకు చెందిన డెబ్ సిగ్గిన్స్. కరోనా విజృంభణతో తల్లడిల్లుతున్న ఆ దేశంలో వైద్యులకు కూడా రక్షణ పరికరాలు కావాల్సినన్ని లేవు.వాటిని ఎవరైనా సొంతంగా తీసుకొనిపోయి ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవు.దానితో డెబ్ ఇంట్లో సొంతంగా మాస్కులు కుట్టి తమ వీధిలోని ఒక చెట్టును గివింగ్ ట్రీ గా మార్చేసి తాను తయారు చేసిన మాస్కులకువాటిని తగిలిస్తుంది. అవసరం ఉన్నవారు ఎవరైనా వాటిని ఉచితంగా తీసుకోవచ్చు ఎవరు ఎన్ని తీసుకున్న పర్లేదు. డెబ్ సిగ్గిన్స్మాత్రం […]
కత్రిన్ జాకబ్స్ డాట్టిర్ శ్రమ కీలకం
ఈ కరోనా సమయంలో ఐస్ ల్యాండ్ ప్రధాని కత్రిన్ జాకబ్స్ డాట్టిర్. ఆ దేశ ప్రజలకు తల్లి పాత్ర పోషించారు మూడున్నర లక్షల కు ఎక్కువగా ఉన్న ఆదేశ జనాభాలో 12 శాతం మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య కేవలం పది …. కరోనా వైరస్ ప్రమాదం అర్ధం చేసుకొని ఆరోగ్య శాఖాధికారులు అంటువ్యాధి నిపుణులు శాస్త్రవేత్తల తో సమీక్షలు నిర్వహించారు. ట్రేసింగ్ యాప్ తో కరోనా సోకిన […]
సన్నా మారిన్ కృషి అపూర్వం
కరోనా కట్టడి విషయంలో ఫిన్ లాండ్ ప్రధాని సన్నా మారిన్ తీసుకొన్న చర్యలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. మర్చి 16 నాటికి మూడు వందల కేసులు నమోదయ్యాయి. వెంటనే దేశంలో ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటించారు సన్నా మారిన్ దేశాదీ నేతగా కాకుండా తల్లి మనసుతో వ్యవహరించింది ఫిన్ లాండ్ ప్రధాని సన్నా మారిన్. ఇతర దేశాలతో రాకపోకలు నిషేదించారు. లాక్ డౌన్ కఠినంగా అమలైంది. పిల్లల భవిష్యత్ కోసం వర్చువల్ క్లాసులు కొనసాగించారు. వయస్సు మళ్ళిన […]
మన తెలుగు సామెతలు
ఆకలి కాకుండా ఔషధమిస్తా, నీ ఇంట్లో సద్ది నాకు పెట్టు అన్నట్లు ! ప్రపంచంలో ఉండే మోస కారులను ఉద్దేశించి చెప్పే మాటలులివి ఆకలి కాకుండా మందు వచ్చే వాడికి చద్దన్నం తో పనేముంటుంది. అమాయకులను మోసం చేసే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతో మంది వారి మాటలకు మోసపోయేవాళ్ళు కూడా తక్కువ ఏంకాదు ఇలాటి వే ఇంకొన్ని చక్కని సామెతలు. * ఆకలి ఆకలి అత్తగారు అంటే రోకటి మింగవే కోడలా […]
టిక్ టాక్ సక్సెస్
లాక్ డౌన్ లో ప్రపంచం మొత్తం స్తంభించిపోయిన వేళలో ప్రజలను ఎక్కువ ఎంటర్టైన్ చేసింది టిక్ టాకే నని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజులో ఎక్కువ కాలం కోట్ల మంది టిక్ టాక్ ను చూస్తున్నారట. హ్యాండ్ వాష్ చాలెంజ్ లు వంటివి టిక్ టాక్ లో విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా స్కిట్స్ కరోనా జోకుల తో టిక్ టాక్ యూజర్ల సంఖ్య అమాంతంగా పెరిగిపోయింది అట ఇళ్లల్లో నే చేసే డాన్సులు, వంటలు విపరీతంగా అన్ లోడ్ […]
గుప్పెడు గింజలతో శక్తి
రోగ నిరోధక శక్తి ని పెంచుకునేందుకు తీసుకోవలసిన ఆహారపు జాబితా లో ముందే ఉన్నాయి పొద్దు తిరుగుడు విత్తనాలు. లోపల పప్పు తో ఈ విత్తనాలు చాలా రుచిగా ఉంటాయి. వీటిలో వంద రకాల ఎంజైములు ఉంటాయి. ఇది హార్మోన్ ను సమతుల్యం చేస్తాయి ఇందులో ఉండే విటమిన్-సి గుండె జబ్బులను రానివ్వదు గుండె నాళాల్లో కొవ్వు చేరకుండా కాపాడతాయి. వీటిలో ఉండే విటమిన్ -ఇ సెరినియం కాపర్ లు కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. రోజుకో గుప్పెడు […]
“మార్తాండ భైరవుడి ప్రసాదం”
కర్నాటక రాష్ట్రంలోని మాంగ్ సులి సమీపంలో ఖండోబా ఆలయంలో మనం మార్తాండ భైరవుడిని చూసి దర్శనం చేసుకోవచ్చు. మల్ల మరియు మణి అనే రాక్షసులు వారికి మరణం లేకుండా ఎవరితోటి ఓటమి లేకుండా వరమివ్వమని బ్రహ్మదేవుని కోసం తపస్సు చేసి వరము పొందారు.వారివురు గర్వంతో దేవతలను,మునీశ్వరులను హింసించేవారు.ఆ బాధలు భరించలేక శివుని ధ్యానం చేస్తూ వుంటే శివుని అంశంగా మూడు కన్నులతో బంగారు రంగు ముఖముతో ఫాలభాగాన నెలవంక తో ఉద్భవించిన మార్తాండ భైరవుడిని చూసి అందరూ […]
మన తెలుగు సామెతలు
‘ విందైన మూడు రోజులు,మందైనా మూడురోజులే ‘ ఈ సామెత నిత్య జీవిత అనుభవం లోంచి వచ్చినదే మంచి భోజనం కనీసం మూడు రోజుల పాటు వరసగా చేస్తే మనకు తృప్తి పడుతోంది. అలాగే ఏ మందైనా మూడు రోజులు వాడితే వంటికి పడుతోంది అని అర్ధం. స్నేహం విందు,మందులా విడవకుండా రోజుల పాటు చేస్తే అది బలపడి,హృదయానికి దగ్గరై కలకాలం ఉంటుంది అని అర్ధం. […]
అడ్జస్ట్ బుల్ మాస్క్ స్ట్రాప్
ఇంకా కొన్ని నెలలు మాస్కు ధరించక తప్పదు.చెవుల మీదుగా ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా మాటి మాటికీ కిందకు జారి పోతూ ఉంటాయి .సరిగ్గా సరిపోయే సైజువి తీసుకున్నా రోజంతా ఉంచుకోవలసి వస్తే చెవులు ముక్కు పైన ఒత్తిడి ఎక్కువ అవుతూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది .ఈ ఇబ్బందులు లేకుండా , అడ్జస్ట్ బుల్ మాస్క్ స్ట్రాప్ లో మనకు సౌకర్యంగా ఉండే అంత గట్టిగా మాస్క్ తగలించవచ్చు .అప్పుడిక జారి పోదు, ముక్కు పైన ఒత్తిడి ఉండదు […]
వాళ్ళే ఎక్కువ
మహిళలతో పోలిస్తే పురుషులే కరోనా తో మరణించే అవకాశాలు ఎక్కువ అంటున్నాయి అధ్యయనాలు .వారిలో ఉండే ఒక కీలకమైన ఎంజైమ్ ఇందుకు కారణం అంటున్నారు.కోవిడ్ -19 తో మరణించిన ప్రపంచ వ్యాప్తి రోగుల గుణాంకాలు పరిశీలించినప్పుడు మహిళల కన్నా పురుషులు సంఖ్య ఎక్కువ ఉంది .కరోనా లక్షణాలు పురుషుల్లోనే ఎక్కువ తీవ్రంగా ఉండటం, వ్యాధి తీవ్రత కూడా ఎక్కువ గానే ఉండటం గమనించారు .3500 మంది పురుషులు ,స్త్రీల రక్త నమూనాలు పరీక్షిస్తే, యాంజయో టెన్సిన్ కన్వర్టింగ్ […]
కేక్ బొమ్మలు
అందమైన డిజైనర్ డ్రస్ లతో ముద్దొచ్చే బొమ్మలు కేకులు తయారు చేస్తున్నారు బేకింగ్ మాస్టర్స్ .ఏదో కొత్తదనం లేకపోతే బిజినెస్ సాగదు కదా …అందమైన ఈ డిజైనర్ డ్రెస్ ల్లాగా సిల్క్ లెస్, పువ్వులు ఎంబ్రాయిడరీ లు, వాటి పైన మెరిసే రాళ్లు లతలు సర్వం ఫాందంట్ తో సృష్టిస్తున్నారు. పంచదార, నీరు జెలాటిన్ గ్లిజరిన్ కలిపి తయారు చేసిన ఫాందంట్ తో ఎలాంటి డిజైన్ లనైనా ,చాలా సున్నితంగా చెక్క వచ్చు. ఈ ఎడిబుల్ కలర్స్ […]
ఉచితంగా కూరగాయలు
ఒడిసా లోని భద్రక్ జిల్లా కురుడ కు చెందిన ఛాయా రాణి సాహూ ,భర్త సర్వేశ్వర్ సాహూ తో కలిసి తమకున్న ఏడు ఎకరాల భూమిలో గత 25 సంవత్సరాలుగా కూరగాయల సాగు,ఇరవై ఆవుల పాడీ నిర్వహిస్తుంది. కరోనా కారణంగా పేదలు నిత్యావసర వస్తువుల కోసం ఇబ్బంది పడుతూ ఉండటంతో, వారికి అండగా ఉండాలనుకొని తన పొలం లో పండిన కూరగాయలను ఉచితంగా అందిస్తోంది .సొంత గ్రామమైన కురుడ తో పాటు చుట్టు పక్కల భైరాపూర్,అలబగ,లుంగ, బ్రాహ్మణ […]
విద్యార్థుల కిచిడీ ప్రాజెక్ట్
పదో తరగతి చదువుతున్న ఇద్దరు బెంగళూరుకు చెందిన విద్యార్థులు ఈ లాక్ డౌన్ లో పేదల ఆకలి తీర్చేందుకు ఎంతో కృషి చేస్తున్నారు.దీప్ దేశాయ్,నందన్ కోనేటి,బెంగుళూరులోని విద్యా శిల్పా అకాడమీ లో చదువుతున్నారు .కరోనా వల్ల పనులు లేక ఆకలితో అలమటిస్తున్న పేదల ఆకలి తీర్చాలని సంకల్పించారు తల్లిదండ్రుల సాయంతో కిచిడీ ప్రాజెక్ట్ పేరిట పేదలకు కిచిడీ ,చట్నీ పంచడం మొదలు పెట్టారు .ఈ కార్యక్రమం గురించి ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయటం తో స్నేహితులు […]
రైతు దంపతుల ఔదార్యం
రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన పబురాం మంద్,మున్నీ దేవి దంపతులు ఈ లాక్ డౌన్ సమయంలో 40 గ్రామాల్లో మూడు వేలకు పైగా కుటుంబాలకు తమ పంట దిగుబడులు పంచారు. వారికున్న ఐదు ఎకరాల భూమిలో వ్యవసాయ పంటలు సాగు చేస్తున్నారు.ఈ లాక్ డౌన్ లో ఆ పంట దిగుబడి అమ్మకుండా ఆ ధాన్యం తో పాటు మరికొన్ని నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి ఉపాధి లేని పేదలకు పంచారు .జోధ్ పూర్ జిల్లా […]
ఇది అపురూపం
ఎంత గొప్ప చిత్రకారుడు కూడా ఊహించలేనంత అందంగా ఉంటాయి ఈ టెన్ పీక్స్ వ్యాలీ లో ఉండే సరస్సు. దాని చుట్టూ కంచె వేసినట్లు కనిపించే పర్వతాలు చుట్టూ పచ్చదనం …ఇది ప్రకృతి మనిషికి ఇచ్చిన అపురూపమైన కానుక.కెనడా లోని మెరెయిన్ సరస్సు లోని నీరు అక్కడ చుట్టు ఉన్న హిమాలయ పర్వతాల నుంచి వస్తుంది. జూన్ నెలలో మంచు కరిగి ఈ సరస్సు లో నీళ్లు చేరుతాయి.ఇందులో నీళ్లు నిండే వేలకు ఎండ తీవ్రతను బట్టి […]
“శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ప్రసాదం”
తమిళనాడులోని తిరుత్తణి వున్న శ్రీ వల్లీ సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకుని వద్దాం పదండి. పురాణ గాథల ప్రకారం ఒక రాక్షసుడు సూరకాసురుడుని సంహరించడానికి శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు,మురుగన్ నిశ్చయించుకున్నాడు.ఆ రాక్షసుడిని చంపేందుకు తిరుత్తణిలో బస చేశాడనీ,ఇక్కడే శ్రీ వల్లీ దేవిని వివాహం చేసుకున్నాడని అంటారు.పూర్వం దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవయానిని సుబ్రహ్మణ్యేశ్వరునితో వివాహం జరిగింది అనీ,అల్లుడికి ఒక ఏనుగుని కానుకగా ఇచ్చిన, ఇంద్రలోకంలో శున్యం కనపడింది.అది గమనించిన మురుగన్ వెంటనే ఆ […]
మానవత్వపు పరిమళం
ఒడిస్సాలోని మహిళా పోలీస్ అధికారి శుభ శ్రీ నాయక్ ఒక మతిస్థిమితం లేని మహిళకు అన్నం తినిపిస్తున్న దృశ్యం సామాజిక మాధ్యమాల్లో జనం ప్రశంసలు అందుకుంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆ దృశ్యాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు .ఆమె ఒడిషాలోని మల్కాన్ గిరి మోడల్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ .లాక్ డౌన్ లో డ్యూటీ లో రోడ్డు పై వెళ్తుండగా బోరింగ్ దగ్గర నీళ్లు కొట్టుకొని తాగేందుకు అవస్తపడుతున్న మహిళ కనిపించింది.ఆమెకు మంచి […]
నా లక్ష్యాన్ని తెలుసుకొన్న
ఈ కరోనా విపత్తు నాకెన్నో పాఠాలు నేర్పించాయి అంటున్నారు ములుగు ఎమ్మెల్యే, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సీతక్క. ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమ్ మహమ్మద్ చేసిన ‘ గో హంగర్ గో ‘ చాలెంజ్ ను తీసుకొని పెనుగోలు గ్రామానికి బయలుదేరాను. అక్కడికి కాలినడకనే వెళ్లాలి గుట్టలు వాగులు దాటుతూ అక్కడి 20 కుటుంబాల ఆకలి తీర్చడం కోసం చేసిన ప్రయాణం నాలో ఆత్మస్థైర్యం నింపింది .మారుమూల గ్రామాల్లో 470 కి పైగా […]
