Sunday, 28 Jun, 2026

  “శ్రీ వారాహీ దేవి ప్రసాదం”

కాశీలోని వారణాసి వారాహి దేవిని ఈ రోజు తలచుకుని భక్తులను దయ తలచమని ప్రాధేయపడదామా వనితలూ!! వారాహిదేవి ఉగ్ర రూపంలో దర్శనం ఇస్తుంది.దుర్గా దేవి అంశమే ఈ వారాహి.సప్త మాత్రుకలలో ఒకరు.అమ్మవారికి తాంత్రిక పూజలు నిర్వహిస్తారు. పగలు దేవి నిద్రలో వుంటారని సూర్యోదయానికి ముందే నైవేద్యం సమర్పణ చేస్తారు.క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు రక్షిస్తాడు.విష్ణు మూర్తి నుంచి వైష్ణవి,బ్రహ్మ నుంచి బ్రాహ్మిణి,విష్ణు మూర్తి అవతారం వరాహమూర్తి నుంచి వారాహిదేవి ఉద్భవించినదని పురాణ గాథ. అమ్మవారి దర్శనం రెండు రంధ్రాలలో నుండి […]

విజయవాడ ఆర్చరీ  వెన్నం జ్యోతి 

ఆమె గురిపెడితే బాణం సూటిగా లక్ష్యాన్ని చేరవలసిందే ఆర్చరీ లో పతకాలు కొల్లగొట్టే వెన్నం జ్యోతి నాలుగేళ్ళ వయసులోనే కృష్ణా నదిలో ఐదు మీటర్లను మూడు గంటల 20 నిముషాల్లో ఈది లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ల కెక్కింది. ఏడేళ్ళ వయసులో ఆర్చరీ లో అడుగుపెట్టి జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు చేజిక్కించుకొంది 2011 లో అంతర్జాతీయ టోర్నోలో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వెన్నం జ్యోతి విజయవాడ ఆర్చరీ. ప్రపంచ కప్ అంటే పోటీలు,ప్రపంచ […]

కేవలం అసంతృప్తే 

కాస్త సమయం దొరికినా టివి ముందు సెటిలై పోవటం నూటికి 90 మంది చేసే పని. కానీ అదేపనిగా టివి చూడాలనే కోరిక ఉండేవాళ్ళలో మాత్రం తీరని అసంతృప్తి జాడలు కనిపిస్తూ ఉన్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఎన్నో సమస్యలతో సతమతం ఆవుతో దాన్ని మరిచేందుకు టివి ముందుంటారంటున్నారు. సంతోషంగా ఆనందంగా ఉండేవాళ్ళు టివి చూసే సమయం కంటే అసంతృప్తితో వున్నవాళ్ళు టివి చూసే సమయం 30 శాతం ఎక్కువగా ఉంటుందంటున్నారు. అయితే ఇలాంటి వ్యక్తులకు ఇది ఉపశమనం […]

స్నేహ మోహన్ రావ్ కు పురస్కారం

తమిళనాడు కు చెందిన స్నేహ మోహన్ దాస్ మహిళా దినోత్సవాన రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకొన్నారు . ఫుడ్ బ్యాంక్ ఇండియా స్వచ్చంధ సంస్థ ద్వారా ఎంతో మంది ఆకలి తీరుస్తూ న్నారు స్నేహ . తమిళనాడు కు చెందిన స్నేహ ,ఆమె స్థాపించిన సంస్థ ద్వారా,ఎవరి స్థోమత కు తగ్గట్టు వాళ్ళు ఎంతో కొంతమందికి వంటచేసి వాలంటీర్లకు సమాచారం ఇస్తే ,వాలంటీర్లు వెంటనే ఆ భోజనం వారి ఇంటి దగ్గర నుంచి తీసుకోని అవసరమైన […]

చిటికెడు చాలు

కొంచెం ఇంగువ పడితే చాలు వంటకం ఘుమాయించి పోతోంది . భారతీయ వంటశాల లోనే చిటికెడు ఇంగువ పడితే చాలు వంటకానికి ప్రత్యేక పరిమళం రుచి వస్తుంది . ఇంగువ లోని యాంటీ సెప్టిక్ గుణాలు ఉదార సంబంధమైన అజీర్తి ,కడుపునొప్పి తగ్గిస్తాయి . కాస్త ఇంగువ కొండంత ఆరోగ్యాన్ని ఇస్తుంది . ప్రతి రోజు కూరల తాలింపులో వేసే కొంచెం ఇంగువ తోనే జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది . ఓ గ్లాసు నీళ్ళలో చిటికెడు ఇంగువ […]

“శ్రీ చక్ర స్వరూపిణి ప్రసాదం”

ఓం!! హైమ్!! హ్రీమ్!!శ్రీమ్!!శ్రీ మాత్రే నమః జగన్మాత స్వరూపిణి అయిన శ్రీ లలితా దేవిని స్మరించుకుని మనపై చల్లని చూపులు తల్లి ఆశీస్సులు ఇవ్వమని పూజ చేసుకుందాం రండి సఖులూ!! యంత్రం అంటే దేవీ రూపం,మంత్రం అంటే నాదం సృష్టించడం.శ్రీ చక్ర స్వరూపిణి అంటే ప్రకృతి.మనం ఏది తలపెట్టిన అమ్మ దయ వుంటే జయమే.శ్రీ చక్రం అంటే మూడు శక్తుల కలయిక, అవే ఇచ్ఛాశక్తి,ఙ్ఞానశక్తి,క్రియాశక్తి.ఇష్టమైన పనిని చేయుట ఇచ్ఛాశక్తి,ఆలోచించి చేసేది ఙ్ఞానశక్తి,పని ముట్లతో చేసేది క్రియాశక్తి.ఈ చరాచర […]

అవసరానికి మించి నష్టమే 

శరీర అవసరాలకు మించి నీళ్ళు తాగటం మంచిది కాదంటున్నారు నిపుణులు. మూత్ర పిండాలు గంటకు లీటర్ నీటిని వడపోయ గలుగుతాయి. అదే సమయంలో లీటర్ నీళ్ళ కన్నా ఎక్కువ తాగితే ఆ ప్రభావం కిడ్నీలతో పాటు ఇతర శరీర కణజాలపైనా పడతాయి. రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల మంచి నీళ్ళు సరిపోతాయి. ఆ నీళ్ళ పరిమితి దాటితే వాటిని బయటకు పంప వలిసిన భారం కిడ్నీల పైన పడుతోంది. దీనితో రక్తం లో సోడియం పలచబడి […]

ఆ క్రెడిట్ విరాట్ దే 

ఫ్యాషన్ విషయంలో నేనెంతో ఫాస్ట్ గా ముందుంటాను అని అందరు అంటారు గానీ నిజానికి నేనసలు ఫ్యాషన్ ట్రెండ్ ఫాలో అవును. ఆలోచించండి. అస్సలు నాకంత తీరిక ఎక్కడండి అంటోంది అనుష్క శర్మ. విరాట్ తో పెళ్ళయ్యాక ఇటు కుటుంబం అటు నా కెరీర్,ప్రొఫెషన్ తో పరుగులు తీయటం సరిపోతుంది. అదీగాక నాకు పెద్దగా కలర్ కాంబినేషన్ల గురించి తెలియదు. ఎక్కువ వాడుకలో వుండే కలర్స్ తీసేసుకొంటూ. ఒక్కసారి విరాట్ కొనుక్కొన్న డ్రెస్ లు సొంతం చేసుకొంటాను […]

ఇన్ స్టా క్వీన్ ప్రియాంక

ఇన్ స్టా గ్రామ్ క్వీన్ అనచ్చు ప్రియాంకా చోప్రాని . ఆమెని పి సీ అని ప్రేమగా పిలిచే ఫాలోవర్స్ సంఖ్య 49.9 మిలియన్ లు అంటే 4 కోట్ల 99 లక్షలు ఆమె పాప్ గాయనిగా పాశ్చాత్యులకు పరిచయం అయ్యారు . అలాగే అక్కడి టెలివిజన్ సిరీస్ ఆమె చాలా పాప్యులర్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్ళాడిన ప్రియాంక ఎన్నో ముచ్చట్లు,తన వివాహ జీవితం గురించి ,షూటింగ్ లు ,ఫిట్ నెస్ ,అలాటి […]

విలువిద్య లో మేటి

మహిళా విలువిద్యలో దీపికా కుమారి కి ఎదురు లేరు. జార్ఖండ్ కు చెందిన 26 సంవత్సరాల దీపికా కుమారి ఎలాంటి క్రీడా నేపథ్యం లేకపోయినా స్వయం కృషితో ఎదిగింది . దీపికా తండ్రి శివనారాయణ్ మహాతో ఆటో డ్రైవర్ తల్లి గీత మహతో రాంచి మెడికల్ కాలేజీ లో నర్స్ గా పని చేస్తున్నారు . 2005 ఖార్సవన్ పట్టణం లోని అర్జున్ ఆర్చరీ  అకాడమీ లో ఆ తరువాత జెమ్ షడ్  పూర్ లోని టాటా […]

మాళవికా అయ్యర్ 

ఎన్నో రంగాల్లో సేవ లందించిన మహిళలు నారీశక్తి పురస్కారం పొందారు. మాళవికా అయ్యర్ తమిళనాడు కు చెందిన మహిళ ఆమె 17 ఏళ్ళ వయసులో బాంబు దాడికి గురై రెండు చేతులు పూర్తిగా పోయాయి. 18 నెలల పాటు ఆమెకు ఎన్నో శస్త్ర చికిత్సలు జరిగాయి. తరువాత ఆమె లేచి నడవగలిగింది వైకల్యాన్ని లెక్కచేయకుండా ఉన్నత విద్యాబ్యాసం చేసింది సోషల్ వర్క్ లో పిజి,పి హెచ్ డి పూర్తి చేసిన మాళవికా అయ్యర్ ఇప్పుడు దివ్యంగుల హక్కుల […]

 నాట్యమయూరి హరిప్రియ 

రాజమండ్రి కి చెందిన మద్దిపట్ల హరిప్రియ నృత్యంలో పేరు తెచ్చుకొంది. తొమ్మిదో తరగతి చదువుతున్న హరిప్రియ ఇప్పటి వరకు 500 లకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. రెండేళ్ళక్రితం ఇస్రో లోను పశ్చిమ బెంగాల్ లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భం గా ఇచ్చిన ప్రదర్శనలు ఆమెకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి .జాతీయ స్థాయి పోటీల్లో నాట్య మయూరి,అవార్డ్ ,నార్తన్ బాల అవార్డ్,రాష్ట్ర స్థాయి పోటీల్లో నాట్య పరిమళ అవార్డులు గెలుచుకోండి నృత్యం తో పాటు వీణలో నిష్టాతురాలు  హరిప్రియ.

మానవతా రూపం డా గాయత్రి 

చికిత్స కు లొంగని కొన్ని కాన్సర్ లు ఉన్నాయి. అలాంటి అనారోగ్యం బారిన పడిన రోగులు చివరి దశలో చాలా ఇబ్బందులు పడుతారు. వారికీ ఉపశమనం కలిగించే పేలియేటివ్ కేర్ చికిత్స చేస్తారు గాయత్రి పాలట్. హైద్రాబాద్ లోని ప్రభుత్వ ఎం.ఎన్.జె కాన్సర్ హాస్పిటల్ లో పేలియేటివ్ సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయటంలో డాక్టర్ గాయత్రి కీలక పాత్ర పోషించారు. ఈ కేంద్రం ద్వారా చివరి దశలో ఉన్న కాన్సర్ రోగాలకీ వారి కుటుంబాలకు కూడా మనో […]

కల నిజమాయగా !

శ్రీ దేవి లాగా ఎప్పటికైనా పెద్ద హీరోయిన్ అవ్వాలని ,నాకు ఐశ్వర్యా రాయ్ లాగా క్రేజ్ ఉండాలని ఎన్ని కలలు కనే దాన్నో చెప్పలేను అంటోంది సారా అలీఖాన్ . ఆమె కలలు నిజమైనట్లే ఉంది . స్పోర్ట్స్ ఇండియా సెలబ్రీలు జాబితాలో అరవై ఆరో స్థానంలో నిలబడివుంది సారా అలీఖాన్ . చిన్నతనం నుంచి కరణ్ సినిమాలు ఎంతో ఇష్టంగా చూసేదాన్ని . సినిమాలే నా ఊహల్లో . కానీ 85 కిలోలు బరువున్నాను . […]

నిద్ర నొప్పి నివారణ ఔషధం

నిద్ర వల్ల వచ్చే ప్రయోజనాల జాబితా ఎప్పటికప్పుడు పెరిగి పోతోంది . హాయిగా నిద్రపోతే సగం అనారోగ్యాలు రావు . ఇప్పుడే కొత్త పరిశోధన నిద్ర ఓ నొప్పి నివారణ అంటోంది . నిద్ర సరిపోయినంత పోతే నొప్పిని తగ్గించే కోపంగా విడుదలై మత్తు మందు మాదిరిగా పని చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు . నిద్ర సరిగా పోకపోతే ఈ హార్మోన్ విడుదల కేంద్రాలు మూసుకుపోయి నొప్పి మరింత పెరుగుతుందని నిపుణులు చెపుతున్నారు . అంతే నిద్ర […]

దోమలు పరార్ 

దోమల్ని ఇంట్లోకి రాకుండా తరిమి కొట్టాలంటే ఈ మొక్కలు కుండీల్లో పెంచండి అంటున్నారు ఎక్సపర్ట్స్. తులసి నిమ్మగడ్డి బంతి,వెల్లుల్లి ,అజిరేటిమ్,రోజ్ మేరీ సిట్రో నెల్లా గడ్డి లావెండర్ మొక్కలు ఒక ఘాటైన వాసనతో ఉంటాయి. వీటికి దోమల్ని పారద్రోలే శక్తి ఉంటుంది. నిమ్మగడ్డిలో ఉండే సిట్రో నెల్లా నూనెను దోమల నివారణకు ఉపయోగిస్తారు. బంతిలో ఉండే పై రిధ్రమ్ అనే రసాయనం దోమలను తరిమేస్తుంది. రోజ్ మేరీ నుంచి విడుదల అయ్యె రసాయనాలను దోమలు ఆశించవు. ఈ […]

అందాన్నిచ్చే ఫేస్ ప్యాక్   

శనగపిండి మంచి స్క్రబ్బర్. మృత కణాలు తొలగించేందుకు ఎంతో బాగా పనికివస్తుంది. శనగపిండి లో నిమ్మరసం కలిపి చిక్కని పేస్ట్ లాగా చేసి మొహంపై రాసి ఆరిపోయాక నలుస్తు మఖం పై రబ్ చేస్తూ వుంటే ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలు రాలిపోతాయి. మోచేతులు మెడ నల్లగా అనిపిస్తే శనగపిండి పసుపు కలిపి మాస్క్ లా వేస్తే నెమ్మదిగా నలుపు తగ్గిపోతుంది. ముఖం శుభ్రంగా ఉండాలంటే శనగపిండి కీరా రసం ప్యాక్ వేసుకోవాలి. ఆయిల్ చర్మం అయితే […]

ఆఫీస్ డ్రస్సింగ్

ప్రతిరోజు ఎనిమిది నుంచి 10 గంటలు ఆఫీస్ లో గడుపుతున్నారు . కనుక దాన్ని కేవలం పని ప్రదేశంలా చూడకండి . అక్కడ కంఫర్ట్ గా ,తాజాగా ,పూర్తి ఉత్సాహంలో కనపడేలా ప్లాన్ చేసుకోండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . వర్కింగ్ ఉమెన్ కు ఇల్లు ఆఫీస్ పని రెండు రకాల బాధ్యతలు ఉంటాయి . రాత్రివేళ ఉదయం ఆఫీస్ కు ఎలా తయారయి వెళ్ళాలో నిర్ణయించు కొనేందుకు కొద్ది సమయం కేటాయించాలి . ఉదయం వేసుకోవలసిన […]

గోపిక కొట్టంత రాయిల్

కేరళకు చెందిన గోపిక కొట్టంత రాయిల్ లాబ్రోట్  విశ్వవిద్యాలయం అందించే 95 లక్షల స్కాలర్ షిప్ అందుకోంది  . ఆమెది వ్యవసాయ కుటుంబం . వ్యవసాయరంగం పైన పరిశోధన చేయాలనుకొన్నది . కాలికట్  విశ్వవిద్యాలయంలో పి .జి  చేసింది ఇప్పుడు తనకు అందిన స్కాలర్ షిప్ తో తేనెటీగల పెంపకం వైరల్ వ్యాధుల నుంచి వాటిని కాపాడుకొనే దిశగా పరిశోధన చేయనున్నది గోపిక . భారతదేశ వ్యవసాయ విధానాన్ని మరింత పెంచేందుకు గోపిక ఈ డబ్బు వినియోగించాలని […]

“ఏకాంబరేశ్వరుని ప్రసాదం”

తమిళనాడు, కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వరుడిని దర్శనం చేసుకుని వద్దాం పదండి. పార్వతీ దేవికి తన మీద ఉన్న భక్తిని శివయ్య పరీక్షించుటకై ఈ ప్రదేశంలో గంగమ్మను ప్రవహించమని ఆదేశించాడు.శివుని పరమ భక్తురాలైన పార్వతీ దేవి గంగమ్మ నుండి శివలింగాన్ని పూజిస్తూ గట్టిగా ఆలింగనం చేసుకుంది.అది చూచిన శివయ్య భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు సమక్షంలో ఒక మామిడి చెట్టు కింద వివాహమాడాడు. ఫాల్గుణ మాసంలో (మార్చి-ఏప్రిల్) 19,20,21ఈ రోజులలో సూర్య కాంతి నేరుగా శివలింగం పై పడుతుంది. […]