February 2020
కొట్టేంత ప్రేమా ?
చాలా సినిమాల్లో,కథల్లో నిజ జీవితంలో భర్తలు,లేదా ప్రియులు తాము ప్రేమించిన వాళ్ళను చెంప దెబ్బ కోటేసి అది తమ హక్కుగా ప్రేమ గా ప్రకటించుకొని ఉంటారు. అయితే చెంపదెబ్బకొట్టటం చెయ్యి చేసుకోవటమే కానీ ప్రేమ ఎలా అవుతోంది. నేను నటిస్తున్న థప్పడ్ కథ కూడా ఇదే థప్పడ్ అంటే చెంపదెబ్బ. ఆలా దెబ్బ కొట్టిన భర్త నుంచి విడాకులు కోరే భార్య కథ ఇది అంటోంది తాప్సీ. ఈ సినిమ ఉద్దేశ్యం ప్రేమ పేరుతొ వ్యక్తిత్వం పై […]
భూమికి దిగిన క్రిస్టినా
11 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన అమెరికా వ్యోమగమి క్రిస్టినా కోచ్ భూమికి దిగివచ్చారు . ఆమెతో పాటు ఐరోపాకు చెందిన లూకా పార్మిటానో రష్యా వ్యోమగమి అలెగ్జాoడర్ స్కొర్త్సవ్ లు కూడా హామీ నౌక ద్వారా కజికిస్థాన్ లోని గడ్డి నెలల్లో దిగారు . రోదసీ లో ఎక్కువ కాలం గడిపిన మహిళగా అమెరికా వ్యోమగామి పెగ్గీ విట్రాన్ పేరిట ఉన్నా రికార్డ్ ను క్రిస్టినా బద్దలు కొట్టారు . క్రిస్టీన్ 328 రోజులు అంతరిక్షంలో […]
మిమ్మల్ని చెప్పే మీ నడక
నడక మన వ్యక్తిత్వాన్ని చెపుతుంది అంటున్నారు పరిశోధకులు నడక తీరు వారసత్వం కానప్పటికీ అనుకోకుండా అలా వద్దనుకొన్నా నడక తీరు వాళ్ళ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది అంటున్నారు . తలపైకెత్తి తిన్నగా నడిచేవాళ్ళు ఎలాటి ఛాలెంజ్ నయినా స్వీకరిస్తారని నెమ్మదిగా నడిచేవాళ్ళు ప్రశాంత జీవితం కోరుకొంటారనీ తలదించుకొని మెత్తగా అడుగులు వేసేవాళ్ళు కాస్త పిరికిగా ఉంటారని ఇక ఫోన్ లో మాట్లాడుతూ ,పాటలు వింటూ హడావుడి చేస్తూ నడిచేవాళ్ళు ఎంతో సమర్థవంతులుగా ఉంటారని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు . దీని […]
ఇప్పుడివే ఫ్యాషన్
కాస్త సింపుల్ గా ,హుందాగా ,ఆకర్షణీయంగా కనిపించాలి అనుకొంటే సాలిటెయిర్ డైమండ్ నగలు ఎంచుకోండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఏ మేలిరకపు రాళ్ళ తో అయినా ఒక్క వజ్రంతో కలిపితే మరింత అందంగా ఉంటాయి . సాలిటెయిర్ డైమండ్ పొదిగిన ఉంగరాలు రోజు ధరించేందుకు వీలుగా ఉంటాయి . ఈ డైమండ్స్ ను సేంట్ లతో కొలుస్తారు . రాళ్ళ నాణ్యతను హామీగా జి.ఐ.ఎ ,లేదా ఐ.జి .ఐ. సర్టిఫికెట్ తీసుకోవాలి . ఒంటిరాయితో మెరిసే […]
వయసుతో పనేముందీ ?
చదువు పట్ల ప్రేమకు వయస్సుతో పనిలేదు.105 సంవత్సరాల కేరళ మహిళ భగీరథ అమ్మ 74.5 శాతం మార్కు లతో నాలుగో తరగతి పాస్ అయిపోయింది.కేరళ రాష్ట్ర అక్షరాస్యత యంత్రంగం అమ్మ ఉతీర్ణతను అధికారకంగా ప్రకటించింది.కొల్లం జిల్లా త్రిక్కరువ పంచాయతీ లోని ప్రక్కులం గ్రామంలో భగీరథ అమ్మ నివసిస్తోంది. మూడవతరగతి లోనే పెద్దల వత్తిడితో చదువు మానేసిన భగీరధమ్మ,పట్టుదలతో ఇప్పటికి చదువు మొదలు పెట్టి. నాలుగో తరగతి పాసై ఐదొవ తరగతిలో చేరనున్నది.
శ్రీ పల్లికొండేశ్వర స్వామి ప్రసాదం”
చిత్తూరు జిల్లాలో తిరుపతికి 76 కి.మీ. దూరంలో ఉన్న పల్లీశ్వర స్వామిని దర్శించి వద్దాం పదండి. అమృత మథనాన్ని వాసుకినితో దేవతలు, రాక్షసులు మధిస్తున్న సమయంలో కాలకూట విషం మొదటగా రావటంతో శివుడు దానిని త్రాగి నీలకంఠుడైనాడని మనందరకి తెలుసు.ఆ విషం తీసుకుని ఈ క్షేత్రం లో విశ్రమించాడని అందుకు ఈ శయనేశ్వరుడని పూజించి అనుగ్రహం పొందండి. పెళ్ళి కాని వారు తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించాలి వెంటనే వివాహం జరుగుతుంది. నిత్య ప్రసాదం: కొబ్బరి,పంచామృతాభిషేకం -తోలేటి […]
మోడెర్న్ లుక్
ఎప్పుడు వేడుకొనే కుర్తీలు మరింత స్టయిల్ గా కనిపించాలి అంటే బెల్ స్లీవ్స్ కుట్టించుకొంటే బావుంటుంది. కీర్తితో పాటు రన్నింగ్ మెటీరియల్ లో స్లీవ్స్ కుట్టించుకొంటే ఫ్యాషన్ గా ఉంటుంది. లేదా అంచుల్లో డిజైన్ ఉండేలాగా,కాంట్రాస్ట్ కలర్ స్లీవ్స్ వేసుకొన్న బావుంటుంది. అయితే కీర్తి ని బట్టి స్లీవ్స్ వెడల్పు నిర్ణయుంచుకోవాలి సన్నగా కనిపించాలి అంటే తక్కువ కుచ్చులతోను,నిండుగా కనిపించాలి అంటే ఎక్కువ కుచ్చులతోను బెల్ స్లీవ్స్ ఎంచుకోవాలి. బెల్ స్లీవ్స్ లేయర్ల లాగా ఉన్న అందమే. […]
పడుకోవటమూ అసాధ్యమే
ప్రతి రోజు సగటున ప్రతి వ్యక్తి దాదాపు 16 గంటలు పాటు కూర్చునే అన్ని రకాల పనులు చక్క బెడుతు ఉన్నట్లు పరిశోధికులు కనిపెట్టారు, ఆరోగ్యాన్ని పెంపొందించుకొనే దిశగా శరీరంలో ఎలాటి కదలికలు లేకపోవటం వల్ల కాలినరాల్లో రక్త ప్రసరణ సాఫీగా జరగక కాళ్ళకు సంబందించిన సమస్యలు వస్తున్నాయి. ఎక్కువ సేపు కుర్చీలో కూర్చోవటం వల్ల మెడ,వెన్నుపాము ముఖ్యంగ వెన్నెముకలో సెర్వైకల్ వెటెబ్రోలో, అంటే కూర్చునేందుకు వీలు కల్పించే వెన్నుభాగం దెబ్బతిని పోతుంది. వెన్నుపాములోని 26 వెన్నుపూసలో […]
చిన్న ఊరంత భవనం
న్యూ సెంచరీ గ్లోబల్ సెంటర్ ప్రపంచంలోనే అతి పెద్దదైన కట్టడం. చైనాలో ఉన్న ఈ భవనం విస్తీర్ణం 420 ఎకరాలు ఒక చిన్న పట్టణం అంత అన్నమాట ఇందులో షాపింగ్ మాల్స్ బ్యూటీ పార్లర్లు, ఆటస్థలాలు అన్ని వుంటాయి. ప్రత్యేక ఆకర్షణ ఒక వాటర్ పార్క్ దీన్ని పారడైజ్ ఐలాండ్ వాటర్ పార్క్ అంటారు. ఇందులో 54 వేల చదరపు అడుగుల కుత్రిమ సముద్ర తీరంలో సూర్యోదయం, సూర్యాస్తమయం చుడచ్చు.ఈ భవనంలో కుత్రిమ సూర్యుని తయారుచేశారు ఉదయం […]
ఆదినాకు గర్వకారణం
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎందరో మహాను భావులు మధ్య నా మైనపు బొమ్మ ఉండటం నాకెంతో గర్వంగా అనిపించిందో చెప్పలేను ఇది నేను ఊహించని బహుమతి. నా జీవితంలో నాకు దొరికిన అపురూపమైన బహుమతి కూడా అంటోంది కాజల్. సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది కాజల్. ఈ మ్యూజియంలో సీత నుంచి మైనపు బొమ్మగా చోటు సంపాదించుకొన్న తొలి హీరోయిన్ కూడా కాజల్ కావటం విశేషం. దశాబ్ద కాలంగా ఆమె […]
“శ్రీ కృష్ణ దేవుని ప్రసాదం”
చిన్ని శిశువూ…చిన్ని శిశువూ ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు!! కేరళ రాష్ట్రంలో ఉన్న కొట్టాయంలోని తిరువరుపులో శ్రీ కృష్ణుని ఆలయం వుంది. ఇక్కడ స్వామి ప్రసాదాన్ని భుజిస్తారు.రోజుకి ఏడు సార్లు నైవేద్యం సమర్పిస్తారు.స్వామి ఆకలికి ఉండలేరు అని తెల్లవారుఝామునే నైవేద్యం పెట్టి సేవలకు అనుమతిస్తారు. శ్రీ కాళహస్తీశ్వరాలయం సూర్య గ్రహణం నాడు కూడా తెరచియునట్లే ఈ ఆలయం కూడా తెరచే వుంటుంది.సంతానం లేనివారు,వివాహ దోషాలను మొదలగునవి ఈ ఆలయ దర్శనం చేసుకొనిన తప్పకుండా శుభం కలుగుతుంది.ఈ […]
ఈ ఛాలెంజ్ ఆరోగ్యకరం
నో షుగర్ ఛాలెంజ్ తీసుకోవటం అంటే ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవటం మొదలు పెట్టడమే అంటారు ఎక్స్ పర్డ్స్ . తేనె, బెల్లం,చక్కర వంటివి పూర్తిగా మానేయటం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ ఉండే మాట నిజం . శరీరానికి కావలసిన సహజమైన చక్కర పండ్లు ,కూరగాయలు ,తృణధాన్యాల నుంచి కూడా లభ్యం అవుతుంది . వెన్న,నెయ్యి,జున్ను,ముల్లంగి,ఆకుకూరలు ,పుచ్చకాయలు,బెర్రీ ఇలాటివి ఎన్నో పదార్దాలు శరీరానికి శక్తి ఇచ్చేవిగా ఉన్నాయి . స్ట్రాబెరీలు ,పిచ్ ,నిమ్మ,ఆరెంజ్ ,ద్రాక్ష,అవకాడో,పుచ్చకాయ వంటివి ఆహారంలో […]
నేను గుర్తుంటే చాలు
నేనెప్పుడూ మంచి పేరు కోసమే పని చేశాను . ఒక సినిమా చేయాలా వద్దా అన్న విషయంలో నేనెప్పుడూ డబ్బు వైపు చూడలేదు . ఆ సినిమా వల్ల నాకు ఎంతో పేరు వస్తుందీ అన్న విషయం మాత్రం ఆలోచించుకొని కష్టపడుతూ వచ్చాను . అలాగే పేరు వచ్చింది . డబ్బు కూడా వచ్చేసింది అంటోంది సమంత . నాకేరీర్ లో పదేళ్ళు గడిచాయి . కాలం గడిచేసేది కొత్త హీరోయిన్లు వచ్చారు . కొందర్ని బాగా […]
బ్రేక్ ఫాస్ట్ తర్వాతే బెస్ట్
అరటి పండు తింటే తక్షణ శక్తి వస్తుందన్న ఉద్దేశ్యంతో చాలా మంది ఉదయాన్నే అరటి పండు తింటూ ఉంటారు. దాన్ని సులువుగా తినచ్చు,కడుపు నిండిన భావన కలుగుతోంది అన్న విషయం యదార్ధం. కానీ దాన్ని బ్రేక్ ఫాస్ట్ కంటే ముందు తిన కూడదు. ఆ పండులో వుండే ఎసిడిక్ కణాల వల్ల దాన్ని పరగడుపున తింటే జీర్ణ సంబంధమైన సమస్యలు వస్తాయి. బ్రేక్ ఫాస్ట్ తిన్న తరువాతనే అరటి పండు తినాలి. అలాగే దానితో పాటు డ్రై […]
వెల్లుల్లి తో సమస్య
వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిసిందే . కొవ్వుని కరిగించేది . జీర్ణశక్తి ని పెంచేది . నోటి వ్యాధులకు మందుగా వెల్లుల్లి సుగుణాల గురించి విన్నాం . కానీ కొత్త అధ్యయనం వెల్లుల్లి వల్ల సమస్యలు ఉన్నాయంటోంది . ప్రతి రోజూ వెల్లుల్లిని తీసుకొంటే లివర్ పనితీరు దెబ్బ తింటుంది అంటున్నారు అధ్యయనకారులు . పాచి వెల్లుల్లిని తీసుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ హెల్త్ దుష్ప్రభావం పడుతుంది . అంచేత దీన్ని మితంగా వాడాలి . పాచి […]
పూర్తి భిన్నంగా
స్త్రీ ,పురుషుల మెదడు నిర్మాణాలు పుట్టుకలో ఒకేలా ఉన్నా యవ్వనంలోకి అడుగు పెట్టేక ఎన్నో మార్పులు వస్తాయి . మెదడు లోని ఒక భాగం మరో భాగానికి కలిపే నాడుల నిర్మాణం స్త్రీ ,పురుషుల్లో భిన్నంగా ఏర్పడుతుంది . పురుషుని మెదడు కొత్త అంశాలను నేర్చుకునేందుకు . ఆ నేర్పును ప్రదర్శించేందుకు అనువుగా రూపు దిద్దుకొంటే ,ఆడవారి మెదడు జ్ఞాపక శక్తి ,సామాజికంగా నలుగురితో కలిసి పనిచేయవలసి అంశాల్లో మెరుగ్గ తయారవుతుంది . పురుషులు లాజికల్ గా […]
నిండైన సౌందర్యం
యవ్వనవంతమైన చర్మం ,మెరిసే నిండైన బుగ్గలతో మొహం కళకళలాడి పోవాలి అంటే శక్తినిచ్చే ఆహారం తినాలి . క్రీమ్ లు మసాజ్ లతో ,రసాయనాలతో చేసే ఫేషియల్స్ తో ముఖ సౌందర్యం ఎంత మాత్రం పెరగదు, చర్మ ఆరోగ్యానికి మేలు చేసే మామిడి ,కమలా,బత్తాయి కర్బుజా, దానిమ్మ ,నేరేడు మొదలైన రంగురంగుల పళ్ళు తినాలి . వివిధ ఆకుకూరలు చర్మాన్ని యవ్వనంగా ఉండేలా చేస్తాయి . కాఫీ ,టి లను అవతల పెట్టి మంచినీళ్ళు తాగాలి . […]
లెక్కల మ్యూజియం
ప్రపంచంలో ఎన్నో రకాల మ్యూజియంలో ఉన్నట్లే లెక్కలకో మ్యూజియం ఉంది . తమిళనాడు లో శ్రీనివాస రామానుజమ్ సారిక మ్యూజియం లెక్కలకు సంబంధించిందే . రామానుజమ్ ప్రైమ్,రామానుజమ్ ఠటా ఫంక్షన్ ,మాక్ ఠటా ఫంక్షన్వంటి 3900 సమీకరణల్ని కనుగొన్న భారతీయ గణిత మేధావి పేరిట నిర్మించిన ఈ మ్యూజియం ఎంతో మంది విద్యార్దులను రికార్చ్ స్కాలర్ ను ఆకర్షిస్తోంది . ఇంకో విశేషం ఏమిటంటే అయన పుట్టి పెరిగిన ఇల్లే ఈ మ్యూజియంగా మార్చారు . ఇక్కడకు […]
వత్తిడి మాయం
ఒత్తిడి ఆందోళన ఈ ఆధునిక ప్రపంచంలో తొంభై శాతం మందిని వేధించే అనారోగ్యాలు. వీటికి వైద్యం మందులు కంటే థెరపీలు బాగా పనిచేస్తాయంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నెన్నో వింత థెరపీలు కూడా ఉన్నాయి. ఇందులో ఎమ్టీ ఛెయిర్ థెరపీ ఒకటి. ఆఫీస్ లో బాస్ పైనో,అంతులేని కోపం వస్తుంది. ఏమీ అనలేక అంతులేని ఒత్తిడి పీడిస్తు ఉంటుంది. ఇలాంటి సందర్భంలో జర్మనీ సైకో థెరపిస్ట్ ఫెడరిక్ సాలొమాన్ ఎమ్టీ ఛెయిర్ టెక్నిక్ కనిపెట్టాడు. ఇందులో ఎదురుగ ఒక […]
ఈ హారానికి ఆదరణ
రాముడిని మించిన దైవం లేదంటారు రామ భక్తులు. రాముని చెంత చల్లని కళ్ళతో ఆశీర్వదించే సీతామాత..వాళ్ళని కొలుస్తూ ఆంజనేయుడు ఒక అలవాటైన అపురూపమైన దృశ్యం. ఈ ముగ్గురితో పాటు లక్ష్మణుడు కూడా ఈ అందమైన హారాల్లో కొలువుదీరి కనిపిస్తాడు. ఈ మధ్య కాలంలో విశేషమైన ఆదరణ పొందిన హారాల్లో ఈ రామ పరివారపు హారం ఒకటి. రత్నాలు,పచ్చలు ఖరీదైన వజ్రాలతో మలిచిన ఈ హారానికి. రామ లక్ష్మణ సీత,హనుమంతుల లాకెట్ ప్రత్యేక ఆకర్షణ. రాళ్ళూ కూర్చిన చిన్న […]
