September 2019
ఆలూ ఫేషియల్
ఖరీదైన ఫేషియల్ పాక్స్ కంటే బంగాళా దుంప రసం ఎంతో బాగా పనిచేస్తుంది అంటారు ఎక్సపర్ట్స్. మొహం పైన మచ్చలు ముడతలు ఉంటే ఈ ఆలూ రసం బాగా ఉపయోగపడుతోంది. బంగాళా దుంప ముక్కలు మిక్సీ లో వేసి రసం పిండి చల్లగా అయ్యేంత వరకు ఫ్రిడ్జ్ లో పట్టాలి. ఈ రసంలో దూది ముంచి ముఖం మొత్తం,మెడ చెవులు కలిపేలా అద్దుకోవాలి. రెండు నిమిషాలు ఆగి కడిగేసుకోవాలి. ఆ తరువాత,నాలుగు స్పూన్ల బంగాళా దుంప రసం […]
బంగారపు హోటల్
అద్భుతమైన హోటల్స్ చూసి ఉంటారు . మరి కేవలం బంగారంతో తాపడం చేయించిన హోటల్ చూశారా ?. వియత్నాం లోని హాన్ రివర్,సన్ ట్రా పెనిన్సులా దగ్గర ఉన్న ఈ హోటల్ లో అడుగడుగునా బంగారపు ధగధగలు . స్థానిక హావా బిన్ గ్రీన్ కార్పొరేషన్ ప్రారంభించిన గోల్డెన్ బే హోటల్ మొత్తం బంగారు రంగు థీమ్ తో డిజైన్ చేశారు. ఏదో మాములు గోల్డ్ కలర్ కాదు ,కుర్చీలు,టేబుల్స్ ,బాత్ రూమ్ లో సింక్ లు […]
ముక్కుపుడక ఫ్యాషన్
ఏ వయసు వాళ్ళకైనా ముక్కుపుడకలు బావుంటాయి. ఇప్పటికి ఫ్యాషన్ ట్రెండ్ కూడా. ముక్కు రంద్రం చేయించుకోవచ్చు, లేదా ప్రెస్ చేసేవి కూడా వున్నాయి ప్లాటినమ్ వంటి వజ్రంలో చేసేవి టీనేజర్లకు బావుంటాయి లేదా రెండు మూడు గ్రాముల బరువుతో రాళ్ళూ పొదిగిన వేలాడే మువ్వలు ఉండే ముక్కుపుడక కూడా బావుంటుంది. మరి పెద్ద ముక్కుపుడకలు రోజు పెట్టుకునేందుకు అనువుగా ఉండవు గాని ధరించేందుకు వీలుగా వుండే పూవులు లతల డిజైన్ల వి చిన్నవిగా వుండేవి ఎంచుకుంటే బావుంటుంది. […]
ఆరోగ్యానికి సోంపు
భోజనం చేయగానే సోంపు వేసుకునే అలవాటు ఎంతో మందికి వుంటుంది. ఈ సోంపు కంటి ఆరోగ్యానికి చాలా మంచిదంటారు చెక్కర,బాదం సోంపు సమానంగా తీసుకొని ముద్ద చేసి పాలతో కలిపి రాత్రి పూట తాగితే కంటి చూపు మెరుగవుతుందటున్నారు వైద్యులు. సోంపు తేనె కలిపి తింటే కాలేయం ఆరోగ్యంగా వుంటుంది. సోంపు వేసి టి తాగితే దగ్గు తగ్గుతోంది. సోంపు తో నోటి దుర్వాసన తగ్గుతోంది సోంపు వేసి మరిగించిన నీళ్ళు తాగితే శరీరం లోని వ్యర్దాలు […]
“శ్రీ విద్యాగణపతి ప్రసాదం”
తొమ్మిది రోజుల గణపతి నవరాత్రులు అన్ని ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. వసిన్యాది వాగ్దేవతలు శ్రీ విద్యా గణపతిని పూజించి అనుగ్రహం పొందండి అని చరిత్ర చెబుతోంది. శ్రీ లలితా సహస్ర నామము నడిస్తే మనకు దర్శనం ఇస్తారు.రాక్షసుల బారినుండి తమను రక్షించడానికి అమ్మ యుద్ధానికి వెళితే ఆ సమయంలో 8 దుష్ట శక్తులు శ్రీ చక్రం లో పడేశారు అసురులు.అవి:సోమరితనం,అలక,బేలతనం,నిద్ర, కిరాతకం, వెనకడుగు వెయ్యడం,కోపం,హింసించడం.ఈ 8 దుష్ట శక్తులును అధిగమించి విజయాన్ని సాధించాలి అంటే మరి […]
ఇదే మొదటిది ,ఆఖరుది
జాతీయ పురస్కారానికి ఎంపికకై నట్లు తెలియగానే ఒక ఏడాదిపాటు నేను పడ్డ కష్టానికి తగిన ప్రతి ఫలం దక్కింది అనిపించింది. మహానటి సినిమా షూటింగ్ నేను మరిచిపోలేని అనుభవం గంటలకొద్దీ మేకప్ సరిగ్గ చేయలేక పోతే ఉన్నా పేరు పోగొట్టు కొంటానేమో నన్న భయం నన్ను చాలా ఉక్కిరి బిక్కిరి చేసింది అంటోంది కీర్తి సురేష్. మహానటి ఒక అద్భుతం అందరిని కట్టిపడేసే ఒక మాయాజాలం. అలాటి సినిమాలో నటించక ఇంకో బయోపిక్ లో నటించలేను,నటించాను కూడా. […]
గుండె పదిలం
గుండె గుప్పెడే కానీ మనిషి ప్రాణం దాని గుప్పేట్లోనే . ఎన్నో భావోద్వేగాలు అదుపు చేసుకోవాలన్న,వ్యక్తం చేయాలన్న పంచుకోవాలన్న గుండె పదిలంగా ఉండాలి . అందుకు ఆరోగ్యకరమైన అలవాట్లు కావాలి . రోజులో కనీసం పదిసార్లు పండ్లు ,కూరగాయలు తినాలి . అప్పుడు కార్డియా వానక్యులర్ నుంచి ప్రమాదం ఉండదు . వేపుళ్ళు మానేసి ,బట్టర్ ,చీజ్ ,పేస్ట్రీస్ మానేసి వెజిటేబుల్ ఆయిల్స్ ఎక్కువ మోతాదులో కార్బోహైట్రేడ్స్ కలసి ఉన్న ఆలివ్ ఆయిల్ ,తక్కవ రిఫైన్డ్ చేసిన […]
కొంచెం తినండి
ఏదైనా పండగో,సెలవో వస్తే ఇంట్లో ఉండటం తో అత్యధిక క్యాలరీలు ఉండే పదార్దాలు తినేయటం సహజం. వారం పాటు నోరు కట్టేసుకుని సెలవు రోజుల్లో కాస్త ఎక్కువ తినేయటం తో బరువు పెరగటం జరుగుతోంది కనుక వీలైనంత వరకు రొటీస్ కే అంటి పెట్టుకొని ఉండటం ఉత్తమం. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లంచ్ మానేయకూడదు. ఇంట్లోనే,సెలవు కదా ఎదో ఒకటి ఎగ్గొట్టిన, ఆవేళ రెండో భోజనం కాస్త అధికంగానే కడుపులోకి చేరుతుంది. మరి తినాలనిపిస్తే వైట్ స్టార్ట్ […]
ఎక్కువకాలం మన్నికగా
ఖరీదైన సిల్క్ దుస్తులు ఇంట్లో ఉతికే క్రమంలో కొన్ని జగ్రత్తలు పాటిస్తే అవి ఎక్కువ కల మన్నుతాయి . వీటిని ఉతికేందుకు గాఢత తక్కువ ఉన్న డిటర్జెంట్ ని ఎంచుకోవాలి . మొదటి సారి ఉతికే ముందు ,చీరె అంచును నీటిలో తడిపి చూస్తే రంగు వెలిసేదా లేనిదా తెలుస్తుంది . రంగు వెలిసేలా ఉంటె దాన్ని వేరుగా ఉతకాలి . టబ్ నిండా గోరువెచ్చని నీరు నింపి,అందులో గాఢత తక్కువగా ఉండే షాంపూ ,బాడీవాష్ ,లేదా […]
భోజనానికి బుక్ ఉచితం
ఫైవ్ స్టార్ హోటల్లో కూడా సాధారణంగా నచ్చిన ఆర్డర్ చేసి తింటే వెంటనే బిల్ ఇస్తారు. కానీ ఢిల్లీ లోని (దానెర్జీ ) ఇండియన్ కేఫ్ లో మాత్రం కాస్టమర్ కి బిల్ తో పాటు పుస్తకం కూడా ఆఫర్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తినటం పూర్తయ్యాక అరల్లో అరుదైన పుస్తకాలు చూసి నచ్చిన దాన్ని ఎంపిక చేసుకొని ఉచితంగా తీసుకోవచ్చు వెయ్యి రూపాయలు బిల్ చేస్తే రెండు పుస్తకాలు,ఇంకా ఎక్కువ బిల్ చేస్తే మూడు […]
రికార్డ సృషించిన పుష్ప కోహ్లీ
పాకిస్థాన్ పోలీస్ శాఖలో కొలువు సాధించిన మొదటి హిందూ మహిళ గా రికార్డ్ సృషించింది పుష్ప కోహ్లీ . ప్రపంచంలోని ముస్లిం ప్రాబల్య దేశాల్లో పాకిస్థాన్ ఒకటి . అక్కడ హిందువులు మైనారిటీలే . అధికారుల లెక్కల ప్రకారం పాకిస్థాన్ లోని హిందువుల సంఖ్య 75 లక్షలు . చాలా మంది సిందూ ప్రావిన్స్ లో స్థిరపడిన వారే . పుష్ప కోహ్లీ అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ గా నియమితురాలైనట్లు పాకిస్థాన్ కు చెందిన వార్తా […]
టుస్సాడ్స్ మ్యూజియంలో శ్రీ దేవి
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో శ్రీ దేవి మైనపు విగ్రహం కొలువు తీరింది . 1987లో అనిల్ కపూర్ శ్రీ దేవి నటించిన మిస్ ఇండియా లోని హవా హవాయి పాటలో ఆమె రూపాన్ని పోలిన మైనపు బొమ్మను రూపొందించారు . బంగారు వర్ణపు దుస్తులు తలపైన కిరీటం తో శ్రీ దేవి నిజంగా జగదేక సుందరి లాగే ఉందని,ఆమె ముగ్ద మనోహర రూపాన్ని చూసి ఎంతో సంతోషించమని శ్రీ దేవి అభిమానులు నివాళి సందేశాలు పంపారు . […]
నెట్ వర్క్ ముఖ్యం
అమ్మాయిలు కెరీర్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ముందుకు దూసుకువెళ్తున్నారు అని అధ్యయనాలు చెపుతున్నాయి. కానీ దానిలో మరింత వేగంతో ముందుకు వెళ్ళాలంటే పరిధిని పెంచుకుంటున్నారు ఎక్సపర్ట్స్ నెట్ వర్క్ పెంచుకోవలి తోటి వారితో సత్సంబందాలు ఎంచుకున్న రంగం ఇది వరకే సక్సస్ ఫుల్ గా నడుస్తున్న ఎక్సపర్ట్స్ తో మాట్లాడటం,సలహాలు తీసుకోవటం ఎంతో లాభిస్తుంది అంటున్నారు. ప్రతి రంగానికి సంభందించిన ఎన్నో వెబ్ సైట్స్ ఉంటాయి. వాటిని తప్పని సరిగా గమనించాలి చేస్తున్న పనిలో ఎన్నో సందేహాలుంటాయి. […]
గుండె పదిలం
గుండె గుప్పుడే . కానీ మనిషి ప్రాణం దాని గుప్పేట్లోనే . ఎన్నో భావోద్వేగాలు అదుపు చేసుకోవాలన్న, వ్యక్తం చేయాలన్న పంచుకోవాలన్న గుండె పదిలంగా ఉండాలి . అందుకు ఆరోగ్యకరమైన అలవాట్లు కావాలి . రోజులో కనీసం పదిసార్లు పండ్లు ,కూరగాయలు తినాలి . అప్పుడు కార్డియా వానాక్యులర్ నుంచి ప్రమాదం ఉండదు . వేపుళ్ళు మానేసి ,బట్టర్ ,చీజ్ ,పేస్ట్రీస్ మానేసి వెజిటేబుల్ ఆయిల్స్ ఎక్కువ మోతాదులో సైబర్ కార్బోహైట్రేడ్స్ కలసి ఉన్న ఆలివ్ ఆయిల్ […]
విలువైన పండ్లు
ఈ సీజన్ లో పియర్స్ ఎక్కువగానే దొరుకుతాయి . వీటిలో ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఆక్సీడెంట్లు ఎక్కువే . గుండెకు మేలు చేస్తాయి పియర్స్ . శరీరంలోని విషతుల్యాలని వెలికి పంపటంలో ఉపకరిస్తాయి . పియర్స్ తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది . చర్మం ముడతలు పడవు . విటమిన్ కె ,ఇతర యాంటీ ఆక్సీడెంట్లు ప్రీరాడికల్స్ ను తగ్గిస్తాయి . కాల్షియం పుష్కలంగా ఉంటుంది . రక్తహీనత,ఎముకలు,దంతాల సమస్యకు ,ఈ పండ్లు చక్కని పరిష్కారం. పియర్స్ పండ్లు వృద్ధాప్య […]
బొత్తిగా స్వార్థపరులు ?
కొత్త దంపతుల మధ్యన ఎందుకు అభిప్రాయ బేధాలు వెంటనే వస్తున్నాయి,ఎందుకు అమ్మాయిలు దాంపత్యానికే దూరం అయిపోదామని చూస్తారు అని ఒక సీరియస్ సర్వే జరిగింది. చాలా చిన్న అంశాలే ఆడ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయని తేలింది. బెడ్ రూమ్ లో సాక్స్ తో రావటం, అవి ఏ మాత్రం శుభ్రంగా లేకుండా వాసన రావటం. భార్యతో ప్రేమగా మాట్లాడటం చేతకాక,ఏవో మాట్లాడేయటం, క్రియేటివిటీ లేకపోవటం, తమ సంగతి తాము చూసుకోవటం తప్ప, భార్య గురించి అస్సులు ఆలోచించక […]
అందం గురించే ఆలోచన
ఈ మధ్య కాలంలో నా ఆలోచనా తీరు చాలా మారింది అంటోంది కాజల్ అగర్వాల్ . ఇంతకు ముందు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కగా అందంగా కనిపించాలని నాకేంతో తాపత్రయం ఉండేది . స్టార్ట్ కెమెరా అనగానే నేను నటించాల్సిన ఎమోషనల్ కంటే నేను అందం గా కనిపిస్తున్నానా లేదా అనే ఆలోచనే ఎక్కువ కానీ అది కరెక్ట్ కాదని అనుకొన్నా . నన్ను నేను విశ్లేషించు కోవటంలో ఒక లాభం ఇది . ఆ తరువాత […]
కాస్త చోటివ్వండి
పక్షుల సంరక్షణ పెద్ద ఖర్చుతో కూడుకొన్న వ్యవహారం ఏమీకాదు, చిన్ని ఖర్చుతో ఇంట్లోనే పక్షుల కోసం ఏర్పాట్లు చేయవచ్చు. వెంటి లెటర్స్ దగ్గర, చెట్ల దగ్గర బాక్స్ ఆకారంలో చిన్ని పెట్టిలు, తీగతో కట్టి గూడు ఏర్పాటు చేయవచ్చు . ఈకలు ,పీచు, పువ్వుల వంటివి అందుబాటులో ఉంటే పక్షులే గూడు కట్టుకొంటాయి . సూర్య రశ్మి, వర్షం వాటిపైన మరీ ఎక్కువగా పడకుండా ఉండే చోట పక్షుల కోసం చిన్ని గూడు ఏర్పాటు చేయాలి. వాటికోసం […]
చిన్న మార్పులతో ట్రెండీలూక్
చదువు ముగించి ఉద్యోగాల్లో చేరాక అమ్మాయిలకు వస్త్రధారణ విషయంలో కొన్ని మార్పులు చాలా అవసరం. కార్పోరేట్ విభాగాల్లో నలుపు, తెలుపు, గ్రే కలర్ దుస్తులు సాధారణ డ్రెస్ కోడ్ లో వుంటాయి. లేదా అలాంటి రంగులు వాతావరణానికి సరిపోతాయి. చిన్న చిన్న ఎలిమెంట్స్ లో అదే రంగులని ఇంకాస్త ట్రెండీ కార్పోరేట్ లుక్ నిట్స్ లేయరింగ్ లో మెరుగవుతోంది. విభిన్న కమిసోల్స్, ష్రగ్స్, ర్యాప్స్ ప్రయత్నం చేయవచ్చు. ఎక్కువ ఏ టెన్షన్ లేని సింపుల్ యాక్ససరీస్ ఎంపిక […]
దత్తత జాబితాలో చెట్లు
ఒక్క యువతి తీసుకొన్న శ్రద్ద అస్సాం లోని హార్గలా అని పిలిచే స్టార్క్ పక్షులకు ఆవాసం ఏర్పడింది . అస్సాంలోని సెన్సోలా కుతి కోసియా గ్రామాల్లో స్టార్క్ పక్షులు అక్కడి సిల్క్ చెట్లపైన గుళ్ళు కట్టుకొని గుడ్లు పొదిగి సంతానాన్ని అభివృద్ధి చేసుకొంటాయి . అయితే ఇష్టం వచ్చునట్లు చెట్లు నరకడం వల్ల ఈ జాతి అంతరించి పోవటం ప్రారంభించింది . ఐక్యరాజ్య సమితి కూడా వాటిని అంతరించి పోయిన పక్షుల జాబితాలో చేర్చింది . 2008లో […]
