September 2019
“ద్వాదశ మహా గణపతి ప్రసాదం”
మహా గణపతిం మనసా స్మరామి. వశిష్ఠ వామ దేవాది వందిత!! వినాయకచవితి అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు కదా!! 1960 నుంచి ఇక్కడ వినాయకుడికి పూజలు నిర్వహిస్తూ వస్తున్న ఆచారం మనకు తెలిసిన విషయమే. 11 రోజులు వైభవంగా పూజలు అందుకుంటాడు.కోరిన కోరికలు తీర్చే గణపయ్య.ఈ గణనాధుని ఆదాయం సుమారు కొన్ని కోట్ల రూపాయలకు చేరింది.ఈ స్వామి వారి సన్నిధిలో ఎంతో మంది పిల్లలకు ఉచిత చదువులకు,భోజనం పెట్టి చల్లని చూపుతో ఆశీస్సులు అందిస్తున్నాడు. గణనాధుని […]
ఈ స్నేహం సాధ్యమా ?
ఇది పాత కథే ,కానీ ఎప్పుడు తలుచుకొని సంబాషించ దగిన కొత్త విషయం ఆశ్ఛర్యం కలిగించే అంశం. ఆ మూడు జంతువులు క్రూర మైనవి, ఆ జన్మ విరోధులు అయిన ఎంతో స్నేహితులు తిండి,నిద్ర ఆటలు అన్ని వేళలా కలిసే వుంటాయి. కలిసే చేస్తాయి. ఇవి అట్లాంటాలోని ఒక బేస్ మెంట్ ఏరియాలో డ్రగ్ రాకెట్ గుట్టు మట్టు చేసేందుకు వెళ్ళిన పోలీసుల కంటపడ్డాయి 2001 లో చిన్న వయసులో ఈ పులి,సింహం,ఎలుగు బంటిని తెచ్చి జార్జియా […]
మరచి పోతున్నారా ?
పది నిముషాల ముందు టేబుల్ పైన తాళం చెవులు గుర్తురావు. ఆఫీస్ హడావుడిలో వుంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టామో ఒక పట్టాన గుర్తు రావు. ఎందుకిలా ? పాతికేళ్ళు దాటకుండానే మతి మరుపు వస్తోందేమిటి ? అనుకుంటారు. ఈ జ్ఞాపక శక్తి తగ్గుదల వయస్సుతో నిమిత్తం లేకుండా పెద్దలకు పిల్లలకు వస్తోంది. జ్ఞాపక శక్తి మెరుగుపడాలంటే ఆరోగ్యపు అలవాట్లలో కొద్దీ మార్పులు చేసుకోవాలి. కాల్షియం ఎక్కువగా లభించే పాలు చీజ్,బట్టర్ పెరుగు వంటివి మెదడు చురుకుదనానికి […]
ఇక్కడ బుక్స్ ఉండవు
గ్రంధాలయాలు లేని ఊర్లు ఉండవు . పుస్తక ప్రేమికులు సందర్శించే ఒక దేవాలయం గ్రంధాలయం . పేరులోనే పుస్తకాలకు ఆలయం అనే అర్ధం ఉంది . కానీ డెన్మార్క్ లోని హ్యూమన్ లైబ్రరీకి వెళితే పుస్తకాలు కనిపించవు . మెనూ బోర్డ్ ఉంటుంది . ఆ మెనూ ప్రకారం మనం తెలుసుకోవాలనుకొన్న అంశాన్ని ఎంచుకొంటే ,వెంటనే ఆ అంశానికి సంబందించిన సమాచారం అందించేందుకు ఒక వ్యక్తి అందుబాటులోకి వస్తాడు . సందేహాలకు సమాదానాలు చెపుతారు . డెన్మార్క్ […]
మెదడుకు పదును
ఒత్తిడి నుంచి బయట పడాలను కుంటే ఫజిల్స్ పూర్తి చేయండి అంటున్నారు ఎక్సపర్ట్స్ . వాటిని పూరిస్తూ వుంటే ఇంకెన్నో ప్రయోజనాలున్నాయని చెపుతున్నారు. ఏది ఎక్కడ సరిపోతుందో నని ఒకే దానిపై ఆలోచించటం ఎక్కువ సేపు దృష్టి పెట్టటం వల్ల ఇతర ఆలోచనలు రావు ఇది ధ్యానం లాంటిదే మనసులో అలాగే ఒత్తడి ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా వుంటుంది. మెదడు పనితీరు చురుగ్గా అవుతోంది. రకరకాల పద బంధాల వల్ల మెదడులోని కుడి ఎడమల భాగాల […]
టీ బ్రేక్ చాలా ముఖ్యం
కార్యాలయాల్లో ఉద్యోగాలు ఆరు నుంచి ఎనిమిది గంటలు కదలకుండా కూర్చొని పని చేయటం కంటే మద్యలో ఒక టీ బ్రేక్ తీసుకొంటే మనసు ,శరీరం బావుంటుందని ,మరింత ఉత్సాహంగా ,ఉల్లాసంగా పని చేస్తారని అధ్యయనాలు చెపుతున్నాయి . టీ బ్రేక్ అన్నది వృధా సమయం కాదని అది ఉద్యోగులను చాల చురుగ్గా పనిచేయిస్తుందని చెపుతున్నారు . ఆ అరగంట టీ బ్రేక్ అలసిన కండరాలకు కాస్త స్వాంతన లభించేలా చేస్తుందని, పైగా తాగే టీ లోని కెఫైన్,ధియోమిన్ […]
అంతా పచ్చదనమే
ప్రకృతి వర్ణాలను ప్రేమించటం,కళకళలాడే పైరులను చూసి పరవశించి పోవటం చాలా మందికి ఇష్టం. కానీ ఈ ఆకుపచ్చ రంగు ఓ బామ్మా ఫేవరేట్. ఎంత పిచ్చి ఇష్టం అంటే ఆవిడ ఇల్లు వస్తువులు డ్రెస్,షూ,జుట్టు రంగు కూడా ఆకుపచ్చ లోనే ఉంటే చాలనే ఇష్టం. అమెరికా లోని న్యూయార్క్ కు చెందిన 74 సంవత్సరాల ఎలిజిబెత్ స్వీట్ హార్ట్ ఎప్పుడు డిఫరెంట్ గా ఉండాలని కోరుకొంటుంది. అందుకే తాను ఎంతో ప్రేమించే ఆకుపచ్చ రంగుని జీవితంలోకి ఆహ్వానించింది. […]
అందం,ఆరోగ్యం రెండూ ముఖ్యం
ఈ మధ్య సమంత ,పొడుగాటి పోల్ పైకి అవలీలగా ఎక్కి వంద కేజిల బరువు మోస్తూ కనిపించి అందరి ప్రశంసలు అందుకొంది . మహిళలు సున్నితంగా ఉండాలి కదా ఈ బరువులు ఎత్తే పనేమిటి అని అడిగితే చాలా గొప్ప సమాధానం చెప్పింది సమంత . అమ్మాయిలు బరువు ఎత్తితే అబ్బాయిల్లా కదలొస్తాయి .అందంపోతుంది అంటారు కానీ నాకయితే అంత బరువు ను మోస్తే చాలా ఆత్మవిశ్వాసం కలిగింది . పురుషుల పై ఆధారపడకుండా ఏ పని […]
గోళ్ళ ఆరోగ్యం
గోళ్ళు అందంగా ఆరోగ్యంగా కనిపించాలంటే కాస్త శ్రద్ధ తీసుకోవాలి. గోళ్ళ పై క్రిములు బాక్టీరియా వృద్ధి చెందకుండా సాద్యమైనంత పొడిగా శుభ్రంగా ఉంచుకోవాలి బట్టలు ఉతకటం గిన్నెలు కడగటం వంటి పనులు అయ్యాక చేతులను పంచదార గులాబిరేకులు ఎసెన్షియల్ ఆయిల్,లిక్విడ్ సోప్ వేసిన నీళ్ళలో కాసేపు ఉంచి,కడిగేసి పొడిగా తుడిచి బాదం నూనె రాస్తే మెత్తగా తేమ పోకుండా ఉంటాయి కాల్షియం,బయోటిన్,విటమిన్ ఇ, ఇనుము మాంసకృత్తులు జంక్ వంటి పోషకాలు గోళ్ళ ఆరోగ్యనికి అవసరం పారాబిన్,సల్ఫేట్ ఎసిటోసిన్ […]
“రాజరాజేశ్వరుడి ప్రసాదం”
శంభో శంభో…శివ శంభో స్వయంభో… ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి సమీపంలో ఉన్న బుగ్గలో శ్రీ రాజరాజేశ్వరుడు స్వయంభువుగా వెలసిన క్షేత్రం.ఈ క్షేత్రం చోళుల నాటి నుండి ప్రసిద్ధి చెందింది.ఇక్కడికి రాణి రుద్రమ దేవీ, ఛత్రపతి శివాజీ లాంటి నాయికా- నాయకులు తమ ఆయుధాలను తీసుకొని వచ్చి ఈ స్వామి వారి సన్నిధిలో పూజలు చేసే వారని స్థానికుల ద్వారా వ్యక్తమవుతుంది. పరమ పవిత్రమైన గంగమ్మ తల్లి నిర్విరామంగా రాజరాజేశ్వరుడిని అభిషేకించి తరిస్తుంది.విశాలమైన ఆవరణలో పచ్చని ప్రకృతిని ఆశ్వాదిస్తూ రాజరాజేశ్వరుడు […]
హెయిర్ కేర్
ఈ వాతావరణంలో శిరోజాలకు ఎక్కువగా హాని కలుగుతుంది . జుట్టు తడితడి గా ఎప్పుడూ బయటకు వెళ్ళకూడదు . వాతావరణంలోని చల్లదనానికి శిరోజాలు ఫ్రీజ్ అయినట్లు అయి పోయి తెగిపోతాయి . గోరువెచ్చని,లేదా చల్లని నీటి స్నానమే మంచిది . వేడినీరు మాడును పొడిబారేలా చేసి శిరోజాలకు చర్మానికి హాని కలిగిస్తాయి . డ్రై షాంపూ చేసుకోవచ్చు అంటే బేబీ పౌడర్ ను సింపుల్ గా జుట్టుపై చల్లి దువ్వెనతో దువ్వెయాలి శిరోజాల స్టయిలింగ్ కోసం బ్లో […]
పాత టైర్లతో వ్యాపారం
రోడ్ల పై వాహనాలు తిరుగుతాయి . టైర్లు పాడాయి పోతాయి వీటిని రీ సైకిలింగ్ చేస్తే అన్న ఆలోచనలో పుణేకు చెందిన పూజా ఆప్టే చేసే జాబ్ కూడా మానేసి కార్య రంగంలోకి అడుగుపెట్టింది . పాతటైర్లతో చెప్పులు తయారు చేసింది . సంస్థకు బ్లింక్ గ్రీన్ అనే పేరు పెట్టి ఈ చెప్పులు అమ్మకానికి పెట్టింది ఈమె స్టార్ట్ప్ ఎంతో మందికి నచ్చాయి . పర్యావరణానికి మేలు చేసేది, పేదవాళ్ళకు సాయపడేదిగా తన సంస్థ ఉంటుందని […]
సహజ పెయిన్ కిల్లర్స్
మనం ఇంట్లో వాడుకునే ఎన్నో పదార్థాల్లో నొప్పి తగ్గించే గుణాలుంటాయి. అంటే అవి సహజమైన పెయిన్ కిల్లర్స్ అన్నమాట. పసుపు సహజమైన పెయిన్ కిల్లర్ ఇన్ ప్లమేషన్ తగ్గించే గుణాలుంటాయి. సహజ యాంటి ఇన్ ప్లమేటరీ ఏజెంట్ లాగా పనిచేస్తుంది సాల్మన్ చేపలోని ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తనాళాలు నరాల్లోని ఇన్ ప్లమేషన్ తగ్గిస్తాయి స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్ లో యాంటి ఇన్ ప్లమేటరీ గుణాలు ఉంటాయి. అల్లం నొప్పి నివారణాలో బ్రుఫిన్ మాదిరిగా పనిచేస్తుంది. […]
ప్రపంచానికే ఆదర్శం
కొన్ని పంటలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయి . ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తాయి . ఇథియోపియా ఇప్పుడు 12 గంటల్లో 35 కోట్ల మొక్కలు నటి రికార్డ్ సృష్టించింది . ఈ దేశ ప్రధాని అచిమ్ అహ్మద్ “గ్రీన్ లెగసీ ‘ పేరుతో మొక్కలు నాటాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు . గ్రీన్ లెగసీ -హెల్దీ ఇథియోపియా నినాదంతో ప్రజలంతా కలసి వచ్చి కొన్ని గంటల్లో విజయవంతంగా పనిపూర్తి చేశారు . ఈ కార్యక్రమంలో ప్రధాని అచిమ్ అహ్మద్ […]
ఎంతటి పట్టుదల
కొంత మంది స్ఫూర్తి దాతలు నిజంగానే కోట్ల మందికి ఆదర్శం . ఒక ప్రయత్నం చేసి వెంటనే ఫలితం రాకపోతే వెంటనే ఆ పని వదిలేసి నిరుత్సహ పడే వాళ్ళు వందల మంది కానీ ఎందుకు నా వల్ల కాదు.. ఎందుకు ప్రయత్నం చేయను అనుకొంటే ఏదైనా సాధ్యమే. దాన్ని నిరూపించింది దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరానికి చెందిన ఛాసా సూన్ . ఇప్పుడు 80 ఏళ్లు వచ్చి ఉంటాయి. సొంత వాహనంలో ఇంటింటికీ తిరిగి […]
శిరోజాలకు మెరుపు
కొన్ని హెయిర్ ఫ్యాక్స్ జుట్టుకు మెరుపును ఇస్తాయి . తాజా కమలా పండ్లరసం కొద్దిగా నీరు,ఒక టేబుల్ స్పూన్ తేనె ,కొద్ది చుక్కలు శాండిల్ ఆయిల్ కలిపి షాంపూ చేసుకున్నాక ఈ మిశ్రమం తో వాష్ చేస్తే జుట్టు నిగనిగలాడుతోంది . కోడిగుడ్డు బీట్ చేసి ,టేబుల్ స్పూన్ పాలు కలపి జుట్టుకు పట్టించి పావుగంట తర్వాత కడిగేస్తే జుట్టు మెరుస్తూ ఉంటుంది . జుట్టు నిర్జీవంగా విస్తారంగా ఉంటే బాగా పండిన అరటి కాయలో కొద్దిచుక్కలు […]
రోజంతా శక్తి
రోజంతా హుషారుగా తిరిగేవాని ఎనర్జీ తో వుండాలంటే త్వరగా జీర్ణమైపోయే కార్బోహైడ్రేట్స్ పదార్దాల స్థానంలో పూర్తి స్థాయి ధాన్యాలు కంద,చిలకడ దుంప వంటివి తీసుకుంటే రోజు మొత్తం శక్తి నిరంతరాయంగా అందుతూనే ఉంటుంది. త్వరగ జీర్ణం ఆయె చెక్కరలో వైట్ బ్రెడ్ వంటివి,బ్లడ్ షుగర్ స్థాయిలు పెంచి ఇన్సులిన్ స్పందనను పెంచుతాయి. వీటిని వర్కవుట్స్ చేసిన తర్వాత ఆహారం తో తీసుకుంటే తరిగి పోయిన ఇంధన నిల్వలను శరీరం కొవ్వు నిల్వల నుంచి కాకుండా ఈ అదనపు […]
గురక తో ఇబ్బంది
ఎంతో మంది నిద్రలో గురక పెడతారు . గురక తీరు శబ్దం ఒకటిగా లేకపోవచ్చు . కానీ ఆ గురక ఎందుకు వస్తోంది . తెలుసుకునే మార్గం లేకపోతే ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి . ముక్కతో గాలి పిల్చుతారు . కానీ గురక సమయంలో నోటితో గాలి పీల్చి వదలటం వల్ల పలు రకాల ,రసాయనాలు,సూక్ష్మజీవులు నేరుగా ఊపిరి తిత్తుల్లోకి చేరతాయి . అలాటివి వడకట్టే సౌకర్యం ముక్కులో ఉంటుంది . కానీ నోటిలో ఉండదు . […]
