Sunday, 28 Jun, 2026

సరిగ్గా కూర్చోండి

గంటల కొద్దీ కంప్యూటర్ ముందు కదలకుండా కూర్చొంటున్నారా.. ఆ కూర్చునే భంగిమ సరిగ్గా ఉందో లేదో మరి అప్పుడు మాత్రం ఆఫీస్ సిండ్రోమ్ సమస్యలు తప్పవంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. ఒకే భంగిమలో శరీరం 20 నిమిషాలకు మించి ఓర్చుకోదు. లేవాలి, అటు ఇటు తిరిగి వళ్ళు విరుచుకోని శరీరాన్ని యాక్టివ్ గా చేయకపోతే సమస్యే. స్క్రీన్ సరైన ఎత్తులో ఉండాలి.తిన్నగా వంగి పోకుండా నిటారుగా మెడ,తల,ఒకే సరళ రేఖలో ఉండేలా కూర్చోవాలి. సీట్లో కూర్చుంటే టేబుల్ మోచేతి […]

ఎంపికలో శ్రద్దా

ఎండ నుంచి కళ్ళకు రక్షణ కోసం సన్ గ్లాస్ పెట్టుకోవాలి.అయితే వాటిని ఎంచుకోవటంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. గ్లాస్ లేబుల్ పైన యువి ప్రోటెక్షన్ కు సంబందించిన సమాచారం చదవాలి. వంద శాతం యువి ప్రోటెక్షన్ ఉన్నవే ఎంచుకోవాలి. అలాగే నాణ్యమైన గ్లాసెస్ తీసుకోవాలి. రంగు ముదురగా ఉన్న లేతగా ఉన్న పర్లేదు.అలాగే లెన్స్ లు పెద్దవిగా కనుబోమ్మల నుంచి కళ్ళకింద వరకు కవర్ చేసే పెద్ద గ్లాసెస్ వాడాలి.గ్లాసెస్ సైడ్స్ కూడా కవర్ చేసేలా ఉండి […]

జీన్స్ కి బదులుగా

జీన్స్ ఎప్పుడు ఫేషనే .అయితే ఎప్పుడూ జీన్సేనా అనుకొంటే కుర్తీలు,asymmetrical tops కూడా ఫ్యాషన్ అంటున్నారు ఎక్స్ పర్ట్స్.స్టైల్ గా కనిపించాలి అనుకొంటే జీన్స్ కంటే సిగరెట్ ఫ్యాంట్లు, పలాజోలు మాక్సీ స్కర్టులు ,జెగ్గింగ్స్ షరారాలు కూడా బావుంటాయి.వీటిలో ఎప్పటి కప్పుడు కొత్త ప్యాటర్న్ లు వస్తున్నాయి. ఒక వేళ పార్టీవేర్ గా కుర్తులీ వేసుకోవాలంటే ఎంబ్రాయిడరీ డిజైన్లు ఉన్న బాటమ్స్ ప్రయత్నం చేయావచ్చు. శరీరానికి అసౌకర్యంగా కలగకుండా ఏది ఎంచుకొన్న స్టైల్ గానే ఉంటుంది.

మరింత ఫ్యాషన్ గా

కాటన్ కుర్తీలు ఈ వేసవికి సౌకర్యమే .ఇది వరకు చక్కని పూవుల ప్రింట్లు ,యానిమల్ జామెట్రికల్ ప్రింట్లు ,లతలు ఆకులు, కుర్తీలు ఆకర్షణీయంగా అనిపించేవి. ఇప్పుడు అందమైన కుర్తీలు అదనంగా బటన్లు ,పైపింగ్ లు ప్రింట్లతో మరింత కంఫర్టబుల్ గా కనిపిస్తున్నాయి. త్రీ ఫోర్స్ చేతులతో ఛాతీ పైన చక్కని ఎంబ్రాయిడరీలు ,వ్రాప్ స్టైల్ పొడవాటి కాటన్ కుర్తీ కాంట్రాస్ట్ ఫ్యాబ్ పైపింగ్ ముందు భాగంలో చక్కని బటన్లు ఒక ఫ్యాషన్ లుక్ తెచ్చాయి. అలాగే రెండు […]

జానపద గేయాలు-నోములు

-డి. సుజాతాదేవి ఎన్ని నోముల పున్నె మోయి నీ ఎంట నడుసుటె బాగ్గెమోయి మావ ఎన్ని నోముల పున్నెమోయి పెళ్ళి సూపుల కొచ్చిన నాడె కళ్ళు కళ్ళు కలిసిన నాడె మళ్ళజాలని మనసు మారాము చేసింది!! తలపాగ పొగసున సుట్టి తరిలీ నువ్వొచ్చినవాడు ఈది ఈదంతా నిన్ను ఇరగాబడి చూసింది!! పచ్చంగా పందిట్టొ అచ్చింతా ఎడగానె అచ్చంగా దేవతలు వచ్చి దీవించారు!! కతలోని రాజల్లె కదిలీ నువ్వొత్తంటె వొళ్ళంతా కళ్ళాయె కళ్ళేమొ బరువాయె!!

“అప్పన్నపల్లి బాల బాలాజీ ప్రసాదం”

“యలమి కోరిన వరాలిచ్చే దేవుడే.. వాడు అలమేల్మంగ వేంకటాద్రినాథుడే.. వేడుకుందామ..వేడుకుందామ వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామ…”!! సఖులూ నిత్య ప్రసాదం కి …సిద్ధమా? మరి పదండి అప్పన్నపల్లి బాల బాలాజీని పూజించి ప్రసాదం తయారు చేసుకుందాం.   గోదావరి నది తీరాన కొలువై ఉన్నాడు.  చిన్ని విష్ణు మూర్తి అందుకే బాల బాలాజీ అని పేరు. పూర్వం వీరాస్వామి అనే భక్తుడు తన వ్యాపారంలో వచ్చే ఆదాయం నుంచి స్వామి వారికి సగం సమర్పించేవాడు.అతని కల్మషం లేని భక్తికి ప్రీతిపాత్రుడై […]

నవ్వండి ప్లీజ్

ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉంటారని ఒంటరి తనాన్ని దూరం చేసే శక్తి నవ్వులో ఉంటుందనీ అంటారు ఎక్స్ పర్ట్స్. సాధారణంగా వ్యక్తులు రోజులో 13 సార్లు నవ్వుతారు. చిన్న పిల్లలు పెద్దల కన్న మూడు రెట్లు ఎక్కువ నవ్వుతారు. 15 నిమిషాల పాటు నవ్వితే 40 కేలరీలు ఖర్చు అవుతాయి. అలాగే నవ్వటం వల్ల ముఖంలో 53 కండరాలు కదిలి మంచి వ్యాయామం అవుతుంది. నవ్వటం వల్ల శరీరంలో విడుదలయ్యే ఎండార్ఫిన్ వత్తిడి నుంచి ఉపశమనం […]

లెట్స్ టాక్ ట్రాష్

లెట్స్ టాక్ ట్రాష్ ది కిడ్స్ యాక్టివిబీ బుక్ తీసుకు వచ్చారు బెంగాళూరుకు చెందిన శుభశ్రీ సంఘమేశ్వరన్ . చిన్న పిల్లలకు మట్టిలో కలిసిపోయే వ్యర్థాలు ,మట్టిలో కలవని వ్యర్థాలు తడి చెత్త, పొడి చెత్త వంటి పర్యావరణ పరిక్షన లో భాగమైన అంశాలను చక్కగా ప్రత్యామ్నయ వస్తువులను ఉపయోగించాలని బొమ్మల రూపంలో ఈ పుస్తుకం రాశారు శుభశ్రీ. జీరో వేస్ట్ లైఫ్ స్టైల్ ను పిల్లలకు అలవాటు చేసేందుకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగనడుతుంది.

అందమైన అమ్మబొమ్మ

Jerel Rowan Baker   గీసిన మధర్ థెరిసా చిత్రాన్ని ఇల్యూషన్ చిత్రాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఈ బొమ్మలో ఎన్నో బొమ్మలు కనిపిస్తాయి.. ఆ ఒక్కో బోమ్మ ఒక్కో కథ చెపుతాయి. ఎన్నో కథలతో ఈ గొప్ప చిత్రం ఆమె సేవలకు ప్రతీకలను చూపిస్తుంది. మదర్ థెరిసా గురించి కొత్తగా చెప్పుకొనేది ఏమీ లేదు. నోబెల్ బహుమతి గ్రహిత అనాథలైన వికలాంగులకి చావుకి ఎదురు చూస్తున్న వారికీ, కలకత్తా మురికివాడల్లో పని చేసిన దయాస్వరూపిణి. ఆమె చిత్రాన్ని ఇన్ని […]

యంగ్ ట్రావెలర్

లెక్సీఆల్ ఫోర్డు కు 21 సంవత్సరాలు.18వ ఏట మొదలు పెట్టి మూడేళ్ళలో 196 దేశాలు పర్యటించి ప్రపంచ దేశాలు చుట్టేసిన అతి చిన్న వయస్కు రాలిగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకొంది. హటల్స్ ట్రావెల్ సంస్థలకు బ్లాగ్ లు రాయటం ఫోటోలు ఇవ్వటం ద్వారా వచ్చిన డబ్బుతో ఫ్లైట్ టికెట్లు కొనుకొన్నది .ఒంటరిగా ఇంత ప్రయాణం చేసిన లెక్సీ ఆల్ ఫోర్ట్ ఇవ్వాల్టి తరం అమ్మాయిలకు స్ఫూర్తి.

అందాల పోటీల్లో సంజనా

సంజనా విజ్ స్వస్థలం ఢిల్లీ. హైదరాబాద్ లో ఫైర్ సొల్యూషన్స్ లో ప్రాజెక్టు మేనెజ్ మెంట్ లో జాబ్ చేస్తోంది. ఇలీవల ముంబైలో జరిగిన మిస్ ఇండియా 2019 అందాల పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. ఒక వైపు జాబ్ చేస్తూనే పారిశుధ్ద కార్మికుల కోసం పని చేస్తుంది. శానిటేషన్ బై ఎడ్యుకేషన్ ఎంపినర్ మెంట్ అండ్ డెవలప్ మెంట్ లతో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మోడలింగ్ లో ఎలాంటి శిక్షణ తీసుకొకుండానే ఈ పోటీల్లో […]

కొలతలు మారతాయి

లోదుస్తుల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. ముఖ్యంగా బ్రా విషయంలో శ్రద్దగా ఉండమంటున్నారు .ఏడాదికి ఒక సారి కొలతలు మారాయేమో చూసుకొవాలి. ఏళ్ళ తరబడి వాటిని వాడవద్దు పట్టీలు వదులుగా అనిపించగానే మార్చేయాలి. వాషింగ్ మిషన్ లో పడేయకుండా సబ్బులో చేత్తో ఉతకటం మేలు. ఉతికాక వేలడేలా ఆరేస్తే పట్టీలు సాగిపోతాయి. బ్రా అతికినట్లు కాకుండా శరీరాన్ని బట్టి ఎంచుకోవాలి. బుజాలు సన్నగా ఉంటే క్రాస్ బ్యాక్ బ్రాలు నప్పుతాయి. వీపు భాగం వెడల్పుగా […]

పంచుకొంటే పెరగదు

డిప్రేషన్,ఆందోళన వంటివి ఎప్పుడు ఎక్కువగా మహిళల విషయంలో చేపుతూ ఉంటారు. కానీ ఇవి పురుషుల్లోనే ఎక్కువనే ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒకరు మానసిక సమస్యకు గురవుతారని అయితే ఈ విషయాలు ఎవ్వరితో పంచుకోనేందుకు వాళ్ళు ఇష్టపడరని, ఇదే అసలు సమస్య అని అధ్యయనకారులు చెపుతున్నారు. డిప్రేషన్ ను వెల్లడించకుండా మనసులో దాచుకొవటం వల్ల అది మరింత తీవ్రమై,తమని తాము హింసించుకోవటం ఇతరులను హింస పెట్టటం చేస్తుంటారని చెపుతున్నారు. శృంగారం పట్ల ఆసక్తి పోగోట్టుకొని ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారని […]

జానపద గేయాలు-బడి

-డి.సుజాతాదేవి మల్లీ మా లచ్చిమీ సీమా లచ్చిమీ!సీతాలచ్చిమీ బండ రాముణ్ణికాదే నే నింక బడికి ఎల్తన్నానే పిల్లా మూతి ముడకవకే ముద్దులగుమ్మా పగలు పాబుకు పోతానె బామ్మా సందలడిపోగానే సదువు కెల్తన్నానే ఏతి ముదర జాతకం ఇక తిరిగిపోయిందె!! పినిమా పేరడగతాకి సిగ్గేత్తదే ఉత్తర మొచ్చిందంటె ఉసూరంటదే సిత్తరమే పిల్లా సదువెంత తేలికో పట్టుబట్టితె ఇట్టే పట్టడిపోతున్న దే ఆరూ తొమ్మది తేడా అర్థమయిందీ ‘ఓ’కి ఒంకరలెన్నో తెలిసిపోయింది ‘ఎ’అంటే ఎల్లెద్దు కొమ్మలాంటిదీ ‘ఐ’ని అటుతిప్పి రాస్తే […]

“సంతోషిమాత ప్రసాదం”

సంతోషాన్ని పంచే మాత మన సంతోషిమాత . అన్ని వేళల సంతోషంగా వుండటానికి ఈ మాతకి ముతైదువులు వ్రతం చేయడం ఒక ఆచారం.  ఒక కుటుంబంలో భార్య- భర్తలు మానసికంగా,శారీరకంగా బాధ పడుతున్న సమయంలో సంతోషిమాత వ్రతం చేయడం వల్ల కలిగే ఫలితం చూసి భక్తులు  నిశ్చేష్టులైనారు.   సంతోషిమాతకి భక్తులకు సంతోషాన్ని పంచటమే తెలుసు. ప్రతి శుక్రవారం సంతోషిమాతని పూజించడం మనం చేసే పనే కదా!!3/5/9/11 శుక్రవారాలు ఉపవాసం ఉండి, మాత కథ చదువుకుని,సాయంత్రం ముతైదువులకు పసుపు, […]

సాయి బాబా”ప్రసాదం”

ఈ రోజు మన ఇష్టమైన దేవునికి పూజ చేసికొన వచ్చును. సాయిబాబాకి కూడా ఈ రోజు చాలా ఇష్టం. ఎవరికి ఏ దేవుడు ఇలవేల్పు అయితే ఆ దేవుడిని పూజిస్తారు. లక్ష్మి వారం నాడే ఇంటిని నలుమూలల శుభ్రంగా చేసుకోవాలి. ఈ రోజు కొంతమంది ఉపవాసం ఉంటారు. ఎవరు ఇంటికి వచ్చిన వారికి భోజనం పెట్టి తాంబూలం ఇస్తే సకల దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ కాపాడుతాయి. భక్తులు తమ మనసు లో ఉన్న ది క్రియా రూపంలో […]

జానపద గేయాలు-సరదాలు

-డి.సుజాతాదేవి సరదాలా వరదమావయ్యె సందేళ కానీయరొ సందమావ సాటుగుండి తొంగి తొంగి సూత్తాడు సుక్కలన్ని నన్ను సూసి ఎక్కిరించిపోతాయి !! సందకాడ జాజీ పూలు సొగసు లార బోత్తాయి ఊసుపోని గాలి బావ ఊరంత పంచుతాడు !! ఎన్నెలోడు సొ రగానికి ఎండిపూల దారేత్తడు నీలి మబ్బు నీడలోన గూడుకట్టి ఉండాల !!

వెయిట్ పెరగాలా?

కొందరికి బరువు సమస్య అయితే మరికొందరికి తక్కువ బరువుండటం సమస్య. వెయిట్ పెరగటం కూడా కష్టమే మంచి ట్రెయినర్ ఉంటేనే చక్కని దేహాస్థితి పొందగలరు.సరైన ఆహారపదార్థాల నుంచి ఎనర్జీ కావలిసి ఉంటుంది. స్టార్ కాగ్ట్ అధికంగా ఉన్నా పదార్థాలు తినాలి. ప్రతి రోజు అదనంగా 500 క్యాలరీల కార్బోహైడ్రేడ్ తీసుకొంటే ప్రతి నెలా ఒక కిలో బరువు పెరగవచ్చు టోస్ట్ తో ఒక బౌల్ సెరల్స్ తినాలి మిడ్ మార్నింగ్ స్నాక్ గా అరటి పండు ఆరెంజ్ […]

ఇది సహజం

మోనోపాజ్ దాటిన చాలా మంది మహిళల్లో మూత్రం నియంత్రించుకోలేక పోయే సమస్య వస్తుంది. ఈ వయస్సు మహిళల్లో ఇది సర్వ సాధారణం దీన్ని స్ట్రెస్ ఇన్ కంటినెన్స్ అంటారు.బలహీనమైన పెల్విన్ ఫ్లాక్ మజిల్స్ వల్ల ఈ సమస్య వస్తుంది. మోనోపాజ్ తర్వాత మరింత ప్రిమినెంట్ గా ఉంటుంది. పెల్విన్ కండరాలు సంబంధించిన వ్యాయమాలు నేర్చుకోని చేస్తూ ఉంటే ఈ సమస్య కాస్త తగ్గుతుంది. కానీ ఇది తీవ్రమైన సమస్య మాత్రం కాదు.

ట్యాన్ పోతుంది

ఎండకు ఎక్స్ పోజ్ అవుతూ ఉంటాయి,సహజంగా అక్కడ చర్మం కాస్త మందంగానూ ఉంటుంది కనుక ముంజేతులు నల్లగా అయిపోతూ ఉంటాయి. ఏ విషయంలో అయినా వచ్చాక వాటి సంగతి చూసేకంటే రాకుండా జాగ్రత్త పడటం ఉత్తమం .ఎస్పిఎఫ్ 30 లేదా అంతకంటే ఎక్కువగల సన్ స్క్రీన్ అప్లైయ్ చేయాలి నిమ్మరసం ,పెరుగువంటివి బాగా పని చేస్తాయి.పెరుగులో గంధం పొడి కలిపి అప్లైయ్ చేస్తే నలుపు పోవచ్చు .పుల్లని పదార్థాల్లో ఆమ్లాలు సహజ పీల్ లాగా పని చేస్తాయి.